franchisee
-
బంగారం కలిపిన టీపొడితో చేసిన ఛాయ్.. ఇండియాలోకి ఎంట్రీ!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ హౌజ్‌గా పేరున్న లండన్ టీ ఎక్సేంజ్ (ఎల్టీఈ) ఇండియాలోకి ఎంట్రీ ఇస్తోంది. వ్యాపార విస్తరణలో భాగంగా ప్రపంచంలోనే అతి పెద్ద టీ మార్కెట్‌గా ఉన్న ఇండియాలో తమ ఛాయ్ రుచులు పంచేందుకు రెడీ అవుతోంది. ప్రిన్స్ ఛార్లెస్‌తో మొదలు బ్రిటీ రాజవంశానికి చెందిన ప్రిన్స్ ఛార్లెస్ 1552లో పోర్చగీస్కి చెందిన ప్రిన్సెస్ కెథరీన్ బంగాజాను వివాహం చేసుకున్న సందర్భంబంగా లండన్ టీ ఎక్సేంజ్‌ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంపన్న శ్రేణికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉపయోగించే టీ హౌజ్‌గా ఎల్టీఈకి గుర్తింపు ఉంది. ఐదు వందల ఏళ్లలో అనేక యాజమన్యాలు మారినా ఎల్టీఈ ప్రత్యేకత చెక్కు చెదరలేదు. కాగా తాజాగా ఎల్టీఈ ఇండియాలో భారీ ఎత్తున విస్తరించే ప్రణాళికను అమలు చేస్తోంది. కోల్‌కతా మూలాలు ఇండియాలో ముందుగా ఢిల్లీ లేదా బెంగళూరులో తొలి టీ హౌజ్‌ను ఆరంభించే యోచనలో ఉన్నట్టు ఎల్టీఈ ఇండియా వ్యవహరాలు చూస్తోన్న రహ్మాన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎల్టీకీ గ్లోబల్ సీఈవోతో పాటు ఇండియాలో మాస్టర్ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్నారు. రహ్మన్ పూర్వీకులు కొల్కతకు చెందిన వారు కావడంతో ఎల్టీఈని ఇండియాలో విస్తరించే యోచనలో ఉన్నారు. ఫ్రాంచైజీలు బోయే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 200 స్టొర్లను అందుబాటులోకి తేవాలని లండన్ టీ ఎక్సేంజ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మొదటి ఏడాదే 50 స్టోర్లను ప్రారంభిస్తామని ఎల్టీఈ ప్రతినిధులు జాతీయ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఢిల్లీ/బెంగళూరు తర్వాత ముంబై, హైదరాబాద్, చెన్నైలలో స్టోర్లు ప్రారంభించనున్నారు. ఎల్టీఈ స్టోర్ ఫ్రాంచైజీ దక్కించుకోవాలంటే పోష్ ఏరియాలో లోకేషన్ చూసుకోవడంతో పాటు సగటున కోటిన్నర రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కేజీ రూ. 13 కోట్లు లండన్ టీ ఎక్సేంజీ (ఎల్టీఈ) స్టోర్లలో టీ ప్రారంభం ధర రూ.120 ఉంటుందని అంచనా.. ఇక ఎల్టీఈకే ప్రత్యేకమైన బంగారంతో చేసిన ప్రత్యేక టీ పొడి ఖరీదు కేజీ రూ. 13 కోట్లు ఉంటుందట! ఈ టీని ఖరీదు చేస్తే స్థోమత సామాన్యులకు లేనట్టే. కాబట్టి ఈ బంగారం కలిసిన టీ పొడిని స్టోర్లలో ప్రదర్శనకు పెట్టినా.. అమ్మడం కష్టమేనంటున్నారు. ముందు నుంచి కూడా రికార్డులు కోరుకునేవారు, సూపర్ రిచ్ పీపుల్స్ దీన్ని భరించగలరంటున్నారు ఎల్టీఈ ప్రతినిధులు. చదవండి👉 Gautam Adani: వారెన్ బఫెట్‌కు భారీ షాక్! రికార్డులన్నీ తొక్కుకుంటూ పోతున్న అదానీ! -
సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియాన్ లారా...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్‌లోనే చెత్త ప్రదర్శన సన్‌రైజర్స్‌ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు... దిగ్గజాలతో సన్‌రైజర్స్‌ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్ఆర్హెచ్ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ సీజన్లో హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్‌ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్‌లోని ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది. -
తుక్కు వ్యాపారంలోకి టాటా గ్రూప్
న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ విధానంలో వాహనాల స్క్రాపేజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటి కేంద్రం అందుబాటులోకి రావచ్చని కంపెనీ ఈడీ గిరీష్ వాఘ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఏటా 25,000 ట్రక్కులు తుక్కుగా మారుతున్నాయన్న అంచనాలు ఉన్నాయని, కానీ సరైన స్క్రాపేజీ కేంద్రాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే యూరప్‌కు చెందిన నిపుణులతో కలిసి మోడల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని రూపొందించామని వాఘ్ పేర్కొన్నారు. ఫ్రాంచైజీ విధానంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు గిరీష్ వాఘ్ తెలిపారు. ఇప్పటికే భాగస్వాములకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) పంపించడం మొదలు పెట్టామని వివరించారు. స్క్రాపేజీ కేంద్రాలతో ఉపాధి అవకాశాలు రాగలవనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కూడా వీటి ఏర్పాటుపై దృష్టి పెడుతోందని వాఘ్ వివరించారు. అహ్మదాబాద్‌లో వాహనాల స్క్రాపేజీ సెంటర్ నెలకొల్పడానికి గుజరాత్ ప్రభుత్వంతో టాటా మోటార్స్ ఇటీవలే చేతులు కలిపింది. -
బంపర్ ఆఫర్: పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్,పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ
ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి..ఎక్కువ ఆదా పొందేలా ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్‌ను ఫ్రాంఛైజ్ తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కేంద్రప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్ వర్క్‌ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 1.55లక్షల పోస్టాఫీస్‌లు ఉన్నాయి. అందులో 89 శాతం పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో సేవల్ని అందిస్తున్నాయి. అయితే కేంద్రం ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చెందుతున్న రూరల్, అర్బన్ ఏరియాల్లో సైతం ఈ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు 2019లో ఈ ఫ్రాంఛైజ్ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. పోస్టాఫీస్ ఫ్రాంఛైజీ తీసుకుంటే ఏం చేయాలి? ► స్టాంప్స్, స్టేషనరీని అమ్ముకోవచ్చు. ► బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ సర్వీస్‌లను అందించాల్సి ఉంటుంది ► పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (పీఎల్ఐ- ఏజెంట్)కు సంబంధించిన అమ్మకాలు, ప్రీమియంను కట్టించుకోచ్చు. ► పోస్టాఫీస్ పరిధిలోకి వచ్చే రీటైల్ సర్వీసులు అంటే బిల్స్, ట్యాక్స్, పన్నుల వసూళ్లు లేదా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఫ్రాంఛైజీకి కావాల్సిన అర్హతలు ► ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవాలంటే మినిమం 8వ తరగతి చదివి ఉండాలి. ఇక డిపాజిట్ కింద రూ.5000 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పోస్టాఫీస్ అధికారులు మీ దరఖాస్తును డివిజనల్ హెడ్‌కు పంపిస్తారు. ► అలా మీ ధరఖాస్తును చెక్ చేస్తారు. మీ ఫ్రాంఛైజీకోసం అప్లయ్ చేసిన ధరఖాస్తుకు చెందిన అడ్రస్‌ను పరిశీలిస్తారు. దీంతో పాటు ఫ్రాంఛైజీని నిర్వహించే సామర్ధ్యం ఉందా లేదా, కంప్యూటర్ సౌకర్యం ఉందా లేదా అని పరిగణలోకి తీసుకుంటారు. ► అనంతరం 14 రోజుల్లో ఫ్రాంఛైజీకి మీరు అర్హులు, కాదా అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఫ్రాంఛైజీకి ఎవరికి? ఏ ప్రాంతంలో ఇవ్వరు ► 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి అవకాశం ఇవ్వరు. ► పోస్టాఫీస్ ఉద్యోగం చేస్తున్నా, లేదంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఫ్రాంఛైజీని తీసుకునేందుకు అనర్హులు ► పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ పథకంలో భాగంగా పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్లు ఉన్న గ్రామాలకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరు. ఫ్రాంఛైజీ వల్ల లాభాలు (⇔ ఈ లింక్ క్లిక్ చేస్తే 22పేజీలో పూర్తి వివరాలు) ► పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ నిర్వాహకులు అందించే సేవలపై కమీషన్ లభిస్తుంది. ► రిజిస్టర్డ్ పోస్ట్‌కు రూ.3, స్పీడ్పోస్టుకు రూ.5 కమీషన్, రూ.100 నుంచి రూ.200 మనీ ఆర్డర్‌పై రూ.3.50, అంతకన్నా ఎక్కువ మనీ ఆర్డర్‌పై రూ.5 కమీషన్ వస్తుంది. ► నెలలో 1000 రిజిస్టర్ పోస్టులు, 1000 స్పీడ్ పోస్ట్‌లు బుక్ చేస్తే 20శాతం కమీషన్ అదనంగా లభిస్తుంది. ► ఇక స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ, మనీ ఆర్డర్ ఫామ్ లాంటి అమ్మకాలపై 5 శాతం కమిషన్ ఉంటుంది. చదవండి : ఏటీఎం సెంటర్లలో మారిన రూల్స్, వాటి గురించి మీకు తెలుసా? -
లంక ప్రీమియర్ లీగ్‌లో సొహైల్ ఖాన్ పెట్టుబడి
ముంబై: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) టి20 టోర్నమెంట్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు నటుడు, నిర్మాత సొహైల్ ఖాన్ పెట్టుబడి పెట్టాడు. ‘క్యాండీ టస్కర్స్’ ఫ్రాంచైజీని సొహైల్ ఖాన్, అతని తండ్రి సలీమ్ ఖాన్‌కు చెందిన కన్సార్టియం ‘సొహైల్ ఖాన్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పీ’ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సొహైల్ ఖాన్ అధికారికంగా ప్రకటించాడు. ‘ఎల్‌పీఎల్‌కు మంచి భవిష్యత్ ఉంది. ఇందులో భాగం కావడం సంతోషాన్నిచ్చింది. ఆట పట్ల లంక అభిమానులు ఉత్సుకతతో ఉంటారు. జట్టుకు మద్దతు ఇవ్వడానికి వారంతా మా వెంటే ఉంటారని నమ్ముతున్నా’ అని సొహైల్ పేర్కొన్నాడు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 13 వరకు జరుగనున్న ఈ ఎల్పీఎల్లో ఐదు జట్లు కొలంబో కింగ్స్, దంబుల్లా హాక్స్, గాలె గ్లాడియేటర్స్, జాఫ్నా స్టాలియన్స్, క్యాండీ టస్కర్స్ తలపడనున్నాయి. లీగ్ కోసం రెండు రోజులుగా జరిగిన ఆటగాళ్ల వేలంలో టస్కర్స్ జట్టు వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్‌ను దక్కించుకుంది. గేల్‌తో పాటు ఫ్లంకెట్, వహాబ్ రియాజ్, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, నువాన్ ప్రదీప్‌లు టస్కర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ హసన్ తిలకరత్నే ఈ జట్టు కోచింగ్ బృందంలో పనిచేయనున్నాడు. ఎల్పీఎల్లో పాల్గొనే ప్రముఖ ఆటగాళ్లు జాఫ్నా స్టాలియన్స్: షోయబ్ మాలిక్. దంబుల్లా హాక్స్: డేవిడ్ మిల్లర్, కార్లోస్ బ్రాత్‌వైట్. కొలంబో కింగ్స్: రసెల్, డుప్లెసిస్, ఏంజె లో మాథ్యూస్. గాలె గ్లాడియేటర్స్: లసిత్ మలింగ, అఫ్రిది, ఇంగ్రామ్, మొహమ్మద్ ఆమీర్. -
కొత్తగా సత్తా చాటేందుకు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సూపర్ స్టార్ల, అంతర్జాతీయ క్రికెటర్ల ఆటే కాదు... అప్పటి వరకు అనామకులుగా కనిపించిన వారిని కూడా హీరోలుగా మార్చేస్తుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించే భారత యువ ఆటగాళ్లకు ప్రతీ ఏటా లీగ్ అలాంటి అవకాశం కల్పిస్తుంది. ఈ వేదిక మీద సత్తా ప్రదర్శించి చెలరేగితే అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకోవచ్చు. దేశవాళీ, జూనియర్ క్రికెట్లో ఇప్పటికే తమకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నా... ఐపీఎల్ అందించే కిక్కే వేరు. అలాంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కూడా ఏరికోరి జట్టులోకి తీసుకున్నాయి. రాబోయే ఐపీఎల్ –2020లో అలా అందరి దృష్టీ నిలిచిన కొందరు ‘అన్క్యాప్డ్’ యువ భారత ఆటగాళ్ల వివరాలు... యశస్వి జైస్వాల్ (రాజస్తాన్ రాయల్స్) ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించి ముంబైలో స్థిరపడ్డ 18 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించే యశస్వి పేరిట దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎన్నో ఘనతలున్నాయి. 13 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లలోనే అతను ఆరుసార్లు 50కి పైగా స్కోర్లు సాధించాడు. సగటు 70.81 కాగా, అందులో ఒక డబుల్ సెంచరీ ఉంది. రాజస్తాన్ రాయల్స్ తుది జట్టులో దాదాపుగా చోటు ఖాయం. మనన్ వోహ్రా, రాబిన్ ఉతప్పలతో ఓపె నర్ స్థానానికి పోటీ పడుతున్న యశస్వికే ఎక్కువ చాన్స్ ఉంది. అబ్దుల్ సమద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) జమ్మూ కశ్మీర్‌కు చెందిన 19 ఏళ్ల సమద్‌ను ప్రతిభాన్వేషణలో భాగంగా స్వయంగా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేశాడు. గత సీజన్లో అద్భుత బ్యాటింగ్‌తో రంజీ మ్యాచ్‌లో పటిష్ట కర్ణాటకపై చెలరేగి అందరి దృష్టిలో పడ్డాడు. స్పిన్ బౌలింగ్‌లో విరుచుకుపడగల సత్తా ఉంది. గత రంజీ సీజన్లో గరిష్ట మ్యాచ్‌ల కంటే రెండు మ్యాచ్‌లు తక్కువే ఆడినా అందరికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత అతని సొంతం. సన్‌రైజర్స్ ఆరు లేదా ఏడో స్థానంలో ఆడించి ఫినిషర్‌గా వాడుకునేందుకు మంచి అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) చక్కటి టెక్నిక్ ఉన్న దూకుడైన మహారాష్ట్ర బ్యాట్స్‌మన్. గత రెండు సీజన్లలో కలిపి చూస్తే భారత దేశవాళీ వన్డేల్లో అతను అందరికంటే ఎక్కువ పరుగులు (15 ఇన్నింగ్స్‌లలో 843) సాధించాడు. ధోని మాటల్లో చెప్పాలంటే ‘చురుకైన బుర్ర’ కలవాడు. సాధారణంగా అతను ఓపెనింగ్ లేదా మూడో స్థానాల్లో ఆడతాడు. రైనా గైర్హాజరులో 23 ఏళ్ల రుతురాజ్‌కు సత్తా ఇది సువర్ణావకాశం. జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ కూడా ఇదే మాట చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆరంభ మ్యాచ్‌లకు ఒకవేళ దూరమైనా...తర్వాతి నుంచైనా రుతురాజ్ చెలరేగిపోగలడు. దేవ్‌దత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఏడాది కాలంలో భారత దేశవాళీ క్రికెట్లో తన దూకుడైన ఆటలో ఎక్కువ మందిని ఆకట్టుకున్న క్రికెటర్ 20 ఏళ్ల దేవ్‌దత్. కేరళలో జన్మించి కర్ణాటక జట్టుకు ఆడుతున్న దేవ్‌దత్ గత దేశవాళీ సీజన్లో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండింటిలో కూడా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముస్తాక్ అలీ టోర్నీలోనైతే ఏకంగా 175.75 స్ట్రయిక్ రేట్‌తో అతను 580 పరుగులు సాధించడం విశేషం. బెంగళూరు జట్టులో ఓపెనర్ స్థానంలో అతను పార్థివ్ పటేల్‌తో పోటీ పడుతున్నాడు. రవి బిష్ణోయ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) అండర్–19 ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావం చూపించిన లెగ్ స్పిన్నర్. 6 మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు తీసిన అతడిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. రాజస్తాన్‌కు చెందని 20 ఏళ్ల రవి బిష్ణోయ్ గుగ్లీలు ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెడతాయనేది సీనియర్ క్రికెటర్ల మాట. పంజాబ్ తుది జట్టులో కృష్ణప్ప గౌతమ్, అశ్విన్ మురుగన్ నుంచి పోటీ ఉన్నా... బిష్ణోయ్‌పై అందరి దృష్టి ఉంది. టీమ్ కోచ్‌గా లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఉండటంతో అతని మార్గనిర్దేశనంలో రవి మరింతగా రాటుదేలినట్లు టీమ్ వర్గాలు చెబుతున్నాయి. -
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఆశలు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ నిర్వహణ సాధ్యం అయ్యేలా లేదని ఆతిథ్య దేశం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ఫ్రాంచైజీల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏదో విధంగా ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందని పులువురు ఫ్రాంచైజీ యజమానులు అభిప్రాయపడుతున్నారు. పూర్తిస్థాయిలో లేదా కుదించైనా, భారత్‌లో కుదరకపోతే విదేశాల్లోనైనా లీగ్‌ను నిర్వహించడంపై బీసీసీఐ దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇటీవలే లీగ్ నిర్వహణపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించిన బీసీసీఐ, తదుపరి కార్యాచరణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ నిర్వహణపై స్పష్టతనివ్వడంతో ఫ్రాంచైజీలన్నీ బీసీసీఐ వైపు ఆశగా చూస్తున్నాయి. లీగ్ పరిధి విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నారు. ‘పూర్తి స్థాయి లీగ్ నిర్వహించేందుకే బీసీసీఐ ప్రయత్నిస్తుంది అందులో సందేహం లేదు. కానీ సమయానుకూలతను బట్టి టోర్నీని కుదించినా మంచిదే. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణే సులభంగా ఉంటుంది. 2009లో కూడా కేవలం నెల వ్యవధిలో లీగ్‌ను దక్షిణాఫ్రికాకు తరలించాం. భారత్‌లో నిర్వహణ సాధ్యం కాకుంటే శ్రీలంక, న్యూజిలాండ్‌లో నిర్వహించవచ్చు. ఒక్కసారి లీగ్‌పై ప్రకటన వస్తే స్పాన్సర్లు కూడా వారంతటవారే వస్తారు’ అని వాడియా అభిప్రాయపడ్డారు. మరోవైపు మైదానాల్లోకి ప్రేక్షకుల్ని అనుమతించకపోయినప్పటికీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్పాన్సర్లను ఆకట్టుకోవచ్చని చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. వ్యూయర్షిప్ కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయ పడిన ఆయన... ఐపీఎల్ తేదీలు ప్రకటించాకే స్పాన్సర్లు ఫ్రాంచైజీలను సంప్రదిస్తారని అన్నారు. మరో ఫ్రాంచైజీకి చెందిన అధికారి మాట్లాడుతూ ఐపీ ఎల్ జరిగితే వ్యక్తిగత స్పాన్సర్‌షిప్‌ల కన్నా కూడా బీసీసీఐ సెంట్రల్ పూల్ ద్వారానే అధిక ఆదాయం పొందవచ్చని చెప్పాడు. ఆదాయం గురించి పక్కన పెడితే ఐపీఎల్ నిర్వహణకు సెప్టెంబర్–అక్టోబర్ తగిన సమయమని అన్నాడు. -
ఈ నిరసనలతో ఎలాగబ్బా..!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్నాయి. బంగ్లాదేశ్‌కు సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. ఐపీఎల్ వేలం ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో నిర్వహించనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యాలు కలవరపడుతున్నాయి. వచ్చే సీజన్‌కు సంబంధించి ఈ నెల 19న ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఫ్రాంచైజీలు ఆరాతీస్తున్నాయి. కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. దీనిపై ఓ ఫ్రాంచైజీ అధికారి మాట్లాడుతూ ‘తీవ్రంగా ఆందోళన చెందడం లేదు కానీ... అక్కడి పరిస్థితులపై ఓ కన్నేశాం. వేలం గురువారం జరగనుండగా... సోమవారం భారీ ర్యాలీలతో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులపై సమీక్షిస్తున్నాం’ అని అన్నారు. మరో ఫ్రాంచైజీ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఫ్రాంచైజీ వర్గాలు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై నమ్మకముంచాయి. పౌరసమాజమే కాదు... రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై భగ్గుమంటోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 20న కోల్‌కతాలో తమ పార్టీ నేతలతో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో వేలం పాట ముగిశాక మరుసటి రోజు తిరుగుపయనం కావడంపై కూడా ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయి. అయితే గురువారం జరిగే ఐపీఎల్ వేలం కార్యక్రమంలో ఎలాంటి మార్పు లేదని... ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే వేలం కార్యక్రమం జరుగుతుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
బెట్టింగ్ స్కామ్: ప్రాంఛైజీ ఓనర్ అరెస్ట్
బెంగళూరు: భారత క్రికెట్లో మరోసారి బెట్టింగ్ ఉదంతం కలకలం సృష్టించింది. ఏకంగా ఫ్రాంచైజీ యజమానే బెట్టింగ్‌కు పాల్పడి అడ్డంగా బుక్యయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీపీఎల్)లో ఫిక్సింగ్ ఉదంతాన్ని మరిచిపోకముందే మరో లీగ్‌లో ఏకంగా ఫ్రాంచైజీ యజమాని బెట్టింగ్‌లో పాల్గొనడం క్రికెట్ వర్గాలను నిర్ఘంతపోయాలే చేశాయి. తాజాగా విజయవంతంగా ముగిసిన కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)-2019లో బెళగావి ఫాంథర్ యజమాని అలీ ఆష్వాక్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని బెంగళూరు సిటీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ బుకీతో కలిసి బెట్టింగ్‌లకు పాల్పడినట్లు అలీ అంగీకరించాడని బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఫిక్సింగ్, ఇతరుల హస్తంపై ఆరా! అలీ బెట్టింగ్తో పాటు ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడ అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా అలీతో పాటు ఆటగాళ్లు లేక ఇంకా ఎవరైనా ఉన్నారనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక బెట్టింగ్ ఉదంతంపై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ అంశంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ యువ క్రికెటర్లను ప్రొత్సహించే ఉద్దేశంతో ఐపీఎల్ తరహాలో స్థానిక క్రికెట్ లీగ్‌లను ప్రొత్సహిస్తోంది. అయితే ఇలాంటి వరుస ఘటనలు జరుగుతుండటంతో బీసీసీఐ ఈ లీగ్‌లపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. కేపీఎల్‌లో ఏడు జట్లు పాల్గొంటాయి. తాజాగా కేపీఎల్ ఎడిషన్-2019 ఆగస్టులో ముగిసిన విషయం తెలిసిందే. -
నాలో సత్తా మిగిలే ఉంది
ముంబై: ఇటీవలి ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తనను తీసుకునేందుకు మొగ్గు చూపకపోవడంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ఈ విషయం కొంత బాధించినా... తనలాంటి వారి కంటే కొత్త తరం ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు ఎక్కువ దృష్టిపెడతాయి కాబట్టి సర్దిచెప్పుకొన్నానని అతడు పేర్కొన్నాడు. 37 ఏళ్ల యువరాజ్‌ను మూడు రోజుల క్రితం జరిగిన వేలంలో రెండో రౌండ్లో రూ.కోటి ప్రాథమిక ధరకు ముంబై ఇండియన్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘క్రికెట్ పట్ల వ్యామోహంతో పాటు నాలో ఇంకా సత్తా ఉంది కాబట్టే ఆడగలుగుతున్నా. ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నట్లు మనసులో ఏమూలనో ఉండేది. అదే జరగబోతోంది. ఫ్రాంచైజీ యజమాని అనంత్ అంబానీ నా గురించి మంచి మాటలు చెప్పడం మరింత ఆనందాన్నిచ్చింది. గతేడాది లీగ్‌లో పంజాబ్ తరఫున విఫలమైంది నిజమే. బ్యాటింగ్ ఆర్డర్లో స్థిరమైన స్థానం లేకపోవడమే దీనికి కారణం. ఈసారి మాత్రం అవకాశాలను సద్వినియోగం చేసుకుంటా. ముంబై ఫ్రాంచైజీలోని సచిన్, జహీర్, కెప్టెన్ రోహిత్‌లతో చాలా మ్యాచ్‌లు ఆడా. మనకు ఎవరైనా మద్దతుగా ఉంటే బాగా ఆడేందుకు అది ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది’ అని వివరించాడు. -
చిన్న నగరాల్లో ఈజీబై స్టోర్లు
రెండేళ్లలో మొత్తం 50 కేంద్రాలు కంపెనీ బిజినెస్ హెడ్ ఆనంద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్ దుస్తుల రంగంలో ఉన్న ఈజీబై రెండేళ్లలో స్టోర్ల సంఖ్యను 50కి చేర్చనుంది. ల్యాండ్‌మార్క్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ప్రస్తుతం 15 ఔట్లెట్లు ఉన్నాయి. కొత్త దుకాణాలన్నీ దక్షిణాది రాష్ట్రాల్లోనే వస్తాయని ఈజీబై బిజినెస్ హెడ్ ఆనంద్ అయ్యర్ తెలిపారు. ఒక్కో రాష్ట్రంలో విస్తరించిన తర్వాతే మరో రాష్ట్రంలో అడుగుపెడుతున్నట్టు వెల్లడించారు. ఫ్రాంచైజీ అయిన వి-రిటైల్ తెలంగాణలో అతిపెద్ద ఈజీబై స్టోర్‌ను హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో ప్రారంభించిన సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక దుకాణాన్ని తెరుస్తామని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫ్రాంచైజీ విధానంలోనే వీటిని నెలకొల్పుతామన్నారు. ‘ఒక్కో స్టోర్‌కు రూ.1 కోటి దాకా వ్యయం అవుతుంది. సరుకు నిర్వహణ పూర్తిగా కంపెనీయే చూసుకుంటుంది. థర్డ్ పార్టీ ప్లాంట్ల నుంచి నాణ్యమైన దుస్తులను కొనుగోలు చేస్తున్నాం’ అని వివరించారు. ప్రస్తుతం అయిదు స్టోర్లు నిర్వహిస్తున్నామని, డిసెంబరుకల్లా మరో మూడు స్టోర్లు ప్రారంభిస్తామని వి-రిటైల్ డెరైక్టర్ మధుసూధన్ తెలిపారు. దుస్తుల ధర రూ.69-699 మధ్య ఉంది. -
యువరాజ్పైనే అందరి దృష్టి
* బరిలో హర్భజన్, నెహ్రా * నేటినుంచి ముస్తాక్ అలీ టి20 టోర్నీ న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత భారత టి20 జట్టులో పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందు దేశవాళీలో తన టి20 సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. శనివారం ప్రారంభం కానున్న ముస్తాక్ అలీ టోర్నీలో అతను పాల్గొంటున్నాడు. వన్డేల్లో చెలరేగడం ద్వారా టీమిండియాకు మళ్లీ ఎంపికైన యువీ... టి20ల్లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. ఐపీఎల్లో ఢిల్లీ జట్టు యువీని తప్పించడంతో ఫిబ్రవరిలో జరిగే వేలంలో మరో ఫ్రాంచైజీలకు అతను అందుబాటులోకి వస్తాడు. ఆలోగా ముస్తాక్ అలీ టోర్నీతో పాటు ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌లలో రాణిస్తే యువీ మరో సారి వేలంలో స్టార్‌గా ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది. పైగా టి20 ప్రపంచకప్ కోసం కూడా అతని అవకాశాలు మెరుగవుతాయి. యువీతో పాటు భారత జట్టులోకి ఎంపికైన సీనియర్లు హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా కూడా తమ ప్రదర్శనను, ఫిట్నెస్ను అంచనా వేసేందుకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. వన్డేల్లో స్థానం కోల్పోయిన సురేశ్ రైనా కూడా తన ఫేవరెట్ ఫార్మాట్లో సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యాడు. కుర్రాళ్లకూ అవకాశం ఐపీఎల్ వేలం ఫిబ్రవరిలో జరగనుంది. దానికి కాస్త ముందు హడావిడిగా కాకుండా ఈ సారి ముస్తాక్ అలీ ట్రోఫీ జనవరి 20నే ముగుస్తోంది. కాబట్టి దేశవాళీ యువ ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకోవాలని భావించే ఫ్రాంచైజీలకు వారి ఆటపై ఓ అభిప్రాయానికి వచ్చేందుకు తగినంత సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ప్రదర్శన కుర్రాళ్లకు కూడా కీలకం కానుంది. విజయ్ హజారే తరహాలోనే అన్ని జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. పాయింట్ల ప్రకారం టాప్-2 జట్లు క్వార్టర్స్‌కు చేరతాయి. గ్రూప్ ఎ: హైదరాబాద్, బెంగాల్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తమిళనాడు, విదర్భ గ్రూప్ బి: రాజస్థాన్, పంజాబ్, కేరళ, జమ్మూ కశ్మీర్, సౌరాష్ట్ర, త్రిపుర, జార్ఖండ్ గ్రూప్ సి: ఆంధ్ర, మధ్యప్రదేశ్, అస్సాం, బరోడా, ఢిల్లీ, రైల్వేస్, గోవా గ్రూప్ డి: ముంబై, ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, సర్వీసెస్ -
ఎవరికెంత జీతం!
- బీసీసీఐ వెబ్సైట్లో క్రికెటర్లకు ఇచ్చే మొత్తం - ఈనెల 31 తర్వాత అందుబాటులోకి - భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ఫ్రాంచైజీలు న్యూఢిల్లీ: పరిపాలనలో పారదర్శకత తీసుకొస్తామని ప్రకటించిన బీసీసీఐ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్లో రిటేన్ చేసుకున్న ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు చెల్లిస్తున్న ‘కచ్చితమైన జీతం’ వివరాలను బోర్డు వెబ్సైట్లో పెట్టనుంది. ఈనెల 31 తర్వాత ఇది అందుబాటులోకి రానుంది. అయితే దీనిపై ఫ్రాంచైజీల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే... 2010 నుంచి రిటేన్ చేసుకున్న ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు ఎన్ని డబ్బులు ఇస్తున్నాయనే వివరాలు బహిర్గతం చేయక తప్పదు. లీగ్ నిబంధన ప్రకారం రిటేన్ చేసుకున్న ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు వరుసగా రూ. 12.5 కోట్లు; రూ. 9.5 కోట్లు; రూ. 7.5 కోట్లు; రూ. 5.5 కోట్లు; రూ. 4 కోట్లు ఇవ్వాలి. ఈ మొత్తం ఆయా ఫ్రాంచైజీల వేలం పర్సులో నుంచి తగ్గిపోతాయి. అయితే ఇదంతా కాగితాలపైనే కనిపిస్తున్నా వాస్తవంగా ఆయా క్రికెటర్లకు ఇంతకంటే పెద్ద మొత్తంలోనే డబ్బులు ముడుతున్నాయని సమాచారం. వ్యూహాలకు దెబ్బ: త్రైపాక్షిక (ఆటగాడు, ఫ్రాంచైజీ, బీసీసీఐ) ఒప్పందంలో భాగంగా ఆటగాళ్లకు ఎంత మొత్తం ఇస్తున్నారనే విషయం కచ్చితంగా బీసీసీఐకి తెలుస్తుంది. కానీ బహిరంగ ప్రజానీకానికి మాత్రం ఈ విషయం వెల్లడికాలేదు. ఇప్పుడు కూడా ఈ అంశాన్ని బహిర్గతం చేయడానికి కొన్ని ఫ్రాంచైజీలు ఇష్టపడటం లేదు. ఆటగాళ్లకు చెల్లిస్తున్న కచ్చితమైన జీతభత్యాలను వెల్లడిస్తే తమ వ్యాపార వ్యూహాలు దెబ్బతింటాయని సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్‌కింగ్స్ డెరైక్టర్లలో ఒకరు కాశీ విశ్వనాథన్ అన్నారు. ‘ఇవన్నీ వ్యాపార ప్రతిపాదనలు. అలాంటప్పుడు ఈ రహస్యాలను ఎలా బయటపెడతాం. గతంలో ధోని, రైనా, అశ్విన్, జడేజా, బ్రేవోలను మేం రిటేన్ చేసుకున్నాం. కానీ వాళ్లకు ఎంత ఇచ్చామన్నది ఎప్పుడూ చర్చల్లోకి రాలేదు’ అని విశ్వనాథన్ పేర్కొన్నారు. జీతం అంశాలు బయటకు వస్తే ఆటగాడు, ఫ్రాంచైజీల మధ్య చీలిక ఏర్పడుతుందని మరో ఫ్రాంచైజీ అధికారి అభిప్రాయపడ్డారు. ‘మేం ఎంతకు రిటేన్ చేసుకున్నామనే విషయం మిగతా వాళ్లకు ఎందుకు? ఏ ఆటగాడికి ఎంత ఇస్తున్నామన్నది ఇతర ఫ్రాంచైజీలకు తెలిస్తే ఒప్పందాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇది జట్టులో అశాంతిని రేపుతుంది. రిటేన్ చేసుకున్న భారత ఆటగాడి కంటే ఓ విదేశీ క్రికెటర్ మెరుగ్గా ఆడతాడనుకుందాం. కానీ వేలంలో రిటేన్ ఆటగాడికి చెల్లించే దానికంటే తక్కువగా వస్తే అతను ఎలా ఫీలవుతాడు. షేన్ వాట్సన్‌ను డ్రాఫ్ట్‌లో పుణే, రాజ్‌కోట్‌లో ఎవరూ తీసుకోలేదు. కారణం ఏంటంటే అతనికి రాజస్తాన్ చాలా పెద్ద మొత్తంలో చెల్లించిందని తేలడమే. అది వాట్సన్‌కు చాలా ఎక్కువని ఫ్రాంచైజీలు గ్రహించాయి’ అని సదరు అధికారి వివరించారు. బహిర్గతం చేయడమే మేలు మరోవైపు ఆటగాళ్ల జీతాలను బహిర్గతం చేయడానికి ఫ్రాంచైజీలు భయపడాల్సిన పనేలేదని ఓ ఫ్రాంచైజీ మాజీ అధికారి అన్నారు. ‘ఆటగాళ్ల జీతాల మధ్య తారతమ్యాలు ఉంటాయని ప్రతి ఒక్కరికీ తెలుసు. కాకపోతే రిటేనింగ్ వల్ల ఓ ఐదారు కేసుల్లో భారీ స్థాయిలో తేడాలు వచ్చే అవకాశం ఉంది. అంతమాత్రానికే ఈ విషయాలను బయటపెట్టలేమనడం సరైంది కాదు. బ్యాలెన్స్షీట్లో రాసినప్పుడు అడిటర్లకు తెలిసిపోతాయి. వాటిని ఎలాగూ మార్చలేం. కాబట్టి లిస్టెడ్ కంపెనీలు వాళ్ల బుక్స్‌ను బయటపెడితే తప్పేం లేదు. ఎక్కువ చెల్లించినా, తక్కువ ఇచ్చినా బీసీసీఐ పట్టించుకునే అవకాశమూ లేదు. వాళ్లకు కావాల్సింది వేలం పర్సు లెక్కలే. అయితే ఆటగాళ్లకు చెల్లిస్తున్న మొత్తం పారదర్శకంగా జరగడం లేదు. దీనివల్లే ఇవన్నీ’ అని మాజీ అధికారి వ్యాఖ్యానించారు. -
తెల్ల ఏనుగులు
ధనాధన్ సిక్సర్లు లేవు... ఫటాఫట్ ఫోర్లు లేవు... పరుగుల సునామీ కనుచూపు మేరలో కనిపించడం లేదు... విధ్వంసం అంతకన్నా లేదు... ఓవైపు అనామక క్రికెటర్లు ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తుంటే... మరోవైపు ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి మరీ కొనుక్కున్న క్రికెటర్లు మాత్రం అసలు సీన్లోనే కనబడటం లేదు.. ఇప్పటికే సగానికిపైగా మ్యాచ్‌లు అయిపోయాయి. కానీ కోట్లు దండుకుంటున్న క్రికెటర్లు మాత్రం పరుగులు చేయలేకపోతున్నారు. దీంతో వీళ్లు ‘తెల్ల ఏనుగుల్లా’ మారి ఫ్రాంచైజీలకు భారమవుతున్నారు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టని స్టార్లు సాక్షి క్రీడావిభాగం, కోరీ అండర్సన్ (ముంబై ఇండియన్స్) ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండీస్‌పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసి వన్డేల్లో సూపర్ ఫాస్ట్ సెంచరీ రికార్డు సాధించిన కివీస్ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 4.5 కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేసింది. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో విఫలమైన అతడు ఐపీఎల్‌లోనూ తేలిపోయాడు. భారీ అంచనాల మధ్య ఐపీఎల్ బరిలోకి దిగిన అండర్సన్ చెత్త ఆటను ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచ్‌ల్లో 132 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 39 పరుగులు. నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆరోన్ ఫించ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడు ఆరోన్ఫించ్ది ఐపీఎల్లో ఫ్లాప్ స్టోరీయే. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఓపెనర్‌ని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రూ. 4 కోట్లకి కొనుగోలు చేసింది. కానీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఫించ్ ఏమాత్రం నిలబెట్టలేకపోతున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే రాణించిన ఫించ్ ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచ్‌ల్లో 263 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 88 నాటౌట్. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా రాణించి జట్టును ప్లే ఆఫ్ దశకు తీసుకెళ్తాడని సన్‌రైజర్స్ యాజమాన్యం ఆశిస్తోంది. జాక్ కలిస్... ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో కలిస్‌ది అగ్రస్థానం.. వేదిక ఏదైనా తనదైన శైలిలో రాణించగల సమర్థుడు. అయితే ఐపీఎల్లో ఈ సీజన్లో మాత్రం తనస్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే రాణించిన ఈ ఆల్‌రౌండర్ 151 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. కలిస్ కోసం కోల్‌కతా యాజమాన్యం రూ.5.5 కోట్లు వెచ్చించింది. యువరాజ్ సింగ్ : బెంగళూరు ఐపీఎల్ ఏడో ఎడిషన్‌కు ముందు వేలంలో స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్(రూ. 14 కోట్లు) అందరికంటే ఎక్కువ ధరకు అమ్ముడై అందరి దృష్టినీ ఆకర్షించాడు. టోర్నీలో తానాడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో రాణించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో జట్టు ఓనర్ విజయ్ మాల్యా పెట్టిన ధరకు తగ్గట్టుగానే యువీ ఆడతాడని అంతా భావించారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. తొలి 8 మ్యాచ్‌ల్లో యువీ 144 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే రాజస్థాన్‌పై బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించాడు. ఇదే జోరు మిగిలిన మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తాడా, లేదా అన్నది వేచిచూడాల్సిందే. మైకేల్ హస్సీ (ముంబై ఇండియన్స్) ఐపీఎల్లో విజయవంతమైన క్రికెటర్లలో మైకేల్ హస్సీ ఒకడు. గత సీజన్ వరకు నిలకడగా రాణిస్తూ చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడంతో హస్సీని ముంబై ఇండియన్స్ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆరు సీజన్లలో రాణించిన ఈ ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ ఈ సారి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 30 పరుగులే చేశాడు. దీంతో జట్టు యాజమాన్యం హస్సీని పక్కనపెట్టింది. కెవిన్ పీటర్సన్: డేర్‌డెవిల్స్ ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా టోర్నీ ముందు అభిమానుల్లో ఆశలు రేపాడు. ఇంగ్లండ్ జట్టు నుంచి ఉద్వాసనకు గురి కావడంతో ఐపీఎల్‌పై కేపీ ప్రత్యేక దృష్టి సారించాడు. చేతివేలికి గాయం కారణంగా సీజన్లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆడలేదు. అయితే గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగినా ఇప్పటిదాకా తన సత్తా ఏంటో చూపలేదు.. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రాణించలేకపోయాడు. మొత్తం 97 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 35 నాటౌట్. ఐపీఎల్ వేలంలో రూ. 9 కోట్లకు అమ్ముడుపోయిన ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా తన స్థాయికి తగ్గట్లుగా ఆడతాడని అటు ఢిల్లీ ఫ్రాంచైజీ, ఇటు అభిమానులు ఎదురుచూస్తున్నారు.