అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన విలక్షణమైన పద్ధతిని రూపొందించింది. ముఖ్యంగా మహిళా సంక్షే మాన్ని అభివృద్ధి నమూనాలో ప్రధానాంశంగా తీసుకు వచ్చింది. మహిళలు, పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం సమష్టి ప్రయత్నాలు... రాష్ట్ర అభివృద్ధి పథాన్ని పునర్నిర్వచించడమే కాకుండా భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళా సంక్షేమంలో సాధించిన ప్రగతి, దాని విధానాల పరివర్తన ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలలో చైతన్యవంతులైన ఓటర్లలో ప్రతిబింబిస్తుంది.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే దాదాపు 32 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేయడం, వెనుకబడిన వర్గాలకు ఇళ్లు, భూమిపై హక్కులు కల్పించడం... ప్రభుత్వం చూపించిన అంకితభావా నికి నిదర్శనాలు. రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ , తాగు నీరుతో సహా కొత్త హౌసింగ్ కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం గణనీయమైన నిధులను కేటా యించి అక్కడి పౌరుల సంక్షేమం, అభివృద్ధికి పాటు పడడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిబద్ధతను మరింత నొక్కి చెబుతుంది.
అలాగే ‘అమ్మ ఒడి’, ‘విద్యా దీవెన’, ‘వసతి దీవెనల’తో సహా ‘నవరత్నాలు’ అన్నీ... విద్య, ఆర్థిక సాధికారత అంశాలలో మహిళలకు సహాయం చేయడంలో కీలకంగా మారాయి. ఒక్క ‘జగనన్న అమ్మ ఒడి పథకం’ ద్వారానే 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చగా, మొత్తం వ్యయం రూ. 26,067 కోట్లు. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా 78 లక్షల మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులకు 25,570 కోట్లు జమయ్యాయి. ఇది స్వయం సహా యక సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని బలపరిచింది.
‘వైఎస్సార్ చేయూత’, ‘కాపు నేస్తం’ పథకాలు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఆర్థిక ప్రగతికీ, స్వాతంత్య్రానికీ భరోసా ఇచ్చాయి. ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకం ద్వారా పాలిచ్చే తల్లులలకూ, శిశు వులకూ పౌష్టికాహారం అందింది. ఐదేళ్ల లోపు 17 ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాపన... ముఖ్యంగా అట్ట డుగు వర్గాలకు ఆరోగ్య సంరక్షణ, వైద్యవిద్య అవకా శాలను గణనీయంగా విస్తరించింది.
మహిళా సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధత రాజ కీయ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. 1,356 నామినేట్ చేసే పోస్టుల్లో 688 మంది మహిళలను నియమించడం ద్వారానే భర్తీ చేశారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లుగా, మేయర్‌లుగా, డిప్యూటీ మేయర్ లుగా, స్థానిక పాలనా సంస్థల్లో ఇతర కీలక పాత్రల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం గుర్తించదగిన విజయం.
ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా గణనీయమైన నిధులను పంపిణీ చేసింది. ప్రయోజనాలు ఎటువంటి పక్షపాతం లేకుండా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూసింది. ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’, ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాలు వివాహ సంబంధిత ఖర్చుల కోసం మహిళలకు ఆర్థిక సహాయం అందించాయి. మొత్తం రూ. 427.27 కోట్లను 56,194 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సంక్షేమ పథకాల అమలును కొనసాగించాలనీ, మరిన్ని ప్రముఖ పదవుల్లో మహిళలను నియమించాలనీ జగన్ ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటి వరకు మహిళా సంక్షేమంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించడం... భారత రాజ్యాంగ సూత్రాల పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది. పరి పాలనా విధానాలు మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా సమగ్రతకు, సమానమైన అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే పాలనకు కొత్త ప్రమాణాన్ని కూడా ఏర్పాటు చేశాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళ గౌరవంగా, అవకాశంతో, శ్రేయస్సులతో కూడిన జీవితాన్ని గడపడానికి ఈ కార్యక్రమాలు అభివృద్ధి చెందడం, విస్తరించడం తప్పనిసరి.
ఓరుగంటి దుర్గ
వ్యాసకర్త నేషనల్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ చైర్‌పర్సన్, ట్రైబల్ డెవలప్‌మెంట్ మిషన్
Comments
Please login to add a commentAdd a comment