women welfare
-
వెనుకబడిన వర్గాలకు చేయూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది. బీసీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్లో రూ.6,229 కోట్లు ఇవ్వగా.. ఈసారి సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా రూ.9,200.32 కోట్లను కేటాయించింది. వాస్తవానికి కొన్నేళ్లుగా బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా లేవని.. ఈసారి ఊరట కలిగించేలా కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.⇒ వడ్డెర, కృష్ణబలిజ పూసల, వాల్మీకి బోయ, భట్రాజ, కుమ్మరి, శాలివాహన, సగర కో–ఆపరేటివ్ ఫెడరేషన్లకు, మేదర కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్ కార్పొరేషన్లకు రూ.50కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లు కేటాయించారు.⇒ తెలంగాణ తాడీ టాపర్స్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.68 కోట్లు.⇒ ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు, చేనేతకారుల సహాయానికి రూ.450 కోట్ల గ్రాంటు..⇒ నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు, వాషర్మెన్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.150 కోట్లు..⇒ ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ వెల్ఫేర్ బోర్డులకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.⇒ నీరా పాలసీకి రూ.25 కోట్ల గ్రాంటు ఇచ్చారు.⇒ మైనారిటీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,200 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.798 కోట్లు అదనంగా రూ.3,002.60 కోట్లు కేటాయించారు.⇒ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఈసారి రూ.2,736 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇచ్చిన రూ.2,131 కోట్లతో పోలిస్తే ఇది రూ.605 కోట్లు అదనం.⇒ ఇక ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కోసం అన్ని సంక్షేమశాఖలకు కలిపి రూ.2,600 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.200 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల కింద బీసీ సంక్షేమ శాఖకు అధికంగా రూ.1,650 కోట్లు కేటాయించారు.సంక్షేమ శాఖలకు కేటాయింపులివీ..శాఖ నిధులు (రూ.కోట్లలో)ఎస్సీ సంక్షేమం 28,724.53గిరిజన సంక్షేమం 15,123.91బీసీ సంక్షేమం 9,200.32మైనారిటీ సంక్షేమం 3,002.60మహిళా, శిశు సంక్షేమం 2,736.00కార్మిక సంక్షేమం 881.86 -
Budget 2024: ఆమె బడ్జెట్ ఎంత?
ఆకాశంలో సగం అన్నారు స్త్రీలను. బిడ్డకు జన్మనిచ్చి ΄పౌరుడిగా దేశానికి ఇస్తుంది స్త్రీ. కుటుంబ నిర్మాణంలో సమాజ ముందడుగులో ఆమె భాగస్వామ్యం సగం. జనాభాలో ఆమె సగం. కాని బడ్జెట్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమెప్రాధాన్యం వెనక్కు వెళ్లి ఇతరప్రాధాన్యాలు ముందుకొస్తాయి. ‘ఇది పేదవాడి బడ్జెట్’, ‘రైతు బడ్జెట్’, ‘మధ్యతరగతి బడ్జెట్’ లాంటి మాటలు వినిపిస్తాయి తప్ప ‘ఇది స్త్రీ సంక్షేమం కోరిన బడ్జెట్’ అనే మాట వినపడదు. ఇప్పుడు రానున్నది బడ్జెట్ కాలం.దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆయా సభలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నాయి. ఈ సందర్భంగా స్త్రీలు ఏం కోరుతున్నారు? ఆర్థిక మంత్రులకు ఏం సందేశం ఇస్తున్నారు?ఆదాయం పెంచుకునేలా చూడాలిదివ్యాంగులు, సీనియర్ మహిళలు, ఒంటరి మహిళల గురించి బడ్జెట్లో ప్రత్యేక దృష్టి సారించాలి. వారు స్వయంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలి. కుటీర పరిశ్రమలతోపాటు హోమ్మేడ్ ఇండస్ట్రీలలో ప్రోత్సహించాలి. విద్య, నైపుణ్యావృద్ధి, ఉపాధి సంబంధించి నోడల్ డిపార్ట్మెంట్లు కొత్త కొత్త ప్రయోగాల్లో మహిళలను భాగస్వాములు చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందించాలి. సాఫ్ట్వేర్, మెడిసిన్, రేడియోగ్రఫీ తదితర అత్యంత నైపుణ్యం కలిగిన రంగాలలో స్త్రీల కోసం బడ్జెట్లో నిధులు వెచ్చించి ప్రోత్సహించాలి. వెల్బీయింగ్, కేర్ ఎకానమిలతో స్త్రీలు ఆదాయం పెంచుకునేలా చూడాలి.– చిత్రామిశ్ర, ఐఏఎస్, పీఓ, ఐటీడీఏ, ఏటూరునాగారంవిద్యకు ప్రాధాన్యం ఇవ్వాలిబాలికల విద్యకుప్రాధాన్యత ఇవ్వాలి. శాస్త్ర, సాంకేతికరంగాల్లో బాలికలు రాణించేలా కార్యక్రమాలు నిర్వహించాలి.ప్రాథమిక పాఠశాల సమయంలో డ్రా΄పౌట్స్ను నిరోధించాలి. వృత్తి విద్య శిక్షణ ఇవ్వాలి. పనిచేసే తల్లుల పిల్లలను చూసుకునేందుకు పని స్థలాల్లో కేర్టేకర్లను ఏర్పాటు చేయాలి. పాఠశాల, కళాశాల రోజుల్లో వైద్యశిబిరాల ద్వారా వివిధ వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు పరీక్షలు చేయాలి. – శేషాద్రిని రెడ్డి, ఏఎస్పీ, వేములవాడకుటీర పరిశ్రమల ఏర్పాటుపురుషులతో సమానంగా మహిళలు విద్య, వైద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదిగితేనే ప్రపంచ దేశాలతో ΄ోల్చి నప్పుడు గర్వపడేలా దేశాభి వృద్ధిని సాధించగలం. మహిళల ఎదుగుదలకు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. అడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు అందోళనకు గురి కాకుండా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. యువతులు ఇంటర్, డిగ్రీతోనే చదువు మానేసి వివాహం చేసుకోవడం వల్ల పురుషులతో సమానంగా ఎదగలేక΄ోతున్నారు. వారికి నాణ్యమైన విద్య అందించాలి. స్కూల్స్, జూనియర్, సాంకేతిక కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలి. బాలికలు, మహిళలకు ఉచిత వ్యాక్సిన్లు ఇచ్చేలా బడ్జెట్ నిధులు కేటాయించాలి.– ఇంజారపు పూజ, ఎస్పీ (ఐపీఎస్ అధికారి), పీటీసీ, మామునూరురక్షణకు నిధులు పెంచాలిపెరుగుతున్న మహిళా జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు పెంచాలి. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసే వివిధ శాఖలకు ఆ నిధులను ఖర్చు చేయాలి. వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గ్రామాల్లో ప్రత్యేక కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి. ప్రత్యేకమైన పథకాలు రూ΄÷ందించాలి. ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు అనుకూలంగా మౌలిక వసతులు కల్పించడం ముఖ్యం. మహిళలపై రాక్షసంగా వ్యవహరించేవారికి కఠిన శిక్షలు వేసే విధంగా చట్టాల్లో మార్పు తీసుకురావాలి. రాజకీయపరంగా అన్ని విభాగాల్లో మహిళలు తన కలలను సాకారం చేసుకునే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. – విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ, జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాపార రంగంలో భాగస్వామ్యంఅభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. మన దేశంలోనూ అన్ని రంగాల్లోప్రాతినిధ్యం పెరిగింది. ఉన్నత చదువుల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు వ్యాపారరంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచాలి. వైద్యం, శారీరక దృఢత్వం కోసం అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్ఠం చేయాలి. మహిళలు విభిన్న రంగాల్లో రాణించేలా రిజర్వేషన్లు కల్పించాలి. మొత్తంగా రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, విద్య, వైద్యం అన్నింటా మహిళలనుప్రొత్సహించాలి. – లక్ష్మీకిరణ్, అదనపు కలెక్టర్, కరీంనగర్విద్య వైద్యం రవాణా ప్రభుత్వానిదేఇది గ్లోబలైజేషన్ కాలం. గ్లోబలైజేషన్‌కి హ్యూమన్ఫేస్ ఉండదని ఆర్థిక వేత్త అమర్త్యసేన్ అన్న మాటలు ఈ మూడు దశాబ్దాల్లో స్త్రీల పట్ల సాగుతున్న వివక్ష చూసినప్పుడు సత్యమని తేలాయి. కనీసం విద్య, వైద్యరంగాలనైనా ప్రభుత్వం స్వయంగా నిర్వహించినప్పుడు మాత్రమే ఆ సేవలకు మానవముఖం ఉంటుంది. విద్య, వైద్యంతోపాటు ప్రజా రవాణా, ఉపాధి... ఈ నాలుగూ ప్రభుత్వరంగంలో ఉన్నప్పుడే మహిళలకు రాజ్యాంగంలో సూచించిన విధంగా జీవనోపాధి పరస్పర గౌరవంతో కూడిన జీవితం సాధ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప మిగిలిన ఏ రంగంలోనూ మగవాళ్లకు, మహిళలకు సమాన పనికి సమానవేతనం లభించడం లేదు. ప్రజల సంక్షేమమే ప్రధానంగా లేని బడ్జెట్లో మహిళల సంక్షేమం దుర్భిణీతో చూసినా దొరకదు. ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరంలో నిర్దేశించిన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్‌లో సంపూర్ణ మహిళ అక్షరాస్యత, ప్రసవ మరణాలను తగ్గించడం ప్రధాన లక్ష్యాలు. ఆ లక్ష్యాలను చేరడానికి నామమాత్రపు చర్యలు తప్ప చిత్తశుద్ధితో ప్రణాళికలు చేపట్టలేదు. ‘ఇలాగే కొనసాగితే భారతదేశం 2040 నాటికి కూడా మహిళల అక్షరాస్యత సంపూర్ణంగా సాధించలేదు’ అని తదుపరి సమీక్షలో ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించిన విషయాన్ని మర్చి΄ోకూడదు. నిర్భయ ఘటన నేపథ్యంలో జస్టిస్ వర్మ కమిటీ ‘ప్రజారవాణా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి’ అన్నది. ఆర్టీసీ బస్సులో ఎప్పుడైనా నిర్భయ ఘటనలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయా? మహిళకు క్షేత్రస్థాయిలో అందాల్సిన కనీస అవసరాల్లో అందడం లేదు. మొక్కకు నీరు ΄ోయకుండా చెట్టుకు అంటుకడతానంటే దానిని అభివృద్ధి అనలేం. – తోట జ్యోతిరాణి, ఎకనమిక్స్ ప్రొఫెసర్ (రిటైర్డ్), కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ -
మహిళా సంక్షేమంలో మునుముందుకు
ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విలక్షణమైన పద్ధతిని రూపొందించింది. ముఖ్యంగా మహిళా సంక్షే మాన్ని అభివృద్ధి నమూనాలో ప్రధానాంశంగా తీసుకు వచ్చింది. మహిళలు, పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం సమష్టి ప్రయత్నాలు... రాష్ట్ర అభివృద్ధి పథాన్ని పునర్నిర్వచించడమే కాకుండా భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళా సంక్షేమంలో సాధించిన ప్రగతి, దాని విధానాల పరివర్తన ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలలో చైతన్యవంతులైన ఓటర్లలో ప్రతిబింబిస్తుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే దాదాపు 32 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేయడం, వెనుకబడిన వర్గాలకు ఇళ్లు, భూమిపై హక్కులు కల్పించడం... ప్రభుత్వం చూపించిన అంకితభావా నికి నిదర్శనాలు. రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ , తాగు నీరుతో సహా కొత్త హౌసింగ్ కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం గణనీయమైన నిధులను కేటా యించి అక్కడి పౌరుల సంక్షేమం, అభివృద్ధికి పాటు పడడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిబద్ధతను మరింత నొక్కి చెబుతుంది. అలాగే ‘అమ్మ ఒడి’, ‘విద్యా దీవెన’, ‘వసతి దీవెనల’తో సహా ‘నవరత్నాలు’ అన్నీ... విద్య, ఆర్థిక సాధికారత అంశాలలో మహిళలకు సహాయం చేయడంలో కీలకంగా మారాయి. ఒక్క ‘జగనన్న అమ్మ ఒడి పథకం’ ద్వారానే 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చగా, మొత్తం వ్యయం రూ. 26,067 కోట్లు. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా 78 లక్షల మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులకు 25,570 కోట్లు జమయ్యాయి. ఇది స్వయం సహా యక సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని బలపరిచింది. ‘వైఎస్సార్ చేయూత’, ‘కాపు నేస్తం’ పథకాలు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఆర్థిక ప్రగతికీ, స్వాతంత్య్రానికీ భరోసా ఇచ్చాయి. ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకం ద్వారా పాలిచ్చే తల్లులలకూ, శిశు వులకూ పౌష్టికాహారం అందింది. ఐదేళ్ల లోపు 17 ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాపన... ముఖ్యంగా అట్ట డుగు వర్గాలకు ఆరోగ్య సంరక్షణ, వైద్యవిద్య అవకా శాలను గణనీయంగా విస్తరించింది. మహిళా సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధత రాజ కీయ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. 1,356 నామినేట్ చేసే పోస్టుల్లో 688 మంది మహిళలను నియమించడం ద్వారానే భర్తీ చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా, మేయర్లుగా, డిప్యూటీ మేయర్ లుగా, స్థానిక పాలనా సంస్థల్లో ఇతర కీలక పాత్రల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం గుర్తించదగిన విజయం. ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా గణనీయమైన నిధులను పంపిణీ చేసింది. ప్రయోజనాలు ఎటువంటి పక్షపాతం లేకుండా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూసింది. ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’, ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాలు వివాహ సంబంధిత ఖర్చుల కోసం మహిళలకు ఆర్థిక సహాయం అందించాయి. మొత్తం రూ. 427.27 కోట్లను 56,194 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సంక్షేమ పథకాల అమలును కొనసాగించాలనీ, మరిన్ని ప్రముఖ పదవుల్లో మహిళలను నియమించాలనీ జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు మహిళా సంక్షేమంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించడం... భారత రాజ్యాంగ సూత్రాల పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది. పరి పాలనా విధానాలు మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా సమగ్రతకు, సమానమైన అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే పాలనకు కొత్త ప్రమాణాన్ని కూడా ఏర్పాటు చేశాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళ గౌరవంగా, అవకాశంతో, శ్రేయస్సులతో కూడిన జీవితాన్ని గడపడానికి ఈ కార్యక్రమాలు అభివృద్ధి చెందడం, విస్తరించడం తప్పనిసరి. ఓరుగంటి దుర్గ వ్యాసకర్త నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ చైర్పర్సన్, ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్ -
మీరు దేశానికే ఆదర్శం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం : ‘మన అక్కచెల్లెమ్మలు దేశానికే ఆదర్శం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన పల్లెల నుంచే సాధికారతతో ఆవిర్భవించాలి. అందుకే మహిళా పక్షపాత ప్రభుత్వంగా వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయనటువంటి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత.. తదితర పథకాల ద్వారా ప్రతి అడుగు అక్క చెల్లెమ్మల కోసమే వేస్తున్నాం. ఈ నాలుగేళ్ల కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్ణయాలు తీసుకున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.48 లక్షల డ్వాక్రా సంఘాల్లోని కోటి ఐదు లక్షల 13 వేల 365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా నాలుగో ఏడాది శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రూ.1,353.76 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.4,969 కోట్లు లబ్ధి కలిగించామన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నారా వారిది నారీ వ్యతిరేక చరిత్ర గత చంద్రబాబు ప్రభుత్వంలో అంతా మోసమే. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు 2014 – 2019 మధ్య రూ.14,205 కోట్లు చెల్లించకుండా మోసం చేసి అక్కచెల్లెమ్మలను నడిరోడ్డు మీద పడేశాడు. దీనికి తోడు సున్నా వడ్డీ పథకాన్ని సైతం 2016 అక్టోబర్ నుంచి రద్దు చేసి వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టాడు. దీంతో ఏ, బి గ్రేడ్లలో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారిపోయాయి. రూ.3,036 కోట్లు ఎదురు వడ్డీ కట్టాల్సి వచ్చింది. మొత్తంగా అప్పులన్నీ తడిసి మోపెడై 2019 ఏప్రిల్ నాటికి రూ.25,571 కోట్లకు ఎగబాకాయి. బాబు చేసిన మోసానికి 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి అక్కచెల్లెమ్మలు తీసుకున్న రుణాలలో 18.36 శాతం మొండి బకాయిలుగా తేలాయి. అదీ నారా వారి నారీ వ్యతిరేక చరిత్ర. ఇప్పుడు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం తోడుగా నిలబడింది. వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ప్రతి అడుగులోనూ తోడుగా నిలబడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఫలితంగా ఈ రోజు పొదుపు సంఘాలలో మొండి బకాయిలు కేవలం 0.3 శాతం మాత్రమే. 99.67 శాతం రికవరీ రేటుతో మన అక్కచెల్లెమ్మలు దేశానికి ఆదర్శంగా నిలిచారు. తేడా మీరే చూడండి. అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చాం మనందరి ప్రభుత్వానికి ముందు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు దాదాపు 90 లక్షలు ఉన్నారు. మనపై నమ్మకం పెరగడం వల్ల ఈ రోజు ఆ సంఖ్య 1.16 కోట్లకు పెరిగింది. అంటే 25 లక్షలకుపైగా పెరిగారు. సున్నా వడ్డీతో పాటు రూ.3 లక్షల వరకు రుణం అతి తక్కువ వడ్డీకే ఇప్పిస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో 12–14 శాతం వడ్డీ వసూలు చేశారు. మనం దానిని 9.5 నుంచి 8.5 శాతం వరకు తగ్గించగలిగాం. ఇవన్నీ ఒక ఎత్తయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న రుణాలు రూ.25,571 కోట్లు. ఆ రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికే ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 3 పర్యాయాలు రూ.19,178 కోట్లు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా వారి చేతుల్లో పెట్టి వారిని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చాం. పలు విధాలా భరోసా ♦ జగనన్న అమ్మ ఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.26,067 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45–65 వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన 26.39 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.14,219 కోట్లు అందించాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1257 కోట్లు సాయం అందించాం. ♦ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు సాయం చేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ఇందుకోసం రూ.10,636 కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. ♦ పిల్లల భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 25.17 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఈ పథకం కింద డిగ్రీలు, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.20 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ చదువుతున్న పిల్లలకు రూ.10 వేలు రెండు దఫాల్లో ఇస్తున్నాం. ఇలాంటి పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. సొంత గూడు కోసం 30 లక్షల ఇళ్ల పట్టాలు ♦ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా నా అక్కచెల్లెమ్మల పేరిట 30 లక్షల ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాం. ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. అంతటితో ఆగక 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాం. ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక్కో దాని విలువ రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ ఒక్క పథకం ద్వారా రెండు మూడు లక్షల కోట్లు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్లయింది. ♦ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 35.70 లక్షల మంది గర్భిణులు, బాలింతలు.. ఆరేళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకు మంచి చేస్తున్నాం. వీరి కోసం గతంలో రూ.400 కోట్లు ఖర్చు చేస్తే గొప్ప అనుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు మనం ఏటా రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి ఇంతవరకు రూ.6,141 కోట్లు వెచ్చించాం. సూర్యోదయానికి ముందే.. ♦ దేశంలో ఎక్కడా కనీ వినీ ఎరుగని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా, సెలవు దినమైనా సరే చిక్కటి చిరునవ్వుతో తలుపులు తట్టి, అవ్వా గుడ్‌మార్నింగ్ అని చెబుతూ పింఛన్ ఇచ్చేలా మనవడు, మనవరాళ్లను మీ ఇంటికి పంపిస్తున్నాను. ♦ గతంలో వెయ్యి రూపాయలు పింఛన్ ఇస్తే గొప్ప అనే పరిస్థితి నుంచి మీ బిడ్డ హయాంలో రూ.2,750కి పెంచాం. వైఎస్సార్ పెన్షన్ కానుక కోసం నాలుగేళ్లలో మీ బిడ్డ చేసిన ఖర్చు రూ.75 వేల కోట్లు. ఇందులో నా అవ్వలు, అక్కచెల్లెమ్మలకు మహిళా పక్షపాత ప్రభుత్వంగా రూ.49,845 కోట్లు వెచ్చించాం. ♦ రూపాయి లంచం, వివక్షకు తావు లేకుండా ఈ నాలుగేళ్లలో నేరుగా రూ.2,31,123 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం ఒక చరిత్ర. ♦ నా అక్కచెల్లెమ్మలు రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లోనూ సగభాగం ఇచ్చేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. వారి భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను తీసుకొచ్చాం. దిశ యాప్‌ను 1 కోటి 24 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆపద వేళ పది నిమిషాల్లో సాయం అందేలా చూస్తున్నాం. ఇప్పటిదాకా ఇలా రాష్ట్రంలో 30,369 మందిని కాపాడగలిగాం. అక్కచెల్లెమ్మలతో మాటామంతి సీఎం జగన్ వేదిక వద్ద డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువుల ప్రదర్శనను పరిశీలించారు. అక్కచెల్లెమ్మలతో ఆప్యాయంగా మాట్లాడారు. మహిళలు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలను కలెక్టర్ హిమాన్షు శుక్లా సీఎంకు వివరించారు. ఆ సమయంలో దూరంగా ఉన్న మంత్రి విశ్వరూప్‌ను దగ్గరకు పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకుని, అందరితో కలిసి గ్రూపు ఫొటో దిగారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు చెల్లుబోయిన వేణు, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఎంపీలు పిల్లి సుబాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతా అనూరాధ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ సతీ‹Ùకుమార్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రూ.20 లక్షల రుణం.. రూ.80 వేల వడ్డీ రాయితి అన్నా.. గతంలో మాలాంటి పేదోళ్లకు అప్పు పుట్టేది కాదు. పుట్టినా రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీలు కట్టేవాళ్లం. మీరు సీఎం అయ్యాక వైఎస్సార్ సున్నా వడ్డీ ప«థకం ద్వారా నాలాంటి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని అప్పు వస్తోంది. నేను ఆర్థి కంగా నిలదొక్కుకుని సొంతంగా వ్యాపారం చేసుకునే ధైర్యాన్ని కలిగించావు. నేను రూ.20 లక్షల వరకు రుణం, రూ.80 వేల వరకు వడ్డీ రాయితీ పొందాను. ఈ రోజు నేను జిరాక్స్ సెంటర్, టిఫిన్ సెంటర్‌తో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మీ పథకాలతో నాలుగేళ్లలో మా కుటుంబం రూ.3 లక్షలకు పైగా లబ్ధి పొందింది. మీ మేలు ఎప్పటికీ మరువం. – దుర్గా భవాని, ఉప్పలగుప్తం, భీమనపల్లి మండలం మేనమామగా నిరూపించుకున్నారు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నన్నెంతగానో ఆదుకుంది. గతంలో ఏదైనా వ్యాపారం చేయాలంటే అప్పులతో భయమేసేది. మీ వల్ల నేను ఈ రోజు పాల వ్యాపారం చేస్తూ నెలకు రూ.7వేలు సంపాదిస్తున్నాను. ఇంటికి కొడుకులా, మా బిడ్డలకు మేనమామగా ఉంటానని చెప్పిన మీ మాట అక్షరాలా నిజమని నిరూపించారు. విద్యా ప«థకాల ద్వారా నా కుటుంబం రూ.2.40 లక్షల వరకూ లబ్ధి పొందింది. మీరు తెచ్చిన వలంటీర్ల వ్యవస్థ సేవలు మరువలేనివి. – పి.ధనక్ష్మి, బండార్లంక, అమలాపురం రూరల్ మండలం -
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
పెద్దపల్లిరూరల్: మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు వర్తింపజేశారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నా రు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలో మంగళవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి 91మహిళా సంఘాలకు రూ.7.75కోట్ల చెక్కులు అందించారు. పోలీసు నియామకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బాలికలు ఉన్నత చదువులకు రెసిడెన్షియల్ వసతి కల్పించిందని అడిషనల్ కలెక్టర్ అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, డీఆర్డీఓ శ్రీధర్, సంక్షేమాధికారి రవుఫ్‌ఖాన్, ఉపాధికల్పనాధికారి తిరుపతిరావు, ఆర్అండ్బీ ఈఈ నర్సింహాచారి, రంగారెడ్డి తదితరులున్నారు. నాడు.. నేడు బేరీజు వేసుకోవాలి మంథని: మహిళల అభివృద్ధికి గత ప్రభుత్వాల పనితీరు.. ప్రస్తుతం అమలవుతున్న పథకాలను బేరీజు వేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్లో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవంలో కలెక్టర్ సంగీత, జయశంకర్భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ శ్రీహర్షిణీతో కలిసి మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు ప్రతి దశలో సర్కారు సహాయం అందిస్తోందన్నారు. ముందుగా జెడ్పీ చైర్మన్లు, కలెక్టర్‌కు మహిళలు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. గర్భిణులకు సీమంతం చేశారు. చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, సీడీపీవో పద్మశ్రీ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట గోదావరిఖని: మహిళల సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దుర్గానగర్ ఆర్కే గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ మహిళ దినోత్సవంలో పాల్గొన్నారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ 40 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వీహబ్ ద్వారా 64 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.4కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించామన్నారు. మేయర్ బంగి అనిల్‌కుమార్, జెడ్పీటీసీ అముల నారాయణ, మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, సీడీపీఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: మహిళే మహారాణి
అమ్మ కడుపులోని బిడ్డ మొదలు.. చేతలుడిగిన అవ్వ వరకు.. ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి అందుకు తగ్గ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి.. దాదాపు ప్రతి పథకంలోనూ వారినే లబ్దిదారులుగా గుర్తించి అడుగులు ముందుకు వేస్తోంది. చిన్న చిన్న వ్యాపారాలతో లక్షలాది మందికి శాశ్వత ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంది. ఫలితంగా నాలుగేళ్లలో మహిళా సాధికారత ఏ మేరకు సాధ్యమైందో ఊరూరా కళ్లెదుటే కనిపిస్తోంది. ప్రతి ఇంట్లోనూ మహిళలకు గౌరవం పెరిగింది. సాక్షి, అమరావతి : ఎక్కడ మహిళలకు గౌరవం దక్కుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడిని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళామణులకు అగ్ర తాంబూలం ఇస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలోని మహిళలు ప్రగతిబాటలో పయనిస్తున్నారు. మహోన్నతంగా మహిళా సంక్షేమం అమలవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తోంది. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో మహిళలే కేంద్ర బింధువుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నవరత్నాలు వంటి అనేక పథకాల్లో 90 శాతం పైగా మహిళలే లబ్దిదారులున్నారు. తద్వారా ప్రతి ఇంటిలో మహిళకు అత్యంత ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం దోహదం చేస్తోంది. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, కళ్యాణమస్తు, ఇళ్ల పట్టాలు.. ఇలా అన్ని పథకాల లబ్ధి అక్కచెల్లెమ్మలకే దక్కుతుండటం గమనార్హం. వృద్ధాప్య, వితంతు పింఛన్లు, మహిళల రక్షణ కోసం దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలు కచ్చి తత్వంతో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల దశ, దిశ మార్చిన పథకాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. కళ్లెదుటే రాజకీయ సాధికారత ♦ ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారతలో సాధించిన అద్భుతాలు గమనిస్తే దేశంలో మరే రాష్ట్రం మనకు సాటిలేదని గర్వంగా చెప్పొచ్చు. రాజకీయ సాధికారత విషయమే తీసుకుంటే.. దేశ వ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ బిల్లు చర్చకు వచ్చి న దాఖలాలు లేవు. ♦ కానీ, రాష్ట్రంలో ఏ డిమాండ్లు, ఉద్యమాలు లేకపోయినా వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత ఎవరూ అడగకుండానే పదవుల్లో మహిళలకు సమున్నత వాటా దక్కింది. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసిన సీఎం వైఎస్ జగన్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. ♦ నామినేటెడ్ పదవుల్లో 51 శాతంపైగా పదవులు ఇచ్చి న తొలి ప్రభుత్వం వైస్ జగన్ ప్రభుత్వమే. గ్రామాల్లో వార్డు మెంబర్, పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గర్నుంచి రాష్ట్ర మంత్రి వరకు మహిళలకు పెద్దపీట వేయడం దేశంలోనే రికార్డు. ♦ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్ చైర్మన్‌గా జకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమించారు. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్‌గా వాసిరెడ్డి పద్మ, సభ్యుల నియామకం ద్వారా మహిళల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని చాటారు. ♦ గతంలో మహిళలకు తొలిసారిగా హోం మంత్రి ఇచ్చి న ఘనత దివంగత సీఎం వైఎస్సార్‌దే. ఆ తర్వాత ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్.. మరో రెండడుగులు ముందుకు వేస్తూ రాష్ట్ర హోం మంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితతో పాటు తొలి మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణిని, మలి విడతలో రాష్ట్ర హోం మంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులు అప్పగించారు. ♦ రాష్ట్రంలో 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో ఏడుగురు.. 26 జడ్పీ వైస్‌చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలే. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 మంది మహిళలే ఎన్నికయ్యేలా చేశారు. స్థానిక సంస్థల నుంచి నామినేటెడ్ పదవుల్లోను మహిళలకు అగ్రపీఠం దక్కింది. దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 51 శాతం మహిళలే ఉండటం గమనార్హం. సున్నా వడ్డీ పథకానికి మళ్లీ జీవం ♦ గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల అధిక వడ్డీ ఆగడాల నుంచి మహిళలను ఆదుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పావలా వడ్డీ పథకాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. పొదుపు సంఘాల పేరుతో బ్యాంకు నుంచి తీసుకునే రుణం సకాలంలో చెల్లించే మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. ♦ 2014 తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ పథకానికి నిధులు విడుదల చేయడం ఆపేశారు. దాంతో పొదుపు సంఘాల మహిళలపై కొత్తగా వడ్డీ భారం పడింది. తద్వారా సుమారు 18.36 శాతం పొదుపు సంఘాలు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మిగిలిపోయాయి. అప్పటి దాకా బాగా నడుస్తున్న ‘ఎ’ కేటగిరిలో ఉండే సంఘాలు కూడా ‘సి’, ‘డి’ గ్రేడ్లలోకి పడిపోయాయి. ♦ 2019లో అధికారంలోకి వచ్చి న సీఎం వైఎస్ జగన్.. సున్నా వడ్డీ పథకానికి తిరిగి జీవం పోశారు. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలకు చెందిన 1,02,16,410 ఖాతాల రుణాలకు సంబంధించి బ్యాంకులకు ప్రభుత్వం వడ్డీ రూపేణా రూ.3,615.28 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం 99.6 శాతానికి పైగా పొదుపు సంఘాలు తిరిగి ‘ఎ’ గ్రేడ్‌లో చేరాయి. ఆసరాతో కొండంత భరోసా ♦ గత చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీలతో అప్పుల పాలైన పొదుపు సంఘాల మహిళలను ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్ ఆదుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళా స్వయం సహాయక సంఘాల పేరిట ఉండే బ్యాంకు రుణం మొత్తాన్ని ఈ పథకం కింద నాలుగు విడతల్లో ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ♦ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) వివరాల ప్రకారం ఎన్నికలు జరిగిన ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల పేరిట రూ.25,517 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయా పొదుపు సంఘాలకు చెందిన 78,94,169 మందికి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం రూ.19,178.17 కోట్ల లబ్ధి చేకూర్చింది. శాశ్వత ఉపాధికి ‘చేయూత’ ♦ రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు సైతం ఆర్థిక దన్ను కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ప్రవేశపెట్టింది. అర్హులైన లబ్ధిదారులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 26,39,703 మంది మహిళలకు రూ.14,129.12 కోట్లు అందించింది. ♦ మహిళలకు శాశ్వత జీవనోపాధి కలిగేలా అమూల్, హిందూస్థాన్ యూనీ లీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబుల్, రిలయెన్స్ రిటైల్, అజియో బిజినెస్ వంటి సంస్థలతో ఒప్పందం కుదిర్చింది. ఆయా మల్టీ నేషనల్ సంస్థల సహకారం, ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో రాష్ట్రంలో 5,28,662 కుటుంబాలు వివిధ రకాల వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకొని శాశ్వత జీవనోపా«ధి పొందుతున్నాయి. వైఎస్సార్ సంపూర్ణ పోషణ.. జగనన్న గోరుముద్ద ♦ రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా గర్భిణులు, బాలింతలకు మంచి ఆహారం అందిస్తున్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు, అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి విద్యతోపాటు వారికి అవసరమైన బలమైన ఆహారం, వైద్యం అందిస్తున్నారు. వారికి ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నారు. ♦ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో 43,26,782 మందికి రూ.3,590 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకానికి గత ప్రభుత్వ హయాంలో ఏటా కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. బడికెళ్లే పిల్లలకు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా బలమైన ఆహారాన్ని అందిస్తున్నారు. లక్షాధికారి అవుతున్న పేదింటి మహిళ ♦ సొంతిల్లు అనేది సామాన్య, నిరుపేద ప్రజల కల. సీఎం జగన్ ఈ స్వప్నం నెరవేర్చే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో 30,76,675 మందికి రూ.75,670.05 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అంతటితో ఆగకుండా ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని మహా యజ్ఞంలా చేపట్టారు. ఇప్పటి వరకు 21,31,564 మంది ఇళ్ల నిర్మాణానికి రూ.9,151.79 కోట్లు ఖర్చు చేశారు. ♦ మరోవైపు వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదలపై భారం వేయకుండా కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. ఒక్కో మహిళకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఇంటిని ప్రభుత్వం అందించడం ద్వారా పేదింటి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. మొత్తంగా రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను సమకూరుస్తున్నారు. ♦ వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద ఓసీ మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు 4,38,088 మంది ఈ వర్గం నిరుపేద అక్క చెల్లెమ్మలకు రూ.1,257.04 కోట్లు అందించారు. కాపు నేస్తం, లా నేస్తం వంటి అనేక పథకాల్లోనూ ఓసీ మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేస్తోంది. ♦ పేద తల్లిదండ్రులు తమ ఆడబిడ్డ పెళ్లి చేయడానికి పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 16,668 మంది ఆడబిడ్డల తల్లుల ఖాతాల్లో రూ.125.50 కోట్లు జమ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కారి్మకులకు ఈ పథకాలను వర్తింపజేయడం ద్వారా ఆ వర్గాల్లో సంతోషం నింపారు. అమ్మ ఒడి.. చదువులమ్మ గుడి ♦ ప్రతి తల్లి తన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆకాంక్షిస్తుంది. అటువంటి తల్లుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రతి దశలో విద్యార్థుల చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా మొత్తం ప్రభుత్వమే భరించేలా పథకాలు అమలు చేస్తున్నారు. ♦ మూడేళ్ల వయసులో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే దశ నుంచి పాఠశాల విద్య, ఇంటర్ విద్య, ఉన్నత విద్యను పూర్తి చేసుకొనే వరకు పేద వర్గాల కుటుంబాల్లోని పిల్లల చదువులకు అయ్యే మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పలు పథకాలు ప్రవేశపెట్టారు. పాఠశాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు వీలుగా 8వ తరగతిలోకి వచ్చే పిల్లలకు ప్రతి ఏటా ఉచితంగా ప్రభుత్వం ట్యాబులు అందిస్తోంది. ♦ ఈ నాలుగేళ్లలో జగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ.19,674.34 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన ద్వారా 25,17,245 మందికి రూ.4,275.76 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 26,98,728 మందికి రూ.10,636.67 కోట్లు లబ్ధి చేకూర్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 1,858 మందికి రూ.132.41 కోట్లు ఇచ్చారు. -
మన మహిళలు 'నవ'దుర్గలు
రాష్ట్ర రాజకీయాల్లో అన్నింటా అర్ధ భాగం కంటే అధికంగానే దక్కించుకున్న అతివలు ‘శైలపుత్రి’గా శక్తి సామర్థ్యాలు చాటుకుంటున్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో ‘లలితాదేవి’గా బాలికలు ప్రకాశిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఇంగ్లిష్ మీడియం చదువులతో విజ్ఞానాన్ని సముపార్జిస్తూ ‘గాయత్రి’గా విరాజిల్లుతున్నారు. అమ్మ ఒడితో ‘చదువుల తల్లి’గా రాణిస్తున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, గోరుముద్దతో ‘అన్నపూర్ణదేవి’ని తలపిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూతతో ప్రతి మహిళ ‘మహాలక్ష్మి’గా అవతరిస్తోంది. వైఎస్సార్ పెన్షన్ కానుక, ఇళ్ల పట్టాలతో అక్క చెల్లెమ్మలు ‘దుర్గాదేవి’గా పురోగమిస్తున్నారు. దిశ, సచివాలయ పోలీస్ లాంటి అస్త్రాలతో ప్రతి మహిళా ‘మహిషాసురమర్దిని’గా ధైర్యంగా జీవిస్తోంది. సాక్షి, అమరావతి: నవదుర్గ అవతారాలకు ప్రతి రూపాలుగా ప్రతి అతివ నవరత్నాలతో పురోగమిస్తోంది. సామాజిక, రాజకీయ రంగాల్లో శక్తి స్వరూపిణిగా గుర్తింపు పొందుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర మహిళలు కీర్తి ప్రతిష్టలు సముపార్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో దశ తిరిగిన మహిళా లోకానికి ఇది నిజమైన విజయ దశమిగా అభివర్ణిస్తున్నారు. నవకాంతులు ప్రసాదించడంలో నవరత్నాల పథకాలు కీలకపాత్ర పోషించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహిళా సాధికారతలో సాటిలేదు.. మహిళా సాధికారతలో ఏపీ సాధించిన అద్భుతాలను గమనిస్తే దేశంలో మరే రాష్ట్రం మనకు సాటి లేదని చెప్పొచ్చు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలంటూ 1993 నుంచి పార్లమెంట్లో బిల్లులు పెడుతూనే ఉన్నా ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. మన రాష్ట్రంలో ఏ డిమాండ్లు, ఉద్యమాలు లేకపోయినా వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకే కేటాయిస్తూ చట్టం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. నామినేటెడ్ పదవుల్లో 51 శాతం మహిళలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం ఇదే. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్ ఛైర్మన్‌గా జకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గాను నీలం సాహ్ని నియమితులయ్యారు. గతంలో మహిళకు తొలిసారిగా హోంమంత్రి పదవి ఇచ్చి వైఎస్సార్ రికార్డు సృష్టిస్తే సీఎం వైఎస్ జగన్ హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితకు అవకాశమిచ్చి చిత్తశుద్ధి చాటుకున్నారు. తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి, మలి విడతలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులు అప్పగించారు. రాష్ట్రంలో 13 జడ్పీ ఛైర్మన్ల పదవుల్లో ఏడుగురు మహిళలే ఉన్నారు. 26 జడ్పీ వై‹స్ చైర్మన్ పదవుల్లో 15 మహిళలకే దక్కాయి. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులకుగానూ 18 మంది మహిళలే ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకే అగ్రపీఠం దక్కింది. దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం, దాదాపు 1.30 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో 51 శాతం మహిళలకే ఇవ్వడం విశేషం. ఆసరాతో ఆదుకున్నారు... చంద్రబాబు సర్కారు మోసాలతో అప్పుల పాలైన పొదుపు సంఘాల మహిళలను సీఎం జగన్ వైఎస్సార్ ఆసరాతో ఆదుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న బ్యాంకు రుణాలు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం ఎన్నికలు జరిగిన తేదీ నాటికి 78.76 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్న 7.97 లక్షల పొదుపు సంఘాల పేరిట రూ.25,517 కోట్లు రుణాలు ఉండగా ఇప్పుటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను ప్రభుత్వం ఆయా మహిళల ఖాతాల్లో జమ చేసింది. 2020 సెప్టెంబరులో తొలి విడతలో రూ.6,318.76 కోట్లు, రెండో విడతగా 2021 అక్టోబరులో మరో రూ.6,439.52 కోట్లను మహిళలకు అందజేసింది. సున్నా వడ్డీ పథకానికి మళ్లీ జీవం.. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల అధిక వడ్డీ ఆగడాల నుంచి మహిళలను ఆదుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో పావలా వడ్డీ పథకాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. బ్యాంకు నుంచి తీసుకునే రుణాలను సకాలంలో చెల్లించే పొదుపు సంఘాల మహిళలకు ఈ పథకం ద్వారా వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తోంది. 2014 తర్వాత విభజన అనంతరం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో పథకం అమలు ఆగిపోయింది. పొదుపు సంఘాల మహిళలపై వడ్డీ భారం పడింది. దీనివల్ల సుమారు 18.36 శాతం పొదుపు సంఘాలు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మిగిలిపోయాయి. అప్పటిదాకా బాగా నడుస్తూ ‘ఏ’ కేటగిరిలో ఉన్న సంఘాలు ‘సి’, ‘డి’ గ్రేడ్లలోకి పడిపోయాయి. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ సున్నా వడ్డీ పథకానికి తిరిగి జీవం పోశారు. గత మూడేళ్లలో ఈ పథకం ద్వారా మహిళా సంఘాల రుణాలకు సంబంధించి బ్యాంకులకు రూ.3,615.29 కోట్ల వడ్డీని ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం 99.6 శాతానికి పైగా పొదుపు సంఘాలు ఏ గ్రేడ్‌కు తిరిగి చేరాయి. ‘చేయూత’తో శాశ్వత జీవనోపాధికి శ్రీకారం గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోని 45–60 ఏళ్ల వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు సైతం ఆర్థిక దన్ను కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా అర్హులైన లబ్ధిదారులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తారు. 26.39 లక్షల మంది మహిళలకు మూడు విడతల్లో రూ.14,110.61 కోట్లను ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం చేకూర్చే లబ్ధితో మహిళలకు శాశ్వత జీవనోపాధులు కలిగేలా అమూల్, హిందూస్థాన్ యూనీలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబుల్, రిలయెన్స్ రిటైల్, అజియో లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. మల్టీ నేషనల్ సంస్థల సహకారం, ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో 5,28,662 కుటుంబాలు వివిధ వ్యాపారాలు, ఆదాయ మార్గాల ద్వారా శాశ్వత జీవనోపా«ధి పొందుతున్నాయి. అమ్మ ఒడి.. చదువులమ్మ గుడి ప్రతి తల్లి తన బిడ్డలు మంచి చదువులు చదువుకోవాలని, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తుంది. వాటిని నెరవేర్చేలా విద్యారంగ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ఏటా రూ.వేల కోట్లను ఖర్చు చేస్తున్నారు. చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా ప్రభుత్వమే భరించేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. మూడేళ్ల వయసులో అంగన్వాడీల కేంద్రాలకు వచ్చే దశ నుంచి పాఠశాల విద్య, ఇంటర్ విద్య, ఉన్నత విద్య పూర్తి చేసేవరకు పేద పిల్లల చదువుల వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. సంతృప్తస్థాయిలో వాటిని అమలు చేయడమే కాకుండా తల్లిదండ్రులపై నయాపైసా భారం లేకుండా ప్రభుత్వమే భరిస్తోంది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు–నేడు లాంటి పథకాలను రూ.వేల కోట్లతో అమలు చేస్తున్నారు. డిజిటల్ విద్య అందించేందుకు వీలుగా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ఏటా ఉచితంగా ట్యాబ్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్యా రంగంలో జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నారు. గతంలో ఉన్నత విద్యార్థులకు ఇచ్చే ట్యూషన్ ఫీజులు నామమాత్రంగా ఉండగా ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే భరిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో పాఠశాల, ఉన్నత విద్యపై రూ.55,064.13 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఇందులో పాఠశాల విద్యార్ధుల కోసం రూ.43,236.67 కోట్లు వ్యయం చేయగా ఉన్నత విద్యార్ధుల కోసం రూ.11,827.46 కోట్లు వెచ్చించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 47,32,065 మంది విద్యార్ధులు చదువుతుండగా ఒక్కో విద్యార్థిపై రూ.91,369.56 చొప్పున ఖర్చు చేసింది. ఉన్నత విద్యారంగంలో 11,02,000 మంది విద్యార్ధులుండగా ఒక్కొక్కరిపై రూ.1,07,327 చొప్పున వ్యయం చేసింది. అమ్మ ఒడి కింద ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తుండగా విద్యా దీవెన, వసతి దీవెన నిధులను కూడా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. సంపూర్ణ పోషణ.. గోరుముద్ద రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని సమకూర్చడంతోపాటు అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి బలవర్థక ఆహారం అందిస్తున్నారు. వారికి ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నారు. ఏడు షెడ్యూల్ ప్రాంతాల్లో మంచి పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా 30.16 లక్షల మందికి మేలు జరుగుతోంది. ఈ పథకానికి గత ప్రభుత్వం ఏటా కేవలం రూ.600 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లను వెచ్చిస్తోంది. బడికెళ్లే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా రోజుకో రకమైన మెనూతో బలమైన ఆహారాన్ని అందిస్తున్నారు. లక్షాధికారి అవుతున్న పేదింటి మహిళ సొంతిల్లు సామాన్యుల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రతి అక్కచెల్లెమ్మ తమకంటూ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. మహిళా సాధికారతకు పెద్దపీట‡ వేసిన సీఎం జగన్ రాష్ట్రంలో లక్షల మంది మహిళల సొంతింటి కలను నెరవేర్చే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో 31 లక్షలకుపైగా ఇళ్లను నిర్మిస్తున్నారు. మహిళల పేరిట ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు, పట్టణ, నగర ప్రాంతాల్లో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల విలువైన స్థలాలను మహిళల పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడంతో పాటు పావలా వడ్డీతో రూ.35 వేల చొప్పున రుణ సాయం అందేలా చర్యలు తీసుకుంది. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై ఇనుము, సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలపై భారం వేయకుండా కనీస సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. ఒక్కో మహిళకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఆస్తులను సమకూర్చడం పేదింటి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. మొత్తంగా రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద సమకూరుస్తోంది. అగ్రవర్ణ పేద మహిళలను ఆదుకున్న ప్రభుత్వం వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా అగ్రవర్ణ పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. 45 – 60 ఏళ్ల వయసున్న దాదాపు 3.93 లక్షల మంది ఓసీ అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందుతోంది. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.15 వేల చొప్పున వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇది కాకుండా కాపు నేస్తం, లా నేస్తం లాంటి పథకాల ద్వారా కూడా అగ్రవర్ణ మహిళలకు ప్రభుత్వం మేలు చేస్తోంది. మహిళా భద్రతకు ‘దిశ’ దిక్సూచి మహిళా భద్రతలో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. రాష్ట్ర మహిళల చేతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన బ్రహ్మాస్త్రం దిశ యాప్ ఉంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు నిముషాల్లోనే రక్షణ కల్పించే అన్నలా దిశ యాప్ భరోసానిస్తోంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నిశ్చింతగా ఉండవచ్చన్న విశ్వాసాన్నిస్తోంది. దిశ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించడమే కాకుండా అందుకు అవసరమైన మౌలిక వ్యవస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పెట్రోలింగ్ వాహనాలు, కమాండ్ కంట్రోల్ రూమ్‌తోపాటు ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించింది. దిశ యాప్‌పై సీఎం జగన్ స్వయంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా పోలీసు శాఖ ఇతర శాఖలతో కలసి మహిళలను చైతన్యం చేస్తోంది. ఇప్పటివరకు 1.35 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. దిశ యాప్‌ను ఆశ్రయించడం ద్వారా దాదాపు 12 వేల మంది మహిళలు రక్షణ పొందారు. మన రాష్ట్ర మహిళలు ఇతర రాష్ట్రాల్లో ఆపదలో చిక్కుకున్నా సరే దిశ యాప్ వారిని ఆదుకోవడం విశేషం. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఢిల్లీలో ప్రమాదంలో చిక్కుకుని దిశ యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించగా, మన రాష్ట్ర పోలీసులు తక్షణమే స్పందించి ఢిల్లీ పోలీసుల ద్వారా భద్రత కల్పించి సురక్షితంగా స్వరాష్ట్రానికి తెచ్చారు. మహిళలపై వేధింపులు, దాడుల కేసుల సత్వర దర్యాప్తు, న్యాయస్థానాల్లో విచారణకు కూడా దిశ వ్యవస్థ దోహదపడుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి ఏడు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయగా... 8 నెలల్లో న్యాయస్థానం విచారణ పూర్తిచేసి దోషికి ఉరిశిక్ష విధించేలా చేశారు. దిశ యాప్ ప్రభావంతో రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్సీఆర్బీ) 2021 వెల్లడించింది. మహిళలకు భద్రత కల్పించడంతో సమర్థంగా పని చేస్తున్న దిశ యాప్ జాతీయ స్థాయిలో 19 అవార్డులు సాధించింది. -
ఆసక్తిగా ఏపీలోని మహిళా సంక్షేమ విధానాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, భద్రత కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ వ్యాఖ్యానించారు. జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సమావేశాలు సోమవారం ముగిశాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన సదస్సులో 16 రాష్ట్రాలకు చెందిన మహిళా కమిషన్ చైర్పర్సన్లు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేఖా శర్మ మాట్లాడుతూ.. ఎన్నారై వివాహ మోసాలకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ సంబంధాల విషయంలో పూర్తి వివరాలు ముందుగానే తెలుసుకునేలా యువతులను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఏపీలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు, రక్షణకు తీసుకుంటున్న చర్యలు, మహిళా సాధికారితను వివరించారు. మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మ ఒడి, చేయూత, చేదోడు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ తదితర సంక్షేమ పథకాలతో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటోందని తెలియజేశారు. ‘దిశ’ యాప్, దిశ పోలీస్స్టేషన్ల ద్వారా మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం భరోసా ఇస్తోందని వివరించారు. కాగా, ఏపీ ప్రభుత్వ మహిళా సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకునేందుకు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసినట్లు వాసిరెడ్డి పద్మ చెప్పారు. -
వివాహ వయసు పెంపుపై చర్చ
సాక్షి, అమరావతి: పేదింటి బాలికలు సైతం ఉన్నత విద్యనభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని.. దీనికి అదనంగా యువతుల కనీస వివాహ వయసు పెంపు వంటి చర్యలు మహిళలు తమ లక్ష్యాలను సులువుగా సాధించేందుకు దోహదపడతాయని కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహాల నిషేధ చట్టం (సవరణ)–బిల్లు 2021’పై అన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం ఆన్లైన్ సదస్సు జరిగింది. మన రాష్ట్రం నుంచి కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌తో పాటు వినుకొండ ఎంపీపీ, పలువురు మహిళా సర్పంచ్‌లు విజయవాడ ఏపీఎస్ఐఆర్డీ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. మహిళల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచడం వల్ల కలిగే మంచి, చెడులపై ఎవరేమన్నారంటే.. వివాహ వయసు పెంపును స్వాగతిస్తున్నా.. 21 ఏళ్లు వచ్చిన తర్వాత వివాహాలు జరగడం వల్ల మహిళలకు బిడ్డను కనడానికి అనువుగా శారీరక పరిపుష్టత ఉంటుంది. బాలికల వివాహ వయసు పెంచడం ద్వారా బాలికలు విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వృద్ధిలోకి వస్తారు. – ఉప్పాల హారిక, జెడ్పీ చైర్పర్సన్, కృష్ణా జిల్లా విద్య, వృత్తి నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి 18 ఏళ్ల లోపే వివాహం చేయడాన్ని గ్రామాల్లోను, బలహీన వర్గాల్లోను నిషేధించడం కష్టంగా ఉంది. కాబట్టి మనం వివాహ వయసుపై కాకుండా బాలికా విద్య, వృత్తి నైపుణ్యాల పై దృష్టిసారించాలి. – జయశ్రీ, ఎంపీపీ, వినుకొండ. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారానికి ప్రాధాన్యత వివాహ వయసు పెంపుదల గ్రామ స్థాయిలో పెద్దగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. మనం విద్య, ఆరోగ్యం, కౌమార బాలికలకు పౌష్టికాహారం, సాంకేతిక, వృత్తి విద్యపై పని చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ జగబంధు, సర్పంచ్, శ్రీకాకుళం జిల్లా -
సీఎం చిత్ర పటాలకు క్షీరాభిషేకం
సాక్షి నెట్వర్క్ : వైఎస్సార్ సున్నా వడ్డీ పంపిణీ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం కర్నూలు నగరంలోని స్థానిక కేవీఆర్ గార్డెన్స్‌లోని సచివాలయంలో పొదుపు సంఘాల మహిళలు సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గంలోని నందనపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం ఐకేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి చెక్కులు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి గోకరాజు రామరాజు ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు చెక్కులు పంపిణీ చేశారు. -
కోడలికి అత్తింటి నుంచి జీవనభృతి
సాక్షి, అమరావతి: భర్తను కోల్పోయి, అత్తింటి నుంచి ఆదరణ కరువైన మహిళకు చివరకు రాష్ట్ర మహిళా కమిషన్ జోక్యంతో న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కలకట మండలం కె.బాటవారిపల్లెకు చెందిన రెడ్డి జాహ్నవికి 2020లో వివాహమైంది. ఆమె భర్త గతేడాది కోవిడ్‌తో చనిపోయాడు. అప్పట్నుంచి ఆమె పోషణ విషయంలో అత్తింటి నుంచి పేచీలు, వేధింపులు తప్పలేదు. దిక్కుతోచని స్థితిలో జాహ్నవి చివరికి రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకటలక్ష్మికి కేసు విచారణ బాధ్యతలు అప్పగిస్తూ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలిచ్చారు. దీంతో ఇరుపక్షాలను కమిషన్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. చట్టపరమైన హక్కులతో జాహ్నవికి జరగాల్సిన న్యాయంపై అత్తింటి వారిని ఒప్పించారు. దీంతో అత్తవారింటి నుంచి తన జీవనభృతికి సంబంధించి రావాల్సిన మొత్తాన్ని చెక్కు రూపంలో జాహ్నవికి కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. -
అన్నింట్లో 'ఆమె'కు అగ్రతాంబూలం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన 21 నెలల పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలిస్తూ అగ్ర తాంబూలం కల్పించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చే యడమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను అమలు చేసి చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మహిళా పక్షపాత ప్రభుత్వంగా నిరూపించారు. అ ధికారం చేపట్టిన కొద్దినెలల్లోనే మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నూరుశాతం అమలు చేశారు. తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించి, అడ్డంకు లు సృష్టించినప్పటికీ లక్షలాదిమంది మహిళలను లబ్ధిదారులగా గుర్తించడమే కాకుండా వారికి ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేశారు. 30.60 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాల రూపంలో ఏకంగా 23,535 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అప్పగించారు. ఇందుకోసం 68 వేల ఎకరాలకు పైగా సేకరించారు. మహిళలే కేంద్ర బిందువుగా ఐదు పథకాల ద్వారా 2019 జూన్ నుంచి ఈ ఏడా ది జనవరి వరకు 2,50,44,190 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.26,311.06 కోట్ల నగదు బదిలీ చేశారు. ఈ నగదును బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోని విధంగా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలకు జమచేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కేవలం 21 నెలల వ్యవధిలోనే మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం ఇదే తొలిసారి. హోంమంత్రి పదవి మహిళకు ఇచ్చి రక్షణలో మహిళలకు భరోసా కల్పించారు. తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ హోంమంత్రి పదవిని మహిళకు ఇచ్చా రు. ఇప్పుడు తండ్రి బాటలోనే తనయుడు సీఎం జగన్ కూడా హోం మంత్రి పదవి మహిళకు ఇచ్చా రు. నామినేషన్ పనులు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టాలు చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కింది. వైఎస్సార్ ఆసరా కింద 87.74 లక్షల మందికి రూ.6,792 కోట్లు గత తెలుగుదేశం ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న 14,204 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి, ఎన్నికల ప్రణాళికలో చేర్చి ఆ తర్వాత ఎగనామం పెట్టింది. అయితే జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో తిరిగి అక్క చెల్లెమ్మలకే ఇస్తానని మాట ఇచ్చారు. తొలి విడతగా వైఎస్సార్ ఆసరా పేరిట 87,74,674 మంది మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల కు 6,792.21 కోట్ల రూపాయలను జమచేశారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఆర్థికంగా మరింత బలోపేతంచేసేందుకు వీలుగా ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకుంది. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో ప్రముఖ కంపెనీలు సహకారం అందిస్తున్నాయి. మహిళలు స్వయం ఉపాధి కింద ఏర్పాటు చేసుకునే షాపులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తోంది. వైఎస్సార్ చేయూత కింద రూ.4,604.13 కోట్లు వైఎస్సార్ చేయూత కింద 45–60 సంవత్సరాల మధ్య వయస్సున్న 24,55,534 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.4,604.13 కోట్లు జమ చేసింది. ఏటా 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆరి్థక సాయం అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో ఇప్పటికే రూ.4,604.13 కోట్లు మహిళల ఖాతాలకు జమ చేసింది. అమ్మ ఒడి కింద రూ.13,022.93 కోట్లు జమ పేదరికం కారణంగా తమ పిల్లలను చదివించకుం డా ఏ తల్లీ ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఏటా పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15 వేలు ఇస్తున్నారు. రెండేళ్లలో 44,48,865 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ,13,022.93 కోట్లను జమ చేశారు. కాపునేస్తం కింద రూ.491.79 కోట్లు కాపుల్లో పేద మహిళలకు ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం కింద ఏటా ఒక్కో మహిళకు రూ.15 వేలు ఇస్తారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో భరోసా ఇప్పటికే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్.. జగనన్న విద్యా దీవెన కింద 18,80,934 లక్షల మందికి రూ.4,101.08 కోట్లను చెల్లించారు. జగనన్న వసతి దీవెన కింద ఇప్పటికే 15,56,956 మందికి రూ.1,220.99 కోట్ల నగదు జమ చేశారు. ఇక నుంచి ఈ సొమ్మును కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం నిర్ణయించారు. సున్నా వడ్డీ కింద రూ.1,400.08 కోట్లు గత తెలుగుదేశం ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీకి కూడా మంగళం పలికింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు కొన్ని నెలల పాలనలోనే పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ నిధులను కూడా వారి ఖాతాలకు నేరుగా జమ చేశారు. పొదుపు సంఘాల్లోని 90,37,255 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.1,400.08 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేసి మెరుగైన జీవనోపాధికి బాటలు వేసింది. మహిళలకు మహోన్నత దిశ ‘సంకల్పం మంచిదైతే.. మంచి ఫలితాలు అవే వస్తాయి’ అనే ఆర్యోక్తికి అచ్చంగా అతికినట్టుగా ‘దిశ’ సాధిస్తున్న అద్భుత ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క మహిళ, బాలిక ఇబ్బం ది పడకూడదనే మహోన్నత సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘దిశ’ ద్వారా వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తున్న సంగతి తెల్సిందే. తెలంగాణలో దిశ ఘటన గురించి తెలుసుకుని చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు, విద్యార్థినికి అటువంటి పరిస్థితి రాకూడదని దిశ చట్టం కోసం అసెంబ్లీలో 2019లో బిల్లును పెట్టి ఆమోదించారు. దానిపై కేంద్రం కొన్ని సూచనలు చేయడంతో ఏపీ దిశ చట్టం–2020 (కొత్త బిల్లు)ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. పలు రాష్ట్రాలు దీని అమలుకు చర్యలు చేపట్టడం విశేషం. దిశ కార్యక్రమానికి ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. మహిళల చేతిలో విల్లు.. దిశ బిల్లు ► ‘దిశ’ కింద పలు కార్యక్రమాలను చేపట్టడంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం అందుతోంది. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్‌శాఖ అనేక చ ర్యలు చేపట్టాయి. జీరో ఎఫ్ఐఆర్ పద్ధతి అమలు జరుగుతోంది. బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంది. ► రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా హెల్ప్ కియోస్క్‌లు, 700 పోలీస్ స్టేషన్లలో ఉమెన్ స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేశారు. దిశ పోలీస్ స్టేషన్లకు 18 దిశ ఇంటిగ్రేటెడ్ క్రైం సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్ (కస్టమైజ్డ్ బస్‌లను) అందిం చారు. ఈ బస్సుల్లోని సాంకేతికతను తెలుసుకుని ప్రధాని మోదీ అభినందించారు. ► తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 11 ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మహిళా పోలీసులకు 900 పెట్రోలింగ్ వెహికల్స్ (ద్విచక్ర వాహనాలు) అందిస్తున్నారు. ► మహిళలు, విద్యార్థినులు వారి మొబైల్స్ ద్వారా స్కాన్ చేసుకునేలా జిల్లా కేంద్రాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో 50 దిశ సైబర్‌సేఫ్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అతివకు రక్షణ కవచం.. రాష్ట్రంలో మహిళలకు ‘దిశ’ పటిష్టమైన కవచంగా నిలుస్తోంది. దిశ కార్యక్రమం వల్ల మహిళలపై నేరాలు 7.5 శాతం తగ్గడం విశేషం. దిశ బిల్లులో ప్రస్తావించినట్టు ఏడు రోజుల్లోనే 561 కేసుల్లో, 15 రోజుల్లో 1,157 కేసుల్లో చార్జిషీట్ వేశారు. ఇప్పటివరకు 108 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మహిళలను సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్న 1,531 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్స్ తెరిచారు. లైంగిక వేధింపులకు పాల్పడే 1,194 మందిపై షీట్స్ తెరిచారు. లైంగిక వేధింపులకు పాల్పడే 2,02,805 మందిపై నిరంతరం నిఘా ఉంచారు. దిశ యాప్..సూపర్ దిశ కార్యక్రమంలో భాగంగా ఏపీ పోలీస్ అందుబాటులోకి తెచ్చిన మొబైల్ యాప్ సూపర్ అని మహిళలు జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలో 12.57 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. 1,17,275 మంది పోలీస్ సహాయం కోసం ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేశారు. నియామకాల్లో, సేవల్లో ఆమెకే పెద్దపీట రాష్ట్రంలో సేవల రంగంలో అతిపెద్ద శాఖగా వైద్య ఆరోగ్యశాఖకు పేరుంది. ఈ శాఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళలకే పెద్దపీట వేసింది. ఉద్యోగ నియామకాల నుంచి, లబ్ధిదారులకు సేవలు అందించడం వరకు ‘ఆమె’కే ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో ఏ ప్రభుత్వమూ చే యని విధంగా ఎక్కువమంది మహిళలను ఉద్యోగా ల్లో నియమించిన రికార్డు ఈ ఏడాదిన్నరలో సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వచ్చే మహిళా రోగులకు మెరుగైన సేవలు అందించ డంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిం దే. రకరకాల కోర్సులు చదివి ఏళ్ల తరబడి ఎలాంటి నియామకాలు లేక నిరుద్యోగులుగా ఉన్న వేల మంది మహిళలు ఉద్యోగావకాశాలు పొందారు. ఏడాదిన్నరలో మహిళలకు అండగా... ► ఒక్క ఏడాదిలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో భాగంగా 13 వేలమంది ఏఎన్ఎంలను నియమించారు. ► అరకొర పారితోషికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆశా కార్యకర్త్తలకు ఒకేసారి రూ.10 వేల వేతనం చేసిన ఘనత ఈ సర్కారుదే. గతంలో వీరికి రూ.3 వేలే ఇచ్చేవారు. ► రాష్ట్రంలో 680 సివిల్ అసిస్టెంట్ పోస్టుల నియామకం జరిగితే, అందులో 300 మంది, బోధనాసుపత్రుల్లో 700 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు జరిగితే అందులో 330 మంది మహిళలున్నారు. ► గ్రామాల్లో వైద్య సేవలు అందించడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లుగా ఇప్పటికే 1000 మంది నియమితులయ్యారు. త్వరలోనే మరో 5 వేల మందిని నియమించబోతున్నారు. ► మాతాశిశు సంరక్షణ కోసం ఎంఎస్ఎస్ యాప్‌ను రూపొందించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుఖ ప్రసవాల కోసం ప్రతి సీహెచ్‌సీలో వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ► మహిళల కోసం అన్ని బోధనాసుపత్రుల్లో హైడె న్సిటీ డెలివరీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నా రు. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ చికిత్సల సంఖ్య పెంచడంతో ఎక్కువమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ► వేలాదిమంది అవ్వలు కంటివెలుగు కార్యక్ర మం ద్వారా చీకటి నుంచి కంటివెలుగు పొందా రు. మెడికల్, పారామెడికల్ కోర్సుల్లోను ఎక్కు వమంది మహిళల నియామకాలు జరిపారు. -
షీ టీమ్స్ పనితీరు భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్ పనితీరుపై 96 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 4 శాతం మంది తాము చేసిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను తెలపకపోవడం, ఫిర్యాదు చేసేందుకు వెళితే సరిగ్గా స్పందించలేదని చెప్పారు. ఈ గణాంకాలను పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో షీ టీమ్స్ సంబంధిత నేరాలపై స్పందించిన అధికారులతో ఒక్క రోజు ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని షీ టీమ్స్ అధికారులు, షీ టీమ్స్‌కు పట్టుబడ్డ దాదాపు 120 మంది నిందితులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని స్వాతిలక్రా పేర్కొన్నారు. షీ టీమ్స్ పనితీరుపై ప్రముఖ సంస్థ ‘సెస్’ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే చేయించామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపుల కేసులు, ఈవ్ టీజింగ్‌లపై అధికంగా వాట్సాప్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని కేసులుగా నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న డీఐజీ సుమతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో షీ టీమ్స్ పనితీరుపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్‌లో షీటీమ్స్‌కు పట్టుపడ్డ వారిలో అధికంగా విద్యావంతులు, మేజర్లే ఉన్నారన్నారు. తప్పు చేస్తే ఎవరినీ వది లేది లేదని.. సైబరాబాద్ పరిధిలో మహిళలను వేధించిన ఘటనలో 51 ఏళ్ల వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే ఇం దుకు నిదర్శనమన్నారు. కాగా, మనో చేతనకు చెందిన గీతా చల్లా ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. నవంబర్‌లో అధికంగా ఫిర్యాదులు నవంబర్‌లో షీ టీమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 464 ఫిర్యాదులు అందాయి. ఇందులో నేరుగా 151, పరోక్షంగా (వాట్సాప్, ఈ–మెయిల్, ట్విటర్, హాక్–ఐ) 313 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఫోన్ ద్వారా వేధింపులు కాగా, 246 ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు తదితరాలు ఉన్నాయి. వీరిలో 90 మందిని హెచ్చరించి, 82 మందికి కౌన్సెలింగ్ చేసి పంపారు. 56 మందిపై కేసులు నమోదు కాగా, 52 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆమే’ రాణి
స్త్రీలు ఎక్కడైతే గౌరవింప బడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. స్త్రీలను గౌరవించే చోట విజయం సిద్ధిస్తుంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వం లోని ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం దీనిని అక్షరాలా అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో మహిళాసాధికారత, మహిళాభ్యు న్నతి, మహిళల రక్షణ అనేవి వారి అవసరం వచ్చి నప్పుడు మాత్రమే గుర్తుకొచ్చేవి. నిజం చెప్పా లంటే వారి శ్రేయస్సు కోసం పాటుపడింది మాత్రం శూన్యం. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు సమీ పిస్తున్న వేళ మహిళలను మభ్యపెట్టడానికి అప్పటి కప్పుడు కొన్ని పథకాలు ప్రకటించినా, అవి కేవలం ఎన్నికల స్టంటేనని రాష్ట్ర మహిళలు గ్రహించారు. అందుకే జగనన్నను తమ తోబుట్టువుగా ఆదరించి, ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించారు. వైఎస్ జగన్ ఎన్నికల ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో ఎక్కడ ఆగి తన ఉపన్యాసాన్ని ప్రారంభించినా, తొలుత ‘నా అక్క చెల్లెమ్మలు’ అని ఎంతో ప్రేమతో సంబోధించేవారు. ఎన్నికల తద నంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి స్వీక రించిన తర్వాత ఒక గిరిజన మహిళకు ఉప ముఖ్య మంత్రి పదవి కేటాయించడం, మంత్రి వర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన హోం శాఖను దళిత మహిళకు కట్టబెట్టడం గమనిస్తే మహిళల పట్ల ఆయనకు ఎంతటి గొప్ప ఆదరణ, గౌరవం ఉందో తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి నాయకుడు వైఎస్ జగన్. మహిళల కోసం కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల పరి షత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా మహిళ లకు విస్తారంగా అవకాశాలు లభించనుండటం వల్ల స్థానిక సమస్యలు సమర్థవంతంగా పరిష్క రించుకోవచ్చు. సర్పంచులుగా మహిళలు చిత్త శుద్ధితో పనిచేసి గ్రామ పరిధిలో అభివృద్ధికి బాటలు వేసే సదవకాశం ఈ ప్రభుత్వం కల్పిం చింది. గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ‘అమూల్’తో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకం. తద్వారా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడమే కాకుండా మహిళలకు ఈ రంగంలో ఎంతో ఉపాధి లభించి చేదోడుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప ట్టిన తర్వాత మన రాష్ట్ర అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలను ఏడాది తిరక్కముందే అమలు చేసి చూపించారు. పిల్లల్ని బడికి పంపే తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందించారు. అమ్మఒడి పథకంతో 43 లక్షలమంది తల్లులకు లబ్ధి చేకూరింది. విద్యాదీవెన పథకంతో దాదాపు 12 లక్షలమంది తల్లులకు వారి పిల్లల చదువుకయ్యే (డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులు)కు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. 12 లక్షలమంది తల్లులకు వారి పిల్లల చదువులకు అయ్యే భోజన, వసతి ఖర్చులకు గాను ఏటా రూ. 20,000లు రెండు దఫాలుగా చెల్లిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మార్కెట్ యార్డు కమిటీలు, దేవాలయ కమిటీలు లాంటి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మహిళల భద్రత కోసం దిశచట్టం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళల బతుకులు బాగుపడాలని మద్యపాన నియం త్రణ చట్టం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది మహి ళలకు వారి పేరుమీదనే ఇళ్ల పట్టాలు అక్టోబర్‌లో ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 91 లక్షల మంది డ్వాక్రా మహి ళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులకు సంబంధించి ప్రభుత్వం ‘వైఎస్సార్ పావలా వడ్డీ’ పథకం ద్వారా మొత్తం వడ్డీని భరించి రూ.1,400 కోట్లు చెల్లించింది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 45 ఏళ్లనుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఆర్థికంగా వెనుకబడిన కాపు మహిళలకు ఏటా రూ.15,000 చొప్పున వెఎస్సార్ కాపు నేస్తంలో భాగంగా ఆర్థిక సహాయం చేస్తు న్నారు. బిడ్డను ప్రసవించిన ప్రతి తల్లికి ‘ఆరోగ్య ఆసరా’ పథకం ద్వారా రూ.5,000 ఆర్థిక సహాయం చేస్తున్నారు. సంక్షేమ కార్య క్రమాల్లో మహిళలకు పెద్దపీట వేసిన ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్. మహిళా స్వావలంబన దిశగా అనేక సంక్షేమ కార్యక్రమా లను ఏడాది కాలం లోనే చేపట్టి, వాటిని విజయ వంతంగా అమలు చేస్తున్న మన సీఎం జగన్‌ను రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు తమ సొంత బిడ్డలా, సోదరుడిలా ఎంతో వాత్సల్యంతో చూసుకుంటు న్నారనడంలో అతిశయోక్తి లేదు. మహిళా సాధికా రత, సంక్షేమం, రక్షణ.. దిశగా దేశానికే ఆదర్శ ప్రాయుడయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ‘ఆమె’ను రాణిగా చేశారు. వ్యాసకర్త ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ చల్లా రామకృష్ణారెడ్డి -
స్త్రీలోక సంచారం
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ప్రపంచ మహిళల ట్వంటీ–20 పోటీలలో సెంచరీ చేసిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు. దక్షిణ అమెరికాలోని ఉత్తర అట్లాంటిక్ తీరంలో ఉన్న గుయానాలో నవంబర్ 9న న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కౌర్ ఈ అత్యద్భుతమైన విజయం సాధించారు. నవంబర్ 9న మొదలైన ఈ ప్రపంచ మహిళల ట్వంటీ 20 మ్యాచ్‌లు నవంబర్ 24న యాంటీగువాలో ముగుస్తాయి. 22న సెమీ ఫైనల్స్. సెమీ ఫైనల్స్ చేరడానికి ముందు వరకు భారత మహిళల జట్టు నవంబర్ 11న పాకిస్తాన్‌తో, నవంబర్ 15న ఐర్లాండ్‌తో, నవంబర్ 17న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ కూడా గుయానాలోనే జరుగుతాయి. ట్వంటీ–20 ఆడుతున్న జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు.. స్మృతి మంథన, మిథాలీరాజ్, జమీమా రోడ్రిగ్స్, వేదాకృష్ణమూర్తి, దీప్తీ శర్మ, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, అనూజా పాటిల్, ఏక్తా భిస్త్, దయాళన్ హేమలత, మోన్సీ జోషీ, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి ఉన్నారు. ఈ మంగళ, శుక్రవారాలు శబరిమలకు సంబంధించి అత్యంత కీలకమైన రోజులు కానున్నాయి. నవంబర్ 16న శబరిమల ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇక అప్పట్నుంచీ 41 రోజుల పాటు నిరవధికంగా ఆలయ పూజలు జరుగుతాయి. నవంబర్ 13న (రేపు).. స్త్రీలకు ఆలయ ప్రవేశ హక్కును కల్పిస్తూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పన్నెండుకు పైగా వాదనలపై సుప్రీంకోర్టు సమీక్ష జరుపుతుంది. వాదోపవాదాలు ఎలా ఉన్నా.. ఈ ‘మండల’ కాలంలో శబరిమలను సందర్శించుకోవడానికి ఇప్పటి వరకు ఆన్లైన్లో 560 మందికిపైగా మహిళలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరోవైపు, కొచ్చి, తిరువనంతపురం నుంచి శబరిమల వస్తున్న మహిళా భక్తులను భద్రత కారణాల రీత్యా హెలికాప్టర్లో తరలించడంలోని సాధ్యాసాధ్యాలపై కేరళ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. భారతదేశంలో వివాహమైన ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు.. భర్త పెట్టే హింసకు గురవుతున్నారని వడోదరలోని ‘సహజ్’ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడయింది. యు.కె.లోని ‘ఈక్వల్ మెజర్స్ 2030’ అనే సంస్థతో కలిసి ‘సహజ్’ నిర్వహించిన ఈ సర్వేలో.. ‘ఒకవైపు ఆర్థికంగా పురోగమిస్తున్న ఇండియా.. లైంగిక వివక్ష విషయంలో మాత్రం తిరోగమిస్తోందనీ.. స్త్రీల సంక్షేమం, ఆరోగ్యం, స్త్రీల భద్రత, రక్షణ అనేవి ఏమాత్రం ప్రాముఖ్యంలేని అంశాలు అయిపోయాయని’ సర్వే నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. -
మహిళా సంక్షేమానికి సీఎం కృషి
ఆదిలాబాద్‌రూరల్ : రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ మహిళలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రల ముఖ్యమంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను అభినందిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం 32 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, వైస్‌ఎంపీపీ గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నైతం శుక్లాల్, ఖయ్యుం, యూనుస్ అక్బానీ, ఎంపీడీవో రాథోడ్ రవీందర్, తహసీల్దార్ మధుకర్, తదితరులు పాల్గొన్నారు. -
శిశు సంక్షేమ శాఖ పీడీ నిర్మల సస్పెన్షన్
కొరిటెపాడు (గుంటూరు) : జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.జె. నిర్మలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు పామాయిల్ ప్యాకెట్ల సరఫరా వ్యవహారంలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలపై ఆమెను విధుల నుంచి తొలగించారు. పామాయిల్ ప్యాకెట్లను సరఫరాచేసే కాంట్రాక్టర్ ఆదిత్య ట్రేడర్స్‌తో కుమ్మక్కై ఎమ్మార్పీ కంటే అధికంగా కొనుగోలు చేసి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఆమె ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం ఆమెను తొలగిస్తూ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై శాఖాపరమైన విచారణ నిర్వహించి తుది నివేదిక రావడంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేయొద్దు
రాయచోటి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోజు రోజుకు డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన కార్యలయంలో విలేకర్లతో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు సరైన ప్రోత్సాహం, అవగాహన కల్పించలేకపోవడం వల్ల ఎం తో మంది మహిళలు సంఘాలలో చేరడానికి వెనుకడుగు వేస్తున్నారన్నారు. ప్రభు త్వ తీరు వల్లనే వేలాది సంఘాలు వెనుకబడి(సిక్) పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి జరుగుతున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఆదరణ, మంచి స్పందన లభిస్తోందన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయడంలేదని ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. బ్యాంకులలో తాకట్టుపెట్టిన బంగారు, అప్పు తీసుకున్న ప్రతి రూపాయిని మాఫీ చేస్తామన్నారు.. మహిళలకు సెల్ఫోన్లు ఇస్తామన్నారు.. రాయచోటిలో మహిళాపోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.. వీటిలో ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలపైన ప్రజలు మండిపడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చాలా పల్లెల్లో సక్రమంగా పంటలు పండక, కుటుంబపోషణ కోసం పాడిపశువులపై దృష్టి పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత హెరిటేజ్ సంస్థ బాగుకోసం ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీని నిర్వీర్యం చేసి, లీటరు పాలును రూ.20లకే కొనుగోలు చేసి, ఐదారు నెలల పాటు బిల్లులు చెల్లించక, పాడిరైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నట్లు తెలిపారు. హెరిటేజ్‌కు పాలు పోయడానికి రైతులు సిద్ధమేనని, అయితే గిట్టుబాటు ధర లీటరుకు రూ.30లు చేసి క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తే చాలన్నారు. అలా చేస్తే రైతుకుల భరోసా కల్గించినట్లువుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తే లీటరు పాలు ధర రూ.30లు చేస్తామన్నారు. గతంలో చెప్పిన ప్రకారం డ్వాక్రా అక్క , చెల్లెల్లకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. -
'మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'
అల్లాదుర్గం (మెదక్ జిల్లా) : మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన అల్లాదుర్గం పట్టణంలో దీపం పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు గ్యాస్ సిలండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కట్టెల పోయ్యిలతో బాధపడకూడదనే ఉద్దేశంతోనే గ్యాస్ కనేక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ్గానికి 5 వేల కనేక్షన్లు మంజూరయినట్లు తెలిపారు. విడతల వారిగా అర్హూలైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మంజూరు చేస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మంజూరు చేసినట్లు ఆయన ఆరోపించారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ, వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఎంపీపీ రాంగారి ఇందిర, జెడ్పీటీసీ కంచరి మమత, వైస్ ఎంపీపీ బిక్షపతి, ఎంపీడీఓ కరుణశీల, తహశీల్దార్ చంద్రకళ, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సుభాశ్‌రావ్, టీఆర్ఎస్ నాయకులు ప్రతాప్‌లింగాగౌడ్, ఎంపీటీసీలు అనూరాధ, శివాజీరావ్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో 'కళ్యాణలక్ష్మి'కి ప్రత్యేక నిధులు
-
ఆకాశంలో సగం.. కళ్యాణలక్ష్మికి రూ. 230 కోట్లు
మహిళల సంక్షేమానికి తాము పెద్దపీట వేస్తామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ''సమాజంలో సగభాగం మహిళలు. అమ్మాయి అంటే భారంగా పరిగణిస్తున్నారు. ఆడపిల్లలు పుట్టగానే చంపేయడానికి కూడా వెనకాడట్లేదు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చాలా కష్టం. అందుకోసం వారికి 51 వేల రూపాయల చొప్పున అందించాలని ప్రతిపాదిస్తున్నాం. ఈ పథకానికి 'కళ్యాణలక్ష్మి' అని పేరు పెడుతున్నాం. మొత్తం దీనికోసం ఎస్సీలకు రూ. 150 కోట్లు, ఎస్టీలకు రూ. 80 కోట్ల వంతున మొత్తం 230 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మహిళలకు ఎక్కడా భద్రత లేకుండా పోతోంది. మహిళల రక్షణ, దేశభద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మహిళా అధికారులతో నియమించిన కమిటీ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఈవ్ టీజింగ్ నిరోధానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేశాం. మహిళల భద్రతకు 10వేల కోట్లు కేటాయించాం.'' అని ఆయన అన్నారు.