దేశంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ఆధారిత మోసాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు 6,32,000 ఫిర్యాదులు నమోదు కాగా.. ఏకంగా రూ.485 కోట్లు వినియోగదారులు నష్టపోయారు.2022-23 నుంచి చూస్తే మొత్తం 27 లక్షల మంది రూ.2,145 కోట్లు నష్టపోయారు.
ఇటీవలి కాలంలో యూపీఐ వినియోగం భారీగా పెరగడం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఒక్క అక్టోబరు నెలలోనే.. 2016లో యూపీఐ వ్యవస్థ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు జరగనన్ని లావాదేవీలు జరిగాయి. రోజుకు 53.5 కోట్ల చొప్పున నెలలో మొత్తం 16.58 బిలియన్ల లావాదేవీలు జరగ్గా వాటి విలువ రూ.23.5 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment