న్యూఢిల్లీ: కానిస్టేబుల్ చేతిలో అత్యాచారానికి గురై న బాలికను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఆదుకుంది. సంఘం ఆదేశాల మేరకు ఈమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షల పరిహారం చెల్లించింది. రిడ్జ్‌రోడ్డు ప్రాంతంలో ఈ 12 ఏళ్ల బాలికపై 2012, ఫిబ్రవరి 10న కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. తదనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉన్నతాధికారులు ఇతనిపై సస్పెన్షన్ వేటు విధించారు. మందిర్‌మార్గ్ స్టేషన్‌లో ఇతనిపై సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదయింది. కానిస్టేబుల్ అత్యాచారం చేయడాన్ని గమనించిన బాలిక బంధువు.. అక్కడే ఉన్న కొందరు కూలీల సాయంతో నింది తుణ్ని బంధించారని విచారణ సందర్భంగా ఎన్‌హెచ్‌ఆర్సీ పేర్కొంది.
మందిర్‌మార్గ్ స్టేషన్ పోలీసులు సమర్పించిన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తే ఇతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అందుకే ఇతణ్ని సస్పెం డ్ చేసినట్టు పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి బాలిక మానవ హక్కులను హరించాడని వ్యాఖ్యానించింది. జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు బాలిక పేరున రూ.ఐదు లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై వచ్చే వడ్డీని ఆమె సంరక్షకుడికి అందజేయవచ్చని కమిషన్ ఆదేశాల్లో పేర్కొంది. బాధితురాలికి 18 ఏళ్ల నిండిన తరువాత నగదు ఆమెకే చెందుతుందని తెలియజేసింది.
బాధిత కుటుంబానికి రూ.ఐదు లక్షల పరిహారం
Published Sat, Aug 9 2014 10:33 PM | Last Updated on Sat, Apr 6 2019 8:51 PM
Advertisement
Advertisement