Retaired employees
-
పదవీ విరమణ భారం.. దూరం కావాలంటే..
పదవీ విరమణ అంటే కొందరికి సంతోషం, ఇంకొందరికీ భయం కలుగుతుంది. ఆర్థిక అవసరాలకు సరిపడే డబ్బును సమకూర్చుకున్నవారికి అది ఆనందం అయితే..ఎలాంటి పెట్టుబడులు, మిగులు లేనివారికి రిటైర్మెంట్ నరకమే. ఇటీవల ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వే ప్రకారం నలుగురిలో ముగ్గురు భారతీయులు తమ పదవీ విరమణ కోసం పొదుపు చేయడంలో విఫలమవుతున్నారని తేలింది. అయితే ముందు నుంచి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని మదుపు చేస్తే పదవీ విరమణ తర్వాత సంతోషంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మానవ విలువలు కనుమరుగవుతున్న ప్రస్తుత కాలంలో చాలామందికి తమ తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితులు లేవు. తల్లిదండ్రులు పనిచేస్తున్నంత కాలం ఏదో కొంత డబ్బు సంపాదిస్తున్నారు కదా అని భరిస్తున్నారు. కానీ పదవీ విరమణ తర్వాత మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయి. వృద్ధాప్యంలో పెరిగే అనారోగ్యంతో ఆర్థిక, మానసిక స్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా సురక్షితమైన, సంతృప్తికరమైన జీవితం గడపాలంటే కొన్ని నియమాలు పాటించాలి.పక్కా ప్రణాళికపదవీ విరమణ తర్వాత ఆదాయం నిలిచిపోతుంది. ఏటా ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్నాయి. మనుషులు ఆయుర్ధాయం అధికమవుతుంది. పనిచేస్తున్నపుడే పొదుపు పాటించాలి. అందుకోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. దాంతో రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్య సంరక్షణ, ప్రయాణాలు..వంటి ఖర్చులను భరించడానికి పొదుపు చాలా అవసరం. పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకునేపుడు మీ జీవనశైలి, అభిరుచులు, ఆసక్తులు, భవిష్యత్తు అవసరాలు, మీపై ఆధారపడినవారు, కుటుంబానికి చేయాల్సిన ప్రధాన బాధ్యతలు..వంటివి పరిగణనలోకి తీసుకుని పొదుపు చేయాలి.పెరుగుతున్న ఆయుర్ధాయంమారుతున్న ఆహార అలవాట్లు దృష్ట్యా చాలామందికి చిన్న వయసులోని బీపీ, షుగర్, కిడ్నీ..సమస్యలు మొదలవుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన తర్వాత ఈ సమస్యలు తీవ్రరూపం దాలుస్తాయి. దాంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ప్రస్తుతం మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనుషులు మరింత ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. కానీ అందుకు డబ్బు కావాల్సి ఉంటుంది. దాన్ని ముందుగానే అంచనా వేసి తగిన కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.పెట్టుబడి ఎక్కడ చేయాలంటే..పదవీ విరమణ ప్రణాళిక కోసం వివిధ పెట్టుబడి మార్గాలున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) వంటి స్థిరంగా రాబడినిచ్చే పథకాలున్నాయి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్)లో ఎక్కువ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా అధిక రాబడి ఉంటుంది. ఈక్వీటీలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, స్థిరాస్తిలో మదుపు చేయవచ్చు.ఇదీ చదవండి: విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణితొందరపడండిపదవీ విరమణ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుగానే మదుపు చేయడం ప్రారంభించాలి. రిటైర్మెంట్ తర్వాత ఎంత డబ్బు అవసరమో లెక్కించడం, దీనికి అనువైన పొదుపును ఎంచుకుని పాటించడం ముఖ్యం. క్రమశిక్షణతో ముందుగానే మదుపు చేస్తే అధిక ఆర్థిక ప్రయోజనాన్ని పొందొచ్చు. క్రమంగా కాలం గడుస్తున్న కొద్దీ అధిక పదవీ విరమణ నిధిని సమకూర్చుకోవచ్చు. -
బంపరాఫర్ ! పోస్టాఫీస్‌లో వెయ్యితో ఖాతా తెరిస్తే ఐదేళ్లలో రూ.14 లక్షలు! పూర్తి వివరాలు
సాధారణంగా పోస్టాఫీస్‌కు సంబంధించిన అన్ని స్కీములు అధిక వడ్డీని అందిస్తాయనే విషయం తెలిసిందే! వినియోగదారుల పొదుపుకు అధిక మొత్తంలో లాభాలను అందించడంలో పోస్టాఫీస్ స్కీములు ఎప్పుడూ ముందుంటాయి. ఐతే తాజాగా మరొక అదిరిపోయే స్కీమ్‌ను మీకు పరిచయం చేస్తోంది. ఆ వివరాలు మీ కోసం.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్). ఈ స్కీమ్ ద్వారా మదుపరులకు ఏకంగా 7.4 శాతం వడ్డీని అందిస్తోంది పోస్టల్‌శాఖ. ఈ స్కీమ్ రిటైర్ అయినవారికి, సేవింగ్ ఎకౌంట్ ఉన్న వారికి చాలా ప్రయోజనకరం. ఈ స్కీమ్ ద్వారా అధికమొత్తంలో తిరిగి సొమ్ము అందితుంది. ఎలాగంటే.. ►60 యేళ్ల పై వయసున్నవారు మాత్రమే ఎస్సీఎస్ఎస్లో అకౌంట్ తెరవడానికి అర్హులు. ► ఆసక్తి ఉన్నవారు 1000 రూపాయలతో ఖాతా తెరవొచ్చు. ►ఇలా మొత్తం పది లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 7.4 శాతం వడ్డీతో కలిపి రూ. 14,28,964 లక్షలు రిటర్న్ వస్తాయి. ►ఆ లెక్కన మొత్తం ఐదేళ్లలో సుమారు రూ. 4 లక్షల 28 వేల వడ్డీ అందుతుంది. ►సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు మదుపు చేయవచ్చు. ►అంతేకాదు మెచ్యురిటీ పీరియడ్ ఐదేళ్లయినప్పటికీ ఈ సమయాన్ని మరో మూడేళ్ల వరకు పొడిగించుకునే సదుపాయం కూడా ఉంది. ►ఎస్సీఎస్ఎస్లో వెయ్యి నుంచి లక్ష రూపాయలలోపు ఖాతా తెరవవచ్చు. ఐతే వడ్డీ విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. ►ఈ పథకంలోని పెట్టుబడులకు సెక్షన్ 80 సి కింద ఆదాయపన్ను నుంచి మినహాయింపు కూడా ఉంది. ఇక ఆలస్యమెందుకు అవసరమైన డాక్యుమెంట్లతో మీ సమీపంలోని పోస్టాఫీస్‌లో వెంటనే అకౌంట్ తెరవండి... మీ విశ్రాంత జీవితానికి మరింత భద్రత పొందండి. చదవండి: అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!! -
‘ఈనాడు ఇటువంటి వార్తలు రాయడం బాధాకరం’
సాక్షి, విజయవాడ: ఈనాడు లాంటి పత్రిక ఇటువంటి వార్తలు రాయడం బాధాకరమని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ దారులకు పెన్షన్ కష్టాలని ఈనాడులో వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు. ఈనాడుతో పాటు మరో పత్రిక కూడా 5వ తేదీ వరకు జీతాలు రావడం లేదని రాసింది.. కానీ ఉద్యోగుల జీతాలు 3వ తేదీనే వచ్చాయని వెల్లడించారు. తప్పుడు వార్తలు రాయడాన్ని వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు. ఉద్యోగులను, పెన్షన్ దారులను కొన్ని పత్రికలు తప్పు తోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాసి ప్రజల్లో చులకన కావద్దని సూచించారు. 3 లక్షల 70 వేల మంది పింఛన్ దారుల్లో చాలామందికి పెన్షన్ వచ్చిందని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వల్ల కొంతమందికి ఒకటి రెండు రోజులు ఆలస్యమైందన్నారు. దానిని పట్టుకుని పెన్షన్ దారులకు పెన్షన్ కష్టాలంటూ ఈనాడు తప్పడు వార్తలు రాయడం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మద్య దూరం పెంచాలన్న ఉద్దేశంతోనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులలో విశ్రాంత ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇళ్ల స్థలాలు లేని విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఉద్యోగులకు అడగకుండానే అన్ని సౌకర్యాలను సీఎం జగన్ కల్పిస్తున్నారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జీతాలు అందరికి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ జేఎసీ ప్రధాన కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ కష్టమని ఈనాడులో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈనాడులో వచ్చిన వార్త అవాస్తవమని, విశ్రాంత ఉద్యోగులలో చాలా మందికి పెన్షన్ వచ్చిందన్నారు. జీతాలు, పెన్షన్ విషయంలో పత్రికలు విజ్ఞత పాటించి వార్తలు రాయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతి అని వాస్తవాలను ఉద్యోగులు, పెన్షన్ దారులు గ్రహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని, ఇటు వంటి వార్తలను తాము ఖండిస్తున్నామని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి. జయబాబు మాట్లాడుతూ... 3 లక్షల 70 వేల మంది పెన్షన్ దారులు ఉన్నారని వాళ్లకు పెన్షన్ కష్టమని ఈనాడులో వార్త రాశారన్నారు. ఈనాడులో రాసిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికే చాలా మంది విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యోగులను,పెన్షన్ దారులను తప్పు తోవ పట్టించే విధంగా వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. -
ఈ వనాన్ని తప్పక చూడాల్సిందే !
‘అది ఒక నందన వనము, దేవతలు విహరించే స్వర్గ ధామము’ అని వర్ణించినా ఆ వనం అందాలు తక్కువ చేసినట్లే. రంగురంగుల పూలు, ఆకులతో ఇంద్ర ధనుస్సును నేలపై పరిచినట్లుగా కనిపించే ఆ వనం ప్రకతి సిద్ధమైనది కాదు. మానవ నిర్మితమైనది. కేవలం ఇద్దరు భార్యా భర్తలు కలిసి ఆ వనాన్ని తీర్చి దిద్దిన తీరు అమోగం. అద్భుతం. ఇది మనం చెబుతున్న మాటలు కాదు. ఇప్పటి వరకు 48 దేశాల నుంచి వచ్చి సందర్శించిన దాదాపు 14 వేల మంది చెప్పిన అభిప్రాయాలు. ఇంగ్లాండ్‌కు చెందిన వెస్ట్ మిడ్లాండ్స్లోని వాల్సల్ పట్టణంలో ఈ వనం ఉంది. నీ దంపతులు తమ ఇంటి వెనక పెరట్లో ఈ వనాన్ని అభివృద్ధి చేశారు. టోనీ దంపతులు తమ ఇంటి వెనక పెరట్లో ఈ వనాన్ని అభివద్ధి చేశారు. ఆ వనానికి ఇంత వన్నెలొచ్చాయంటే మేరీ, టోని న్యూటన్ అనే ఇద్దరు దంపతులు చేసిన కృషే.. ఒకటి, రెండు ఏళ్లు కాదు, వారు 37 సంవత్సరాలు కషి చేస్తే ఈ వనం తయారయింది. ఇందులో అన్నీ 35 ఏళ్లున్న చెట్ల గుబుర్లే. ఆ భార్యా భర్తలిద్దరు 1982లో ఈ వనాన్ని పెంచడం మొదలు పెట్టగా ఇటీవల పూర్తయింది. అప్పుడు 40 ఏళ్లున్న వాళ్లకు ఇప్పుడు 71 ఏళ్లు. ఇద్దరిది ఒకే వయస్సు ఆ రంగుల వనంలో నివసిస్తున్నందున తాము ఇప్పటికీ ఆయురారోగ్యాలతో ఉన్నామని వారు చెబుతున్నారు. వాని వనంలో వివిధ దేశాల నుంచి తెచ్చిన మొక్కలు ఉన్నాయి. 450 రకాల అజాలీస్ (ముదురు రంగుల పూల మొక్కలు. ఎప్పుడూ చిన్నగానే ఉంటాయి), 120 జపనీస్ మాపుల్స్ (వివిధ రంగుల్లో చీలినట్లు హస్తం లాగా ఆకులు కలిగిన జపనీస్ జాతి మొక్కలు), 15 జూనిపర్ బ్లూస్టార్ (నీలి రంగు పూలు కలిగిన గుబురు చెట్లు) ఉన్నట్లు దంపతులు వివరించారు. ఈ వనానికి మరో విశేషం ఉంది. అన్ని రుతువుల్లో ఈ వనం ఇలాగే కనిపిస్తుందట. ఓ చెట్టు ఒక రంగు ఆకులు లేదా పూలు సీజన్లో రాలిపోతే మరో జాతి మొక్కకు అదే రంగు పూలు లేదా ఆకులు మొలవడం వల్ల అలా కనిపిస్తుందట. అయితే ఈ విషయం తెలిసిన బ్రిటన్ రాణి టోనీ దంపతులను పిలిచి సముచితంగా సత్కరించినట్లు తెలిసింది. ఈ వనం అభివద్ధికి మరీ ఎక్కువ కాకుండా 15 వేల పౌండ్లు (దాదాపు 14 లక్షల రూపాయలు) ఖర్చు అయ్యాయట. -
మానసిక క్షోభలో లక్షలాది పెన్షనర్లు
రెండున్నర లక్షల మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, వారి మీద ఆధారపడుతున్న దాదాపు పది లక్షల మంది కుటుంబ సభ్యులు ఈ రోజు అసంతృప్తికి గురై దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరంతా గత 60 ఏళ్లుగా విద్యార్థులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, రిటైర్డు ఉద్యోగులుగా అన్ని దశలలో తెలంగాణ రాష్ట్ర సాధనకై వివిధ ఉద్యమాలలో పాల్గొన్నవారే. తెలంగాణ రాష్ట్రం గాఢంగా కాంక్షించిన వారే. తాము కోరుకున్న తెలంగాణ రాష్ట్రం అవ తరించగానే తమ సమస్యలు సత్వరంగా పరిష్కా రం కాగలవని ఆశించిన వారే. తమది ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వమని నూతన పాలకులు ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఆశలు మరింత బలప డ్డాయి. కానీ కొత్త రాష్ట్రంలో ఇంత త్వరగా తమకు ఆశాభంగం కలుగుతుందని వారు అసలు ఊహించలేదు. పదవ పే రివిజన్ కమిషన్ పదవ పీఆర్సీ తన నివేదికను అవిభక్త ఆంధ్రప్రదేశ్ చివరి రోజుల్లో 29.5.2014వ తేదీన రాష్ర్ట ప్రభుత్వానికి సమర్పిం చింది. అప్పుడు రాష్ట్రంలో ఉన్నది గవర్నర్ పాలన. 2014 జూన్‌లో రాష్ట్ర విభజన జరుగగానే ఈ నివేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు అం దింది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల నిరీక్షణ మొదలైంది. ఆరు నెలలు గడచినా తెలంగాణ ప్రభుత్వంలో స్పందన కనిపిం చలేదు. పెన్షనర్ల సంఘం పలు పర్యాయాలు సమర్పించిన విజ్ఞప్తి పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పలేదు. 2015 జనవరిలో సీఎం కేసీఆర్, అందరికి గరిష్ట సంతృప్తి కలిగే రీతిగా పదవ పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరో రెండు మాసాల పిదప ఉద్యోగులకు, పెన్షనర్లకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. వెంటనే ఉద్యోగుల నేతలు సంబరాలు చేసుకున్నప్పటికీ నేటి ద్రవ్యోల్బ ణం, ధరల పెరుగుదలతో పోల్చి చూస్తే 43 శాతం ఫిట్మెంట్ చాలా తక్కువ. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన పిదప మరో మూ డు మాసాలకు 2015 ఏప్రిల్ 7వ తేదీన ఫిట్మెంట్ జీఓ 33 జారీ అయింది. జారీ అయిన తరువాత రెండు నెలలకు ఫిట్మెంట్ జీఓ అమలులోకి వచ్చింది. 12 నెలల తీవ్ర జాప్యం తర్వాత పదవ పీఆర్సీ మొదటి జీఓ కంటి తుడుపుగా అమలు జరిగింది. 2015 జూన్ 1వ తేదీన ఇచ్చింది రెండు మాసాల (2015 మార్చి, ఏప్రిల్) బకాయిలే. 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 మాసాల బకాయిల సంగతి ఇంత వరకు తేలలేదు. బకాయిలను బాండ్ల రూపంలో ఇస్తారన్న వదంతులతో పెన్షనర్లు కుంగి పోయారు. తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ అమలుైపై జాప్యం చేసిన పన్నెండు మాసాలలో తెలంగాణ అం తట కొన్ని వందల మంది ప్రభుత్వ పెన్షనర్లు నిస్పృ హపాలై మృతి చెందారు! ప్రభుత్వాలలో మానవతా దృక్పథం లోపిం చడం వల్ల శ్రేయోరాజ్య సదాశయం నేతి బీరకాయ అవుతున్నది. సీనియర్ పెన్షనర్ల, జూనియర్ పెన్షనర్ల పెన్షన్లలో వ్యత్యాసాలను వీలైంత వరకు తగ్గించడా నికి కేంద్ర ప్రభుత్వపు 6వ పీఆర్సీలో అదనపు క్వాం టమ్కు అంకురార్పణ జరిగింది. పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన (ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్తిస్తున్న) పదవ పీఆర్సీ.. ప్రభుత్వ పెన్షనర్లకు 70 ఏళ్ల నుంచే 15 శాతం అదనపు క్వాంటమ్ ఇవ్వాలని సమంజసంగా సిఫారసు చేసింది. సమష్టి కుటుంబాలు అంతరి స్తున్న, వృద్ధులైన తల్లిదండ్రులను వారి పిల్లలు ఆదు కునే సత్సంప్రదాయం క్రమంగా అడుగంటుతున్న నేటి సామాజిక పరిస్థితులలో వృద్ధ, సీనియర్ పెన్ష నర్లకు కనీసం 70 ఏళ్ల వయసు నుంచైనా అదనపు క్వాంటమ్ లభించడం సముచితం, సహేతుకం. ఈ సిఫారసును 15 నెలలు గడిచినా తెలంగాణ ప్రభు త్వం నేటికీ ఆమోదించకపోవడం బాధాకరం. 2014 జూన్ నుంచి రావలసిన 9 మాసాల ఫిట్మెంట్ బకా యీల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది ప్రభుత్వ పెన్షనర్ల, వారి కుటుంబాల ఓరిమిని ప్రభుత్వం ఇం కా పరీక్షించడం విజ్ఞత కాదని మనవి చేస్తున్నాం. - కె.చంద్రప్రకాశ్‌రావు, అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం మొబైల్: 94414 55412 -
'రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి నియమించొద్దు'
హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులను ఓయస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)లుగానూ, సలహాదారులుగానూ, కన్సల్టెంట్లుగానూ నియమించే విధానంపై తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగులను ఆయా శాఖాల్లో తిరిగి నియమించుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.