Post Office Schemes
-
‘సుకన్య సమృద్ధి’ వడ్డీ పెరిగిందా? పోస్టాఫీసు స్కీములపై అప్డేట్
చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. వీటిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి ఆయా పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రస్తుత వడ్డీ రేట్లు∇ సుకన్య సమృద్ధి యాజన (SSY): సంవత్సరానికి వడ్డీ రేటు 8.2 శాతం∇ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): వడ్డీ రేటు 8.2 శాతం∇ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): వడ్డీ రేటు 7.1 శాతం∇ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): వడ్డీ రేటు 7.7 శాతం∇ పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS): వడ్డీ రేటు 7.4 శాతం∇ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్: వడ్డీ రేటు 7.5 శాతం∇ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్: వడ్డీ రేటు 6.7 శాతంఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. వడ్డీ రేట్లను చివరిగా 2023 డిసెంబర్ 31న సవరించింది. ఈ చిన్న పొదుపు పథకాలన్నీ పోస్టాఫీసు ద్వారా అందిస్తున్నారు. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు, సార్వభౌమాధికార హామీ ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్ వంటి కొన్ని పథకాలు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను-పొదుపు ప్రయోజనాలను అందిస్తాయి. -
అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
సెప్టెంబర్ ముగుస్తోంది.. అక్టోబర్ నెల మొదలవడానికి మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెలలో మాదిరిగానీ వచ్చే నెలలో (2024 అక్టోబర్) కూడా ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటివాటికి సంబంధించిన చాలా నిబంధలను మారతాయి. ఈ కథనంలో వచ్చే నెలలో ఏ రూల్స్ మారుతాయనే విషయం తెలుసుకుందాం..స్మాల్ సేవింగ్ స్కీమ్2024 అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్ రూల్స్ మారనున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాల వంటి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు ఖాతాలు కొత్త సర్దుబాట్లకు లోబడి ఉంటాయి. రెగ్యులర్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్ (NSS) ఖాతాలపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. కొన్ని అకౌంట్స్ క్రమబద్దీకరించాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలుఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 నుంచి మీరు రూ. 10వేలు ఖర్చు చేయడం ద్వారా రెండు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. మునుపటి క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు.. తరువాత క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్‌ను అన్‌లాక్ చేస్తాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులువచ్చే నెల ప్రారంభం నుంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్దులో కొన్ని మార్పులు జరగనున్నాయి. స్మార్ట్‌బై ప్లాట్ఫామ్లో.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే.. అందులో వచ్చే రివార్డ్ పాయింట్స్ కేవలం ప్రొడక్ట్‌కు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు 1వ తేదీ నుంచి స్మార్ట్‌బై పోర్టల్ ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్ల చొప్పున తనిష్క్ వోచర్ల కోసం రివార్డ్ పాయింట్ల రిడీమ్‌ను పరిమితం చేస్తుంది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కార్డ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి : ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంటీడీఎస్ వడ్డీ రేట్లుకేంద్ర బడ్జెట్ సమయంలో సెక్షన్ 194DA - జీవిత బీమా పాలసీకి సంబంధించి చెల్లింపును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సెక్షన్ 194G - లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్ తదితరాలను కూడా 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఇది కూడా 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం. -
చేతిలో రూ.25 లక్షలు ఉన్నాయ్.. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
నాకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో రూ.4 లక్షల పెట్టుబడులు ఉన్నాయి. మూడేళ్ల తర్వాత నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ ఏది? – ధీరజ్ సన్యాల్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. 8 శాతం వార్షిక రాబడిని (హామీతో కూడిన) మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటారు. కానీ డిపాజిట్ చేసిన రోజు ఉన్న రేటే ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లే అయినా, ఫారమ్–2 సమర్పించడం ద్వారా ముందుగానే ఖాతాను మూసివేయవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్ చేసిన కాలవ్యవధి ఆధారంగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటికే మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్‌ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద చెల్లించాల్సి వస్తుంది. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మూడేళ్ల తర్వాత మీ డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్సీఎస్ఎస్ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించి కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా, ఎలాంటి పెనాల్టీ పడదు. నా వయసు 74 ఏళ్లు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ త్వరలోనే గడువు తీరి (మెచ్యూరిటీ) రూ.25 లక్షలు చేతికి రానున్నాయి. నేను ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ప్రభుత్వ పథకాలు అయిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై), పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్)లో పూర్తి స్థాయిలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. – ఎస్.అరుణ్ ఫిక్స్డ్ డిపాజిట్లో రాబడులు మెరుగ్గా ఉండవు. కనుక మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ అస్థిరతలతో ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌లో మాదిరిగా అస్థిరతలు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో ఉండవు. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్, ఆర్బిట్రేజ్ అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్‌లోనూ రిస్క్ ఎక్కువే ఉంటుంది. అయితే మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలానికి రిస్కీ అని నేను అనుకోను. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మరోక ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోనూ రాబడులు ఉంటాయి. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్, పీఎంవీవీవై పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి కనుక క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడి తీసుకుంటూ ఉంటారు. కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఉన్న వాటిల్లో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్ అవుతుంది. ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌కు వెళ్లొచ్చు. -
పన్ను ప్రయోజనాలు కావాలంటే.. ఈ పోస్టాఫీస్ పథకాలపై ఓ లుక్కేయండి!
పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఆలోచించేది, ఆచరించే మంత్రం ‘పొదుపు’. వారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పొదుపు చేయడంతో పాటు ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా పొందొచ్చు.అవేంటో తెలుసుకుందాం! పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఈ పథకంలో 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇందులో కనీసం రూ. సంవత్సరానికి 500, గరిష్ట డిపాజిట్ రూ.ఒకే ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షలు జమ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా ప్రాణాంతక వ్యాధి, ఉన్నత విద్య , నివాస మార్పు వంటి పరిస్థితులకు లోబడి ఉంటుంది. అయితే, వ్యక్తులు 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. 4 సంవత్సరాల తర్వాత రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద చేసిన డిపాజిట్లకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అదనంగా, సంపాదించిన వడ్డీ పూర్తిగా పన్ను రహితం. ప్రస్తుత పోస్టాఫీసు PPF వడ్డీ రేటు వార్షికంగా 7.1% ఉంది. సుకన్య సమృద్ధి ఖాతా ఆడపిల్లల భవిష్యత్ కోసం ఉద్దేశించిన ప్రత్యేక పథకం ఇది. 10 ఏళ్లలోపు బాలికలకు ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచే సమయంలో అమ్మాయి వయస్సుతో సంబంధం లేకుండా ఈ పథకం 21 సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంది. ఉదాహరణకు, ఖాతా తెరిచే సమయంలో ఒక అమ్మాయికి 7 సంవత్సరాలు ఉంటే, ఆ అమ్మాయికి 28 ఏళ్లు వచ్చేసరికి ఆ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 సంవత్సరాల పాటు డిపాజిట్లు చేయాలి. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.60%. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో ముందస్తు విత్ డ్రా చేసుకోవచ్చు, కాకపోతే కనీసం 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ పన్ను ఆదా పథకం కింద చేసిన పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలకు అర్హత పొందుతాయి. ప్రస్తుత పోస్టాఫీసు సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీ రేటు సంవత్సరానికి 7.6% అందిస్తుంది. ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహం కోసం నియమ నిబంధనలను అనుసరించి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో చేసే పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే వడ్డీ గానీ, మెచ్యూరిటీ మొత్తంపై గానీ పన్ను వర్తించదు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అనేది పన్ను మినహాయింపు కోసం ప్రముఖ పోస్టాఫీసు పథకాలలో ఒకటి. ఈ ప్లాన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. పెట్టుబడిదారులు 1, 2, 3, 5 సంవత్సరాల వంటి వివిధ కాల వ్యవధిలో డిపాజిట్లు చేయవచ్చు ఈ పథకంలో గరిష్ట పదవీకాలం 5 సంవత్సరాలు. టైమ్ డిపాజిట్లో కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000, కాగా దీనికి గరిష్ట పరిమితి లేదు. అయితే, పన్ను ప్రయోజనం రూ. 1.5 లక్షలు ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పన్ను ప్రయోజనం కోసం ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఖతాదారుడు మొత్తం పెట్టుబడిని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఖాతాదారులు అసలు, వడ్డీ రెండు కలిపి మొత్తం కార్పస్‌ను అందుకుంటారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 7% వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దలు, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 55 నుంచి 60 ఏళ్ల లోపు వయసువారు ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు.. ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. దీని ప్రత్యేకత ఏమనగా.. పోస్టాఫీస్ అందిస్తున్న పథకాల్లో అత్యధిక వడ్డీ రేటుని అందిస్తోంది ఈ పథకం. ప్రస్తుతం వార్షికంగా ఈ పథకం 8% వడ్డీ రేటు అందిస్తోంది. ఇందులో వడ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జులై, అక్టోబరు, జనవరి నెలల్లో మొదటి తేదీన వడ్డీ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. -
బెజవాడ పోస్ట్ ఆఫీస్ లో నిధులు గోల్మాల్
-
పోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్..! ఇంకా కొన్ని రోజులే ఛాన్స్..! లేకపోతే..!
పోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్..! ఏప్రిల్ 1, 2022 నుంచి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్ ఖాతాలపై వడ్డీని నగదు రూపంలో చెల్లించడాన్ని నిలిపివేస్తాయని పోస్ట్ డిపార్ట్మెంట్ సర్క్యులర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. వీటికి అందించే వడ్డీలను ఖాతాదారుడి పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతాలో మాత్రమే వడ్డీ జమ చేయబడుతుందని పోస్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఖాతాదారుడు పొదుపు ఖాతాను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ , టర్మ్ డిపాజిట్ ఖాతాల ఖాతాలతో లింక్ చేయలేకపోతే ఇబ్బందులు తలెత్తనున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు, వృత్తి వ్యాపారాలు చేసేవారు, చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పోస్టాఫీసులు అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. వాటిలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ వంటి పథకాలు ఎక్కువగా ఆదరణను పొందాయి. ఈ పథకాల్లో సేవింగ్స్ చేయడం ద్వారా ఖాతాదారులు వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతారు. ఈ వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా కూడా చేసుకునే సదుపాయం ఉంది. అయితే, ఈ వడ్డీ ఆదాయాన్ని విత్ డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌కు సంబంధించిన వడ్డీ ఆదాయాన్ని అనుసంధానిత పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంకు ఖాతాకు మాత్రమే జమ చేస్తామని పోస్టల్ శాఖ ప్రకటించింది. సదరు స్కీమ్‌కు సంబంధించిన వడ్డీ నేరుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా, లేదా బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. మార్చి 31వ తేదీలోపు వారి ఖాతాలను పోస్టాఫీసు పొదుపు ఖాతా, బ్యాంక్ అకౌంట్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని పోస్టల్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఒకవేళ ఈ తేదీలోపు అనుసంధానించకపోతే వడ్డీ ఆదాయాన్ని సంబంధిత సండ్రీ అకౌంట్‌కు బదిలీ చేయనుంది. అయితే, ఏప్రిల్ 1 నుంచి సండ్రీ అకౌంట్ ద్వారా నగదు రూపంలో చెల్లింపులు ఉండవని, ఔట్ స్టాండింగ్ వడ్డీ ఆదాయాన్ని పోస్టాఫీసు పొదుపు ఖాతా, చెక్ ద్వారా మాత్రమే చెల్లిస్తామని పోస్టల్ శాఖ. స్పష్టం చేసింది. చదవండి: ఎన్ఎస్సీ, పీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్లలో వడ్డీరేట్లు.. పన్ను రాయితీలు ఇలా -
పోస్టల్ ఖాతాదారులకు అలర్ట్.. ఆ పథకాలను ఖాతాతో లింకు చేశారా?
చిన్న మొత్తాల్లో పొదుపు చేసే వారికి పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చే పొదుపు పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఎస్సిఎస్ఎస్, టైమ్ డిపాజిట్ వంటి పొదుపు ఖాతాలలో చాలా మంది పొదుపు చేశారు. ఈ పథకాల ద్వారా చాలా మందికి నెలవారీ, త్రైమాసిక, వార్షికానికి ఒకసారి వడ్డీ లభిస్తుంది. అయితే, వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా చేసుకుంటున్నారని గుర్తించిన పోస్టల్ శాఖ ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. 01.04.2022 నుంచి అలా నగదు రూపంలో పొదుపు పథకాల వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా చేయలేరు అని పేర్కొంది. పోస్టల్ డిపార్ట్ మెంట్ జారీచేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.." ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ ఖాతాల ద్వారా లభించే వడ్డీని 01.04.2022 నుంచి అకౌంట్ హోల్డర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ ఖాతాలో మాత్రమే క్రెడిట్ చేయనున్నారు. ఒకవేళ ఖాతాదారుడు తన పొదువు ఖాతాను ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ ఖాతాలతో 31.03.2022 వరకు లింక్ చేయకపోతే ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ సండ్రీ ఆఫీసు ఖాతాల్లో వడ్డీ క్రెడిట్ చేయనున్నట్లు తెలిపింది. అలా బకాయి వడ్డీని పోస్ట్ఆఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా చెక్ ద్వారా మాత్రమే చెల్లించనున్నారు. 01.04.2022 నుంచి ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ సండ్రీ ఆఫీసు అకౌంట్ నుంచి వడ్డీని క్యాష్ రూపంలో చెల్లించరు" అని తెలిపింది. సేవింగ్స్ ఖాతాకు లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ నుంచి లభించే వడ్డీ పొదుపు ఖాతాలో జమ అయినట్లు అయితే, మీకు అదనంగా వడ్డీ లభిస్తుంది. డిపాజిటర్లు పోస్టాఫీసును సందర్శించాల్సిన పని లేకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ వడ్డీ కోసం ప్రతిసారీ విత్ డ్రా ఫారాలను నింపాల్సిన అవసరం లేదు. డిపాజిటర్లు ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ ఖాతాల లభించే వడ్డీని పివో సేవింగ్స్ అకౌంట్ నుంచి రికరింగ్ డిపాజీట్ ఖాతాలకు ఆటోమేటిక్ క్రెడిట్ అయ్యే సౌకర్యాన్ని పొందవచ్చు. (చదవండి: యాపిల్ తిక్క కుదిరింది.. ఐఫోన్‌కు దీటుగా రష్యా కొత్త ఫోన్..!) -
అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది!
All About Kisan Vikas Patra Saving Scheme: పోస్టాఫీస్‌కు చెందిన సేవింగ్ స్కీమ్‌లలో కిసాన్ వికాస్ పత్ర పథకం ఒకటి. ఈ సేవింగ్ స్కీమ్‌లో మీ సొమ్మును మదుపుచేశారంటే (బ్యాంకు కంటే) 124 నెలల్లో అది రెట్టింపవుతుంది. అంతేకాకుండా మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంకులు దివాలా తీస్తే కేవలం 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. ఐతే పోస్టాఫీసులో అలా కాదు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.. వడ్డీ రేటు పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకం 6.9 శాతం వడ్డీ అందిస్తుంది. ప్రతీ యేటా వడ్డీని కలుపుతారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ వడ్డీ వర్తిస్తుంది. ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు ఈ పోస్టాఫీసు పథకంలో కనీసం రూ. 1000లతో ఖాతా తెరవాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అంటే రూ.1000ల నుంచి ఎంతైన మదుపు చేయవచ్చు. ఖాతా తెరవడానికి ఎవరు అర్హులు? కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించిన అకౌంట్లో ముగ్గురు సభ్యులవరకు జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. పదేళ్ల వయసున్న మైనర్లు కూడా తమ పేరు మీద నేరుగా ఖాతా తెరవొచ్చు. మెచ్యురిటీ పీరియడ్ సమర్పించిన తేదీ నుండి 124 నెలలు (10 సంవత్సరాల 4 నెలలు) ఉంటుంది. ఖాతా బదిలీ చేసే సందర్భాలు ►ఈ పథకం కింది సందర్భాలలో మాత్రమే వ్యక్తి నుండి వ్యక్తికి ఖాతా బదిలీ చేస్తుంది.. ►ఖాతాదారు మరణిస్తే, నామినీ లేదా చట్టపరమైన వారసుడికి ఖాతా బదిలీ చేయబడుతుంది. ►ఖాతాదారుడు మరణిస్తే, ఖాతాను జాయింట్ హోల్డర్‌కు బదిలీ చేయవచ్చు. ►కోర్టు ఆదేశాల మేరకు ఖాతా బదిలీ చేయవచ్చు. ►అంతేకాకుండా ఖాతాను ఏదైనా అధికారి వద్ద తనఖా పెట్టవచ్చు. చదవండి: ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో.. -
బంపరాఫర్ ! పోస్టాఫీస్‌లో వెయ్యితో ఖాతా తెరిస్తే ఐదేళ్లలో రూ.14 లక్షలు! పూర్తి వివరాలు
సాధారణంగా పోస్టాఫీస్‌కు సంబంధించిన అన్ని స్కీములు అధిక వడ్డీని అందిస్తాయనే విషయం తెలిసిందే! వినియోగదారుల పొదుపుకు అధిక మొత్తంలో లాభాలను అందించడంలో పోస్టాఫీస్ స్కీములు ఎప్పుడూ ముందుంటాయి. ఐతే తాజాగా మరొక అదిరిపోయే స్కీమ్‌ను మీకు పరిచయం చేస్తోంది. ఆ వివరాలు మీ కోసం.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్). ఈ స్కీమ్ ద్వారా మదుపరులకు ఏకంగా 7.4 శాతం వడ్డీని అందిస్తోంది పోస్టల్‌శాఖ. ఈ స్కీమ్ రిటైర్ అయినవారికి, సేవింగ్ ఎకౌంట్ ఉన్న వారికి చాలా ప్రయోజనకరం. ఈ స్కీమ్ ద్వారా అధికమొత్తంలో తిరిగి సొమ్ము అందితుంది. ఎలాగంటే.. ►60 యేళ్ల పై వయసున్నవారు మాత్రమే ఎస్సీఎస్ఎస్లో అకౌంట్ తెరవడానికి అర్హులు. ► ఆసక్తి ఉన్నవారు 1000 రూపాయలతో ఖాతా తెరవొచ్చు. ►ఇలా మొత్తం పది లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 7.4 శాతం వడ్డీతో కలిపి రూ. 14,28,964 లక్షలు రిటర్న్ వస్తాయి. ►ఆ లెక్కన మొత్తం ఐదేళ్లలో సుమారు రూ. 4 లక్షల 28 వేల వడ్డీ అందుతుంది. ►సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు మదుపు చేయవచ్చు. ►అంతేకాదు మెచ్యురిటీ పీరియడ్ ఐదేళ్లయినప్పటికీ ఈ సమయాన్ని మరో మూడేళ్ల వరకు పొడిగించుకునే సదుపాయం కూడా ఉంది. ►ఎస్సీఎస్ఎస్లో వెయ్యి నుంచి లక్ష రూపాయలలోపు ఖాతా తెరవవచ్చు. ఐతే వడ్డీ విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. ►ఈ పథకంలోని పెట్టుబడులకు సెక్షన్ 80 సి కింద ఆదాయపన్ను నుంచి మినహాయింపు కూడా ఉంది. ఇక ఆలస్యమెందుకు అవసరమైన డాక్యుమెంట్లతో మీ సమీపంలోని పోస్టాఫీస్‌లో వెంటనే అకౌంట్ తెరవండి... మీ విశ్రాంత జీవితానికి మరింత భద్రత పొందండి. చదవండి: అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!! -
ప్రతి నెల రూ.1500 పొదుపు చేస్తే.. రూ.35 లక్షలు మీ సొంతం!
