అన్నింట్లో 'ఆమె'కు అగ్రతాంబూలం | CM Jagan who proved to be a women partisan government | Sakshi
Sakshi News home page

అన్నింట్లో 'ఆమె'కు అగ్రతాంబూలం

Published Mon, Mar 8 2021 4:57 AM | Last Updated on Mon, Mar 8 2021 7:07 PM

CM Jagan who proved to be a women partisan government - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన 21 నెలల పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలిస్తూ అగ్ర తాంబూలం కల్పించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చే యడమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను అమలు చేసి చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మహిళా పక్షపాత ప్రభుత్వంగా నిరూపించారు. అ ధికారం చేపట్టిన కొద్దినెలల్లోనే  మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నూరుశాతం అమలు చేశారు. తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించి, అడ్డంకు లు సృష్టించినప్పటికీ లక్షలాదిమంది మహిళలను లబ్ధిదారులగా గుర్తించడమే కాకుండా వారికి ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేశారు. 30.60 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాల రూపంలో ఏకంగా 23,535 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అప్పగించారు. ఇందుకోసం 68 వేల ఎకరాలకు పైగా సేకరించారు. మహిళలే కేంద్ర బిందువుగా ఐదు పథకాల ద్వారా 2019 జూన్‌ నుంచి ఈ ఏడా ది జనవరి వరకు 2,50,44,190 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.26,311.06 కోట్ల నగదు బదిలీ చేశారు. ఈ నగదును బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోని విధంగా అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాలకు జమచేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కేవలం 21 నెలల వ్యవధిలోనే మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం ఇదే తొలిసారి. హోంమంత్రి పదవి మహిళకు ఇచ్చి రక్షణలో మహిళలకు భరోసా కల్పించారు. తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్సార్‌ హోంమంత్రి పదవిని మహిళకు ఇచ్చా రు. ఇప్పుడు తండ్రి బాటలోనే తనయుడు సీఎం జగన్‌ కూడా హోం మంత్రి పదవి మహిళకు ఇచ్చా రు. నామినేషన్‌ పనులు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టాలు చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కింది. 

వైఎస్సార్‌ ఆసరా కింద 87.74 లక్షల మందికి రూ.6,792 కోట్లు  
గత తెలుగుదేశం ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న 14,204 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి, ఎన్నికల ప్రణాళికలో చేర్చి ఆ తర్వాత  ఎగనామం పెట్టింది. అయితే జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో తిరిగి అక్క చెల్లెమ్మలకే ఇస్తానని మాట ఇచ్చారు. తొలి విడతగా వైఎస్సార్‌ ఆసరా పేరిట 87,74,674 మంది మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల కు 6,792.21 కోట్ల రూపాయలను జమచేశారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఆర్థికంగా మరింత బలోపేతంచేసేందుకు వీలుగా ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకుంది. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంలో ప్రముఖ కంపెనీలు సహకారం అందిస్తున్నాయి. మహిళలు స్వయం ఉపాధి కింద ఏర్పాటు చేసుకునే షాపులకు బ్రాండింగ్‌ కల్పించేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తోంది.  

వైఎస్సార్‌ చేయూత కింద రూ.4,604.13 కోట్లు
వైఎస్సార్‌ చేయూత కింద 45–60 సంవత్సరాల మధ్య వయస్సున్న 24,55,534 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.4,604.13 కోట్లు జమ చేసింది. ఏటా 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల  ఆరి్థక సాయం అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో ఇప్పటికే రూ.4,604.13 కోట్లు మహిళల ఖాతాలకు జమ చేసింది. 

అమ్మ ఒడి కింద రూ.13,022.93 కోట్లు జమ 
పేదరికం కారణంగా తమ పిల్లలను చదివించకుం డా ఏ తల్లీ ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.  ఏటా పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15 వేలు ఇస్తున్నారు. రెండేళ్లలో 44,48,865 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ,13,022.93 కోట్లను జమ చేశారు.  

కాపునేస్తం కింద రూ.491.79 కోట్లు 
కాపుల్లో పేద మహిళలకు ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం కింద 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం కింద ఏటా ఒక్కో మహిళకు రూ.15 వేలు ఇస్తారు. 

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో భరోసా 
ఇప్పటికే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. జగనన్న విద్యా దీవెన కింద 18,80,934 లక్షల మందికి రూ.4,101.08 కోట్లను చెల్లించారు. జగనన్న వసతి దీవెన కింద ఇప్పటికే 15,56,956 మందికి రూ.1,220.99 కోట్ల నగదు జమ చేశారు.  ఇక నుంచి ఈ సొమ్మును కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం నిర్ణయించారు.

సున్నా వడ్డీ కింద రూ.1,400.08 కోట్లు
గత తెలుగుదేశం ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీకి కూడా మంగళం పలికింది. అయితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట మేరకు కొన్ని నెలల పాలనలోనే పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ నిధులను కూడా వారి ఖాతాలకు నేరుగా జమ చేశారు. పొదుపు సంఘాల్లోని 90,37,255 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.1,400.08 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేసి మెరుగైన జీవనోపాధికి బాటలు వేసింది. 

మహిళలకు మహోన్నత దిశ
‘సంకల్పం మంచిదైతే.. మంచి ఫలితాలు అవే వస్తాయి’ అనే ఆర్యోక్తికి అచ్చంగా అతికినట్టుగా ‘దిశ’ సాధిస్తున్న అద్భుత ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క మహిళ, బాలిక ఇబ్బం ది పడకూడదనే మహోన్నత సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘దిశ’ ద్వారా వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తున్న సంగతి తెల్సిందే. తెలంగాణలో దిశ ఘటన గురించి తెలుసుకుని చలించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. తన రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు, విద్యార్థినికి అటువంటి పరిస్థితి రాకూడదని దిశ చట్టం కోసం అసెంబ్లీలో 2019లో బిల్లును పెట్టి ఆమోదించారు. దానిపై కేంద్రం కొన్ని సూచనలు చేయడంతో ఏపీ దిశ చట్టం–2020 (కొత్త బిల్లు)ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. పలు రాష్ట్రాలు దీని అమలుకు చర్యలు చేపట్టడం విశేషం. దిశ కార్యక్రమానికి ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. 

మహిళల చేతిలో విల్లు.. దిశ బిల్లు
► ‘దిశ’ కింద పలు కార్యక్రమాలను చేపట్టడంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం అందుతోంది. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్‌శాఖ అనేక చ ర్యలు చేపట్టాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌ పద్ధతి అమలు జరుగుతోంది.  బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంది. 
► రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేకంగా హెల్ప్‌ కియోస్క్‌లు, 700 పోలీస్‌ స్టేషన్‌లలో ఉమెన్‌ స్పెషల్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. దిశ పోలీస్‌ స్టేషన్‌లకు 18 దిశ ఇంటిగ్రేటెడ్‌ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్‌ (కస్టమైజ్డ్‌ బస్‌లను) అందిం చారు. ఈ బస్సుల్లోని సాంకేతికతను తెలుసుకుని ప్రధాని మోదీ అభినందించారు. 
► తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. 11 ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మహిళా పోలీసులకు 900 పెట్రోలింగ్‌ వెహికల్స్‌ (ద్విచక్ర వాహనాలు) అందిస్తున్నారు. 
► మహిళలు, విద్యార్థినులు వారి మొబైల్స్‌ ద్వారా స్కాన్‌ చేసుకునేలా జిల్లా కేంద్రాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో 50 దిశ సైబర్‌సేఫ్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 

అతివకు రక్షణ కవచం..
రాష్ట్రంలో మహిళలకు ‘దిశ’ పటిష్టమైన కవచంగా నిలుస్తోంది. దిశ కార్యక్రమం వల్ల మహిళలపై నేరాలు 7.5 శాతం తగ్గడం విశేషం. దిశ బిల్లులో ప్రస్తావించినట్టు ఏడు రోజుల్లోనే 561 కేసుల్లో, 15 రోజుల్లో 1,157 కేసుల్లో చార్జిషీట్‌ వేశారు. ఇప్పటివరకు 108 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మహిళలను సోషల్‌ మీడియా ద్వారా వేధిస్తున్న 1,531 మందిపై సైబర్‌ బుల్లీయింగ్‌ షీట్స్‌ తెరిచారు. లైంగిక వేధింపులకు పాల్పడే 1,194 మందిపై షీట్స్‌ తెరిచారు. లైంగిక వేధింపులకు పాల్పడే 2,02,805 మందిపై నిరంతరం నిఘా ఉంచారు. 

దిశ యాప్‌..సూపర్‌
దిశ కార్యక్రమంలో భాగంగా ఏపీ పోలీస్‌ అందుబాటులోకి తెచ్చిన మొబైల్‌ యాప్‌ సూపర్‌ అని మహిళలు జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలో 12.57 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 1,17,275 మంది పోలీస్‌ సహాయం కోసం ఎస్‌ఓఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేశారు.  

నియామకాల్లో, సేవల్లో ఆమెకే పెద్దపీట
రాష్ట్రంలో సేవల రంగంలో అతిపెద్ద శాఖగా వైద్య ఆరోగ్యశాఖకు పేరుంది. ఈ శాఖలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళలకే పెద్దపీట వేసింది. ఉద్యోగ నియామకాల నుంచి, లబ్ధిదారులకు సేవలు అందించడం వరకు ‘ఆమె’కే ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో ఏ ప్రభుత్వమూ చే యని విధంగా ఎక్కువమంది మహిళలను ఉద్యోగా ల్లో నియమించిన రికార్డు ఈ ఏడాదిన్నరలో సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వచ్చే మహిళా రోగులకు మెరుగైన సేవలు అందించ డంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిం దే. రకరకాల కోర్సులు చదివి ఏళ్ల తరబడి ఎలాంటి నియామకాలు లేక నిరుద్యోగులుగా ఉన్న వేల మంది మహిళలు ఉద్యోగావకాశాలు పొందారు. 

ఏడాదిన్నరలో మహిళలకు అండగా...
► ఒక్క ఏడాదిలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో భాగంగా 13 వేలమంది ఏఎన్‌ఎంలను నియమించారు. 
► అరకొర పారితోషికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆశా కార్యకర్త్తలకు ఒకేసారి రూ.10 వేల వేతనం చేసిన ఘనత ఈ సర్కారుదే. గతంలో వీరికి రూ.3 వేలే ఇచ్చేవారు.
► రాష్ట్రంలో 680 సివిల్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకం జరిగితే, అందులో 300 మంది,  బోధనాసుపత్రుల్లో 700 వరకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలు జరిగితే అందులో 330 మంది మహిళలున్నారు.
► గ్రామాల్లో వైద్య సేవలు అందించడానికి మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లుగా ఇప్పటికే 1000 మంది నియమితులయ్యారు. త్వరలోనే మరో 5 వేల మందిని నియమించబోతున్నారు.
► మాతాశిశు సంరక్షణ కోసం ఎంఎస్‌ఎస్‌ యాప్‌ను రూపొందించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుఖ ప్రసవాల కోసం ప్రతి సీహెచ్‌సీలో వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.
► మహిళల కోసం అన్ని బోధనాసుపత్రుల్లో హైడె న్సిటీ డెలివరీ యూనిట్‌లు ఏర్పాటు చేస్తున్నా రు. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్‌ చికిత్సల సంఖ్య పెంచడంతో ఎక్కువమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. 
► వేలాదిమంది అవ్వలు కంటివెలుగు కార్యక్ర మం ద్వారా చీకటి నుంచి కంటివెలుగు పొందా రు. మెడికల్, పారామెడికల్‌ కోర్సుల్లోను ఎక్కు వమంది మహిళల నియామకాలు జరిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement