House tax
-
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ కుంభకోణం?
సాక్షి, హైదరాబాద్: ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమా గుర్తుందా? అందులో ఊరి నుంచి వచ్చిన బ్రహ్మానందంను నమ్మించి చార్మినార్‌ను తనికెళ్ల భరిణి విక్రయిస్తాడు. ఈ ఘటన కూడా ఇంచుమించు అలాంటిదే. కాకపోతే గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేసుకున్న వారు ఆస్తి పన్ను చెల్లించడానికి ప్రవేశపెట్టిన స్వీయ మదింపు (సెల్ప్ అసెస్మెంట్)లో ఉన్న లోపాలను, అధికారుల పర్యవేక్షణ వైఫల్యాన్ని బయటపెట్టడానికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఏకంగా మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి ఆస్తి పన్ను స్వయంగా మదింపు చేసుకొని అసెస్మెంట్ నంబర్ పొందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి నిర్మాణం చేసుకున్న యజమాని ఇంటి పన్ను చెల్లించడానికి ముందు ఆస్తి పన్ను మదింపు చేసి ఇంటి నంబరు కేటాయిస్తారు. ఈ విధానంలో అవినీతి ఎక్కువ కావడంతో స్వీయ మదింపు విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దాని ద్వారా ఇంటి యజమానే అన్ని వివరాలు పూర్తి చేసి ఆస్తి పన్ను మదింపు చేసుకోవచ్చు. ఈ విధానంలో కూడా లోపాలుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా అక్రమార్కులకు వరంగా మారింది. బయటపెట్టింది ఇలా.. మల్కాజిగిరి కార్పొరేటర్ గీతానగర్‌లో ఉన్న సర్కిల్ కార్యాలయం భవనాన్ని యాభై గజాలుగా చూపిస్తూ 194 రూపాయలు స్వీయ మదింపు ద్వారా ఆస్తి పన్ను చెల్లించారు. ఆస్తి పన్ను చెల్లించగానే పీటీఐ నంబర్ 1280210792 జనరేట్ అయింది. ఈ విధానంలో ఉన్న లోపాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరు బాధ్యతారాహిత్యం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ మదింపు విధానం పూర్తిగా అక్రమార్కులకు వరంగా మారింది. నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తిని కాజేయడానికి ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు. నగరంలోని అన్ని సర్కిళ్లలో ప్రభుత్వ భూములు కొల్లగొట్టడంతో కోట్లాది రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఈ విధానంపై రెవిన్యూ విభాగం అధికారుల తీరు అధ్వానంగా ఉంది. మల్కాజిగిరిలో ఏఎమ్‌సీలను అడిగితే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ విధానం ద్వారా జరిగిన అన్ని ఆస్తి మదింపు (అసెస్మెంట్ల)పై కమిటీ వేసి విచారణ జరిపించాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – శ్రవణ్, కార్పొరేటర్ -
ఒకే ఇల్లు.. 4 గదులు తెలంగాణలో, 4 గదులు మహారాష్ట్రలో..
ముంబై/హైదరాబాద్: ఒక్క ఇంట్లో రెండు రాష్ట్రాలకు పన్ను కట్టాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే ఇంట్లో నివసిస్తూ ఒక రాష్ట్రంలో భోజనం చేసి మరో రాష్ట్రంలో నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వినడాకిని వింతగా ఉన్నా.. ఇలాంటి ఇల్లు నిజంగానే ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా మహారాజగూడ గ్రామంలో ఈ ఇల్లు ఉంది. పవార్ బ్రదర్స్ దీని యజమానులు. 13 మంది కుటుంబసభ్యులు ఇందులో నివసిస్తున్నారు. మొత్తం 10 గదులున్నాయి. నాలుగు గదులు మహారాష్ట్ర కిందకి, మరో నాలుగు గదులు తెలంగాణ కిందకు వస్తాయి. అందుకే రెండు రాష్ట్రాలకు ఈ కుటుంబం పన్ను కడుతోంది. అయితే పన్ను ఎక్కువ కట్టాల్సి వస్తోందని వీళ్లు బాధపడటం లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలను వీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాహనాల రిజిస్టేషన్లను ఎంహెచ్, టీఎస్‌తో ఇనీషియల్స్‌తో చేయించుకుంటున్నారు. 1969 మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించినప్పుడు తమ ఇళ్లు రెండు రాష్ట్రాల కిందకు వచ్చిందని యజమానులు ఉత్తమ్ పవార్, చందు పవార్ చెబుతున్నారు. అప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. Maharashtra | A house in Maharajguda village, Chandrapur is spread b/w Maharashtra & Telangana - 4 rooms fall in Maha while 4 others in Telangana Owner, Uttam Pawar says, "12-13 of us live here. My brother's 4 rooms in Telangana&4 of mine in Maharashtra, my kitchen in Telangana" pic.twitter.com/vAOzvJ5bme — ANI (@ANI) December 15, 2022 ఇప్పటివరకు మహారాజగూడ గ్రామానికి మాత్రమే తెలిసిన ఈ ఇల్లు గురించి ఇప్పుడు దేశంలో అందిరికీ తెలిసింది. తమ ఇల్లు రెండు రాష్ట్రాల్లో ఉండటం వల్ల తమకెలాంటి ఇబ్బంది అన్పించడంలేదని పవార్ సోదరులు చెబుతున్నారు. తన నాలుగు గదులు మహారాష్ట్రలో, తన సోదరుడు చందు కుటుంబం నివసించే మరో నాలుగు గదులు తెలంగాణలో ఉన్నట్లు ఉత్తమ్ వివరించారు. తన కిచెన్ మాత్రం తెలంగాణలోనే ఉందన్నారు. చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్.. -
గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరుగా ఆస్తి పన్ను!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరు ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి వేర్వేరు పన్ను విధానం అమలులో ఉంది. గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు ఒకే రకమైన ఇంటి పన్నును వసూలు చేస్తున్నారు. అయితే, గ్రామ పంచాయతీలు తమ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని అవే సమకూర్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పలుమార్లు రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సామాన్య ప్రజలపై ఏ మాత్రం అదనపు భారం పడకుండా నివాసిత ఇళ్లకు ఇప్పుడు అమలులో ఉన్న ఇంటి పన్ను విధానాన్నే కొనసాగించనున్నారు. వ్యాపార అవసరాలకు ఉపయోగించే ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు మాత్రం కొత్త ఇంటి పన్ను విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. అయితే, వ్యాపార దుకాణాలకు ఎంత ఇంటి పన్ను విధించాలన్న దానిపై పంచాయతీరాజ్ శాఖే ఒక ప్రాతిపదికను నిర్ధారించనుంది. దీని ఆధారంగా సంబంధిత గ్రామ పంచాయతీలు వ్యాపార దుకాణాలకు పన్ను నిర్ణయించుకునేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ముందుగా సర్వే.. గ్రామాలవారీగా ఎన్ని వ్యాపార దుకాణాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ మొదటి వారంలో అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించనుంది. పంచాయతీ, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. వ్యాపార అవసరాలకు నిర్మించిన షాపులతోపాటు నివాసిత ఇళ్లకు అనుబంధంగా ఆ ఇంటిలోనే నిర్వహిస్తున్న దుకాణాల వివరాలను వేర్వేరుగా సేకరించనున్నారు. సర్వే అనంతరం తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో భారీ వడ్డన నిబంధనల ప్రకారం.. గ్రామాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇంటి పన్నును సవరించాల్సి ఉంది. అయితే, 1996 తర్వాత ఇప్పటివరకు పన్ను సవరణ జరగలేదు. దీనికి బదులుగా 2001 నుంచి ఏటా పాత పన్నుపై ఐదు శాతం చొప్పున పెంచే విధానం అమలవుతోంది. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో అప్పటి ఇళ్ల విలువ ఆధారంగా కొత్త ఇంటి పన్నును నిర్ధారించే ప్రక్రియను చేపట్టారు. దీంతో ఆ జిల్లాలో ఒక్కో యజమాని చెల్లించాల్సిన పన్ను అంతకు ముందున్న ఇంటి పన్నుకు ఐదారు రెట్లు పెరిగిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పశ్చిమ గోదావరి జిల్లాలో మాదిరిగా రాష్ట్రమంతా అన్ని గ్రామాల్లో ఇంటి పన్ను పెంపునకు కసరత్తు చేపట్టారు. ఇందుకుగాను 2018లో ప్రిస్ సర్వే పేరిట ప్రతి ఇంటి కొలతలు తీసుకున్నారు. వాటికి ఆ గ్రామంలోని మార్కెట్ ధరను కలిపి ఆ వివరాలన్నింటినీ అన్లైన్లో నమోదు చేశారు. అయితే, 2018 ఆగస్టులో సర్పంచుల పదవీ కాలం ముగియడం, సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఇంటి పన్ను అమలును టీడీపీ ప్రభుత్వం వాయిదా వేసింది. -
యాప్ ద్వారా పారదర్శకంగా ఇంటి పన్ను వసూలు: పెద్దిరెడ్డి
-
గ్రామాల్లో మొబైల్ యాప్‌తో ఇంటిపన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఇక నుంచి గ్రామాల్లో ఇంటి పన్నును అన్లైన్ విధానంలోనే వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ యాప్ ద్వారా ఇంటిపన్ను పూర్తి పారదర్శకంగా నూరు శాతం వసూలవుతుందని తెలిపారు. గ్రామాల్లోని సుమారు 86 లక్షల గృహాలకు సంబంధించిన డేటాను సేకరించి, ఆ వివరాలను యాప్‌తో ఇప్పటికే అనుసంధానం చేసినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఇకపై గ్రామాల్లో మాన్యువల్ విధానంలో ఇంటి పన్ను వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. ఇలా అన్లైన్ విధానంలో పన్ను చెల్లించిన వెంటనే అన్లైన్లోనే రశీదు తయారై, ఆ రశీదు వెంటనే పన్ను చెల్లించిన వారి మొబైల్ నెంబరుకు వెళ్తుందని మంత్రి చెప్పారు. అంతేకాక.. ఇంటి యజమానులకు ఎంత పన్ను చెల్లించారు.. ఇంకా ఎంత చెల్లించాలి అనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా ఆయా పంచాయతీల్లోని పన్ను చెల్లింపుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుందని వివరించారు. పొదుపు సంఘాల కార్యక్రమాలపైనా సమీక్ష పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పెన్షన్ల పంపిణీ అంశాలపై మంత్రి పెద్దిరెడ్డి సచివాలయంలోని తన ఛాంబరులో సెర్ప్ అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
ఈసారి ‘ఎర్లీబర్డ్’ వసూళ్లు డల్
సాక్షి, సిటీబ్యూరో: మూడు నాలుగేళ్లుగా జీహెచ్ఎంసీకి ఆర్థిక సంవత్సరం ఆరంభమయ్యే ఏప్రిల్‌లోనే ఆస్తిపన్ను రూపేణా ఎంతో డబ్బు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరేది. దాంతో ఆ తర్వాత మూడు నాలుగు నెలల వరకు సిబ్బంది జీతభత్యాలకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెలలో ఆస్తిపన్ను చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్’ పథకం కింద 5 శాతం రాయితీ ఉండటమే ఇందుకు కారణం. రాయితీ ఉండటంతో చాలామంది ఏప్రిల్‌లోనే ఆస్తిపన్ను చెల్లించేవారు. ఇలా గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎర్లీబర్డ్ ద్వారా దాదాపు రూ. 535 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం ఏప్రిల్ నెలాఖరు.. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు రూ. 128 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇందుకు పలు కారణాలున్నట్లు సంబంధిత అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం కారణంగా ఆదాయం లేక, జీతాలు లేక చాలామందికి రోజులు గడవడమే కష్టంగా ఉంది. దీంతో చాలామంది ఆస్తిపన్ను చెల్లించలేదు. అంతేకాకుండా గత సంవత్సరం వరకు ఎలాంటి వ్యత్యాసాలు లేకుండాజీహెచ్‌ఎంసీ పరిధిలోని నివాస, వాణిజ్య, మిక్స్డ్ భవనాలన్నింటికీ ఎర్లీబర్డ్ కింద 5 శాతం రాయితీ ఉండేది. దాంతో ఎక్కువ ఆస్తిపన్ను చెల్లించాల్సిన నివాస భవనాల వారితో పాటు వాణిజ్య భవనాల వారు చెల్లించేవారు. ఈసారి కేవలం నివాస భవనాల వారికి మాత్రమే, అది కూడా రూ. 30వేల లోపు ఆస్తిపన్ను వరకు మాత్రమే రాయితీ సదుపాయం వర్తింపచేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈసారి వాణిజ్య భవనాలకు రాయితీ లేకపోవడం, నివాస భవనాలకు పరిమితులుండటం కూడా ఆస్తిపన్ను వసూళ్లపై ప్రభావానికి మరో కారణంగా భావిస్తున్నారు. వీటితోపాటు ఈసారి ఎర్లీబర్డ్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించేందుకు మే నెలాఖరు వరకు అవకాశం ఉంది. గతంతో ఏప్రిల్ నెలాఖరు వరకే గడువుండేది. ఇలా వివిధ కారణాలు, కరోనా లాక్‌డౌన్‌తోనూ ఈసారి ఏప్రిల్ నెలాఖరు వరకు గతంతో పోలిస్తే తక్కువ ఆదాయం మాత్రమే వచ్చింది. గతంలో వివిధ మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేసేవారు. బిల్‌కలెక్లర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేవారు. ఇవేవీ లేకపోవడం కూడా ఇందుకు కారణాలుగా అధికారులు విశ్లేషిస్తున్నారు. డిమాండ్ రూ. 450 కోట్లు.. నివాస, రూ.30వేల లోపు ఆస్తిపన్ను డిమాండ్ సైతం దాదాపు రూ. 450 కోట్లు ఉంది. రూ. 30 వేలలోపు ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు జీహెచ్ఎంసీలో దాదాపు 13.70 లక్షల మంది ఉండగా, ఇప్పటి వరకు 2.05 లక్షల మంది మాత్రమే ఎర్లీ బర్డ్ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. -
‘అవ్వ’ ది గ్రేట్
కుత్బుల్లాపూర్: సరిగా నిలబడ లేక వంగి వంగి నడుస్తున్న ఈ అవ్వ పేరు లక్ష్మి(లక్ష్మమ్మ). కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో అటు ఇటు నడవలేక నడవలేక నడుస్తున్న ఈమె పింఛను కోసమో, ఇతరత్రా పథకాల లబ్ధికోసమో పాట్లు పడటం లేదు. ఈ అవ్వ వచ్చింది తన ఇంటి పన్ను కట్టడానికి. గాజులరామారం డివిజన్ మార్కండేయనగర్లో ఉన్న ఇంటి నంబరు 05–104 (పి.టి.ఐ నంబరు: 1152400681)కు గాను 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తూ వస్తుంది. అయితే ఇటీవల ఆమె వద్దకు ఓ వ్యక్తి వచ్చి పన్ను కట్టాల్సిందిగా కోరగా అతనికి డబ్బులు చెల్లించింది. అయినప్పటికీ తన ఇంటి పన్ను ఇంకా పెండింగ్ ఉందని తెలియడంతో ఇలా నేరుగా సర్కిల్ కార్యాలయానికి వచ్చి వాకబు చేసింది. సి.ఎస్.సి సెంటర్లోకి వెళ్లగా అక్కడ సిబ్బంది ఇంటి పన్ను రూ.2614 గా చెప్పడంతో అవాక్కయ్యింది. ఎప్పుడూ తన ఇంటి పన్ను రూ.1200 నుంచి 1300 మధ్యలోనే వస్తుందని, కాని ఇప్పుడు ఇంతలా ఎలా పెరిగిందని వాపోయింది. తన వద్ద ఇప్పుడు రూ 1200 మాత్రమే ఉన్నాయని మిగిలిన డబ్బులు తీసుకువస్తానని కొద్ది సేపు కూర్చుని తిరిగి వెళ్లిపోయింది అవ్వ. అయితే 2019 మార్చి నెలలో రూ.630 రూపాయలు కట్టి పాత బకాయిలు లేకుండా ట్యాక్స్ క్లియర్ చేయించుకుంది లక్ష్మమ్మ. ఆఖరికి ఆస్తి పన్ను మదింపు ఈ అవ్వను కూడా ఇబ్బందులకు గురిచేసింది. ఓ దశలో తన ఇబ్బంది చెబుతూ కన్నీటి పర్యంతమైంది. తాము 20 ఏళ్లుగా పన్ను చెల్లిస్తూ వస్తున్నామని, తన భర్త చనిపోయాక 2013 నుంచి తానే స్వయంగా చెల్లిస్తున్నాని చెప్పింది. సరిగా నడవలేని, సహకరించని శరీరం వణుకుతున్నప్పటికీ ఓపిక చేసుకుని ఆస్తిపన్ను కట్టడానికి వచ్చిన ఆ అవ్వను చూసి ఆస్తి పన్ను కట్టకుండా ఉండే మొండి బకాయిదారులు సిగ్గుపడాలని సిబ్బంది వ్యాఖ్యానించారు. -
ఆన్లైన్లో ఇంటిపన్ను వివరాలు
రామభద్రపురం(బొబ్బిలి): జిల్లాలో ఇప్పటివరకూ చేపట్టిన ఇంటిపన్ను వసూళ్ల వివరాలను తక్షణమే ఆన్లైన్లో పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) బి సత్యనారాయణ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రూ.15 కోట్లు ఇంటి పన్ను డిమాండ్ ఉండగా రూ.12 కోట్లు వసూలైందన్నారు. ఇందులో రూ.5 కోట్లు ఆన్లైన్లో పెట్టారని, మిగతా రూ.7 కోట్లు ఆన్లైన్లో పెట్టాల్సి ఉందన్నారు. ఈనెలాఖరు లోగా ఆన్లైన్లో పెట్టని కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 3,86,000 ఇళ్లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 1510 కిలోమీటర్ల కాలువల్లో పూడికలు తొలగించామన్నారు. ఇందులో 175 కిలోమీటర్లు మాత్రమే ఆన్లైన్ చేశారని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైనందున కాలువల్లో మురుగు నీల్వ ఉండకుండా పూర్తిగా తొలగించాలని డీపీఓ ఆదేశించారు. ప్రజలు రోగాలకు గురైతే కార్యదర్శులదే బాధ్యతని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పరిశీలించాల్సిన బాధ్యత ఈఓపీఆర్డీలదేనన్నారు. పంచాయతీ ఖర్చులనకు సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచాలని, చంద్రన్న పెళ్లికానుకకు కావాల్సిన వివాహ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో ఇవ్వాలని సూచించారు. జిల్లాల్లో 669 చెత్తశుద్ధి కేంద్రాల నిర్మాణాలు ప్రారంభించగా వాటిలో 129 పూర్తి చేశామన్నారు. 50 కేంద్రాల్లో వర్మీకంపోస్టు తయారు చేస్తున్నట్లు డీపీఓ తెలిపారు. -
ఇంటి పన్నులకు..పింఛన్ డబ్బు
చీమకుర్తి రూరల్: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు చెల్లించాల్సిన పింఛన్ల డబ్బును గ్రామ కార్యదర్శులు ఇంటి పన్నులకు జమ చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చండ్రపాడు గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీ సందర్భంగా బకాయిలున్న ఇంటి పన్నుల కింద పింఛన్ సొమ్ము ను జమ చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తన తండ్రి వల్లంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చిన వెయ్యి రూపాయల పింఛ న్లో ఇంటి పన్ను కింద రూ.250 జమ చేసుకున్నారని అంజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామంలో మరో వృద్ధురాలికి ఇల్లు కూడా లేదు. బంధువుల ఇళ్ల వద్ద కాలం వెళ్లదీస్తోంది. ఆ వృద్ధురాలికి వచ్చిన పింఛను డబ్బును బంధువులు చెల్లించాల్సిన ఇంటిపన్ను కింద కార్యదర్శి జమ చేసుకున్నారు. అదేమని అడిగితే ఇంటిపన్ను చెల్లించాల్సిన వాళ్లు మీకు బంధువులే కాబట్టి వారి దగ్గర వసూలు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇలా ఒక్క సోమవారం 80 మందికి పింఛన్లు పంపిణీ చేస్తే వారిలో 50 మంది వద్ద నుంచి ఇంటి పన్నుల కింద ఇచ్చిన పింఛన్లను జమ చేసుకున్నారని పింఛనుదారులు వాపోతున్నారు. ఆసరగా ఉంటుందనుకుంటే పన్ను కింద జమ ప్రభుత్వం పంపిణీ చేసే పింఛన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరాగా ఉంటుందనుకుంటే వారి అవసరాలను గుర్తించకుండా వచ్చిన పింఛన్లను ఇంటి యజమాని చెల్లించాల్సిన ఇంటి పన్నుల కింద జమ చేసుకోవడాన్ని పింఛనుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. పింఛన్లతో నెలంతా కాస్త ఉపశమనం పొందే వృద్ధులకు పన్నుల పేరుతో అది కూడా లేకుండా అధికారులు ముక్కుపిండి వసూలు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్లు వస్తున్నాయి కాబట్టే తమను కాస్త గౌరవంగా ఇంట్లో చూస్తున్నారని, వచ్చిన పింఛన్లను ఇలా జమ చేసుకోవడం ఏంటని వృద్ధులు వాపోతున్నారు. మార్చి నెలాఖరు దాటిపోయినా పింఛన్లు వసూలు చేసేందుకు ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రభుత్వం ఇంటి పన్ను జమ చేసేందుకు గడువు ఇచ్చింది. దానిలో భాగంగా గ్రామాల్లో ఇంటి పన్ను టార్గెట్ వంద శాతం చేసేందుకు గాను కార్యదర్శులు గ్రామాల్లో పింఛన్లు జమ చేసుకుంటున్నారు. నచ్చజెప్పే తీసుకుంటున్నాం ఇంటి పన్నుల బకాయిలున్నాయని, పింఛన్ల డబ్బును జమ చేయమని నచ్చజెప్పిన తర్వాతే పింఛన్ల డబ్బును ఇంటిపన్ను కింద వసూలు చేసుకుంటున్నాం. ఇంటి పన్నులను నూరు శాతం వసూలు చేయాలని అధికారుల ఆదేశాలున్నాయి. పింఛనుదారులకు వివరించి వారిని ఒప్పించిన తర్వాతే తీసుకుంటున్నాం. – షేక్.జాన్ బాషా, కార్యదర్శి, చండ్రపాడు -
నిర్లక్ష్యం..వైఫల్యం!
జీహెచ్ఎంసీలో భవన నిర్మాణాల్లో అక్రమాల నుంచి చెరువుల పరిరక్షణ, ఆస్తిపన్ను వసూళ్లు, ఘనవ్యర్థాల నిర్వహణల్లో జీహెచ్ంఎసీ విఫలమైందని ‘కాగ్’ కడిగి పారేసింది. ఈ అంశాల్లో వేటిల్లోనూ సమర్థంగా పనిచేయలేదని విమర్శించింది. అడ్డగోలు నిర్మాణాలను అడ్డుకోనందున విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని తూర్పారబట్టింది. క్షేత్రస్థాయి తనిఖీలు లేవని తప్పుబట్టింది. తడి పొడి చెత్త గురించి జీహెచ్ంఎసీ ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ఘనవ్యర్థాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. స్వచ్ఛ కార్యక్రమాల్లో ప్రచార ఆర్భాటమే ఎక్కువగా ఉందని విమర్శించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 2012 నుంచి 2017 వరకు జరిగిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలను కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇక మై జీహెచ్ఎంసీ యాప్, ప్రజావాణి, ఎమర్జెన్సీ డయల్ 1100 తదితర కార్యక్రమాలను కాగ్ ప్రశంసించింది. ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రజలపై భారం వేకుండా ట్రాన్సాక్షన్ రుసుంను మినహాయించడాన్ని కూడా కాగ్ అభినందించింది. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో గత ఐదేళ్ల ఆస్తిపన్ను విధింపులో వ్యత్యాసాలున్నాయని కాగ్ తేటతెల్లం చేసింది. 75,387 ఆస్తులను తనిఖీ చేయగా, 41 శాతం (30,864) భవనాల్లో వ్యత్యాసం ఉందని వెల్లడించింది. వీటిలో 10,460 భవనాలు అక్రమ నిర్మాణాలేనని తప్పుబట్టింది. 2016–17లో భవన నిర్మాణాలకు 4,042 దరఖాస్తులు రాగా వాటిలో 33 శాతం(1,323) మందికి మాత్రమే ఓసీలు జారీ చేయగా, మిగతా వారి రికార్డులే లేవంది. ఓసీలు నిరాకరించినప్పుడు, అక్రమ కట్టడాలను గుర్తించినప్పుడు నోటీసులిస్తున్నామని పేర్కొంటూ 2016, 2017ల్లో మొత్తం 868 నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపినప్పటికీ, పెండింగ్ కేసుల వివరాలు మాత్రం ఇవ్వలేదని బల్దియా తీరును తప్పుబట్టింది. అక్రమ నిర్మాణాలున్నాయని ఒప్పుకున్న జీహెచ్ఎంసీ.. కోర్టు కేసుల వల్ల, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల వల్ల తగిన చర్యలు చేపట్టడంలో అశక్తతను వెల్లడించారని కుండబద్దలు కొట్టింది. పర్యావరణ ప్రభావ రుసుమును వసూలు చేయలేకపోయారని పేర్కొంది. నివాసగృహాలను ఇతర అవసరాలకు వినియోగిస్తుండటాన్నీ ప్రస్తావించింది. ఆస్తిపన్ను వసూళ్లపై.. ఆస్తిపన్ను వసూళ్లు, పెనాల్టీల వసూళ్లలో తగిన విధంగా వ్యవహరించలేదని కాగ్ పేర్కొంది. 2017 మార్చి వరకు రావాల్సిన బకాయిలు రూ.1403.43 కోట్లలో.. రూ.900.33 కోట్లు మూడేళ్లుగా వసూలు చేయలేదని, ఇలాంటి భవనాలు 1,78,701 ఉన్నాయని వెల్లడించింది. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ప్రస్తావించింది. తద్వారా ఆరు సర్కిళ్లలో జరిపిన తనిఖీల్లో 708 భవనాలకు వెరసి రూ.5.25 కోట్లు ఆస్తిపన్ను తక్కువగా అసెస్ చేశారంది. ♦ విభాగం ఎప్పటికప్పుడు నిర్మాణ అనుమతుల వివరాలను రెవెన్యూ విభాగానికి అందజేయలేదని వెల్లడించింది. తనిఖీ చేసిన ఆరు సర్కిళ్లలో ఆస్తిపన్ను అసెస్మెంట్ల డేటాబేస్‌లో ఉండాల్సిన పన్ను చెల్లించేవారి వివరాలు లోపభూయిష్టంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ♦ జీఐఎస్ ఆధారంగా ఆస్తిపన్ను మదింపు కోసం సర్వే వంటి వాటి కోసం రూ.20.81 లక్షలు ఖర్చు చేయగా, క్షేత్రస్థాయిలో జీహెచ్ంఎసీ పరిశీలించిన వివరాలకు పొంతనలేదని విరమించుకున్నప్పటికీ, రెండు రకాల సమాచారాన్ని పోల్చి సమన్వయపరిచే ప్రయత్నం చేయలేదంది. ♦ ఇక పన్ను పరిధిలోని నిర్మాణాలకు సంబంధించి జియో ట్యాగింగ్ ఏర్పాట్లలో 72 స్థానిక సంస్థల సాఫల్యతను జీహెచ్ఎంసీ సమీక్షించాలని సూచించింది. అనుమతి పొందిన ప్లాన్ కంటే అదనంగా నిర్మించిన వాటికి విధించాల్సిన జరిమానాల్లోనూ తక్కువ జరిమానా విధించినట్లు గుర్తించింది. ♦ టౌన్‌ప్లానింగ్ సమాచారంతో జియో ట్యాగింగ్ వంటి సాంకేతిక పద్ధతుల్ని వినియోగించుకొని అన్ని నిర్మాణాలనూ పన్ను పరిధిలోకి తేవాల్సి ఉందని సూచించింది. ♦ నివాసేతర భవనాల వయసును బట్టి వార్షిక అద్దె మీద ఇవ్వాల్సిన రిబేటు 10–30 శాతం కాగా, కొన్ని చోట్లా 40 శాతం ఇచ్చినట్లు పేర్కొంది. ♦ వసూలయ్యే ఆస్తిపన్నులో గ్రంథాలయ సెస్సును జిల్లా గ్రంథాలయ సంస్థకు సకాలంలో ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఇంటి నెంబర్లు ఇంకా పజిలే.. ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఇంటి నెంబర్ల నమోదు కొలిక్కి రాకపోవడాన్ని, లోటుపాట్లను బట్టబయలు చేసింది. ఏర్పాటు చేసిన చోటా డూప్లికేషన్ జరగడాన్ని ఎత్తిచూపింది. అంతా ప్రచార ఆర్భాటమే.. తడి– పొడి చెత్త గురించి జీహెచ్ంఎసీ ఎంతగా ప్రచారం చేస్తున్నా ఘనవ్యర్థాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందని కాగ్ నివేదికలో పేర్కొంది. చెత్త ఉత్పత్తి స్థానంలో తడి–పొడి వేరవుతున్నది 27 శాతమేనంది. వ్యర్థాల నుంచి ఇంధన తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయలేకపోయారని, అందుబాటులోని డంపింగ్ ప్రాంతాలను పునరుద్ధరించలేదని పేర్కొంది. ఐదేళ్ల వ్యవధిలో రోజువారీ వ్యర్థాలు రెట్టింపు అయినట్లు పేర్కొన్నప్పటికీ, వ్యర్థాల పరిమాణాన్ని అంచనా వేసే యంత్రాంగం లేకపోవడాన్ని తప్పుబట్టింది. ముంపు సమస్యలు తప్పేదెప్పుడు..? వరదనీటి కాలువల ఆధునికీకరణకు రూపొందించిన ప్రణాళిక ఏడేళ్లయినా అమలు చేయలేకపోయారని విమర్శించింది. వరదొస్తే నగరం చెరువుగా మారే దుస్థితి తప్పలేదని ప్రస్తావించింది. వరదనీరు నిలిచిపోయే 461 ప్రాంతాల్లో 52 ప్రదేశాలు అత్యంత ప్రమాదకరమైనవని, మరో 67 కూడళ్లలో జనసమ్మర్ధం ఎక్కువని హెచ్చరించింది. ♦ వర్షం వస్తే ఇవి ముంపుబారిన పడతాయని హెచ్చరించింది. వరదకాలువల విస్తరణకు 26 నాలాలపై రూ.350.13 కోట్లతో 71 పనులు చేపట్టినా ఆక్రమణలను తొలగించడంలో వైఫల్యం వల్ల 16 పనులు ఆగిపోయాయని కాగ్ పేర్కొంది. ♦ 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల కాలంలో వరదకాలువల ఆధునికీకరణకు రూ.1306 కోట్లు బడ్జెట్లో కేటాయించినా, రూ.707 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంది. సకాలంలో పనులు చేయనందున కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థికసాయం రాలేదని ప్రస్తావించింది. ♦ నాలాల విస్తరణకు సంబంధించి పరిశీలించిన 24 పనుల్లో (అంచనా వ్యయం రూ.227.82 కోట్లు)13 పనులు అర్ధాతరంగా ఆగిపోయాయని గుర్తించింది. ఐదేళ్లలో మొత్తం రూ.78.34 కోట్లతో డీసిల్టింగ్ పనులు చేసినట్లు పేర్కొన్నప్పటికీ, చెత్తను కాలువల్లో వేయడాన్ని నిలువరించలేకపోయారని ఎత్తిచూపింది. చెరువులు మాయమవుతున్నా పట్టదా..? చెరువుల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు స్పష్టం చేసింది. చెరువులు, నాలాల వెంబడి 12,182 ఆక్రమణలకు గతేడాది జూలై వరకు కేవలం 7 శాతం(847) మాత్రమే తొలగించారని, 17 సరస్సులు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోలేకపోయారని తప్పు పట్టింది. 9 సరస్సులు పూర్తిగా దురాక్రమణ పాలయ్యాయని నిగ్గు తేల్చింది. కొన్ని పద్ధతులకు ప్రశంసలు వివిధ అంశాల్లో జీహెచ్ఎంసీని తప్పుపట్టిన కాగ్.. కొన్ని అంశాల్లో మంచి పద్ధతులు ప్రవేశపెట్టారని కితాబిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన ‘మై జీహెచ్ఎంసీ’ యాప్, ‘ప్రజావాణి’ కాల్‌సెంటర్, ఎమర్జెన్సీ డయల్ 1100, ఆన్లైన్ సేవల(జీహెచ్ఎంసీ ఆన్లైన్, ట్విట్టర్)ను ప్రస్తావించింది. ఐదేళ్లలో వివిధ వేదికల ద్వారా జీహెచ్ఎంసీకి రూ.3.14 లక్షల ఫిర్యాదులు అందగా, 3.11 పరిష్కరించినట్లు పేర్కొంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రజలపై ట్రాన్సాక్షన్ ఫీజు పడకుండా చేయడాన్ని అభినందించింది. -
ఆస్తిపన్నుఅప్'లేట్'!
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రంగారావు గత డిసెంబర్లోనే తన ఇంటి తాలూకు ఆస్తిపన్ను రెండో వాయిదా రూ.6,780 ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో మరోసారి తన ఇంటి పన్ను వివరాలు చూసుకునేందుకు జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగా...తాను ఇంకా రెండో వాయిదా చెల్లించనట్లుగా చూపుతోంది. దీంతో అవాక్కయిన రంగారావు సమీపంలోని జోనల్ కార్యాలయాన్ని సంప్రదించాడు. అక్కడ ఉన్నతాధికారి ద్వారా వివరాలు అప్డేట్ చేయించుకుని ఊపిరిపీల్చుకున్నాడు. ఇలా...అప్డేట్ కాని వివరాలతో నగరంలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులు అవస్థలు పడుతున్నారు. అసలు తాము మళ్లీ ఆస్తి పన్ను చెల్లించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆస్తి పన్ను వివరాలు ఆన్లైన్లో అప్డేట్ కావడంలేదని ఇటీవల విమర్శలు వస్తున్నాయి. ఒక వైపు డిజిటల్ లావాలదేవీలు పెంచుతామంటూ..మరోవైపు సైట్‌ను సక్రమంగా నిర్వహించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆస్తి పన్ను వివరాలు చూసుకునేందుకు జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లోని సంబంధిత లింక్‌ను ఓపెన్ చేసేందుకే ఎంతో సమయం పడుతోంది. తీరా ఓపెన్ చేసి చూశాక ఆన్లైన్లో చెల్లించిన ఆస్తి పన్ను వివరాలు సైట్లో చూపకపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఆబిడ్స్‌లోని ఓ వ్యాపార సంస్థ చెల్లించిన దాదాపు రూ.16 లక్షల 50 వేల రూపాయలు కూడా చెల్లించినట్లు చూపకపోవడంతో వారు హతాశులయ్యారు. ఎట్టకేలకు సంబంధిత అధికారుల ద్వారా పరిశీలించగా, చెల్లించినట్లు నమోదైంది. ఇలా పబ్లిక్ డొమైన్లలో తాజా వివరాలు లేకపోవడంతో పలువురు ఆందోళనలు చెందుతున్నారు. ఎందరికో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వివిధ అంశాల్లో నెంబర్‌వన్‌గా ఉన్నామని, దేశంలోనే అనేక అంశాల్లో మేమే టాప్ అని, ఈఓడీబీ, ఈ –ఆఫీస్ వంటి అంశాల్లోనూ ముందంజలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీలో ఇలాంటి స్వల్ప సమస్యలపై అధికారులు శ్రద్ధ వహించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ బిల్కలెక్టర్లకు ఆస్తిపన్ను చెల్లించిన వారితోపాటు ఈసేవ, మీసేవ, సీఎస్సీల్లో చెల్లించిన వారికి సైతం ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు ఎంతోకాలంగా ఉన్నప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఆర్థిక సంవత్సరం ముగియవస్తున్న తరుణంలో ప్రజలకు మనశ్శాంతి లేకుండా పోతోంది. జీహెచ్ఎంసీకి ఐటీ విభాగమంటూ ఉన్నా ఆన్‌లైన్‌కు సంబంధించిన పనులన్నీ సీజీజీకి అప్పగించారు. వెబ్సైట్లో జీహెచ్ఎంసీకి సంబంధించి గతంలో ఉన్న పలు వివరాల్లేవు. అదేమంటే అప్డేట్ జరుగుతోందని చెబుతున్నారు. నెలల తరబడి ఇదే సమాధానం. ఏటా వెయ్యికోట్లకు పైబడి ఆస్తిపన్ను వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీలో ఇదీ పరిస్థితి. బిల్ కలెక్టర్లకు ఆస్తిపన్ను చెల్లించిన వివరాలు సైతం హ్యాండ్ హెల్డ్ డివైజ్ నుంచి రసీదు ఇచ్చిన వెంటనే ఆన్లైన్లో నమోదయ్యేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటిది సీఎస్సీలు, మీసేవల్లో చెల్లించిన వివరాలు అప్డేట్ కాకపోవడం ఏమిటో అంతుపట్టడం లేదు. -
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సీజ్
జగ్గయ్యపేట అర్బన్ : ఇంటి పన్ను చెల్లించకపోవటంతో స్థానిక బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజినల్ కార్యాలయాన్ని బుధవారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు పన్ను వసూళ్లకు వచ్చిన పురపాలక సంఘ రెవెన్యూ అధి కారులు.. కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపివేసి ప్రధాన ద్వారానికి తాళాలు వేసి సీల్ వేశారు. పన్ను చెల్లింపునకు ఈనెల 31 వ తేదీ డెడ్‌లైన్ కావటంతో మున్సిపల్ కమిషనర్ పి.రమేష్ ఆదేశాల మేరకు పన్ను బకాయిల వసూలు లక్ష్యంతో రెవెన్యూ విభాగం సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా బీఎస్ఎన్ఎల్ గత 18 ఏళ్లుగా రూ.5.13 లక్షల ఇంటి పన్నును చెల్లించకపోవటంతో అనేకసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా ఖాతరు చేయలేదు. దీంతో బుధవారం కార్యాలయానికి వచ్చి మరొకసారి పన్ను బకాయిలు చెల్లించాలని కోరారు. అయినా స్పందించకపోవడంతో రెవెన్యూ ఆఫీసర్ ఆర్. వసంతరావు ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కేజే శంకర్, టీమ్ లీడర్ చావా ప్రేమ్‌చంద్, సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, బిల్ కలెక్టర్లు నాగరాజు, ఇతర సిబ్బంది కార్యాలయాన్ని సీజ్ చేస్తున్నట్లు నోటీస్ జారీ చేసి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి సీల్ వేశారు. కాగా ఒక దశలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, సిబ్బందికి.. మున్సిపల్ అధికారులు, సిబ్బందికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా రెవెన్యూ అధికారులు ససేమిరా అనటంతో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఈ విషయాన్ని వారి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అలాగే, మున్సిపల్ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. -
ఇంటిపన్నురూ.5000= రసీదు రూ.4500
రైల్వేకోడూరు: పంచాయితీ కార్యదర్శి ఇంటి పన్ను అధికంగా వసూలు చేస్తోందని విద్యానగర్ వాసులు ఈఓపీఆర్డీ సంజీవరావుకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఈఓపీఆర్డీను మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కె.బుడుగుంటపల్లె పంచాయితీ కార్యదర్శి లక్ష్మీదేవితో మరో వ్యక్తితో వచ్చి తమను బెదిరించి ఇంటి పన్నులు వేలలో కట్టమని డిమాండు చేస్తోందని ఆరోపించారు. రేకుల ఇంటికి కూడా వేలల్లో ఇంటి పన్ను కట్టమంటే ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిల్లర అంగడి ఉంటే దానికి ఇంటి పన్ను 5 వేలు అడుగుతోందని, ఇదేంటని అడిగితే అది అంతేనని కట్టక తప్పదని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బయపెడుతోందన్నారు. తీసుకున్న మొత్తంలో 5 వందలు తగ్గించుకుని బిల్లు ఇస్తోందని ఇదేంటని అడిగితే కంప్యూటర్ పనిచేయడం లేదని కుంటి సాకులు చెబుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి రాలేదన్నారు. ప్రతి బిల్లుకు 4 నుంచి 5 వందలు ఎక్కువగా వసూలు చేసుకుని తక్కువ మొత్తానికి బిల్లు ఇస్తోందన్నారు. కార్యదర్శి ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై ఈఓపీఆర్డీను వివరణ కోరగా కె.బుడుగుంటపల్లె పంచాయితీలో మొత్తం 925 ఇండ్లు ఉన్నాయని, ఇంటి పన్ను వసూలు డిమాండు 1.70 లక్షలు ఉందన్నారు. సరాసరి ఒక ఇంటికి 185 రూపాయులు కడితే చాలన్నారు. షాపులు, ఇతర వాటికి 500 లైసెన్సు రుసుం చెల్లిస్తే సరిపోతుందన్నారు. అలా ఎందుకు వసూలు చేసిందో తమకు తెలియదన్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. గతంలో ఆమె పింఛన్లు కూడా సక్రమంగా ఇవ్వలేదని, రాజంపేట డీఎల్పీఓ రమణ విచారణ చేపట్టిన విషయం తెలిసినదే. ఫిర్యాదు చేసిన వారిలో దామోదర్, ప్రకాష్, రత్న, కుమారి, నరసమ్మ, సుశీలమ్మ తదితరులు ఉన్నారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ
► పూర్తిస్థాయి పరిశీలన అనంతరం చర్యలు ► డీపీవో సుదర్శన్ జూలపల్లి: వడ్కాపూర్ గ్రామ సర్పంచ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కలెక్టర్‌కు వార్డు సభ్యులు ఈనెల 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్ పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు. వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే పనులు చేస్తున్నారని, పంచాయతీలో వసూలైన ఇంటి పన్ను, నల్లా బిల్లు, నూతన నల్లా కనెక్షన్ల డబ్బులు, గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే అంగడిలో వసూలు చేస్తున్న డబ్బులు ఎస్టీవోలో జమ చేయకుండానే సొంతానికి వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా సర్పంచ్ కనకట్ల కళ గతంలో వార్డు సభ్యులకు రూ.5వేల చొప్పున ఇచ్చినట్లు, మరిన్ని డబ్బుల కోసమే వేధిస్తున్నారని డీపీవోకు రాసి ఇ చ్చారు. పంచాయతీ రికార్డులను స్వాదీనం చేసుకున్న డీపీవో పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్డీ విజయలక్ష్మి, సెక్రటరీ అంజ య్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
ఆత్మకూర్‌లో పన్నుల డబ్బు మాయం!
రూ.లక్ష వరకు గల్లంతు కారోబార్‌ను విధుల నుంచి తొలగింపు మెట్‌పల్లిరూరల్ : మెట్పల్లి మండలం ఆత్మకూర్ పం చాయతీ వసూలు చేసిన వివిధ పన్ను ల డబ్బులు సుమా రు రూ.లక్ష వరకు మాయమయ్యా యి. ఈ విషయం మంగళవారం సర్పంచ్, మండల ఉపాధక్షుడు, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ఆరా తీయగా.. స్వాహా అయినట్లు వెలుగుచూసింది. గ్రామపంచాయతీలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు.. పన్నుల డబ్బు స్వాహా విషయమై ఫోన్లో చర్చించుకున్న మాటలు బహిర్గతమయ్యాయి. ఇంటిపన్ను.. నల్లా డిపాజిట్లు, నల్లా పన్నులను వసూలు చేసిన కారోబార్.. నకిలీబిల్లుబుక్లనుంచి ప్రజలకు రశీదులు ఇచ్చినట్లు బయటపడింది. నకిలీబుక్ల ద్వారా ఎంతమంది నుంచి ఎంతమొత్తం వసూలు చేశారో నిర్ధరించేందుకు కమిటీ వేశారు. కారోబర్ శ్రీనివాస్‌ను విధుల నుంచి తప్పించారు. 2011 నుంచి అన్ని రశీదులను తనిఖీ చేయాలని, గతంలో ఇక్కడ పని చేసి ఉద్యోగ విరమణ పొందిన కార్యదర్శి రాజేశ్వర్‌ను కూడా ప్రశ్నించాలని తీర్మానించారు. గ్రామంలోని ఓ అంగన్వాడీ కార్యకర్త వద్ద స్థానిక నాయకులతో సన్నిహితంగా మెలిగే ఒకరు రూ.మూడువేలు, 30 గుడ్లను తీసుకున్నట్లు గుర్తించారు. సమావేశంలో సర్పంచ్ గంగుల బలరాంమూర్తి , వైస్ ఎంపీపీ రాచమల్ల సురేశ్, ఉపసర్పంచ్ దిలీప్, కార్యదర్శి రమేశ్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. -
పల్లె ప్రజలపై పన్ను పోటు
పంచాయతీల్లో ఇంటి పన్నుల బాదుడు రెట్టింపు పెంపునకు కసరత్తు ముమ్మరంగా సాగుతున్న ఇంటి కొలతల ప్రక్రియ రూ.113 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పెరగనున్న పన్నుల డిమాండ్ ప్రగతికి పట్టుగొమ్మలైన పల్లెపై పన్ను పోటు పడనుంది. పంచాయతీలకు ఆదాయం పేరుతో ప్రజలపై భారం వేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా వచ్చే నిధుల్లో ఓవైపు కోత కోస్తూ ఇంకోవైపు అదనపు భారం మోపుతూ గ్రామ పాలనను గందరగోళం చేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. కొత్త సంవత్సరం పన్నుల మోతతో శ్రీకారం చుట్టడానికి జిల్లా యంత్రాంగం సిద్ధపడుతోంది. అమలాపురం టౌన్ : గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల పెంపుతో గ్రామీణ ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో పన్నుల ప్రక్రియను ఆ¯ŒSలై¯ŒSలో అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇంతకాలం మాన్యువల్‌గా జరిగిన ఈ ప్రక్రియను పూర్తిగా అ¯ŒSలై¯ŒS చేసి పంచాయతీల్లో పన్నుల వసూళ్లపరంగా ఆదాయాన్ని మరింత పారదర్శకంగా పెంచుకుంటూనే పన్నుల పెంపునకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు అయిదేళ్లకోసారి జరిగే ఇంటి పన్నుల రివిజ¯ŒSను వేదికగా చేసుకొని చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పన్నుల డిమాండ్‌ను రెట్టింపు చేస్తూ కొలతలు...గణాంకాలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాలోని 1069 పంచాయతీల్లో ఇంటి పన్నుల రివిజ¯ŒSకు సంబంధించి ఇళ్ల కొలతలు...లెక్కలు ప్రస్తుతం గ్రామాల్లో ముమ్మరంగా జరగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పంచాయతీల్లో ఇంటి పన్నుల డిమాండ్ రూ.113 కోట్లు వరకూ ఉండగా దాన్ని తాజా రివిజ¯ŒS ద్వారా రూ.200 కోట్లకు పైగా ఆదాయాన్ని పన్నుల వసూళ్ల ద్వారా పెంచే ప్రయత్నం జరుగుతోంది. రిజిస్టర్ వేల్యూ... రేట్ ఆఫ్ టాక్స్‌తో పెంపుదల గతంలో ఆయా పంచాయతీ పాలక వర్గాలు నిర్ణయించే పంచాయతీ రేట్ ఆఫ్ టాక్స్ ద్వారా ప్రతి ఏటా అయిదు శాతాన్ని పెంచుతూ అయిదేళ్లకు 27 శాతం వరకూ పెంచేవారు. ఇప్పుడు రేట్ ఆఫ్ టాక్స్‌తోపాటు కొత్తగా ఆ భవనానికి సంబంధించి రిజస్ట్రేష¯ŒS కార్యాలయంలో దాని విలువకు చెందిన సమాచారంతో పన్నుల పెంచేలా నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఇందుకోసం తొలుత పంచాయతీలకు రేట్ ఆఫ్ టాక్స్‌ను అడుగు విస్తీర్ణానికి కనీస స్థాయి 13 పైసలుగా నిర్ధారించారు. అక్కడ నుంచి ఆయా పంచాయతీల స్థానిక విలువ ఆధారంగా 13 పైసలకు మించి పెంచుకునే అధికారం పంచాయతీల పాలక వర్గాలకు ఇచ్చారు. ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేష¯ŒS కార్యాలయాల వెబ్సైటుల్లో ఆ ఇంటి యజమాని ఆధార్ నెంబరు, డోర్ నెంబరు..సర్వే నెంబరు ఇలా సమస్త సమాచారం ఆ¯ŒSలై¯ŒS అయి ఉండటంతో పంచాయతీ ఇంటి పన్ను పెంపునకు రిజిస్ట్రేష¯ŒS వేల్యూను కూడా ఆధారంగా చేసుకుంటున్నారు. దీనివల్ల పన్నుల రివిజ¯ŒS సమయంలో సిబ్బంది ప్రలోభాలు, అక్రమాలకు పాల్పడకుండా అడ్డుకుట్ట వేసినట్లయింది. ఆ¯ŒSలై¯ŒS అనుసంధానం, పన్నుల పెంపునకు తొలి కసరత్తుగా జిల్లాలోని ఇళ్లకు కొలతలు కొలిచి చదరపు అడుగులు నిర్థారించే బాధ్యతను ప్రభుత్వం ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇదే సంస్థ ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో కొలతలు పూర్తి చేసింది. ఆ సంస్థకు చెందిన సిబ్బంది జిల్లాలోని 1069 పంచాయతీల్లో ప్రస్తుతం బృందాలుగా ఏర్పడి ఇంటి కొలతలను లెక్కగడుతున్నారు. ఆ¯ŒSలై¯ŒS అయిన తర్వాత ఇంటి యజమాని సెల్ ఫో¯ŒSకు తమ ఇంటికి పన్ను ఎంత పెరిగిందీ?ఎంత చెల్లించాలి అనే సమాచారం మెసేజ్ ద్వారా రానుంది. పన్నులు కూడా ఆ¯ŒSలై¯ŒS ద్వారా చెల్లించుకునే వెసులబాటు కూడా అందుబాటులోకి వస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2017 ఏప్రిల్ నుంచి పెంపు పన్నులు, ఆ¯ŒSలై¯ŒS విధానం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. -
పంచాయతీలకు కాసుల గలగల
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులను అవస్థలు పెడుతున్నా... గ్రామ పంచాయతీల్లో మాత్రం పన్నుల వసూళ్లు పెరుగుతున్నాయి. పాత రూ.500, రూ.1,000 నోట్లతో పన్నుల చెల్లింపునకు అవకాశం కల్పించడమే దీనికి కారణం. కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయి ఉన్నాయి. దాంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా పాతనోట్లతో పన్నులు, బకాయిలు చెల్లించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించడంతో నాలుగు రోజులుగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఖజానా కళకళలాడుతోంది. పలు గ్రామాల్లో పాత బకాయిలతో పాటు వచ్చే ఏడాది మార్చిలోగా చెల్లించా ల్సిన ఆస్తిపన్నును కూడా చెల్లిస్తుండడం గమనార్హం. ఇంతకుముందు ఇంటింటికీ తిరిగి పన్ను కట్టాలని అడిగినా వసూళ్లు జరిగేవి కావని, ఇప్పుడు పన్ను చెల్లించేం దుకు పాతనోట్లతో జనం బారులు తీరుతు న్నారని కొందరు గ్రామ పంచాయతీల సర్పంచులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాతనోట్లతో ఆస్తిపన్ను చెల్లించుకునే అవకా శాన్ని మారుమూల గ్రామాలు సైతం వినియోగించుకుంటున్నారని.. ముఖ్యంగా పట్టణాలకు సమీపంలో ఉండే గ్రామాల్లో ఆస్తి పన్నులు వంద శాతం వసూలయ్యే అవకాశం కనిపిస్తోందని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపు తుండడాన్ని గమనించి పంచాయతీరాజ్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో రోజువారీగా దండోరా వేయిం చడంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో వార్డుకో పన్ను వసూలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లోనైతే పంచాయతీ సిబ్బందే ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేసి రసీదులు అందజేస్తున్నారు. మొత్తంగా గత 4 రోజుల్లో అనూహ్యంగా రూ.21 కోట్లకు పైగా పన్నులు వసూలు కావడం, పాత నోట్లతో పన్ను చెల్లింపునకు కేంద్రం మరింత గడువు ఇవ్వడంతో మరింత ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆస్తిపన్ను వసూలుకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ ప్రజలను చైతన్యపరిచేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా చొరవ చూపడం, కొత్త జిల్లాల్లో డీపీవోలుగా నియమితులైన అధికారులు ప్రత్యేక శ్రద్ద కనబరచడంతో పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌తో అదనపు నిధులు పాత బకాయిలతో పాటు ఈ ఏడాది వంద శాతం ఆస్తిపన్ను వసూలైన గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నుంచి పెర్ఫార్మెన్స్ గ్రాంటు రూపేణా అదనపు నిధులు అందనున్నాయి. కేంద్రం ఇచ్చే ఈ పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌లో 50 శాతం నిధులను గతేడాది కంటే ఐదుశాతం అధికంగా ఆస్తిపన్ను వసూలు చేసిన గ్రామ పంచాయ తీలకు, మరో 50 శాతం నిధులను ఈ ఏడాది వంద శాతం పన్నులు వసూలు చేసిన గ్రామ పంచాయతీలకు ఇవ్వనున్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి రూ.105 కోట్ల పెర్ఫార్మెన్స్ గ్రాంట్ లభించగా.. వచ్చే ఏడాది రూ.195 కోట్లను ఇవ్వనున్నారు. సాధారణంగా వచ్చే అభివృద్ధి నిధులకు తోడుగా మంచి పనితీరు కనబర్చిన గ్రామాలకు ఈ పెర్ఫార్మెన్స్ గ్రాంట్ ఇస్తారు. దీంతో అభివృద్ధి పనులకు మరింత తోడ్పాటు లభిస్తుంది. -
'కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి'
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సర్కారు ఖజానా గలగల లాడుతోంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లతో ప్రభుత్వ విభాగాల బిల్లులు, బకాయిలు చెల్లించ వచ్చన్న వెసులు బాటుతో కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి. జీహెచ్ఎంసీ తదితర విభాగాలకు మొత్తం నాలుగు రోజుల్లో సుమారు రూ.389 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో రద్దయిన నోట్లతో వివిధ పన్నులు, చార్జీలు, జరిమానాలు చెల్లింపు గడువును ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరు తుండగా, డిస్కం, జలమండలిలకు భారీగా బకాయిలు వసూలవుతున్నాయి. ట్రాఫిక్ ఈ-చెలానా చెల్లింపులు కూడా పెద్దఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీకి రూ.157 కోట్లు జీహెచ్ఎంసీకి గత నాలుగు రోజుల్లో ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో రికార్డు స్థాయిలో దాదాపు రూ.157 కోట్లు వసూలయ్యాయి. సోమవారం ఒక్కరోజే రూ.55 కోట్లు రాగా, అందులో ఆస్తి పన్ను కింద రూ.19 కోట్లు, లేఅవుట్ల క్రమ బద్ధీకరణ కింద రూ.36 కోట్ల వరకు పన్ను వసూలైంది. కొందరు ముందస్తు ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ కూడా చెల్లిస్తుండటం విశేషం. భారీగా వసూలైన విద్యుత్ చార్జీలు విద్యుత్ శాఖకు కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. గత నాలుగు రోజుల్లో సుమారు రూ.202 కోట్లు వసూలయ్యాయి. సెలవు దినమైనప్పటికీ విద్యుత్ శాఖ కౌంటర్లు పనిచేయడంతో సుమారు రూ.20 కోట్ల వరకు చార్జీలు వసూలయ్యాయి. కొందరు వినియోగదారులు ముందస్తు చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. పెరిగిన బకాయిల చెల్లింపులు పెద్ద నోట్ల రద్దుతో జలమండలికి మొండి బకాయిలు పెద్ద ఎత్తున వసూలవు తున్నాయి. ఈ నాలుగు రోజుల్లో సుమారు రూ.30 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. సోమవారం రూ.4.44 కోట్లు చార్జీల రూపేణా చెల్లింపులు జరిగాయి. ట్రాఫిక్ ఈ-చెలానా చెల్లింపులు ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ–చలాన్లను కూడా వాహన దారులు రద్దయిన నోట్లతో క్లియర్ చేసుకొంటున్నారు. మీ–సేవ, ఈ–సేవా కేంద్రాల ద్వారా పెద్దఎత్తున చెల్లింపులు జరిపారు. సోమవారం సుమారు రూ.13 లక్షలకు పైగా పోలీసు యంత్రాంగానికి ఆదాయం సమకూరింది. -
ఇంటి పన్ను రూ 1.02 కోట్లు వసూలు
అనంతపురం న్యూసిటీ : ఇంటి పన్ను రూ 1.02 కోట్లు వసూలైనట్లు మునిసిపల్ ఆర్డీ విజయలక్ష్మి తెలిపారు. శనివారం అనంతపురం నగరపాలక సంస్థలో పాటు మిగితా మునిసిపాలిటీల్లో ఇంటి పన్ను చెల్లింపులు పెరిగాయన్నారు. ఈ నెల 14 వరకు పెద్ద నోట్లతో చెల్లించవచ్చునని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. -
ఇంటి పన్నులు తగ్గించాలని జమ్మికుంట బంద్
ఇంటి పన్నులు 50 శాతం మేర తగ్గించాలని డిమాండం చేస్తూ అభిలపక్షాల పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచి దుకాణాలు, వ్యాపారసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు కూడా తిరగలేదు. అఖిలపక్షాల నేతలు బంద్‌ను పర్యవేక్షిస్తున్నారు. -
ఏపీలో ఇంటి పన్ను రెట్టింపు..!
-
ఆస్తి పన్ను రూ.1200 కాదు..రూ.101 మాత్రమే
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నూతన సంవత్సరం కానుకగా వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిలోని నివాస గృహాల యజమానులకు తీపి కబురు అందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1,200, ఆలోపు వార్షిక ఆస్తి పన్ను చెల్లిస్తున్న పేద, మధ్య తరగతి నివాస గృహాల యజమానుల నుంచి ఇకపై రూ.101 మాత్రమే కడితే సరిపోతుంది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జీహెచ్ఎంసీలో చట్టాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు గ్రేటర్ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ వాసులపై వరాల జల్లు కురిపిస్తోంది. అలాగే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ గడువును మరో నెల రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది. మరోవైపు త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా 9వేల కానిస్టేబుళ్ల భర్తీకి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. -
ఆస్తిపన్నులో 'గ్రేటర్' కట్!
హైదరాబాద్ : జీహెచ్ఎంసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. పదిరోజుల్లోగా పనులు మొదలుపెట్టి నెలలోపు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు, మధ్య తరగతి వారికి ఆస్తిపన్ను తగ్గించే ప్రతిపాదనకు కేసీఆర్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. రూ.1200లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్నవారికి రూ.101 వసూలు చేసే ప్రతిపాదన సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై విధివిధానాలు ఖరారు చేయాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ విధానం అమలు అయితే సుమారు 5 లక్షల మంది లబ్ది పొందనున్నారు. కాగా త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ లబ్ది పొందేందుకు గ్రేటర్ వాసులకు వరాల జల్లు కురిపిస్తోంది. -
పల్లె ప్రజలపై ‘వీధి’ పోటు
* పంచాయతీల్లో ప్రజల నుంచి వసూలుకు ప్రభుత్వ నిర్ణయం * ఇంటి పన్నుతో కలిపి రాబట్టాలని ప్రతిపాదనలు * పంచాయతీరాజ్ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం * ఈ ఏడాది వసూలు లక్ష్యం... 78కోట్లు * బిల్లు నిర్ణయం ఇలా... ఇంటి విస్తీర్ణం, పంచాయతీ స్థాయిలను బట్టి * ఇప్పటివరకు బకాయిలు 800 కోట్లు సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లోని ప్రజలపై మరో విద్యుత్ భారం పడనుంది. గ్రామ పంచాయతీల్లోని వీధి దీపాల విద్యుత్ చార్జీలను ప్రజల నుంచే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి పన్నుతో కలిపి వీధి దీపాల విద్యుత్ పన్నును కూడా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ సూచన మేరకు పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీల్లో ఆదాయ వనరుల సమీకరణపై జరిగిన సమీక్షలో వీధి విద్యుత్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి గ్రామ పంచాయతీలు వీధి దీపాల కరెంట్ బిల్లును గ్రామస్తుల నుంచి వసూలు చేయనున్నారు. ఇంటి విస్తీర్ణం, పంచాయతీ స్థాయిలను బట్టి ఒక్కో ఇంటికి ఎంత బిల్లు చెల్లించాలనేది నిర్ణయిస్తారు. దీనిని ఇంటి పన్నులోనే కలుపుతారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి వీధి దీపాల చార్జీల పన్ను రూపేణా ఈ ఏడాది దాదాపు రూ. 78 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఏం జరుగుతోంది.. చిన్న పంచాయతీల్లోని వీధి దీపాలకు, మంచినీటి పథకాల నిర్వహణ కోసం వినియోగించే కరెంట్‌కు ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయిస్తూ 1987లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 44ను జారీ చేసింది. పెద్ద పంచాయతీల్లో వీధి దీపాల కరెంట్ చార్జీలను చాలా ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తోంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి గ్రామాలకు విడుదల చేయాల్సిన నిధులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ శాఖకు చెల్లిస్తూ పంచాయతీలపై కరెంట్ బిల్లుల భారం లేకుండా చేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తిరిగి బాధ్యతలు చేపట్టాక.. విద్యుత్ శాఖ 1987 జీవోకు భిన్నంగా మైనర్ పంచాయతీలలో వీధి దీపాల కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. దాదాపు రూ. 612 కోట్లు బకాయిగా పేర్కొంది. దీంతోపాటు పెద్ద పంచాయతీల విద్యుత్ బిల్లు బకాయిలను కలిపి దాదాపు రూ. 800 కోట్లు వసూలుకు ఆయా గ్రామ పంచాయతీలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో మంచినీటి పథకాలకు విద్యుత్ శాఖ సరఫరా నిలిపివేసింది. ఈ వివాదం నేపథ్యంలో పాత బకాయిల వసూలుకు పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల మధ్య చర్చలు నడుస్తుండగానే.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి గ్రామ పంచాయతీ వీధి దీపాలకు వినియోగించే కరెంట్ బిల్లులను తప్పనిసరిగా చెల్లించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత నాలుగు నెలలుగా పంచాయతీ సర్పంచ్‌లు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులను మళ్లించి వీధి దీపాల చార్జీల కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. -
20 ఏళ్లుగా నిద్రపోతున్నారా ?
సంతనూతలపాడు: ‘కాలనీలో 20 ఏళ్ల నుంచి 50 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. క్రమం తప్పకుండా గతంలో పంచాయతీకి..ఇప్పుడు కార్పొరేషన్‌కు ఇంటి పన్నులు, నీటి పన్నులు కడుతున్నారు. ఇప్పటికిప్పుడు కాలనీని ఖాళీ చేయమని అధికారులు నోటీసులు ఇవ్వడం ఏంటి. ఇన్నేళ్లుగా నిద్రపోతున్నారా..కాలనీకి వైఎస్సార్ పేరు బదులు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే ఓకేనా’ అని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పేర్నమిట్ట పంచాయతీ పరిధిలో..ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వైఎస్సార్ కాలనీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాల వారు 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. కాలనీలోని స్థలాలు ఎన్ఎస్పీ కాలువకు చెందినవని..డిసెంబర్ 1వ తేదీనాటికి ఖాళీ చేయకుంటే ఇళ్లను కూల్చేస్తామని ఎన్ఎస్పీ అధికారులు నోటీసులిచ్చారు. అయితే ఆ నోటీసుల్లో ఎక్కడా సర్వే నంబర్లను పేర్కొనలేదు. ఇదే కాలనీలో పలు రైస్ మిల్లులు, కార్పొరేట్ స్కూళ్లు ఉంటే వాటికి నోటీసులు ఇవ్వకుండా కేవలం వైఎస్సార్ కాలనీలోని ఇళ్ల వారికే పంపడం గమనార్హం. ఈ క్రమంలో కాలనీవాసులు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బుధవారం కాలనీని సందర్శించారు. కాలనీలోని గృహాలను, వాటి డోర్ నంబర్లు, కరెంటు మీటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల నుంచి ఓ పక్క ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లించుకుంటూ ఇప్పుడు అవి ఎన్ఎస్పీ కాలువ స్థలాలన్న సాకు చూపి అధికారులు వారిని వీధులపాలు చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మెప్పుకోసమే ఈ పనిచేస్తున్నారా అని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి కాలనీవాసుల తరఫున న్యాయపోరాటం చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. పేర్నమిట్ట మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు రావూరి లింగారెడ్డి మాట్లాడుతూ ‘అసలిక్కడ కాలువ ఉందా..అధికారం చేతిలో ఉందికదా అని అధికారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని అవసరమైతే గాలిలో కూడా మేడలు కట్టాం అంటారు. అసలు కాలనీకి వైఎస్సార్ పేరు పెట్టడం వల్లే కదా ఇదంతా..ఎన్టీఆర్ పేరు పెడితే అధికారుల కళ్లు చల్లబడతాయా..’ అని అన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు ఓబుల్‌రెడ్డి, కండే రమణాయాదవ్, ఈశ్వరరావు, ఎమ్ ఆంజనేయులు, టీ గోపి, కృష్ణారెడ్డి, చిరంజీవి తదితరులున్నారు.