చిత్తూరు జిల్లాలో పింఛన్‌దారులకు కష్టాలు
గుడిపాల మండలంలో 27 గ్రామాల్లో ఇదే వైఖరి
పింఛన్ సొమ్ములోంచి జమ చేసుకున్న వైనం
గుడిపాల: ఇంటి పన్నుకు, పింఛన్లకు కూటమి సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో మంగళవారం 27 పంచాయతీల్లో ఇదే తంతు నడిచింది. పైనుంచి ఆదేశాలొచ్చాయంటూ..సచివాలయాల సిబ్బంది, వీఆర్‌ఓలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటి పన్ను వసూలు చేశారు.
కొన్ని గ్రామాల్లో ఇంటి పన్ను చెల్లిస్తామని చెప్పిన తర్వాతే పింఛన్ సొమ్ము అందజేశారు. అయితే పన్ను చెల్లించిన వారికి ఎక్కడా కూడా రశీదులు ఇవ్వలేదు. ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదని, ఇలా బలవంతం చేయడం తగదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
‘పింఛన్ డబ్బులిచ్చేటప్పుడే ఇంటి పన్ను వసూలు చేయండి. తర్వాత అయితే డబ్బులు లేవు అని చెబుతారు. ఇప్పుడైతే డబ్బులు లేవు అని చెప్పడానికి వారికి ఆస్కారం ఉండదు. ఇది ఇయర్ ఎండింగ్ అని చెప్పండి’ అని ఒక ప్రజాప్రతినిధి అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయమై స్పందించడానికి అధికారులెవరూ ఇష్టపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment