సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పునరావాస కేసులను పున:సమీక్షించాలని జాతీయ పర్యవేక్షణ కమిటీని (నేషనల్ మానిటరింగ్ కమిటీ) సోమవారం జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంలో పారదర్శకత లోపించిందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అభిప్రాయపడింది. పునరావాస నష్టపరిహారం ఇవ్వకుండానే.. ప్రజలను ఉన్నపళంగా గ్రామాల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ 2013లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (ఎన్‌హెచ్‌ఆర్సీ) పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఎన్‌హెచ్‌ఆర్సీ పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న ప్రజలకు పునరావాసం, నష్ట పరిహారంపై దృష్టి సారించాలని నేషనల్ మానిటరింగ్ కమిటీని ఆదేశించింది. అదేవిధంగా గతంలో పునరావాసంపై మూసివేసిన కేసులను పునఃసమీక్షించాలని సూచించింది. కాగా ఇటీవల ఢిల్లీ హైకోర్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment