- పంచాయతీల్లో ఇంటి పన్నుల బాదుడు
- రెట్టింపు పెంపునకు కసరత్తు
- ముమ్మరంగా సాగుతున్న ఇంటి కొలతల ప్రక్రియ
- రూ.113 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పెరగనున్న పన్నుల డిమాండ్
పల్లె ప్రజలపై పన్ను పోటు
Published Fri, Dec 23 2016 11:52 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
ప్రగతికి పట్టుగొమ్మలైన పల్లెపై పన్ను పోటు పడనుంది. పంచాయతీలకు ఆదాయం పేరుతో ప్రజలపై భారం వేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా వచ్చే నిధుల్లో ఓవైపు కోత కోస్తూ ఇంకోవైపు అదనపు భారం మోపుతూ గ్రామ పాలనను గందరగోళం చేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. కొత్త సంవత్సరం పన్నుల మోతతో శ్రీకారం చుట్టడానికి జిల్లా యంత్రాంగం సిద్ధపడుతోంది.
అమలాపురం టౌన్ :
గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల పెంపుతో గ్రామీణ ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో పన్నుల ప్రక్రియను ఆ¯ŒSలై¯ŒSలో అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇంతకాలం మాన్యువల్‌గా జరిగిన ఈ ప్రక్రియను పూర్తిగా అ¯ŒSలై¯ŒS చేసి పంచాయతీల్లో పన్నుల వసూళ్లపరంగా ఆదాయాన్ని మరింత పారదర్శకంగా పెంచుకుంటూనే పన్నుల పెంపునకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు అయిదేళ్లకోసారి జరిగే ఇంటి పన్నుల రివిజ¯ŒSను వేదికగా చేసుకొని చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పన్నుల డిమాండ్‌ను రెట్టింపు చేస్తూ కొలతలు...గణాంకాలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాలోని 1069 పంచాయతీల్లో ఇంటి పన్నుల రివిజ¯ŒSకు సంబంధించి ఇళ్ల కొలతలు...లెక్కలు ప్రస్తుతం గ్రామాల్లో ముమ్మరంగా జరగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పంచాయతీల్లో ఇంటి పన్నుల డిమాండ్ రూ.113 కోట్లు వరకూ ఉండగా దాన్ని తాజా రివిజ¯ŒS ద్వారా రూ.200 కోట్లకు పైగా ఆదాయాన్ని పన్నుల వసూళ్ల ద్వారా పెంచే ప్రయత్నం జరుగుతోంది.
రిజిస్టర్ వేల్యూ... రేట్ ఆఫ్ టాక్స్‌తో పెంపుదల
గతంలో ఆయా పంచాయతీ పాలక వర్గాలు నిర్ణయించే పంచాయతీ రేట్ ఆఫ్ టాక్స్ ద్వారా ప్రతి ఏటా అయిదు శాతాన్ని పెంచుతూ అయిదేళ్లకు 27 శాతం వరకూ పెంచేవారు. ఇప్పుడు రేట్ ఆఫ్ టాక్స్‌తోపాటు కొత్తగా ఆ భవనానికి సంబంధించి రిజస్ట్రేష¯ŒS కార్యాలయంలో దాని విలువకు చెందిన సమాచారంతో పన్నుల పెంచేలా నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఇందుకోసం తొలుత పంచాయతీలకు రేట్ ఆఫ్ టాక్స్‌ను అడుగు విస్తీర్ణానికి కనీస స్థాయి 13 పైసలుగా నిర్ధారించారు. అక్కడ నుంచి ఆయా పంచాయతీల స్థానిక విలువ ఆధారంగా 13 పైసలకు మించి పెంచుకునే అధికారం పంచాయతీల పాలక వర్గాలకు ఇచ్చారు. ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేష¯ŒS కార్యాలయాల వెబ్‌సైటుల్లో ఆ ఇంటి యజమాని ఆధార్ నెంబరు, డోర్ నెంబరు..సర్వే నెంబరు ఇలా సమస్త సమాచారం ఆ¯ŒSలై¯ŒS అయి ఉండటంతో పంచాయతీ ఇంటి పన్ను పెంపునకు రిజిస్ట్రేష¯ŒS వేల్యూను కూడా ఆధారంగా చేసుకుంటున్నారు. దీనివల్ల పన్నుల రివిజ¯ŒS సమయంలో సిబ్బంది ప్రలోభాలు, అక్రమాలకు పాల్పడకుండా అడ్డుకుట్ట వేసినట్లయింది. ఆ¯ŒSలై¯ŒS అనుసంధానం, పన్నుల పెంపునకు తొలి కసరత్తుగా జిల్లాలోని ఇళ్లకు కొలతలు కొలిచి చదరపు అడుగులు నిర్థారించే బాధ్యతను ప్రభుత్వం ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఇదే సంస్థ ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో కొలతలు పూర్తి చేసింది. ఆ సంస్థకు చెందిన సిబ్బంది జిల్లాలోని 1069 పంచాయతీల్లో ప్రస్తుతం బృందాలుగా ఏర్పడి ఇంటి కొలతలను లెక్కగడుతున్నారు. ఆ¯ŒSలై¯ŒS అయిన తర్వాత ఇంటి యజమాని సెల్ ఫో¯ŒSకు తమ ఇంటికి పన్ను ఎంత పెరిగిందీ?ఎంత చెల్లించాలి అనే సమాచారం మెసేజ్ ద్వారా రానుంది. పన్నులు కూడా ఆ¯ŒSలై¯ŒS ద్వారా చెల్లించుకునే వెసులబాటు కూడా అందుబాటులోకి వస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2017 ఏప్రిల్ నుంచి పెంపు పన్నులు, ఆ¯ŒSలై¯ŒS విధానం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.
Advertisement