గుంటూరు, సాక్షి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోని ఫర్నీచర్ అంశంపై వైఎస్సార్‌సీపీ.. మూడు నెలల వ్యవధితో ఇప్పుడు ఐదోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఫర్నీచర్ వీలైనంత త్వరగా వచ్చి తీసుకెళ్లాలని ఆ లేఖలో సాధారణ పరిపాలన విభాగాన్ని(GAD) కోరింది.
‘‘గతంలో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉన్నది ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారింది. కాబట్టి.. వెంటనే ఫర్నీచర్‌ను తీసుకెళ్లండి. ఎప్పుడు తీసుకెళ్తారో సమయం చెప్పండి. ఒకవేళ తీసుకుని వెళ్లకపోతే గనుక ఆ ఫర్నీచర్ ఖర్చులు చెబితే.. వాటిని చెల్లిస్తాం’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు ఐదుసార్లు విషయాన్ని జీఏడీ దృష్టికి తీసుకెళ్లిన అంశాన్ని తేదీలతో సహా ఆయన తన లేఖలో ప్రస్తావించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ సీఎంగా పని చేసిన క్యాంప్ ఆఫీస్‌లోని ఫర్నీచర్ అంశంపై అనుకూల మీడియాతో రాద్ధాంతం చేయాలని ప్రయత్నించింది. అయితే అప్పటికే జీఏడీకి వైస్సార్‌సీపీ లేఖ రాసింది. ఇప్పటిదాకా నాలుగుసార్లు లేఖ, మెయిల్ ద్వారా కబురు పంపినా జీడీఏ నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో కేవలం నిందలు మోపడానికే దీనిపై స్పందించడం లేదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment