
‘అది ఒక నందన వనము, దేవతలు విహరించే స్వర్గ ధామము’ అని వర్ణించినా ఆ వనం అందాలు తక్కువ చేసినట్లే. రంగురంగుల పూలు, ఆకులతో ఇంద్ర ధనుస్సును నేలపై పరిచినట్లుగా కనిపించే ఆ వనం ప్రకతి సిద్ధమైనది కాదు. మానవ నిర్మితమైనది. కేవలం ఇద్దరు భార్యా భర్తలు కలిసి ఆ వనాన్ని తీర్చి దిద్దిన తీరు అమోగం. అద్భుతం. ఇది మనం చెబుతున్న మాటలు కాదు. ఇప్పటి వరకు 48 దేశాల నుంచి వచ్చి సందర్శించిన దాదాపు 14 వేల మంది చెప్పిన అభిప్రాయాలు.
ఇంగ్లాండ్‌కు చెందిన వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని వాల్‌సల్ పట్టణంలో ఈ వనం ఉంది. నీ దంపతులు తమ ఇంటి వెనక పెరట్లో ఈ వనాన్ని అభివృద్ధి చేశారు. టోనీ దంపతులు తమ ఇంటి వెనక పెరట్లో ఈ వనాన్ని అభివద్ధి చేశారు. ఆ వనానికి ఇంత వన్నెలొచ్చాయంటే మేరీ, టోని న్యూటన్ అనే ఇద్దరు దంపతులు చేసిన కృషే.. ఒకటి, రెండు ఏళ్లు కాదు, వారు 37 సంవత్సరాలు కషి చేస్తే ఈ వనం తయారయింది. ఇందులో అన్నీ 35 ఏళ్లున్న చెట్ల గుబుర్లే. ఆ భార్యా భర్తలిద్దరు 1982లో ఈ వనాన్ని పెంచడం మొదలు పెట్టగా ఇటీవల పూర్తయింది. అప్పుడు 40 ఏళ్లున్న వాళ్లకు ఇప్పుడు 71 ఏళ్లు. ఇద్దరిది ఒకే వయస్సు ఆ రంగుల వనంలో నివసిస్తున్నందున తాము ఇప్పటికీ ఆయురారోగ్యాలతో ఉన్నామని వారు చెబుతున్నారు.
వాని వనంలో వివిధ దేశాల నుంచి తెచ్చిన మొక్కలు ఉన్నాయి. 450 రకాల అజాలీస్ (ముదురు రంగుల పూల మొక్కలు. ఎప్పుడూ చిన్నగానే ఉంటాయి), 120 జపనీస్ మాపుల్స్ (వివిధ రంగుల్లో చీలినట్లు హస్తం లాగా ఆకులు కలిగిన జపనీస్ జాతి మొక్కలు), 15 జూనిపర్ బ్లూస్టార్ (నీలి రంగు పూలు కలిగిన గుబురు చెట్లు) ఉన్నట్లు దంపతులు వివరించారు. ఈ వనానికి మరో విశేషం ఉంది. అన్ని రుతువుల్లో ఈ వనం ఇలాగే కనిపిస్తుందట. ఓ చెట్టు ఒక రంగు ఆకులు లేదా పూలు సీజన్‌లో రాలిపోతే మరో జాతి మొక్కకు అదే రంగు పూలు లేదా ఆకులు మొలవడం వల్ల అలా కనిపిస్తుందట. అయితే ఈ విషయం తెలిసిన బ్రిటన్ రాణి టోనీ దంపతులను పిలిచి సముచితంగా సత్కరించినట్లు తెలిసింది. ఈ వనం అభివద్ధికి మరీ ఎక్కువ కాకుండా 15 వేల పౌండ్లు (దాదాపు 14 లక్షల రూపాయలు) ఖర్చు అయ్యాయట.



Comments
Please login to add a commentAdd a comment