Saving schemes
-
జగనన్న ఇళ్లలో విద్యుత్ పొదుపు పథకం భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘నవరత్నాలు’లో భాగంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో విద్యుత్ ఆదా చర్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. భారీ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు విద్యుత్ పొదుపు చేయగల ఉపకరణాలను అందించే ప్రాజెక్టును చేపట్టడాన్ని ఢిల్లీలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయంలో ఎనర్జీ హెడ్ ఆఫ్ కో ఆపరేషన్ అండ్ కౌన్సెలర్ డాక్టర్ జోనాథన్ డెమెంగే ప్రశంసించారు. దక్షిణ భారతదేశంలో చేపడుతున్న ఇంధన సామర్థ్య కార్యక్రమాలను డెమెంగేకు ఈఈఎస్ఎల్ సీనియర్ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం వివరించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడంతో పాటు విద్యుత్ పొదుపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్విసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)’తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలను అందించే ప్రయత్నాన్ని డెమెంగే ఈ సందర్భంగా కొనియాడారు. ప్రతి లబ్ధిదారునికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను అందజేయడం వల్ల, ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని చంద్రశేఖరరెడ్డి ఆయనకు తెలిపారు. ఫలితంగా ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లలో ఏటా రూ.352 కోట్ల మిగులుతాయన్నారు. విద్యుత్ పొదుపుతో పాటు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపుపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని డెమెంగే సూచించారు. గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ పథకంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్లను డెమెంగే అభినందించారు. ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని డెమెంగే కోరారు. ఇంధన సామర్థ్య గృహ నిర్మాణ పథకాల వల్ల సామాన్య ప్రజలతో పాటు పర్యావరణానికీ లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం మార్గనిర్దేశం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. -
పన్ను శూన్యం.. ఆదాయం అదనం
ఆదాయపన్ను ఆదాచేసే పెట్టుబడి సాధనాలకు మంచి డిమాండ్ ఉంది. మధ్యాదాయ వర్గాల వారికి పాత పన్ను విధానమే మెరుగైనది. అందులో పన్ను ఆదా, మినహాయింపునిచ్చే సెక్షన్లు చాలానే ఉన్నాయి. పన్ను ఆదా కోసం ఈ తరహా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారు చాలా మంది ఉన్నారు. ఆర్థిక సంవత్సరం చివర్లో కాకుండా ఆరంభం నుంచే ఈ సాధనాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడం వల్ల చివర్లో ఏకమొత్తంలో సమకూర్చుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అయితే, పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు లాభ, నష్టాల గురించి పూర్తిగా విచారించుకోవాలి. లాక్ ఇన్ పీరియడ్‌ను చూడాలి. రాబడిని చూడాలి. రిస్క్‌ను అర్థం చేసుకోవాలి. పన్ను బాధ్యత ఏ మేరకు అన్నది పరిశీలించాలి. ముందస్తు ఉపసంహరణలకు అవకాశం ఉందా? లేదా? తెలుసుకోవాలి. చాలా మంది పెట్టుబడిపై పన్ను ఆదానే చూస్తుంటారు. కానీ రాబడిపై పన్ను బాధ్యత గురించి తెలుసుకోరు. ముఖ్యంగా రిస్క్‌లేని సంప్రదాయ డెట్ సాధనాల్లో రాబడి 6–8 శాతం మించదు. కానీ, దీనిపై పన్ను చెల్లించాల్సి వస్తే.. ఇక మిగిలేది ఏముంటుంది? కనుక పెట్టుబడిపై పన్ను ఆదాయే కాదు, రాబడిపైనా పన్ను లేని సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదనపు రాబడిని సంపాదించుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సాధనాల గురించి తెలియజేసే కథనమే ఇది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసే వారు పాత, కొత్త విధానాల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే కొత్త విధానంలో పన్ను ఆదా ప్రయోజనాలు పెద్దగా లేవు. స్టాండర్డ్ డిడక్షన్, ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ ఖాతాకు చేసే జమపైనే పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. పాత విధానంలో అయితే సెక్షన్ 80సీ, 80డీ సహా ఎన్నో సెక్షన్లు పన్ను భారాన్ని తగ్గిస్తున్నాయి. కనుక పాత, కొత్త విధానాల్లో ఒక దానిని ఎంపిక చేసుకునే ముందు తమ ఆదాయం, పెట్టుబడులు తదితర అంశాలన్నీ విశ్లేషించుకున్న తర్వాత ఎంపిక చేసుకోవాలి. పాత విధానంలో అయితే, ఇక్కడ చర్చించే సాధనాలు రిస్క్‌లేని రాబడిని, పన్ను లేని రాబడినిస్తాయి. కనుక ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అన్నది ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోతగిన సాధనం. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మొత్తంపైనా ఎలాంటి పన్ను లేదు. అంతేకాదు ఈ సాధనానికి మూడు రకాల పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఇందులో పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిపైనా పన్ను కట్టక్కర్లేదు. చివర్లో గడువు తీరిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను లేదు. భద్రత దృష్ట్యా చూస్తే.. సార్వభౌమ గ్యారంటీతో కూడిన పథకం ఇది. ప్రస్తుతం 7.1 శాతం వార్షిక రాబడి ఈ పథకంలో ఉంది. పీపీఎఫ్ అకౌంట్ కాల వ్యవధి 15 ఏళ్లు. లాకిన్ పీరియడ్ కూడా ఇంతే ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి మొదలు పెట్టిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల కాలం అమలవుతుంది. ఆరంభం నుంచి కాదు. ఖాతా ప్రారంభించిన ఆరో ఏట నుంచి రుణ సదుపాయం అమల్లో ఉంటుంది. ఖాతా ప్రారంభించిన ఏడో ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. ఇందుకు కొన్ని షరతులు అమలవుతాయి. పోస్టాఫీసు లేదా బ్యాంక్‌లో ప్రారంభించుకోవచ్చు. పోస్ట్ ఆఫీసు అయితే అక్కడ సేవింగ్స్ ఖాతా తెరవాలని షరతు పెడుతున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి, స్వచ్ఛంద భవిష్య నిధి సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్ కిందకు వస్తారు. వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్ ఖాతాకు ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది. పని చేయించుకునే సంస్థ కూడా ఉద్యోగి తరఫున అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. ఉద్యోగులు తన వంతుగా జమ చేసే మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ నిధికి 12 శాతానికి మించి జమ చేసుకోవాలంటే అందుకు వీలు కల్పించేదే స్వచ్చంద భవిష్య నిధి (వీపీఎఫ్). ఈపీఎఫ్ నిబంధనలు వీపీఎఫ్‌కు సైతం వర్తిస్తాయి. ఈపీఎఫ్ వడ్డీ రేటే వీపీఎఫ్ జమలపైనా అమలవుతుంది. ఈపీఎఫ్ పథకాన్ని కేంద్ర సర్కారు నిర్వహిస్తోంది. కనుక నూరు శాతం భద్రత ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీ రేటు అమలు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ పథకం రిటైర్మెంట్ వరకు కొనసాగుతుంది. ముందస్తు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఉన్నత విద్య, వివాహం, వైద్య చికిత్సల కోసం ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన పథకాల మాదిరే ఈపీఎఫ్‌పైనా పన్ను లేదు. కాకపోతే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఉద్యోగి చేసే జమ రూ.2.5 లక్షలు మించినప్పుడు.. అంతకుమించి చేసే జమలపై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించి జమ చేసే వారు 5 శాతం మంది కూడా ఉండరు. వీపీఎఫ్, ఈపీఎఫ్ రెండు కలసి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితిపైనే పన్ను ఆదా పరిమితం. జీవిత బీమా పాలసీలు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కలిగిన సాధనాల్లో జీవిత బీమా సాధనాలు కూడా ఉన్నాయి. టర్మ్ పాలసీలు, ఎండోమెంట్ పాలసీలు, యూనిట్ లింక్డ్ పాలసీల (యులిప్‌లు)కు ఏటా చెల్లించే ప్రీమియం మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. జీవిత బీమాను పెట్టుబడి కోణంలో చూడొద్దు. కుటుంబానికి రక్షణ సాధనంగానే చూడాలి. అలా చూసినప్పుడు అసలైన బీమా ప్లాన్ అంటే టర్మ్ ప్లాన్ అనే చెప్పుకోవాలి. తక్కువ ప్రీమియంకే ఎక్కువ రక్షణ కవరేజీ లభిస్తుంది. పాలసీదారుడికి ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థిక ఇబ్బుందుల పాలు కాకుండా ఉంటుంది. గడువు తీరే వరకు జీవించి ఉంటే చివర్లో ఏమీ తిరిగి రాదు. అందుకే చాలా మంది దీని పట్ల విముఖత చూపిస్తుంటారు. దీనికి బదులు చివర్లో ఎంతో కొంత చెల్లింపులు చేసే ఎండోమెంట్ ప్లాన్ల వైపు వెళుతుంటారు. సంప్రదాయ పాలసీల్లో 20 ఏళ్లకు మించి కాలంపై రాబడి 4–6 శాతం మించదని గుర్తుంచుకోవాలి. యులిప్ ప్లాన్లు బీమా రక్షణ, పెట్టుబడితో కూడినవి. వీటిల్లోనూ ప్రీమియం అధికంగానే ఉంటుంది. యులిప్ ప్లాన్లలో పెట్టుబడులను ఈక్విటీ లేదా డెట్, లేదా ఈక్విటీ డెట్ కలసినవి ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి ఎలాంటి చార్జీల్లేకుండా మార్చుకోవచ్చు. గడువు తీరిన తర్వాత చివర్లో వచ్చే మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించకుండా చూసుకుంటే మెచ్యూరిటీపై పన్ను పడదు. యులిప్‌లలో ఉన్న మరో ప్రతికూలత ఇవి చాలా తక్కువ టర్మ్‌తో వస్తుంటాయి. యులిప్ ప్లాన్లలోనూ రాబడులకు హామీ ఉండదు. అంచనా రాబడినే బీమా సంస్థలు వెల్లడిస్తాయి. ఇక సంప్రదాయ బీమా పాలసీలు (జీవించి ఉంటే మెచ్యూరిటీ చెల్లించేది) తీసుకునే వారు వార్షిక ప్రీమియం రూ.5 లక్షలు మించకుండా చూసుకోవాలి. అప్పుడే చివర్లో చేతికొచ్చే మొత్తం పన్ను రహితం. ఈ నిబంధన 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాలు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాలలో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది. పైన చెప్పుకున్న వాటికి ఇది భిన్నం. సెక్షన్ 80సీ కింద గరిష్టంగా ఈ పథకాల్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకాలు పూర్తిగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక రిస్క్ ఉంటుంది. రాబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. రాబడులపై హామీ ఉండదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లాభ, నష్టాలు ఏవైనా రావచ్చు. కాకపోతే ఈక్విటీల్లో ఐదేళ్లకు మించిన కాలానికి నికరంగా రాబడులే వస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. పన్ను ఆదా సాధనాల్లో తక్కువ లాకిన్ ఉన్నది ఇదే. ఈఎల్ఎస్ఎస్ నుంచి మూడేళ్లు నిండకుండా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. మూడేళ్ల లాకిన్ పీరియడ్‌లో ఈ పథకం నుంచి ఆదాయం రావాలని కోరుకుంటే, గ్రోత్ ఆప్షన్‌కు బదులు డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. దాంతో ఫండ్ డివిడెండ్ ప్రకటించిన ప్రతీ సందర్భంలోనూ ఇన్వెస్టర్‌కు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కాకపోతే డివిడెండ్ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి, పన్ను వర్తించే ఆదాయం ఉన్నప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏడాదికి మించిన కాలంపై వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఈఎల్ఎస్ఎస్ పథకాలు మూడేళ్ల లాకిన్‌తో ఉంటాయి కనుక.. ఇందులో వచ్చే రాబడులు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.లక్ష వరకు ఉంటే ఎలాంటి పన్ను లేదు. ఈ పరిమితికి మించిన లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాలి. అందుకే ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో గ్రోత్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకుని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలి. మూడేళ్లు నిండిన తర్వాత నుంచి ఏటా రూ.లక్ష లాభం మించకుండా ఉపసంహరించుకుని, తిరిగి ఆ మొత్తాన్ని మరొక ఈఎల్ఎస్ఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల లాభంపై పన్ను పడదు. దీర్ఘకాలంలో మంచి నిధి జమవుతుంది. సుకన్య సమృద్ధి యోజన భేటీ బచావో భేటీ పడావో అనే పథకం కింద సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర సర్కారు తీసుకొచ్చింది. కుమార్తెలకు సంబంధించిన డిపాజిట్ పథకం ఇది. ఆడ పిల్ల విద్య లేదా వివాహం అవసరాల కోసం తల్లిదండ్రులు ఆమె పేరిట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కరు ఇద్దరు కుమార్తెల పేరిటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఇద్దరికి మించి కుమార్తెలు ఉంటే, వారి పేరిట ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం ఉండదు. పీపీఎఫ్ మాదిరే ఇందులోనూ పెట్టుబడిపై పన్ను లేదు. రాబడి, చివరిలో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. పన్ను లేని, మెరుగైన రాబడితో కూడిన డెట్ సాధనం ఇది. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో వస్తుంది కనుక భద్రత పరంగా సందేహం అక్కర్లేదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేటు 8 శాతం. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే ఇందులోనే రాబడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడులకు 21 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ముందస్తు ఉపసంహరణలను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తారు. కుమార్తెల వయసు 10 ఏళ్లు మించకుండా ఉంటే, వారిపైనే ఈ పథకం కింద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తె వయసు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రి లేదా సంరక్షకుడు ఖాతాను నిర్వహించొచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ ఖాతా తెరుచుకోవచ్చు. -
సీఎం చిత్ర పటాలకు క్షీరాభిషేకం
సాక్షి నెట్వర్క్ : వైఎస్సార్ సున్నా వడ్డీ పంపిణీ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం కర్నూలు నగరంలోని స్థానిక కేవీఆర్ గార్డెన్స్‌లోని సచివాలయంలో పొదుపు సంఘాల మహిళలు సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గంలోని నందనపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం ఐకేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి చెక్కులు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి గోకరాజు రామరాజు ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు చెక్కులు పంపిణీ చేశారు. -
అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది!
All About Kisan Vikas Patra Saving Scheme: పోస్టాఫీస్‌కు చెందిన సేవింగ్ స్కీమ్‌లలో కిసాన్ వికాస్ పత్ర పథకం ఒకటి. ఈ సేవింగ్ స్కీమ్‌లో మీ సొమ్మును మదుపుచేశారంటే (బ్యాంకు కంటే) 124 నెలల్లో అది రెట్టింపవుతుంది. అంతేకాకుండా మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంకులు దివాలా తీస్తే కేవలం 5 లక్షలు మాత్రమే తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. ఐతే పోస్టాఫీసులో అలా కాదు. ఇక్కడ పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ముకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.. వడ్డీ రేటు పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకం 6.9 శాతం వడ్డీ అందిస్తుంది. ప్రతీ యేటా వడ్డీని కలుపుతారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ వడ్డీ వర్తిస్తుంది. ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు ఈ పోస్టాఫీసు పథకంలో కనీసం రూ. 1000లతో ఖాతా తెరవాలి. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అంటే రూ.1000ల నుంచి ఎంతైన మదుపు చేయవచ్చు. ఖాతా తెరవడానికి ఎవరు అర్హులు? కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించిన అకౌంట్లో ముగ్గురు సభ్యులవరకు జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. పదేళ్ల వయసున్న మైనర్లు కూడా తమ పేరు మీద నేరుగా ఖాతా తెరవొచ్చు. మెచ్యురిటీ పీరియడ్ సమర్పించిన తేదీ నుండి 124 నెలలు (10 సంవత్సరాల 4 నెలలు) ఉంటుంది. ఖాతా బదిలీ చేసే సందర్భాలు ►ఈ పథకం కింది సందర్భాలలో మాత్రమే వ్యక్తి నుండి వ్యక్తికి ఖాతా బదిలీ చేస్తుంది.. ►ఖాతాదారు మరణిస్తే, నామినీ లేదా చట్టపరమైన వారసుడికి ఖాతా బదిలీ చేయబడుతుంది. ►ఖాతాదారుడు మరణిస్తే, ఖాతాను జాయింట్ హోల్డర్‌కు బదిలీ చేయవచ్చు. ►కోర్టు ఆదేశాల మేరకు ఖాతా బదిలీ చేయవచ్చు. ►అంతేకాకుండా ఖాతాను ఏదైనా అధికారి వద్ద తనఖా పెట్టవచ్చు. చదవండి: ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో.. -
మైనర్ల పేరుతో పీఓఎమ్ఐఎస్ ఖాతా తెరవొచ్చు
జూన్-సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పెట్టిన వారు ఏడాదికి 6.6 శాతం వడ్డీ రేటును పొందనున్నారు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం(పీఓఎమ్ఐఎస్) అనేది పొదుపు పథకం. దీనిలో మీరు పెట్టుబడి పెట్టిన నిర్ధిష్ట మొత్తంపై ప్రతి నెలా స్థిర వడ్డీని పొందవచ్చు. మీ దగ్గరలోని పోస్టాఫీసులో పీఓఎమ్ఐఎస్ ఖాతాను తెరవవచ్చు. ఏ భారతీయ నివాసి అయినా పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఖాతా తెరవవచ్చు. అలాగే, ముగ్గురు వయోజనులు ఉమ్మడిగా కూడా ఖాతాను తెరవవచ్చు. మీరు కనుక మీ పిల్లల పేరు మీద కొత్త మొత్తం పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మీ మైనర్ల పేరిట పీఓఎమ్ఐఎస్ ఖాతాను తెరవవచ్చు. డిపాజిట్లు ఈ ఖాతాతెరవడానికి అవసరమైన కనీస మొత్తం ₹1,000, గరిష్టంగా ₹4.5 లక్షలను మాత్రమే సింగిల్ హోల్డర్ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలో పరిమితి ₹9 లక్షలు మించి పెట్టుబడి పెట్టలేరు. ఉమ్మడి ఖాతా హోల్డర్లు సమాన వాటాను ప్రతి నెల పొందుతారు. వడ్డీ రేట్లు ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తరువాత వడ్డీ చెల్లించడం మొదలు అవుతుంది. ఇది మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది. మీరు ప్రతి నెలా చెల్లించే వడ్డీని క్లెయిం చేసుకోనట్లయితే, అటువంటి వడ్డీ ఎలాంటి అదనపు వడ్డీనిపొందలేరు. అంతేగాక, ఫిక్సిడ్ లిమిట్లకు మించి ఎక్కువ డిపాజిట్ చేస్తే రీఫండ్ చేయబడుతుంది. డిపాజిట్ చేయబడ్డ అదనపు మొత్తంపై పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ కు వర్తించే వడ్డీ రేటు వర్తిస్తుంది. మీరు ఆటో క్రెడిట్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతినెల వడ్డీని మీ సేవింగ్స్ ఖాతాలోకి పొందవచ్చు. అయితే ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే ఈ వడ్డీ మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ వర్తించదు. మెచ్యూరిటీ: మీరు పోస్టాఫీసులో ఖాతా తెరిచిన ఐదు సంవత్సరాల తర్వాత ఖాతాను క్లోజ్ చేయవచ్చు. అయితే, ఒకవేళ మీరు పీఓఎమ్ఐఎస్ అకౌంట్ మెచ్యూరిటీకి ముందే మరణించినట్లయితే, దానిని క్లోజ్ చేయవచ్చు. మీరు చేసిన డిపాజిట్ నామినీ లేదా లీగల్ వారసులకు రీఫండ్ చేయబడతాయి. అలాంటప్పుడు, వడ్డీని మునుపటి నెల వరకు మాత్రమే చెల్లిస్తారు. ఖాతా తెరచేటప్పుడు, మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరునైనా నామిని కింద నమోదు చేయాలి, తద్వారా ఒకవేళ మీరు ఖాతా కాలవ్యవధిలో మరణించినట్లయితే, వారు ఈ ప్రయోజనాలను క్లెయిం చేసుకోవచ్చు. డిపాజిట్ తేదీ నుంచి గడువు ముగియడానికి ఒక సంవత్సరం ముందు ఎలాంటి డిపాజిట్ విత్ డ్రా చేయరాదని మీరు గుర్తుంచుకోవాలి. అయితే, ఒక సంవత్సరం తర్వాత, మూడు సంవత్సరాలకు ముందు ముందస్తుగా ఖాతా క్లోజ్ చేసినట్లయితే, ప్రిన్సిపాల్ నుంచి 2 శాతం తగ్గించి మిగిలిన మొత్తం మీకు చెలిస్తారు. ఒకవేళ ఖాతా మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య క్లోజ్ చేసినట్లయితే, ప్రిన్సిపాల్ నుంచి 1 శాతం తగ్గించి మిగిలిన మొత్తం మీ ఖాతాలో జమ చేస్తారు. చదవండి: చిన్న పొదుపు పథకాల ఆదాయంపై పన్ను ఎంతో తెలుసా? -
వృద్దుల కోసం ఉత్తమమైన పొదుపు పథకాలు!
బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో సీనియర్ సిటిజన్స్‌కు అధిక వడ్డీతో హామినిచ్చే కొన్ని పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొంత మొత్తం డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి నెల లేదా ఏడాదికి వడ్డీ రూపంలో నగదు లభిస్తుంది. ఈ వయస్సులో వారికి ఇలాంటి పథకాలు ఆర్థిక చేయూతను ఇస్తాయి. ఎస్బీఐతో సహా కొన్ని అగ్ర బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 6.2 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే, బ్యాంక్‌ల కన్నా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు అధిక వడ్డీని అందిస్తాయి. సీనియర్ సిటిజన్లుకు ఆర్థిక చేయూతను ఇచ్చే కొన్ని పెట్టుబడి పథకాల గురుంచి తెలుసుకుందాం.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్( ఎస్సిఎస్ఎస్ ) అనేది ప్రభుత్వం నడుపుతున్న చిన్న పొదుపు పథకం. దీనిలో చేరిన వారికీ ప్రస్తుతం సంవత్సరానికి 7.40 శాతం అందిస్తుంది. ఎస్సీఎస్ఎస్కు ఐదేళ్ల కాలపరిమితి ఉంది. దీనిని మరో మూడేళ్ల వరకు పొడిగించవచ్చు. అయితే, ఎస్సీఎస్ఎస్లో పెట్టుబడులు పెట్టడానికి గరిష్టపరిమితి రూ.15 లక్షలు. త్రైమాసిక ప్రాతిపదికన అధిక స్థిర రాబడి మరియు సాధారణ ఆదాయం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లకు ఎస్సిఎస్ఎస్ మంచి ఆదాయ వనరు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80 సి కింద ఎస్సీఎస్ఎస్లో పెట్టుబడులు ద్వారా వచ్చిన నగదుపై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హులు. స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డి) పథకం చాలా మంది సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎల్లప్పుడూ ఒక మంచి ఎంపిక. బ్యాంక్ ఎఫ్‌డిలు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక వడ్డీ రేటు చెల్లింపులను అందిస్తాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిపాజిట్లపై 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రత్యేక ఎఫ్‌డిలు 30 జూన్ 2021 వరకు అమలులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 6 శాతం నుంచి 7 శాతంపైన వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తున్నాయి. ప్రధాన్ మంత్రి వయా వందన యోజన(పీఎంవీవీవై) పీఎంవీవీవై(ప్రధాన్ మంత్రి వయా వందన యోజన) అనేది సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) నిర్వహిస్తుంది. పిఎమ్‌వివివై పథకం 2023 మార్చి 31 వరకు పొడిగించబడింది. ప్రస్తుతం, ఈ పథకం కింద పెట్టుబడి పెట్టిన నగదుపై ప్రతి నెలకు సంవత్సరానికి 7.40 శాతం చొప్పున పెన్షన్‌ను అందిస్తోంది. కాల పరిమితి 10 సంవత్సరాలు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఆదాయ పథకం(పీఓఎంఐఎస్) పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్) కింద 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే గడువు కాలం ముగిసే వరకు వడ్డీ రేటు అలాగే ఉంటుంది. ప్రస్తుతం, జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో వడ్డీ రేటు సంవత్సరానికి 6.6 శాతంగా ఉంది. చదవండి: డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు! -
సీనియర్ సిటిజన్ స్కీమ్‌కు పన్ను మినహాయింపు!
న్యూఢిల్లీ: పెద్దల పొదుపు పథకం (సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్) కింద ఆర్జించే వడ్డీ రాబడిపై ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక సూచించింది. దీనివల్ల ద్రవ్యలోటుపై ప్రభావం పరిమితమేనని పేర్కొంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) కింద ఒకరు రూ.15 లక్షలను గరిష్టంగా డిపాజిట్ చేసుకోవచ్చు. కాకపోతే 60 ఏళ్లు, ఆ పైన వయసున్న వారికే ఇందుకు అనుమతి ఉంటుంది. దీనిపై 8.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతీ త్రైమాసికానికి ఓసారి వడ్డీ చెల్లింపు ఉంటుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు, ఆ తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. ఇందులో పెట్టుబడికి రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ఉంది. అయితే, ఈ పథకంలో డిపాజిట్‌పై వచ్చే వడ్డీకి ఆదాయపన్ను మినహాయింపు ప్రస్తుతం లేదు. ఇది ఈ పథకానికి ఉన్న ఒక ప్రతికూలత. ‘‘ఈ పథకంలో పెట్టుబడులపై వచ్చే రాబడికి పూర్తి పన్ను రాయితీ ఇవ్వడం మంచిది. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వం కోల్పోయే ఆదాయం కేవలం రూ.3,092 కోట్లు మాత్రమే. ప్రభుత్వ ద్రవ్యలోటుపై ఇది 2 బేసిస్ పాయింటు మాత్రమే’’ అని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని బ్యాంకులు ఆర్బీఐ రేట్ల కోతతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడాన్ని చూస్తూనే ఉన్నాం. అటు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోని ఇతర పథకాలపై వడ్డీ రేటుతో చూసుకున్నా కానీ, ఎస్సీఎస్ఎస్ పథకంలో వడ్డీ రేటు పెద్దలకు సంబంధించి ఆకర్షణీయమైనదిగా ఉంది. 4.1 కోట్ల ఖాతాలు: దాదాపు 4.1 కోట్ల సీనియర్ సిటిజన్ టర్మ్ డిపాజిట్ ఖాతాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీటిల్లోని మొత్తం డిపాజిట్లు రూ.14 లక్షల కోట్లు. దేశ జీడీపీలో 7 శాతానికి సమానం. -
బీమా.. ధీమా!
చివరగా కీలకమైన మరో అంశం...! అనుకోని సంఘటన జరిగి పిల్లలు ఒంటరి అయినా మీ ఆశయం నెరవేరాలి. ఈ విషయంలోనే ఇతర సేవింగ్ పథకాలతో పోలిస్తే పిల్లల చదువుకు బీమా పథకాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రీమియం చెల్లించే తల్లిదండ్రులకు ఏమైనా జరిగితే భవిష్యత్తు ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీ కొనసాగుతుంది. తద్వారా ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా కుటుంబసభ్యులు మీ ఆశయాన్ని సులభంగా చేరుకోగలరు.