బాలికపై లైంగిక దాడిపై మీ స్పందనేది? | NHRC sends notice to GDA over police inaction in gangrape case | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడిపై మీ స్పందనేది?

Published Thu, Oct 30 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

NHRC sends notice to GDA over police inaction in gangrape case

 న్యూఢిల్లీ:   పదోతరగతి చదువుతున్న బాలికపై లైంగికదాడికి ఉసిగొల్పిన  గ్రామపంచాయతీపై కేసు విషయమై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నా యూపీలోని ఘజియాబాద్ జిల్లా అధికారయంత్రాంగం(జీడీఏ) పట్టించుకోకపోవడాన్ని మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తప్పు పట్టింది. ఈ మేరకు గురువారం ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.  నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను కమిషన్ సుమోటోగా స్వీకరించి ఈ నోటీసు జారీ చేసింది.  ఘజియాబాద్ పరిధిలోని మురద్‌నగర్ గ్రామ పంచాయతీ ఓ కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి చేసి, అనంతరం ఆ కుటుంబానికి చెందిన పదోతరగతి చదువుతున్న బాలికపై 4 యువకులు లైంగికదాడికి పాల్పడేలా ఉసికొల్పింది  ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
 
 నిందితులను ఐదుసార్లు చెప్పులతో కొట్టి వదిలేయాలని పంచాయతీ కుటుంబ సభ్యులను సూచించింది. దీనికి ఆ కుటుంబ సభ్యులు అంగీకరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించింది. ఈ విషయమై మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిని ఎన్‌హెచ్‌సీ పరిశీలించింది. మీడియా కథనంలో వివిరాలులిలా..సెప్టెంబర్ 30వ తేదీన పాఠశాల నుంచి తిరిగి వస్తున్న పదోతరగతి చదువుతున్న బాలికను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ నలుగురు యువకులపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. పైగా రాజీ పడాలని పోలీసులు కూడా ఆ కుంబ సభ్యులను బెదిరించినట్లు పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement