దేశ విదేశాలకు ఇటీవల హాలిడే ట్రిప్‌లకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిలో యువత, టీనేజర్లే అధికంగా ఉంటున్నారు. అయితే ఇలా హాలిడే ట్రిప్‌లకు వెళ్లేవారు ట్రావెల్ బుకింగ్ స్కామ్‌లకు గురవుతున్నారు. ఇలాంటి ట్రావెల్ స్కామ్‌లను అరికట్టడానికి ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్స్‌తో చేతులు కలిపింది.
మార్కెట్ రీసెర్చ్ సంస్థ యుగోవ్ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. ఇందులో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌కు చెందిన మిలీనియల్స్ (1980, 90లలో పుట్టినవారు), జెన్ జెడ్ (1995-2010 మధ్య జన్మించినవారు) టీనేజర్లు ఎక్కువగా ప్రయాణ స్కామ్‌ల బారిన పడుతున్నారు. బాధితులు సగటున రూ.1,02,233 నష్టపోతున్నారు. డబ్బు ఆదా అవుతుందంటే చాలు దాదాపు సగం మంది భారతీయ ప్రయాణికులు హాలిడే బుక్ చేసుకునేటప్పుడు అప్రమత్తతను పట్టించుకోవటం లేదని ఈ అధ్యయనం పేర్కొంది. 40 శాతం మందికిపైగా పరిమిత సమాచారంతోనే బుకింగ్ చేస్తుండటం వల్ల నష్టపోతున్నారని వెల్లడించింది.
ఈ అధ్యయనానికి అనుగుణంగా వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ తమ కస్టమర్ ఇన్ఫర్మేషన్, బుకింగ్‌ల రక్షణ కోసం అనేక చర్యలను అమలు చేసింది. స్కామ్‌లు, ఆన్-ప్లాట్‌ఫారమ్ మెసేజింగ్ అరికట్టడానికి గెస్ట్ పేమెంట్ పేమెంట్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక బృందాలు, వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీటిలో భాగంగా చెక్-ఇన్ తర్వాత 24 గంటల వరకు పేమెంట్‌ను నిలిపివేయడం ద్వారా యూజర్లకు అదనపు భద్రతను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment