betting scandal
-
మహదేవ్ బెట్టింగ్ స్కామ్: కీలక నిందితుడి అరెస్టు!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో ప్రధాని నిందితుడు రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో ఇంటర్‌పోల్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ రవి ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలో రవిని భారత్ తీసుకువచ్చేందుకు ఈడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో రాయ్‌పూర్ పీఎంఎల్ఏ కోర్టులో ఇప్పటికే ఈడీ రవి ఉప్పల్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రవి తన భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకోకుండానే వనాతు ఐలాండ్ పాస్పోర్టుతో దుబాయ్‌లో ఉంటున్నట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో రూ.6 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఈడీ పేర్కొంది. ఆశిమ్ దాస అనే కొరియర్ ద్వారా రూ.508 కోట్ల ముడుపులను మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాగేల్కు చెల్లించారని అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఆరోపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేయగా దీనికి పూర్తి విరుద్ధంగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇదీచదవండి..డ్యూటీలో కత్తి తీసుకెళ్తా: కోర్టుకెక్కిన ఇండిగో పైలట్ -
IND VS AUS 3rd T20: వేలల్లో టికెట్లు.. కోట్లలో బెట్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ ద్వారా బ్లాక్‌మార్కెటింగ్, బెట్టింగ్ మాఫియాలు భారీగా డబ్బు దండుకున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు వరకు బ్లాక్‌లో టికెట్ల దందా యథేచ్ఛగా సాగగా మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ సైతం జోరుగా జరిగింది. స్టేడియంలో ఫస్ట్ ఫ్లోర్, సౌత్ పెవిలియన్, నార్త్ పెవిలియన్, టెర్రస్.. ఇలా పలు రకాలుగా ఉండే టికెట్లను బ్లాక్ మార్కెట్ మాఫియా కనీసం నాలుగింతలు పెంచి అమ్మింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ మాఫియా రూ. కోట్లలో కొల్లగొట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాన ఆటగాళ్లు చేయబోయే పరుగులు, వికెట్లు తీసే బౌలర్లు, మొత్తంగా జట్టు సాధించే స్కోర్.. ఇలా పలు విభాగాల్లో బెట్టింగ్ సాగింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌ల ద్వారా బెట్టింగ్ గ్రూపులు క్రియేట్ చేసి ఆధార్ కార్డుతో కూడిన వ్యక్తిగత వివరాలు పంపిన వారినే ఇందులో చేర్చుకున్నట్లు తెలిసింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా కేంద్రాలుగా సాగిన ఈ దందాలో రూ.1000 మొదలు రూ. 10 లక్షల దాకా ఒక్కో బంతికి లేదా ఒక్కో పరుగుకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. -
టెన్నిస్‌లో బెట్టింగ్ కలకలం!
బెర్లిన్: టెన్నిస్‌లో బెట్టింగ్ కలకలం చోటుచేసుకుంది. దాదాపు 135 మందికి పైగా ప్రొఫెషనల్ ఆటగాళ్లకు బెట్టింగ్‌లతో సంబంధం ఉందని... అందులో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టాప్–30 ర్యాంకింగ్ ఆటగాళ్లు ఉన్నారంటూ జర్మనీ మీడియా డై వెల్ట్, బ్రాడ్‌క్యాస్టర్ జీడీఎఫ్ బాంబు పేల్చింది. వీరు తొందర్లోనే అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), యూరోపియన్ అథారిటీస్లతో విచారణ ఎదుర్కోనున్నారని ఆ మీడియా సంస్థలు తెలిపాయి. ఇందులో ఇప్పటి వరకు 3 ఏటీపీ టూర్ టైటిల్స్ నెగ్గిన టాప్–30 ర్యాంకు ఆటగాడు ఉన్నాడని సమాచారం. అర్మేనియా బెట్టింగ్ మాఫియాతో చేతులు కలిపిన కొందరు టెన్నిస్ ఆటగాళ్లు మ్యాచ్ ఫలితాలను తారుమారు చేస్తున్నారని బెల్జియం న్యాయవాది ఎరిక్ బిషప్ తెలిపారు. ఈ బెట్టింగ్‌ల ద్వారా కొన్ని వేల యూరోలు చేతులు మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఫిక్సింగ్ చేస్తూ దొరికిన అర్జెంటినా మాజీ టెన్నిస్ ఆటగాడు మార్కొ ట్రుంగెల్లిటి ఈ బెట్టింగ్ సమాచారం అందించినట్లుగా టెన్నిస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. -
బెట్టింగ్ స్కామ్: ప్రాంఛైజీ ఓనర్ అరెస్ట్
బెంగళూరు: భారత క్రికెట్లో మరోసారి బెట్టింగ్ ఉదంతం కలకలం సృష్టించింది. ఏకంగా ఫ్రాంచైజీ యజమానే బెట్టింగ్‌కు పాల్పడి అడ్డంగా బుక్యయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీపీఎల్)లో ఫిక్సింగ్ ఉదంతాన్ని మరిచిపోకముందే మరో లీగ్‌లో ఏకంగా ఫ్రాంచైజీ యజమాని బెట్టింగ్‌లో పాల్గొనడం క్రికెట్ వర్గాలను నిర్ఘంతపోయాలే చేశాయి. తాజాగా విజయవంతంగా ముగిసిన కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)-2019లో బెళగావి ఫాంథర్ యజమాని అలీ ఆష్వాక్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని బెంగళూరు సిటీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ బుకీతో కలిసి బెట్టింగ్‌లకు పాల్పడినట్లు అలీ అంగీకరించాడని బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఫిక్సింగ్, ఇతరుల హస్తంపై ఆరా! అలీ బెట్టింగ్తో పాటు ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడ అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా అలీతో పాటు ఆటగాళ్లు లేక ఇంకా ఎవరైనా ఉన్నారనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక బెట్టింగ్ ఉదంతంపై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ అంశంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ యువ క్రికెటర్లను ప్రొత్సహించే ఉద్దేశంతో ఐపీఎల్ తరహాలో స్థానిక క్రికెట్ లీగ్‌లను ప్రొత్సహిస్తోంది. అయితే ఇలాంటి వరుస ఘటనలు జరుగుతుండటంతో బీసీసీఐ ఈ లీగ్‌లపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. కేపీఎల్‌లో ఏడు జట్లు పాల్గొంటాయి. తాజాగా కేపీఎల్ ఎడిషన్-2019 ఆగస్టులో ముగిసిన విషయం తెలిసిందే. -
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై తీర్పు రేపు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో మంగళవారం తీర్పు వెలువడనుంది. సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పును ఖరారు చేయనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై, రాజస్థాన్ భవితవ్యం తేలనుంది. 2013 ఐపీఎల్ సీజన్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో మేయప్పన్, రాజ్‌కుంద్రాపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ కేసును విచారించడానికి జనవరిలో సుప్రీం కోర్టు.. మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర లోధా సారథ్యంలో కమిటీని నియమించింది. రాజ్‌కుంద్రా, మేయప్పన్లు బెట్టింగ్‌కు పాల్పడ్డారని తేలినట్టు సమాచారం. చెన్నై, రాజస్థాన్ జట్లను నిషేధించవచ్చని లేదా ఈ రెండు జట్లకు భారీ జరిమానా విధించవచ్చని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.