ఆస్తి పన్ను రూ.1200 కాదు..రూ.101 మాత్రమే
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నూతన సంవత్సరం కానుకగా వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని నివాస గృహాల యజమానులకు తీపి కబురు అందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1,200, ఆలోపు వార్షిక ఆస్తి పన్ను చెల్లిస్తున్న పేద, మధ్య తరగతి నివాస గృహాల యజమానుల నుంచి ఇకపై రూ.101 మాత్రమే కడితే సరిపోతుంది.
ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జీహెచ్ఎంసీలో చట్టాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ సర్కారు గ్రేటర్ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ వాసులపై వరాల జల్లు కురిపిస్తోంది. అలాగే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ గడువును మరో నెల రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది.
మరోవైపు త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా 9వేల కానిస్టేబుళ్ల భర్తీకి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది.