పెన్షనర్లను మోసగాళ్లు కొత్త స్కామ్‌తో బురిడీకొట్టిస్తున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (CPAO) అధికారులమని చెప్పుకుంటూ పెన్షనర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ మోసగాళ్లు ఫేక్ వాట్సాప్ సందేశాలు పంపి తప్పుడు ఫారమ్‌లను నింపమని కోరుతున్నారు. పాటించకపోతే వారి పెన్షన్ చెల్లింపులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు.
వార్తా నివేదికల ప్రకారం.. బ్యాంకు ఖాతా వివరాలు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్‌ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా మోసగాళ్లు ఈ స్కామ్ చేస్తున్నారు. ఈ సమాచారంతో వారు పెన్షనర్ల వివరాలను దొంగిలించి ఆర్థిక మోసానికి పాల్పడవచ్చు. ఈ నేపథ్యంలో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
సీపీఏఓ పేరుతో ఏదైనా సందేశం వస్తే దాని ప్రామాణికతను పరిశీలించుకోవాలి. అధికారిక ఏజెన్సీలు వాట్సాప్ లేదా ఇతర అనధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యక్తిగత వివరాలను అడగవు. మీ పీపీఓ నంబర్, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు. అనుమానం వస్తే సీపీఏఓ లేదా బ్యాంక్ వారిని అధికారిక సంప్రదింపు వివరాలను ఉపయోగించి సంప్రదించండి.
Comments
Please login to add a commentAdd a comment