GDA
-
ఫర్నీచర్ సంగతి ఏదో ఒకటి తేల్చండి: వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోని ఫర్నీచర్ అంశంపై వైఎస్సార్సీపీ.. మూడు నెలల వ్యవధితో ఇప్పుడు ఐదోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఫర్నీచర్ వీలైనంత త్వరగా వచ్చి తీసుకెళ్లాలని ఆ లేఖలో సాధారణ పరిపాలన విభాగాన్ని(GAD) కోరింది.‘‘గతంలో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉన్నది ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మారింది. కాబట్టి.. వెంటనే ఫర్నీచర్‌ను తీసుకెళ్లండి. ఎప్పుడు తీసుకెళ్తారో సమయం చెప్పండి. ఒకవేళ తీసుకుని వెళ్లకపోతే గనుక ఆ ఫర్నీచర్ ఖర్చులు చెబితే.. వాటిని చెల్లిస్తాం’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు ఐదుసార్లు విషయాన్ని జీఏడీ దృష్టికి తీసుకెళ్లిన అంశాన్ని తేదీలతో సహా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ సీఎంగా పని చేసిన క్యాంప్ ఆఫీస్‌లోని ఫర్నీచర్ అంశంపై అనుకూల మీడియాతో రాద్ధాంతం చేయాలని ప్రయత్నించింది. అయితే అప్పటికే జీఏడీకి వైస్సార్సీపీ లేఖ రాసింది. ఇప్పటిదాకా నాలుగుసార్లు లేఖ, మెయిల్ ద్వారా కబురు పంపినా జీడీఏ నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో కేవలం నిందలు మోపడానికే దీనిపై స్పందించడం లేదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బాలికపై లైంగిక దాడిపై మీ స్పందనేది?
న్యూఢిల్లీ: పదోతరగతి చదువుతున్న బాలికపై లైంగికదాడికి ఉసిగొల్పిన గ్రామపంచాయతీపై కేసు విషయమై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నా యూపీలోని ఘజియాబాద్ జిల్లా అధికారయంత్రాంగం(జీడీఏ) పట్టించుకోకపోవడాన్ని మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) తప్పు పట్టింది. ఈ మేరకు గురువారం ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను కమిషన్ సుమోటోగా స్వీకరించి ఈ నోటీసు జారీ చేసింది. ఘజియాబాద్ పరిధిలోని మురద్‌నగర్ గ్రామ పంచాయతీ ఓ కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి చేసి, అనంతరం ఆ కుటుంబానికి చెందిన పదోతరగతి చదువుతున్న బాలికపై 4 యువకులు లైంగికదాడికి పాల్పడేలా ఉసికొల్పింది ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. నిందితులను ఐదుసార్లు చెప్పులతో కొట్టి వదిలేయాలని పంచాయతీ కుటుంబ సభ్యులను సూచించింది. దీనికి ఆ కుటుంబ సభ్యులు అంగీకరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించింది. ఈ విషయమై మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిని ఎన్‌హెచ్‌సీ పరిశీలించింది. మీడియా కథనంలో వివిరాలులిలా..సెప్టెంబర్ 30వ తేదీన పాఠశాల నుంచి తిరిగి వస్తున్న పదోతరగతి చదువుతున్న బాలికను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ నలుగురు యువకులపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా రాజీ పడాలని పోలీసులు కూడా ఆ కుంబ సభ్యులను బెదిరించినట్లు పేర్కొంది. -
ట్రాఫిక్ సమస్యకు జీడీఏ చెక్..
ఘజియాబాద్: నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశలో ఘజియాబాద్ అభివృద్ధి సంస్థ(జీడీఏ) ముందడుగువేసింది. ఈ మేరకు జీటీ రోడ్డుకు ఆనుకొని కొత్తగా నిర్మించిన అండర్‌పాస్ రోడ్డును బుధవారం ప్రారంభించారు. సుమారు రూ.6.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అండర్‌పాస్ రోడ్డుకు 2013 జూన్ 3వ తేదీన యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. దీన్ని జీటీ రోడ్డు మీద మీరట్ రోడ్ టీ- పాయింట్ నుంచి హిందోన్ బ్రిడ్జి మధ్య నిర్మించారు. కాగా, ప్రజల సౌకర్యార్థం బుధవారం జీడీఏ వైస్ చైర్మన్ సంతోష్ యాదవ్ ప్రారంభించారు. ఈ అండర్‌పాస్ వినియోగంలోకి వస్తే జీటీ రోడ్డుపైన ట్రాఫిక్ సమస్య పరిష్కారమైనట్టేనని అధికారులు అంటున్నారు. ఎన్‌హెచ్ 24, ఎన్‌హెచ్ 58 నుంచి ఢిల్లీ వైపు వెళ్లే వాహనాలు జీటీ రోడ్డు వద్ద కలుస్తాయి. అక్కడనుంచి అవి జీటీ రోడ్డు ఎడమ వైపు నుంచి ఘజియాబాద్‌వైపు వెళ్లి అక్కడ యూ టర్నర్ తీసుకుని ఢిల్లీ వైపు కదులుతాయి. దీంతో యూ-టర్న్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడేది. దీంతోపాటు ప్రమాదాల సంఖ్య విపరీతంగా జరిగేవి. దీంతో ఏడాది కిందట అండర్‌పాస్ నిర్మాణానికి నిర్ణయించారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య పరిష్కారమైనట్లే. జీడీఏకి చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రాజ్‌నగర్ ఎక్స్టెన్షన్ రోడ్డునుంచి వచ్చే వాహనాలు అండర్ పాస్ ను ఉపయోగించుకుని సాయి ఉపవాన్ వైపు వెళ్లిపోవచ్చు..’ అని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఈ అండర్‌పాస్‌ను తేలికపాటి వాహనాల రాకపోకల నిమిత్తం నిర్మించారు. దీనిద్వారా కేవలం కార్లు, జీపులు వంటి వాహనాలు మాత్రమే వెళ్లగలవు. ఈ అండర్ పాస్ 46 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తులో నిర్మించారు.