![Betting Scam In KPL Belagavi Panthers Team Owner Asfaq Ali Arrested - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/25/betting-scam-in-kpl.jpg.webp?itok=KHGKU-pI)
బెళగావి ఫాంథర్ యజమాని అలీ ఆష్వాక్
బెంగళూరు: భారత క్రికెట్‌లో మరోసారి బెట్టింగ్ ఉదంతం కలకలం సృష్టించింది. ఏకంగా ఫ్రాంచైజీ యజమానే బెట్టింగ్‌కు పాల్పడి అడ్డంగా బుక్యయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీపీఎల్)లో ఫిక్సింగ్ ఉదంతాన్ని మరిచిపోకముందే మరో లీగ్‌లో ఏకంగా ఫ్రాంచైజీ యజమాని బెట్టింగ్‌లో పాల్గొనడం క్రికెట్ వర్గాలను నిర్ఘంతపోయాలే చేశాయి. తాజాగా విజయవంతంగా ముగిసిన కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)-2019లో బెళగావి ఫాంథర్ యజమాని అలీ ఆష్వాక్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని బెంగళూరు సిటీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ బుకీతో కలిసి బెట్టింగ్‌లకు పాల్పడినట్లు అలీ అంగీకరించాడని బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు.
ఫిక్సింగ్, ఇతరుల హస్తంపై ఆరా!
అలీ బెట్టింగ్‌తో పాటు ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడ అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా అలీతో పాటు ఆటగాళ్లు లేక ఇంకా ఎవరైనా ఉన్నారనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక బెట్టింగ్ ఉదంతంపై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ అంశంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ యువ క్రికెటర్లను ప్రొత్సహించే ఉద్దేశంతో ఐపీఎల్ తరహాలో స్థానిక క్రికెట్ లీగ్‌లను ప్రొత్సహిస్తోంది. అయితే ఇలాంటి వరుస ఘటనలు జరుగుతుండటంతో బీసీసీఐ ఈ లీగ్‌లపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. కేపీఎల్‌లో ఏడు జట్లు పాల్గొంటాయి. తాజాగా కేపీఎల్ ఎడిషన్-2019 ఆగస్టులో ముగిసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment