బంపర్‌ ఆఫర్‌: పోస్టాఫీస్‌ ఫ్రాంఛైజ్‌,పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ | ​how To Get Post Office Franchise Earn Money | Sakshi
Sakshi News home page

Post Office Franchise: పోస్టాఫీస్‌ ఫ్రాంఛైజ్‌, పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ

Published Fri, Oct 29 2021 1:36 PM | Last Updated on Sat, Oct 30 2021 10:36 AM

​how To Get Post Office Franchise Earn Money - Sakshi

ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి..ఎక్కువ ఆదా పొందేలా ఏదైనా బిజినెస్‌ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్‌ను ఫ్రాంఛైజ్‌ తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. 
 
కేంద్రప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్‌ నెట్‌ వర్క్‌ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 1.55లక్షల పోస్టాఫీస్‌లు ఉన్నాయి. అందులో 89 శాతం పోస్టాఫీసులు  గ్రామీణ ప్రాంతాల్లో సేవల్ని అందిస్తున్నాయి. అయితే కేంద్రం ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చెందుతున్న రూరల్‌, అర్బన్‌ ఏరియాల్లో సైతం ఈ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు 2019లో ఈ ఫ్రాంఛైజ్‌ స్కీంను అందుబాటులోకి  తెచ్చింది. 

పోస్టాఫీస్‌  ఫ్రాంఛైజీ తీసుకుంటే ఏం చేయాలి? 

 స్టాంప్స్‌, స్టేషనరీని అమ్ముకోవచ్చు. 

► బుకింగ్‌ రిజిస్టర్డ్‌ ఆర్టికల్స్‌, స్పీడ్‌ పోస్ట్‌ ఆర్టికల్స్‌, మనీ ఆర్డర్స్‌ సర్వీస్‌లను అందించాల్సి ఉంటుంది

► పోస్టల్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ (పీఎల్‌ఐ- ఏజెంట్‌)కు సంబంధించిన అమ్మకాలు, ప్రీమియంను కట్టించుకోచ్చు.

► పోస్టాఫీస్‌ పరిధిలోకి వచ్చే రీటైల్ సర్వీసులు అంటే బిల్స్‌, ట్యాక్స్‌, పన్నుల వసూళ్లు లేదా చెల్లింపులు  చేయాల్సి ఉంటుంది.  

ఫ్రాంఛైజీకి కావాల్సిన  అర్హతలు 

► ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవాలంటే మినిమం 8వ తరగతి చదివి ఉండాలి. ఇక డిపాజిట్‌ కింద రూ.5000 నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. 

 దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను   పోస‍్టాఫీస్‌ అధికారులు మీ దరఖాస్తును డివిజనల్ హెడ్‌కు పంపిస్తారు. 

 అలా మీ ధరఖాస్తును చెక్‌ చేస్తారు. మీ ఫ్రాంఛైజీకోసం అప్లయ్‌ చేసిన ధరఖాస్తుకు చెందిన అడ్రస్‌ను పరిశీలిస్తారు. దీంతో పాటు ఫ్రాంఛైజీని నిర్వహించే సామర్ధ్యం ఉందా లేదా, కంప్యూటర్‌ సౌకర్యం ఉందా లేదా అని పరిగణలోకి తీసుకుంటారు. 

► అనంతరం 14 రోజుల్లో ఫ్రాంఛైజీకి మీరు అర్హులు, కాదా అంశంపై  నిర్ణయం తీసుకుంటారు.

ఫ్రాంఛైజీకి ఎవరికి? ఏ ప్రాంతంలో ఇవ్వరు

► 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి అవకాశం ఇవ్వరు. 

► పోస్టాఫీస్‌ ఉద్యోగం చేస్తున్నా, లేదంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఫ్రాంఛైజీని తీసుకునేందుకు అనర్హులు 

► పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ పథకంలో భాగంగా పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్లు ఉన్న గ్రామాలకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరు.  

ఫ్రాంఛైజీ వల్ల లాభాలు (⇔ ఈ లింక్‌ క్లిక్‌ చేస్తే 22పేజీలో పూర్తి వివరాలు)

► పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌ నిర్వాహకులు అందించే సేవలపై కమీషన్ లభిస్తుంది. 

► రిజిస్టర్డ్ పోస్ట్‌కు రూ.3, స్పీడ్‌పోస్టుకు రూ.5 కమీషన్, రూ.100 నుంచి రూ.200 మనీ ఆర్డర్‌పై రూ.3.50, అంతకన్నా ఎక్కువ మనీ ఆర్డర్‌పై రూ.5 కమీషన్ వస్తుంది.

► నెలలో 1000 రిజిస్టర్ పోస్టులు, 1000 స్పీడ్ పోస్ట్‌లు బుక్ చేస్తే 20శాతం కమీషన్ అదనంగా లభిస్తుంది. 

► ఇక స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ, మనీ ఆర్డర్ ఫామ్ లాంటి అమ్మకాలపై 5 శాతం కమిషన్ ఉంటుంది.

చదవండి :  ఏటీఎం సెంటర్‌లలో మారిన రూల్స్‌, వాటి గురించి మీకు తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement