
బాపట్ల జిల్లా రావినూతల గ్రామంలో చెక్కు అందుకుంటున్న మహిళలు
సాక్షి నెట్‌వర్క్ : వైఎస్సార్ సున్నా వడ్డీ పంపిణీ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం కర్నూలు నగరంలోని స్థానిక కేవీఆర్ గార్డెన్స్‌లోని సచివాలయంలో పొదుపు సంఘాల మహిళలు సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గంలోని నందనపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పాల్గొన్నారు.
ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం ఐకేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి చెక్కులు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి గోకరాజు రామరాజు ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు చెక్కులు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment