Senior Citizen Savings Scheme (SCSS): Full Details About Senior Citizen Savings Scheme In Telugu - Sakshi
Sakshi News home page

Senior Citizen Savings Scheme: బంపరాఫర్‌ ! పోస్టాఫీస్‌లో వెయ్యితో ఖాతా తెరిస్తే ఐదేళ్లలో రూ.14 లక్షలు!! పూర్తి వివరాలు..

Published Mon, Nov 29 2021 1:19 PM | Last Updated on Mon, Nov 29 2021 2:39 PM

Full Details About Senior Citizen Savings Scheme In Telugu - Sakshi

సాధారణంగా పోస్టాఫీస్‌కు సంబంధించిన అన్ని స్కీములు అధిక వడ్డీని అందిస్తాయనే విషయం తెలిసిందే! వినియోగదారుల పొదుపుకు అధిక మొత్తంలో లాభాలను అందించడంలో పోస్టాఫీస్‌ స్కీములు ఎప్పుడూ ముందుంటాయి. ఐతే తాజాగా మరొక అదిరిపోయే స్కీమ్‌ను మీకు పరిచయం చేస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

 సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌). ఈ స్కీమ్‌ ద్వారా మదుపరులకు ఏకంగా 7.4 శాతం వడ్డీని అందిస్తోంది పోస్టల్‌శాఖ. ఈ స్కీమ్‌ రిటైర్‌ అయినవారికి, సేవింగ్‌ ఎకౌంట్‌ ఉన్న వారికి చాలా ప్రయోజనకరం. ఈ స్కీమ్‌ ద్వారా అధికమొత్తంలో తిరిగి సొమ్ము అందితుంది. ఎలాగంటే..

►60 యేళ్ల పై వయసున్నవారు మాత్రమే ఎస్‌సీఎస్‌ఎస్‌లో అకౌంట్‌ తెరవడానికి అర్హులు. 
► ఆసక్తి ఉన్నవారు 1000 రూపాయలతో ఖాతా తెరవొచ్చు. 


►ఇలా మొత్తం పది లక్షల రూపాయలను ఇన్వె‍స్ట్‌  చేస్తే ఐదేళ్ల తర్వాత 7.4 శాతం వడ్డీతో కలిపి రూ. 14,28,964 లక్షలు రిటర్న్‌ వస్తాయి.  
►ఆ లెక్కన మొత్తం ఐదేళ్లలో సుమారు రూ. 4 లక్షల 28 వేల వడ్డీ అందుతుంది.  
►సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు మదుపు చేయవచ్చు. 
►అంతేకాదు మెచ్యురిటీ పీరియడ్‌ ఐదేళ్లయినప్పటికీ ఈ సమయాన్ని మరో మూడేళ్ల వరకు పొడిగించుకునే సదుపాయం కూడా ఉంది. 
►ఎస్‌సీఎస్‌ఎస్‌లో వెయ్యి నుంచి లక్ష రూపాయలలోపు ఖాతా తెరవవచ్చు. ఐతే వడ్డీ విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. 
►ఈ పథకంలోని పెట్టుబడులకు సెక్షన్‌ 80 సి కింద ఆదాయపన్ను నుంచి మినహాయింపు కూడా ఉంది. 

ఇక ఆలస్యమెందుకు అవసరమైన డాక్యుమెంట్లతో మీ సమీపంలోని పోస్టాఫీస్‌లో వెంటనే అకౌంట్‌ తెరవండి... మీ విశ్రాంత జీవితానికి మరింత భద్రత పొందండి. 

చదవండి: అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement