మానసిక క్షోభలో లక్షలాది పెన్షనర్లు | lacks of pensioners to Mental harrasments | Sakshi
Sakshi News home page

మానసిక క్షోభలో లక్షలాది పెన్షనర్లు

Published Sat, Sep 19 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

మానసిక క్షోభలో లక్షలాది పెన్షనర్లు

మానసిక క్షోభలో లక్షలాది పెన్షనర్లు

రెండున్నర లక్షల మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, వారి మీద ఆధారపడుతున్న దాదాపు పది లక్షల మంది కుటుంబ సభ్యులు ఈ రోజు అసంతృప్తికి గురై దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరంతా గత 60 ఏళ్లుగా విద్యార్థులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, రిటైర్డు ఉద్యోగులుగా అన్ని దశలలో తెలంగాణ రాష్ట్ర సాధనకై వివిధ ఉద్యమాలలో పాల్గొన్నవారే.

తెలంగాణ రాష్ట్రం గాఢంగా కాంక్షించిన వారే. తాము కోరుకున్న తెలంగాణ రాష్ట్రం అవ తరించగానే తమ సమస్యలు సత్వరంగా పరిష్కా రం కాగలవని ఆశించిన వారే. తమది ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వమని నూతన పాలకులు ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఆశలు మరింత బలప డ్డాయి. కానీ కొత్త రాష్ట్రంలో ఇంత త్వరగా తమకు ఆశాభంగం కలుగుతుందని వారు అసలు ఊహించలేదు.
 
 పదవ పే రివిజన్ కమిషన్ పదవ పీఆర్‌సీ తన నివేదికను అవిభక్త ఆంధ్రప్రదేశ్ చివరి రోజుల్లో 29.5.2014వ తేదీన రాష్ర్ట ప్రభుత్వానికి సమర్పిం చింది. అప్పుడు రాష్ట్రంలో ఉన్నది గవర్నర్ పాలన. 2014 జూన్‌లో రాష్ట్ర విభజన జరుగగానే ఈ నివేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు అం దింది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల నిరీక్షణ మొదలైంది. ఆరు నెలలు గడచినా తెలంగాణ ప్రభుత్వంలో స్పందన కనిపిం చలేదు. పెన్షనర్ల సంఘం పలు పర్యాయాలు సమర్పించిన విజ్ఞప్తి పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పలేదు.

2015 జనవరిలో సీఎం కేసీఆర్, అందరికి గరిష్ట సంతృప్తి కలిగే రీతిగా పదవ పీఆర్‌సీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరో రెండు మాసాల పిదప ఉద్యోగులకు, పెన్షనర్లకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. వెంటనే ఉద్యోగుల నేతలు సంబరాలు చేసుకున్నప్పటికీ నేటి ద్రవ్యోల్బ ణం, ధరల పెరుగుదలతో పోల్చి చూస్తే 43 శాతం ఫిట్‌మెంట్ చాలా తక్కువ.
 
 రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన పిదప మరో మూ డు మాసాలకు 2015 ఏప్రిల్ 7వ తేదీన ఫిట్‌మెంట్ జీఓ 33 జారీ అయింది. జారీ అయిన తరువాత రెండు నెలలకు ఫిట్‌మెంట్ జీఓ అమలులోకి వచ్చింది. 12 నెలల తీవ్ర జాప్యం తర్వాత పదవ పీఆర్‌సీ మొదటి జీఓ కంటి తుడుపుగా అమలు జరిగింది. 2015 జూన్ 1వ తేదీన ఇచ్చింది రెండు మాసాల (2015 మార్చి, ఏప్రిల్) బకాయిలే. 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 మాసాల బకాయిల సంగతి ఇంత వరకు తేలలేదు. బకాయిలను బాండ్ల రూపంలో ఇస్తారన్న వదంతులతో పెన్షనర్లు కుంగి పోయారు. తెలంగాణ ప్రభుత్వం పీఆర్‌సీ అమలుైపై జాప్యం చేసిన పన్నెండు మాసాలలో తెలంగాణ అం తట కొన్ని వందల మంది ప్రభుత్వ పెన్షనర్లు నిస్పృ హపాలై మృతి చెందారు!
 
 ప్రభుత్వాలలో మానవతా దృక్పథం లోపిం చడం వల్ల శ్రేయోరాజ్య సదాశయం నేతి బీరకాయ అవుతున్నది. సీనియర్ పెన్షనర్ల, జూనియర్ పెన్షనర్ల పెన్షన్లలో వ్యత్యాసాలను వీలైంత వరకు తగ్గించడా నికి కేంద్ర ప్రభుత్వపు 6వ పీఆర్‌సీలో అదనపు క్వాం టమ్‌కు అంకురార్పణ జరిగింది. పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన (ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్తిస్తున్న) పదవ పీఆర్‌సీ.. ప్రభుత్వ పెన్షనర్లకు 70 ఏళ్ల నుంచే 15 శాతం అదనపు క్వాంటమ్ ఇవ్వాలని సమంజసంగా సిఫారసు చేసింది. సమష్టి కుటుంబాలు అంతరి స్తున్న, వృద్ధులైన తల్లిదండ్రులను వారి పిల్లలు ఆదు కునే సత్సంప్రదాయం క్రమంగా అడుగంటుతున్న నేటి సామాజిక పరిస్థితులలో వృద్ధ, సీనియర్ పెన్ష నర్లకు కనీసం 70 ఏళ్ల వయసు నుంచైనా అదనపు క్వాంటమ్ లభించడం సముచితం, సహేతుకం. ఈ సిఫారసును 15 నెలలు గడిచినా  తెలంగాణ ప్రభు త్వం నేటికీ ఆమోదించకపోవడం బాధాకరం. 2014 జూన్ నుంచి రావలసిన 9 మాసాల ఫిట్‌మెంట్ బకా యీల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది ప్రభుత్వ పెన్షనర్ల, వారి కుటుంబాల ఓరిమిని ప్రభుత్వం ఇం కా పరీక్షించడం విజ్ఞత కాదని మనవి చేస్తున్నాం.
- కె.చంద్రప్రకాశ్‌రావు, అధ్యక్షులు,
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం
 మొబైల్: 94414 55412

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement