rehabitation
-
పోలవరంపై విచారణ చేపట్టిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పునరావాస కేసులను పున:సమీక్షించాలని జాతీయ పర్యవేక్షణ కమిటీని (నేషనల్ మానిటరింగ్ కమిటీ) సోమవారం జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంలో పారదర్శకత లోపించిందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అభిప్రాయపడింది. పునరావాస నష్టపరిహారం ఇవ్వకుండానే.. ప్రజలను ఉన్నపళంగా గ్రామాల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ 2013లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (ఎన్హెచ్ఆర్సీ) పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఎన్హెచ్ఆర్సీ పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న ప్రజలకు పునరావాసం, నష్ట పరిహారంపై దృష్టి సారించాలని నేషనల్ మానిటరింగ్ కమిటీని ఆదేశించింది. అదేవిధంగా గతంలో పునరావాసంపై మూసివేసిన కేసులను పునఃసమీక్షించాలని సూచించింది. కాగా ఇటీవల ఢిల్లీ హైకోర్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. -
కొటేషన్లలోనే కొట్టేశారు!
సాక్షి, యాదాద్రి : కొటేషన్ల ద్వారా కొనుగోళ్లు చేశారు.. వారు చూపిన చోటనే కొనుగోళ్లు చేయాలని లబ్ధిదారులను పురమాయించారు. అధికారులు చెప్పిన చోటకు వెళ్లి సరుకులు తెచ్చుకున్నారు. రూ.2లక్షల మంజూరులో వారికి వచ్చింది కేవలం రూ.1.50లక్షల వస్తువులే. ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అధికారులతో గొడవ ఎందుకని సర్దుకుపోయారు ఇదీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గుడుంబా పునరావాసం పథకం అమలుపై ‘సాక్షి’ నిర్వహించిన గ్రౌండ్‌రిపోర్ట్‌లో వెల్లడైన వాస్తవాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించారు. ప్రభుత్వం గుడుంబా అమ్మకందారులకు కల్పించిన పునరావాస పథకం అమలులో అధికారులు అత్యంత చాకచాక్యంగా అవినీతికి పాల్పడినట్లు తేటతెల్లమైంది. బ్యాంకుల కాన్సంట్‌తో సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేస్తారు. మార్గదర్శకాల ప్రకారం ఎక్సైజ్ శాఖ లబ్ధిదారులను గుర్తించాలి. ఈ లబ్ధిదారుల జాబితాను సంక్షేమ శాఖల ద్వారా ఎంపీడీఓలకు పంపించి లబ్ధిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించిన తదనంతరం యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో గుడుంబా పునరావాసం పొందిన లబ్ధిదారులను కలిసినప్పుడు వారి మాటల్లో అధికారులు అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు. చాలా మంది తమ పేరు రాయడానికి ఇష్టపడలేదు. నిజం చెప్పితే మళ్లీ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతారని భయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేటగిరిలో 704 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఒక యూనిట్ విలువ రూ.2లక్షలు. మొత్తంగా 14.08 కోట్లు కేటాయించారు. జిల్లాల వారీగా చూస్తే..యాదాద్రి భువనగిరి జిల్లాలో 81 మంది లబ్ధిదారులను గుర్తిస్తే 76 మందికి గ్రౌండింగ్‌చేశారు. నల్లగొండ జిల్లాలో 229 మందికి 229మందికి మంజూరు చేశారు. అత్యధిక తండాలు కలిగిన సూర్యాపేట జిల్లాలో 394 మంది గుడుంబా తయారీ, విక్రయదారులను గుర్తించగా 391 మందికి పునరావాస పథకం కింద నగదు మంజూరు చేశారు. చేతికి చిల్లిగవ్వ ఇవ్వలేదు పునరావాసం కింద మంజూరైన మొత్తంతో కొనుగోళ్లన్నీ కోటేషన్లతో నడిపించారని, చేతికి ఒక్క రూపాయి ఇవ్వలేదని పలువురు లబ్ధిదారులు వాపోయారు. పునరావాసం పథకంలో పాడి పశువులు, గొర్రెలు, కిరాణం, జనరల్‌స్టోర్, లేడిస్ ఎంపోరియం, వస్త్ర దుకాణం, ఆటోమొబైల్, టెంట్‌హౌస్‌లు లబ్ధిదారుల కోరిక మేరకు ఇప్పించారు. అయితే ఎక్కడా కూడా లబ్ధిదారులకు చేతికి డబ్బులు ఇవ్వలేదు. అదే సమయంలో వారు కోరిన చోట కూడా ఇప్పించలేదు. ముందుగానే అధికారులు ఎంపిక చేసుకున్న దుకాణాల పేరు మీద కొటేషన్లు తీసుకుని వారి వద్ద సరుకులు కొనుగోలు చేశారు. దీంతో అధికారులు ముందుగానే కమీషన్లు మాట్లాడుకుని వారినుంచి కొటేషన్లను స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరంలో ప్రతి యూనిట్ వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయి. లబ్ధిదారులు తాము ఇతర చోట్ల కొనుగోలు చేస్తామంటే అధికారులకు అందుకు అంగీకరించకపోవడం వెనుక అంతర్యంలోనే అక్రమాలు జరగాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి కొనుగోలులో రూ.50వేల వరకు అవినీతి జరిగిందని తెలుస్తోంది. జరిగిన అవినీతి బయటపెడితే తమను కేసుల పేరుతో వేధిస్తారని పేరు రాయడానికి ఇష్టపడని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలానికి చెందిన గిరిజన లబ్ధిదారుడొకరు ‘సాక్షి’తో చెప్పారు. ‘‘నాకు రూ.2లక్షలు మంజూరైది. వచ్చిన పేరే కానీ నాకు ఇచ్చింది రూ.1.40లక్షల సరుకులు మాత్రమే. అన్ని వారే ఇప్పించారు. హోల్‌సేల్ దుకాణానికి వెళ్లి తెచ్చుకోమంటే తెచ్చుకున్నాను. ఓ లెక్కా లేదు, ఓ పత్రం లేదు. ప్రభుత్వం ఇచ్చింది బతుకుదామని కిరాణ దుకాణం నడుపుకుంటున్నాను. ఇప్పుడు ఎవరి మీద చెప్పిపా ఏం లాభం’’ అంటూ దాటవేశాడు. అంతా పారదర్శకంగా చేశాం గుడుంబా పునరావాస పథకంలో యాదాద్రి జిల్లావ్యాప్తంగా 76మంది లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండ్ చేశాం. వారంతా ఇప్పుడు గుడుంబా అమ్మకాలు నిలిపివేసి వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నారు. మూడు సంవత్సరాల వరకు వారిపై నిఘా కొనసాగుతుంది. ఈ మేరకు సారా అమ్మకాలు చేయమని బాండ్ రాయించుకున్నాం. ఎలాంటి అక్రమాలు జరగకుండా కోటేషన్ల ద్వారా లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశాం. ఎక్కడా అవినీతి జరగలేదు. – కృష్ణప్రియ, యాదాద్రి జిల్లాఎక్సైజ్ శాఖ అధికారి డబ్బులు సగమే ఇచ్చారు.. నాది మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామం. పునరావాస పథకం కింద రూ. రెండు లక్షల విలువచేసే గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా అధికారులు కేవలం రూ. లక్ష విలువ చేసే గొర్రెలే ఇచ్చారు. రూ. లక్షకు 16 గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా ఒకటి కోతపెట్టారు. మిగిలిస రూ.లక్ష ఎప్పుడు ఇస్తారంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. సారా విక్రయించుకుంటూ ఉన్నంతలో పూట వెళ్లదీసుకునేది. ఇప్పుడు తిండికి ఇబ్బందులు పడుతున్నా. అధికారులను మిగిలిన డబ్బులు అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. మిగిలిన రూ. లక్ష అయినా చేతికందిస్తే చిన్నపాటి కిరాణ దుకాణం పెట్టుకుంటా. – భిక్షాల నాగయ్య, కందిబండ, మేళ్లచెరువు రూ.50 వేలకు మించి సరుకుల్లేవ్ ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన రాగటి పార్వతమ్మ ఐదేళ్ల నుంచి సారా విక్రయిస్తుంది. సారానిర్మూలనలో భాగంగా పార్వతమ్మకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తామని చెప్పింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఆమెకు భువనగిరిలో కిరాణా సరుకులు ఇప్పించారు. అయితే రూ. 2లక్షల విలువ గల సామగ్రి ఇప్పించాల్సి ఉండగా అధికారులు ఇప్పించిన సరుకులు రూ. 50 వేలకు మించి కూడా లేవని పార్వతమ్మ వాపోతోంది. సరుకులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తోంది. – రాగటి పార్వతమ్మ, ఆత్మకూరు(ఎం) -
పునరావాసం పక్కా మోసం
మంగంపేట(ఓబులవారిపల్లె): దశాబ్దం కిందట మంగంపేట గనుల పరిధిలో డేంజర్‌జోన్‌గా ప్రకటించిన కట్టడాలను 14 రీచ్‌లుగా విభజించి ఏపీఎండీసీవారు రెవెన్యూ ద్వారా పరిహారం అందజేశారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇందులో 1వ రీచ్‌లో 90 ఇళ్లలకు రూ.2,97,61,320, 2వ రీచ్‌లో 78 కట్టడాలకు రూ.31.45లక్షలు పరిహారం నిర్వాసితులకు అందజేశారు. 3వ రీచ్‌లో 52 కట్టడాలకు రూ.19.35లక్షలు, 4వ రీచ్‌లో 78 కట్టడాలకు రూ.32.69 లక్షలు, 5వ రీచ్‌లో 209 కట్టడాలకు రూ.50.19 లక్షలు, 8వ రీచ్‌లో 31 కట్టడాలకు రూ.89.65 లక్షలు, 9వ రీచ్‌లో 172 కట్టడాలకు రూ.2.08కోట్లు, 10వరీచ్లో 231 కట్టడాలకు రూ.3.76కోట్లు, 11వ రీచ్‌లో 119 కట్టడాలకు రూ.2.29 కోట్లు, 12వ రీచ్‌లో 12కట్టడాలకు రూ.10.05 లక్షలు, 14వరీచ్లో 26కట్టడాలకు రూ.43.83 లక్షలు పరిహారం చెల్లించి వాటిని తొలగించారు. 1457 ఇళ్లు కూల్చివేత యుద్ధ ప్రాతిపదికన కట్టడాలు తొలగించే సందర్భంలో కొందరు నిర్వాసితులు ఇళ్లను తొలగించేందుకు సమ్మతించకపోవడంతో అధికారులు డోలాయమానంలో పడ్డారు. దీంతో అధికారులు నిర్వాసిత కుటుంబాలకు ఆరునెలల్లోపు పునరావాసం కల్పించడంతోపాటు తక్షణం ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీతోపాటు ఆరునెలలపాటు ప్రతి కుటుంబానికి నెలనెలా ఏపీఎండీసీ అద్దె చెల్లిస్తుందని హామీఇచ్చారు. ఉద్యోగం రాని కుటుంబాలకు పరోక్ష ఉపాధి కల్పిస్తామని ఆశ కల్పించడంతో గ్రామంలోని తమ 1,457 ఇళ్లను దగ్గరవుండి నిర్వాసితులు కూల్చివేయించారు. ఏపీఎండీసీ అధికారులు ఇచ్చిన హామీప్రకారం పునరావాస కేంద్రాల్లో కోట్లాదిరూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించారు. చక్రం తిప్పిన ఖద్దర్బాబులు ముందుగా కట్టడాలను తొలగించిన నిర్వాసితులకు 1వ పునరావాసంలో 1,100 కుటుంబాలకు నివాస స్థలాలు కల్పించారు. 2వ పునరావాస కేంద్రంలో 358, 3వ పునరావాస కేంద్రంలో 325, 4వ పునరావాస కేంద్రంలో 310 కుటుంబాలకు స్థలాలు కేటాయించారు. ఇక్కడే తిరకాసు మొదలైంది. రాజకీయంగా చక్రంతిప్పే ఒక్కొక్క ఖద్దరుబాబులు అధికారులతో కుమ్మకై మూడుప్లాట్ల నుంచి పదిప్లాట్ల వరకు కబ్జాచేసి సువిశాలమైన గృహాలను నిర్మించుకున్నారు. అంతేకాకుండా అప్పట్లో ప్రభుత్వ గృహనిర్మాణశాఖ అధికారులకు పెద్దఎత్తున చేతులు తడిపి ఏకంగా పక్కా గృహాలను మంజూరు చేపించుకుని దర్జాగా భవంతులు నిర్మించుకున్నారన్నారు. అధికారులకూ స్థలాలు ఇదేఅదునుగా భావించి ఫ్లాట్లు కేటాయింపునకు సర్వే నిర్వహించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు సైతం బినామీపేర్లతో పునరావాస కేంద్రంలో ప్లాట్లు పొందారు. వీరి నిర్వాకంతో ప్రస్తుతం కేటాయించిన పునరావాసంలో నిర్వాసితులు అందరికీ సరిపోవాల్సిన ఇంటి స్థలాలు చాలక ఏపీఎండీసీ ఇంకా లక్షల వ్యయంతో నిర్వాసితులకోసం భూములుకొని స్థలాలు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే 1,457 కట్టడాల కూల్చివేతకు 2,120 కుటుంబాలకు ఏపీఎండీసీ నివాసస్థలాలు ఏర్పాటుచేసింది. అయితే బస్టాండ్ ప్రాంతంలోని ఇంకా వందపైబడి నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఏపీఎండీసీ యాజమాన్యం వాస్తవాలను వెలికితీసి కబ్జాకు గురైన ప్లాట్లను గుర్తించి స్వాధీనపరుచుకుంటే ఇంటిస్థలాలు లేని నిర్వాసితులకు సరిపోతుందని స్థానికంగా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కబ్జాకు గురైన స్థలాలు స్వాధీనానికి ఏపీఎండీసీ చొరవ చూపిస్తుందా లేక రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తుందా అని బాధితులు ఎదురుచూస్తున్నారు. అధికారులకు బినామీ ప్లాట్లు కట్టబెట్టారు గనుల విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన అర్హులైన నిర్వాసితులకు నివేశస్థలాలు ఇవ్వకుండా ఏపీఎండీసీకి చెందిన కొందరు అధికారులు బినామీ పేర్లతో ప్లాట్లను అక్రమంగా పొందారు. ఇప్పటికైనా ఏపీఎండీసీపై అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుని అర్హులైన నివేశçస్థలాలు ఇప్పించాలి. – తల్లెం భరత్కుమార్రెడిడ, కాపుపల్లె, మంగంపేట. ఏళ్లుగా నివేశస్థలాలు కేటాయించలేదు గనుల విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయాము. ఏపీఎండీసీ అధికారులు ఇప్పటివరకు మాకు నివేశస్థలాలు కేటాయించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంగంపేట ఆర్ఆర్సెంటర్ సమీపంలో నివేశస్థలాలు కేటాయిస్తే బాగుంటుంది. – షేక్ కరిముల్లా, మంగంపేట. ఇల్లు కోల్పోయిన వారికే నివాసస్థలం కల్పించాం గనుల విస్తరణలో ఇల్లుకోల్పోయిన నిర్వాసితులకే పునరావాసంలో నివాసస్థలం కేటాయించాం. ఎవ్వరికీ అదనంగా నివాసస్థలాలు ఇవ్వలేదు. అప్పట్లో ఉన్న ఏపీఎండీసీ అధికారులు, రెవిన్యూవారు ప్లాట్లువేసి ఇల్లు కోల్పోయిన వారిప్లాట్లు కేటాయింపు జరిగి ఉంటుంది. – రాచమల్లు కేథార్నాథ్రెడ్డి, సిపివో, మంగంపేట. -
మొదటి విడత పునరావాసం పూర్తి
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు మొదటి విడత పునరావాసం పూర్తయ్యింది. మొదటి విడత ఖాళీ చేయాల్సిన ఏడు గ్రామాల నిర్వాసితులకు, పోల వరం కుడికాలువ నిర్మాణం వల్ల ఖాళీ చేసిన మరో గ్రామానికి సంబంధించి 1,825 కుటుంబాలకు రూ.57.84 కోట్ల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రాయితీలుగా అందించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ ఎం.ముక్కంటి వివరాలను విలేకరులకు వెల్లడించారు. 2005లో విడుదల చేసిన 68 జీవో ప్రకారం రూ.6.01 కోట్లు, జీవో 90 కింద మరో రూ.51.83 కోట్లు చెల్లించామన్నారు. గతేడాది జరిగిన సర్వేలో గిరిజనేతరుల భూములకు తక్కువ రేటు చెల్లించారని, పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులు అటవీ సంపదను కోల్పోయారని గుర్తించామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిర్వాసితులను ఆదుకోవాలని కలెక్టర్ కె.భాస్కర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా జీవో 90 కింద రూ. 60.47 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. అప్పటి నుంచి అధికార యంత్రాంగం అర్హులైన నిర్వాసితుల జాబితా రూపొందించి గ్రామసభల ఆమోదంతో నివేదికలు పంపించామన్నారు. ప్రణాళిక ప్రకారం పరిష్కారం : జేసీ పి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముంపు గ్రామాల వారీగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి గ్రామసభలు నిర్వహించామని చెప్పారు. ప్రణాళిక ప్రకారం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించామన్నారు. దేవరగొంది, మామిడిగొంది, తోటగొంది, చేగొండిపల్లి, సింగన్నపల్లి, రామయ్యపేట, పైడిపాక, రామన్నపాలెం గ్రామాల నిర్వాసితులకు పునరావాస కేంద్రాల్లో ఐటీడీఏ ద్వారా భూములు అభివృద్ధి చేయడం, జీవనోపాధి కోసం రుణాలు మంజూరు చేయడం, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా బోర్లు వేయించడం, ఆర్అండ్ఆర్ నిధులతో వీధిదీపాలు, చెత్తకుండీల ఏర్పాటు, ముంపు గ్రామాల్లోని నిర్వాసితుల చెట్లకు నష్టపరిహారం చెల్లించడం వంటి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కలెక్టర్, జేసీలు, అన్ని శాఖల అధికారుల సహకారంతో వసతులు కల్పించామని వివరించారు. ఆర్ఐ కె.రమేష్ పాల్గొన్నారు.