Gram Suraksha Scheme: పెట్టుబడిదారులకు సురక్షితమైన, భరోసాతో కూడిన రాబడిని అందించే పెట్టుబడి పథకాలను ఎప్పటికప్పుడు ఇండియా పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. మార్కెట్ లింక్డ్ పథకాలతో పోలిస్తే పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి పథకాలు ఈక్విటీ పనితీరుపై ఆధారపడవు కాబట్టి పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం. కాబట్టి, సురక్షితమైన పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. అటువంటి పథకాలలో 'గ్రామ సురక్షా పథకం' ఒకటి. ఈ పథకం కింద పెట్టుబడిదారులు ప్రతి నెలా కేవలం రూ.1500 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయం తర్వాత రూ.35 లక్షల వరకు పొందవచ్చు. పైన పేర్కొన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేయడం ద్వారా పెట్టుబడిదారులు రూ.31 నుంచి 35 లక్షల ప్రయోజనం పొందవచ్చు. 9 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ భారతీయ పౌరుడు అయినా పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద హామీ ఇవ్వబడిన కనీస మొత్తం రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. పోస్టాఫీసు పథకం కింద ప్రీమియంలను నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ వార్షికంగా లేదా వార్షికంగా చెల్లించవచ్చు. పెట్టుబడిదారులు ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. (చదవండి: సన్నీ లియోనీ పేరుతో ఎన్ఎఫ్టీ.. ఇది మరో రికార్డు!) అంతేకాక, ఎంపిక చేసిన కాలపరిమితి కోసం స్కీంలో నిరంతరం పెట్టుబడి పెట్టిన తరువాత వారు పెట్టుబడులకు విరుద్ధంగా అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ పథకాన్ని మూడు సంవత్సరాలల తర్వాత కూడా సరెండర్ చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు మీరు గ్రామ సురక్ష పథకాన్ని ముగించుకుంటే బోనస్ ప్రయోజనం లభించదు. ఒక వ్యక్తి పోస్టాఫీసు పథకంలో 19 ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన సురక్ష పాలసీని కొనుగోలు చేసినప్పుడు 55 సంవత్సరాల వరకు నెలవారీ ప్రీమియం రూ.1515, 58 సంవత్సరాలకు రూ.1463, 60 సంవత్సరాలకు రూ.1411 చెల్లించాల్సి ఉంటుంది. 55 సంవత్సరాల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.31.60 లక్షలు రూ.58 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్ రూ.34.60 లక్షలు ఉంటుంది. (చదవండి: సన్నీ లియోనీ పేరుతో ఎన్ఎఫ్టీ.. ఇది మరో రికార్డు!) -
బంపర్ ఆఫర్: పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్,పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ
ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి..ఎక్కువ ఆదా పొందేలా ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్‌ను ఫ్రాంఛైజ్ తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కేంద్రప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్ వర్క్‌ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 1.55లక్షల పోస్టాఫీస్‌లు ఉన్నాయి. అందులో 89 శాతం పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో సేవల్ని అందిస్తున్నాయి. అయితే కేంద్రం ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చెందుతున్న రూరల్, అర్బన్ ఏరియాల్లో సైతం ఈ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు 2019లో ఈ ఫ్రాంఛైజ్ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. పోస్టాఫీస్ ఫ్రాంఛైజీ తీసుకుంటే ఏం చేయాలి? ► స్టాంప్స్, స్టేషనరీని అమ్ముకోవచ్చు. ► బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ సర్వీస్‌లను అందించాల్సి ఉంటుంది ► పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (పీఎల్ఐ- ఏజెంట్)కు సంబంధించిన అమ్మకాలు, ప్రీమియంను కట్టించుకోచ్చు. ► పోస్టాఫీస్ పరిధిలోకి వచ్చే రీటైల్ సర్వీసులు అంటే బిల్స్, ట్యాక్స్, పన్నుల వసూళ్లు లేదా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఫ్రాంఛైజీకి కావాల్సిన అర్హతలు ► ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవాలంటే మినిమం 8వ తరగతి చదివి ఉండాలి. ఇక డిపాజిట్ కింద రూ.5000 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పోస్టాఫీస్ అధికారులు మీ దరఖాస్తును డివిజనల్ హెడ్‌కు పంపిస్తారు. ► అలా మీ ధరఖాస్తును చెక్ చేస్తారు. మీ ఫ్రాంఛైజీకోసం అప్లయ్ చేసిన ధరఖాస్తుకు చెందిన అడ్రస్‌ను పరిశీలిస్తారు. దీంతో పాటు ఫ్రాంఛైజీని నిర్వహించే సామర్ధ్యం ఉందా లేదా, కంప్యూటర్ సౌకర్యం ఉందా లేదా అని పరిగణలోకి తీసుకుంటారు. ► అనంతరం 14 రోజుల్లో ఫ్రాంఛైజీకి మీరు అర్హులు, కాదా అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఫ్రాంఛైజీకి ఎవరికి? ఏ ప్రాంతంలో ఇవ్వరు ► 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి అవకాశం ఇవ్వరు. ► పోస్టాఫీస్ ఉద్యోగం చేస్తున్నా, లేదంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఫ్రాంఛైజీని తీసుకునేందుకు అనర్హులు ► పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ పథకంలో భాగంగా పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్లు ఉన్న గ్రామాలకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరు. ఫ్రాంఛైజీ వల్ల లాభాలు (⇔ ఈ లింక్ క్లిక్ చేస్తే 22పేజీలో పూర్తి వివరాలు) ► పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ నిర్వాహకులు అందించే సేవలపై కమీషన్ లభిస్తుంది. ► రిజిస్టర్డ్ పోస్ట్‌కు రూ.3, స్పీడ్పోస్టుకు రూ.5 కమీషన్, రూ.100 నుంచి రూ.200 మనీ ఆర్డర్‌పై రూ.3.50, అంతకన్నా ఎక్కువ మనీ ఆర్డర్‌పై రూ.5 కమీషన్ వస్తుంది. ► నెలలో 1000 రిజిస్టర్ పోస్టులు, 1000 స్పీడ్ పోస్ట్‌లు బుక్ చేస్తే 20శాతం కమీషన్ అదనంగా లభిస్తుంది. ► ఇక స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ, మనీ ఆర్డర్ ఫామ్ లాంటి అమ్మకాలపై 5 శాతం కమిషన్ ఉంటుంది. చదవండి : ఏటీఎం సెంటర్లలో మారిన రూల్స్, వాటి గురించి మీకు తెలుసా? -
World Post Day 2021: జ్ఞాపకాల మూట
World Post Day 2021: నిన్న మొన్నటి వరకూ టెలిఫోన్ కలిగిన వారిదే. మధ్యతరగతిది ఉత్తరం. పేదవాడికి పోస్ట్‌కార్డ్. కనీసం ఐదు దశాబ్దాల భారతీయుల జీవన భావోద్వేగాలు లేఖలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ కార్డులు, మనీ ఆర్డర్ల చుట్టే తిరిగాయి. ఉత్తరం లేకపోతే... పోస్ట్‌మేన్ లేకపోతే ఆ జ్ఞాపకాలు ఉండేవా? అక్టోబర్ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’ సందర్భంగా కొన్ని ఉద్వేగాల రీవిజిట్. ‘ఇద్దరం ఉద్యోగానికి అప్లై చేద్దాం. నా వంతు డబ్బులు నావి. ఏవీ... మీ డబ్బులు ఇవ్వండి’ అని నిస్సిగ్గుగా సావిత్రి దగ్గరి నుంచి అడిగి మరీ తీసుకుంటాడు ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’లో. ఆ నిరుద్యోగ రోజులు అలాంటివి. వారి అప్లికేషన్ పోస్ట్‌లో అందుకున్న వెంటనే ఎస్.వి.రంగారావు ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని టెలిగ్రామ్ ఇమ్మంటాడు మేనల్లుడు ఏఎన్నార్‌ని. అంతేనా ఖర్చులకు 200 ఎం.ఓ కూడా చేయమంటాడు. చూడండి... ఒక్క సీనులో ఎన్ని పోస్టాఫీసు సేవలు అవసరమయ్యాయో. ఆ సేవలు లేకుంటే ఎన్టీఆర్, సావిత్రి ఉద్యోగంలో చేరేవారూ కాదు... ‘రావోయి చందమామ’ పాడేవారూ కాదు. గాంధీ గారికి ఉత్తరాలు రాయకుండా ఏ రోజూ గడవలేదు. నెహ్రూ జైలులో ఉండి తన కుమార్తె ఇందిరకు తెగ ఉత్తరాలు రాశారు. ఉత్తరం రాయడం ఒక మర్యాద. ఉత్తరం అందుకోవడం ఒక గౌరవం. ఉత్తరాలు ఒకరికొకరు రాసుకుంటూ ఉండటం స్నేహం. కాని ఉత్తరం కేవలం పెద్దవాళ్ల వ్యవహారంగా కొంతకాలమే ఉంది. పేదవాళ్లు, మధ్యతరగతి వారు ఉత్తరాలను మొదలెట్టారు. వీధి మొదలులో వేలాడదీసి ఉండే ఎర్రటి పోస్ట్ డబ్బాను గుర్తించారు. ఊళ్లో ఆ రోజుల్లో స్కూల్ మేష్టారు లేదంటే పోస్ట్మేస్టారే కదా గౌరవనీయులు. ‘పెళ్లి చేసి చూడు’లో ఏఎన్నార్ తండ్రి తెలుగు మేష్టారు రావికొండలరావు. కొడుకు పంపాల్సిన మనియార్డర్ ఏదిరా అని పోస్ట్మేన్ని దబాయిస్తాడు. ‘రాలేదు మేష్టారు’ అనంటే ‘వస్తే అందరూ ఇస్తారు. రాకపోయినా ఇవ్వడమే గొప్పదనం’ అంటాడు. 1970లు, 80లు కొడుకుల మనిఆర్డర్ల కోసం తల్లిదండ్రుల కళ్లు కాయలు కాచేలా చేశాయి. నిరుద్యోగ భారతంలో కొడుకు ఉద్యోగం సంపాదించి ఎంతో కొంత పంపితేనే జరుగుబాటైన ఇళ్లు. ఆ రోజుల్లో అకౌంట్లు ఎవరికీ ట్రాన్స్ఫర్లు ఎవరికీ ఫోన్‌పేలు ఎవరికీ? మని ఆర్డరే. పోస్ట్‌మేన్ మనీ ఆర్డర్ తెచ్చి ఇస్తే సంతోషించి ఆ ఇంటి ఇల్లాలు మజ్జిగ ఇచ్చేది. ఇంటి పెద్ద రూపాయో రెండ్రూపాయలో బక్షీసు ఇచ్చేవాడు. ఆ పూట ఆ ఇంట్లో గుండెల మీద కాకుండా వంటగదిలోనే కుంపటి వెలిగేది. సౌదీ, అమెరికా, రంగూన్... వలస వెళ్లిన వారి ఉత్తరాలు నెలల తరబడి వేచి చూస్తే తప్ప వచ్చేవి కావు. సైన్యంలో చేరిన వారి బాగోగులు ఉత్తరాలు చెప్తే తప్ప తెలిసేవి కావు. పట్నంలో చదువుకుంటున్న కొడుకు పరీక్ష ఫీజు కోసం రాసిన పోస్ట్‌కార్డు అతి బరువుగా అనిపించేది. కాపురానికి వెళ్లిన కూతురు నుంచి వచ్చిన ప్రతి ఉత్తరం ఉలికిపాటును తెచ్చేదే. ఆ కూతురు కూడా తక్కువ తిన్నదా? కష్టాలన్నీ తాను దిగమింగుతూ సంతోషంగా ఉన్నట్టు తెగ నటించదూ? ఇంటర్వూకు కాల్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, స్టడీ మెటీరియల్, కలం స్నేహం కోసం మొదలెట్టిన జాబులు, పత్రికకు పంపిన కథకు జవాబు, తకరారులో చిక్కుకుంటే వచ్చే కోర్టు నోటీసు, వ్యాపార లావాదేవీల కరెస్పాండెన్సు, అభిమాన హీరోకు లేఖ రాస్తే పంపే ఫొటో, వశీకరణ ఉంగరం... ఎన్నని. అన్నీ ఆ ఖాకీ బట్టల పోస్ట్‌మేన్ చేతుల మీదుగా అందేవి. తెలిసేవి. సంతోషపెట్టేవి. బాధించేవి. గెలిపించేవి. ఓడించేవి. ఇక కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఉత్తరాలు సృష్టించిన ‘డ్రామా’ అంతా ఇంతా కాదు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే లైనుతో ఎన్నో కథలు మొదలయ్యేవి. ఉత్తరాలు అందక ఏర్పడిన అపార్థాలు, ఒకరి ఉత్తరం ఇంకొకరికి చేరి చేసే హంగామాలు, ఒకరి పేరుతో మరొకరు రాసే ప్రేమ లేఖలు.. వీటిలో పోస్ట్మేన్లది ఏ పాపమూ ఉండదు. కాని వారికి తెలియకనే వ్యవహారమంతా వారి చేతుల మీదుగా నడుస్తుంటుంది. ఉత్తరాలు బట్వాడా చేయాల్సింది వారే కదా. కొందరు పోస్ట్‌బాక్స్ నంబర్ తీసుకుని ఆ నంబర్ మీదే సవాలక్ష వ్యవహారాలు నడిపేవారు. బుక్పోస్ట్ను ఉపయోగించి పుస్తకాలు పంపని కవులు, రచయితలు లేరు. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ డ్యూ అక్నాలెడ్జ్మెంట్ అయితే ఆ ధీమా వేరు. ‘టెలిగ్రామ్’కు పాజిటివ్ ఇమేజ్ లేదు. అది వచ్చిందంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారమే. సంతవ్సరం పొడుగూతా సేవ చేసే పోస్ట్‌మేన్ మహా అయితే అడిగితే దసరా మామూలు. అది కూడా ఇవ్వక వారిని చిన్నబుచ్చేవారు కొందరు. చాలీ చాలని జీతంతో, ఎండనక వాననక సైకిల్ తొక్కుతూ ఇల్లిల్లు తిరిగి క్షేమ సమాచారాలు ఇచ్చి ఊరడింప చేసే ఆత్మీయుడు పోస్ట్‌మేన్ మధ్యతరగతి భారతదేశంలో కనిపించని పాత్ర పోషించాడు. ఇవాళ కథే మారిపోయి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. చేతిరాతతో అందుకునే ఉత్తరం జాడ ఎక్కడిది. ఆ చెరగని గుర్తు ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు. ఆ కాలానికి ధన్యవాదాలు. థ్యాంక్యూ పోస్ట్‌మేన్. ‘‘ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు.’’ -
Post Office Schemes: పోస్ట్ ఆఫీస్ టాప్ - 5 డిపాజిట్ స్కీమ్స్
ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. పోస్టాఫీసు పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడి కూడా అందిస్తుంది. పోస్టాఫీసు పథకాలు నమ్మదగినవి. ఈ పథకాలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. గరిష్ట వడ్డీ రేట్లతో ప్రజాదరణ పొందిన తపాలా కార్యాలయ పథకాలు కొన్ని సుకన్య సమృద్ధి పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం, కిసాన్ వికాస్ పాత్రా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. వీటి గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం. (చదవండి: వన్‌ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్) సుకన్య సమృద్ధి పథకం సుకన్య సమృద్ధి పథకాన్ని సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల పేరిట ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు. సంవత్సరానికి 7.6 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రాతిపదికన లెక్కిస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం అనేది రిటైర్డ్ వ్యక్తులు, వృద్ధులకొరకు ప్రజాదరణ పొందిన పథకం. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు రూ.1000తో ఈ స్కీమ్‌లో ఖాతా తెరవొచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒకేసారి రూ.10 లక్షలు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో మీకు రూ.14 లక్షలకు పైగా వస్తాయి. వడ్డీ రూపంలో రూ.4,28,964 వరకు పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)ను ఎవరైనా తెరవవచ్చు. పిపిఎఫ్ కింద పెట్టుబడి పెట్టె నగదుపై ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1,50,000 నగదు జమ చేయవచ్చు. పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మనిహాయింపు లభిస్తుంది. పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 15 ఏళ్ల తర్వాత చేతికి రూ.40 లక్షలకు పైగా వస్తాయి. కిసాన్ వికాస్ పత్ర కిసాన్ వికాస్ పాత్రా పథకం కింద కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు. 124 నెలల్లో (10 సంవత్సరాలు 4 నెలలు) పెట్టుబడి పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది. వార్షికంగా 7.7 వడ్డీ వడ్డీ రేటు లభిస్తుంది మీరు రూ.50,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలం తర్వాత రూ.73,126 లభిస్తాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు. వార్షికంగా 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే మెచ్యూరిటీ కాలం తర్వాత మాత్రమే వడ్డీ అసలు చెల్లిస్తారు. ఎన్ఎస్సీ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత చేతికి దాదాపు రూ.21 లక్షలు వస్తాయి. -
మైనర్ల పేరుతో పీఓఎమ్ఐఎస్ ఖాతా తెరవొచ్చు
జూన్-సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పెట్టిన వారు ఏడాదికి 6.6 శాతం వడ్డీ రేటును పొందనున్నారు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం(పీఓఎమ్ఐఎస్) అనేది పొదుపు పథకం. దీనిలో మీరు పెట్టుబడి పెట్టిన నిర్ధిష్ట మొత్తంపై ప్రతి నెలా స్థిర వడ్డీని పొందవచ్చు. మీ దగ్గరలోని పోస్టాఫీసులో పీఓఎమ్ఐఎస్ ఖాతాను తెరవవచ్చు. ఏ భారతీయ నివాసి అయినా పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఖాతా తెరవవచ్చు. అలాగే, ముగ్గురు వయోజనులు ఉమ్మడిగా కూడా ఖాతాను తెరవవచ్చు. మీరు కనుక మీ పిల్లల పేరు మీద కొత్త మొత్తం పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మీ మైనర్ల పేరిట పీఓఎమ్ఐఎస్ ఖాతాను తెరవవచ్చు. డిపాజిట్లు ఈ ఖాతాతెరవడానికి అవసరమైన కనీస మొత్తం ₹1,000, గరిష్టంగా ₹4.5 లక్షలను మాత్రమే సింగిల్ హోల్డర్ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలో పరిమితి ₹9 లక్షలు మించి పెట్టుబడి పెట్టలేరు. ఉమ్మడి ఖాతా హోల్డర్లు సమాన వాటాను ప్రతి నెల పొందుతారు. వడ్డీ రేట్లు ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తరువాత వడ్డీ చెల్లించడం మొదలు అవుతుంది. ఇది మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది. మీరు ప్రతి నెలా చెల్లించే వడ్డీని క్లెయిం చేసుకోనట్లయితే, అటువంటి వడ్డీ ఎలాంటి అదనపు వడ్డీనిపొందలేరు. అంతేగాక, ఫిక్సిడ్ లిమిట్లకు మించి ఎక్కువ డిపాజిట్ చేస్తే రీఫండ్ చేయబడుతుంది. డిపాజిట్ చేయబడ్డ అదనపు మొత్తంపై పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ కు వర్తించే వడ్డీ రేటు వర్తిస్తుంది. మీరు ఆటో క్రెడిట్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతినెల వడ్డీని మీ సేవింగ్స్ ఖాతాలోకి పొందవచ్చు. అయితే ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే ఈ వడ్డీ మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ వర్తించదు. మెచ్యూరిటీ: మీరు పోస్టాఫీసులో ఖాతా తెరిచిన ఐదు సంవత్సరాల తర్వాత ఖాతాను క్లోజ్ చేయవచ్చు. అయితే, ఒకవేళ మీరు పీఓఎమ్ఐఎస్ అకౌంట్ మెచ్యూరిటీకి ముందే మరణించినట్లయితే, దానిని క్లోజ్ చేయవచ్చు. మీరు చేసిన డిపాజిట్ నామినీ లేదా లీగల్ వారసులకు రీఫండ్ చేయబడతాయి. అలాంటప్పుడు, వడ్డీని మునుపటి నెల వరకు మాత్రమే చెల్లిస్తారు. ఖాతా తెరచేటప్పుడు, మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరునైనా నామిని కింద నమోదు చేయాలి, తద్వారా ఒకవేళ మీరు ఖాతా కాలవ్యవధిలో మరణించినట్లయితే, వారు ఈ ప్రయోజనాలను క్లెయిం చేసుకోవచ్చు. డిపాజిట్ తేదీ నుంచి గడువు ముగియడానికి ఒక సంవత్సరం ముందు ఎలాంటి డిపాజిట్ విత్ డ్రా చేయరాదని మీరు గుర్తుంచుకోవాలి. అయితే, ఒక సంవత్సరం తర్వాత, మూడు సంవత్సరాలకు ముందు ముందస్తుగా ఖాతా క్లోజ్ చేసినట్లయితే, ప్రిన్సిపాల్ నుంచి 2 శాతం తగ్గించి మిగిలిన మొత్తం మీకు చెలిస్తారు. ఒకవేళ ఖాతా మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య క్లోజ్ చేసినట్లయితే, ప్రిన్సిపాల్ నుంచి 1 శాతం తగ్గించి మిగిలిన మొత్తం మీ ఖాతాలో జమ చేస్తారు. చదవండి: చిన్న పొదుపు పథకాల ఆదాయంపై పన్ను ఎంతో తెలుసా? -
‘వడ్డి’oచిన విస్తరి ఏదీ?
♦ రేట్ల కోతతో డిపాజిట్లపై తగ్గుతున్న రాబడి ♦ రుణ గ్రహీతలకు వరమే కానీ వీరికి ఇబ్బందే ♦ ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్న పొదుపరులు ♦ కార్పొరేట్ బాండ్లు సహా పలు పథకాలు అందుబాటులో వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. ఇంకా తగ్గించాలనే డిమాండ్లూ వస్తున్నాయి. దీంతో ఆర్బీఐ మరో విడత రెపో రేటు కోతపెట్టే అవకాశాలూ లేకపోలేదు. ఇక బ్యాంకులేమో ఆర్బీఐ తగ్గించిన వెంటనే డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. కాకపోతే ఆ స్పీడును రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపులో మాత్రం చూపించటం లేదన్నది అందరికీ తెలిసిందే. ఒకరకంగా ఇలా వడ్డీ రేట్లు తగ్గుతుండటమన్నది రుణాలు తీసుకున్నవారికి శుభవార్తే. వారికిది మంచికాలమే. మరి డిపాజిట్లు చేసుకుని వడ్డీపై వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నవారి సంగతో? వారి పరిస్థితేంటి? ఇలాంటపుడు వాళ్లేం చేయాలి? ఇదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... ఉదాహరణకు కృష్ణమూర్తి రిటైరయి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఉన్న డబ్బులు అక్కడా ఇక్కడా ఇన్వెస్ట్ చేయకుండా భద్రంగా ఉంటుందని బ్యాంకునే నమ్ముకున్నారాయన. ఏడాది కిందటిదాకా పరిస్థితి బాగానే ఉంది. అప్పట్లో ఐదేళ్ళ కాలానికి బ్యాంకులో డిపాజిట్ చేస్తే 9.5 శాతం తక్కువ కాకుండా వడ్డీ వచ్చేది. ఇప్పుడు అదే కాలానికి డిపాజిట్ చేస్తే 8-8.5 శాతానికి మించి వడ్డీ రావడం లేదు. దీంతో ఆయన కూడా ప్రత్యామ్నాయాలు అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోస్టాఫీసు పథకాలు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గుతున్న తరుణంలో పలు పోస్టాఫీసు పథకాల వడ్డీరేట్లు కాస్త ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో మూడేళ్ల నుంచి ఐదేళ్ళ కాలపరిమితి గల డిపాజిట్లపై 8-8.5 శాతానికి మించి వడ్డీ ఇవ్వడం లేదు. కానీ ఇదే సమయంలో పలు పోస్టాఫీసు పథకాల్లో ఇంతకంటే ఎక్కువ వడ్డీ లభిస్తోంది. ఎన్ఎస్సీ: నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్సీ)పై 8.5 శాతం నుంచి 8.8 శాతం వడ్డీ లభిస్తోంది. అంతేకాదు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇవి ఐదేళ్లు, పదేళ్ల కాలపరిమితిలో లభిస్తున్నాయి. కేవీపీ: ఇన్వెస్ట్ చేసిన ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలల్లో రెట్టింపు అయ్యే విధంగా కిసాన్ వికాసపత్రాలను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపై 8.7 శాతం వడ్డీరేటు గిట్టుబాటు అవుతుంది. పీపీఎఫ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఈ పథకం కాలపరిమితి 15 ఏళ్లు. దీనిపై ప్రస్తుతం 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు లభిస్తాయి. మంత్లీ ఇన్కమ్ : నెలవారీ వడ్డీ కావాలనుకునే వారి కోసం ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకంపై ప్రస్తుతం 8.4 శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్స్ స్కీం: 60 ఏళ్లు దాటిన వారు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పథకంపై 9.3 శాతం వడ్డీరేటు అందిస్తున్నారు. కాలపరిమితి ఐదేళ్లు. సుకన్య సమృద్ధి... అమ్మాయిల కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవింగ్ పథకాల్లో అత్యధిక కాలపరిమితి కలిగిన పథకమిదే. ఈ పథకం కాలపరిమితి అమ్మాయికి 21 ఏళ్లు లేదా వివాహ తేదీ ఏది ముందైతే అది. ఈ పథకంపై అందించే వడ్డీ ఏటా మారుతుంటుంది. ఈ ఏడాది వడ్డీరేటును 9.2 శాతంగా ప్రకటించారు. అంతేకాదు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఒక అమ్మాయి పేరిట ఒక ఖాతాను మాత్రమే ప్రారంభించగలరు. ఇలా గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేరిట ప్రారంభించొచ్చు. దగ్గర్లోని పోస్టాఫీసులో ఈ పథకాన్ని ప్రారంభించొచ్చు. డెట్ ఫండ్స్ కొద్దిగా రిస్క్ చేస్తే బ్యాంకు, పోస్టాఫీసు పథకాల కంటే ఎక్కువ రాబడిని డెట్ ఫండ్స్ ద్వారా పొందచ్చు. కానీ వీటి రాబడిపై కచ్చితమైన హామీ ఉండకపోవడమే వీటిలోని ప్రధానమైన రిస్క్. వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో గిల్ట్ వంటి ఫండ్స్ మంచి రాబడులను అందిస్తాయి. గడిచిన సంవత్సర కాలంలో మీడియం టర్మ్ గిల్ట్ ఫండ్స్ 14 నుంచి 16 శాతం వరకు రాబడిని అందిస్తే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అన్నీ 10 శాతం రాబడిని అందించాయి. ప్రైవేటు కంపెనీల బాండ్లు వివిధ కంపెనీలు బాండ్స్ లేదా డిపాజిట్ల ద్వారా నిధులను సేకరిస్తుంటాయి. ఇవి అందించే వడ్డీరేట్లు కంపెనీని బట్టి మారుతుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు కంపెనీలు డిపాజిట్లపై (ట్రిపుల్ ఏ రేటింగ్) 9-9.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఈ కంపెనీ బాండ్స్ అనేవి పూర్తి రిస్క్‌తో కూడుకున్నవి. మెచ్యూర్టీ సమయంలో కంపెనీ చెల్లింపులు చేయలేని పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు. కాబట్టి ఈ రిస్క్‌కు సిద్ధపడ్డవారు అధిక వడ్డీ కోసం కంపెనీ డిపాజిట్ల వైపు చూడవచ్చు. ప్రస్తుతం శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, బీఎన్పీపారిబాస్లు 9.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంటే, పీఎన్బీ హౌసింగ్, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్స్, బజాజ్ ఫైనాన్స్‌లు 9.25 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఇన్ఫ్రా బాండ్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం జారీ చేసే వాటిని ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రా బాండ్స్‌ని ఈ ఏడాది తిరిగి ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఇవి సాధారణంగా 10, 15 సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉంటాయి. ఈ బాండ్స్ విధివిధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. సాధారణంగా బ్యాంకు డిపాజిట్ల కంటే వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. కానీ ఈ పథకాల్లో వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణించకపోవడం కలిసొచ్చే కాలం. ఉదాహరణకు బ్యాంకు డిపాజిట్లో 9 శాతం వడ్డీ లభిస్తుంటే దానిపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి అప్పుడు నికర వడ్డీ 6.3 శాతమే అవుతుంది. ఇన్ఫ్రా బాండ్స్ ఇంతకంటే ఎక్కువ వడ్డీని అందిస్తాయి. వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇన్ఫ్రా బాండ్స్ మార్కెట్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం