నాటి టీడీపీ పాలన పెత్తందారీ పాలన అన్న నోరే నేడు అదే పాలన కావాలి, అంటే ఆ నోటిని ఏమ నాలి? ప్రతి మనిషికీ స్వార్థం ఉంటుంది. అలాగే ప్రతిపక్ష పార్టీలకు తిరిగి అధికారంలోకి రావాలనే తపన ఉంటుంది. అది తప్పు కాదు. అయితే అధికా రంలోకి రావడానికి ఏ అడ్డదారైనా తొక్కవచ్చునా అనేదే ఇక్కడ ప్రశ్న.
అధికారంలో ఉన్న వారికి ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందించడమే రాజ నీతి. అంటే మంచిని మంచిగా, చెడును చెడుగా చూడాలి. నేడు అది జరుగుతోందా? ప్రజలు ఆలో చించాలి. స్వాతంత్య్రానంతరం 75 ఏళ్లలో అధికా రాన్ని వెలగబెట్టిన పార్టీలు, ముఖ్యమంత్రులు ప్రజలకు మంచిపాలన అందించారా? నిజంగా వారి పాలన అంత బాగా ఉంటే నేటికీ ప్రాంతాల మధ్య అంతరాలు ఎందుకు ఉన్నాయి? ప్రజల పేదరికం స్థాయి ఇంకా ఎందుకు పెరిగింది?
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత టీడీపీ అధి నేత ఎంతో అనుభవజ్ఞులని ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే ఏం జరిగింది? ఉద్యోగ, కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళా వర్గాలను పాతాళానికి తొక్కిన మాట నిజం కాదా? చెప్పుకోవడానికి ఒక మంచి అయినా జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే నేడు ఆ పార్టీలు తాము చేసిన మేలును గురించి చెప్పుకుంటూ జనంలోకి ఎందుకు వెళ్లడం లేదు? ఈ ఐదేళ్లలో ప్రతిపక్షంగానైనా ఎప్పుడెనా, ఎక్కడైనా వారు చేసిన మంచిని గురించి మాట్లాడారా? అది చెప్పలేక అధికార పక్షంపై విరుచుకుపడుతూ, జగన్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే విపరీత మైన దాడికి పాల్పడటం ఏ పాటి నీతి? పాలనను సైతం సాగించడానికి వీలు లేనంత అక్కసు వారి మాటలలో కనబడలేదా?
గత టీడీపీ పాలనలో విసిగి, వేసారిన ప్రజలు 2019లో చిత్తుగా ఓడించి వైఎస్సార్‌సీపీని గద్దెనెక్కించినారు. అప్పటి నుంచి జగన్... ప్రజలే కేంద్రంగా పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజలు పాలకుల దగ్గరకు తిరగడం కాదు, పాలకులే ప్రజల దగ్గరకు పోయే వ్యవస్థలైన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ లను ఏర్పాటు చేశారు.
నవ్యాంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతాలు ఏక కాలంలో సమానంగా అభివృద్ధి చేయాలనుకోవడం తప్పా? గతంలో ‘పెద్ద మనుషుల’ ఒప్పందాలు, నిపుణుల కమిటీల నివేదికల ఆధారంగా రాయలసీమలో పెట్టాల్సిన రాజధానిని, ఇప్పటికే అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతంలో పెట్టడం నేరం కాదా? మూడు ప్రాంతాలలో మూడు రాజధాను లను ఏర్పాటు చేయడం తప్పా? ఇదెక్కడి రాజనీతి!
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా, జగన్ సామాన్య ప్రజలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వాన్ని నడుపు తున్న మాట వాస్తవం కాదా? పేదలు అందరితో సమానంగా సమాజంలో తలెత్తుకొని బతకాలన్న సద్బుద్ధితో... విద్య, వైద్య రంగాలను ప్రక్షాళన చేసిన మాట వాస్తవం కాదా?
ప్రజలారా ఆలోచించండి. ఎవరికైనా బూజు పట్టిన సమాజాన్ని మార్చడానికి సమయం కావాలి. కరోనా కాలం మినహాయించి చూస్తే నిజంగా వైఎస్సార్‌సీపీకి ఈ టెర్మ్‌లో ఉన్నది కేవలం రెండు న్నర సంవత్సరములు మాత్రమే. ఇంత తక్కువ కాలంలో ఏ ప్రభుత్వాలూ అద్భు తాలు చేసి చూపించలేవు. అయినా జగన్ ప్రభుత్వం కష్టా లను, అడ్డంకులను అధిగమించి ప్రపంచం మన వైపు చూసే లాగా వ్యవస్థలను సంస్కరించింది.
వీటన్నిటికీ మించి నిర్లక్ష్యానికి గురైన బహుజన సమాజాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్విరామ కృషి చేస్తోంది. బహుజనులు అంటే బలహీనులు కాదు, దేశ సంపదను సృష్టించే శ్రామికులు అనే సత్యాన్ని సమాజంలోకి తీసుకెళుతోంది. అందుకే నిరంతరం మంచికై తపన పడుతున్న వైఎస్సార్‌సీపీనీ, ప్రభు త్వాన్నీ బతికించుకుందాం. పెత్తందారుల వంచనను ఎండగడదాం. వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా పాలనకు జై కొడదాం. తద్వారా మనం చనిపోయినా బతికిన వాళ్లమవుదాం. లేకుంటే బతికి కూడా చనిపోయిన వారితో సమానంగా ఉండిపోతాం!
– కె.వి. రమణ
బెస్త కార్పొరేషన్ డైరెక్టర్, అనంతపురం
సత్పరిపాలనకు జై కొడదాం!
Published Wed, Jan 3 2024 12:01 AM | Last Updated on Wed, Jan 3 2024 7:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment