
All About Kisan Vikas Patra Saving Scheme: పోస్టాఫీస్‌కు చెందిన సేవింగ్ స్కీమ్‌లలో కిసాన్ వికాస్ పత్ర పథకం ఒకటి. ఈ సేవింగ్ స్కీమ్‌లో మీ సొమ్మును మదుపుచేశారంటే (బ్యాంకు కంటే) 124 నెలల్లో అది రెట్టింపవుతుంది. అంతేకాకుండా మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంకులు దివాలా తీస్తే కేవలం 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. ఐతే పోస్టాఫీసులో అలా కాదు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం..
వడ్డీ రేటు
పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకం 6.9 శాతం వడ్డీ అందిస్తుంది. ప్రతీ యేటా వడ్డీని కలుపుతారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ వడ్డీ వర్తిస్తుంది.
ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు
ఈ పోస్టాఫీసు పథకంలో కనీసం రూ. 1000లతో ఖాతా తెరవాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అంటే రూ.1000ల నుంచి ఎంతైన మదుపు చేయవచ్చు.
ఖాతా తెరవడానికి ఎవరు అర్హులు?
కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించిన అకౌంట్‌లో ముగ్గురు సభ్యులవరకు జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. పదేళ్ల వయసున్న మైనర్లు కూడా తమ పేరు మీద నేరుగా ఖాతా తెరవొచ్చు.
మెచ్యురిటీ పీరియడ్
సమర్పించిన తేదీ నుండి 124 నెలలు (10 సంవత్సరాల 4 నెలలు) ఉంటుంది.
ఖాతా బదిలీ చేసే సందర్భాలు
►ఈ పథకం కింది సందర్భాలలో మాత్రమే వ్యక్తి నుండి వ్యక్తికి ఖాతా బదిలీ చేస్తుంది..
►ఖాతాదారు మరణిస్తే, నామినీ లేదా చట్టపరమైన వారసుడికి ఖాతా బదిలీ చేయబడుతుంది.
►ఖాతాదారుడు మరణిస్తే, ఖాతాను జాయింట్ హోల్డర్‌కు బదిలీ చేయవచ్చు.
►కోర్టు ఆదేశాల మేరకు ఖాతా బదిలీ చేయవచ్చు.
►అంతేకాకుండా ఖాతాను ఏదైనా అధికారి వద్ద తనఖా పెట్టవచ్చు.
చదవండి: ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో..