Andhra Pradesh: మహిళే మహారాణి  | Women Empowerment in YS Jagan Mohan Reddys government | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: మహిళే మహారాణి 

Published Fri, May 26 2023 4:19 AM | Last Updated on Fri, May 26 2023 1:01 PM

Women Empowerment in YS Jagan Mohan Reddys government  - Sakshi

అమ్మ కడుపులోని బిడ్డ మొదలు.. చేతలుడిగిన అవ్వ వరకు.. ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి  అందుకు తగ్గ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. మహిళలు బాగుంటేనే రాష్ట్రం  బాగుంటుందని నమ్మి.. దాదాపు ప్రతి పథకంలోనూ వారినే లబ్దిదారులుగా  గుర్తించి అడుగులు ముందుకు  వేస్తోంది. చిన్న చిన్న వ్యాపారాలతో లక్షలాది మందికి శాశ్వత ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంది.  ఫలితంగా నాలుగేళ్లలో మహిళా సాధికారత ఏ మేరకు సాధ్యమైందో ఊరూరా కళ్లెదుటే కనిపిస్తోంది. ప్రతి ఇంట్లోనూ మహిళలకు గౌరవం పెరిగింది.  

సాక్షి, అమరావతి :  ఎక్కడ మహిళలకు గౌరవం దక్కుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడిని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళామణులకు అగ్ర తాంబూలం ఇస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలోని మహిళలు ప్రగతిబాటలో పయనిస్తున్నారు. మహోన్నతంగా మహిళా సంక్షేమం అమలవుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ పురోగమిస్తోంది.

21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో మహిళలే కేంద్ర బింధువుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నవరత్నాలు వంటి అనేక పథకాల్లో 90 శాతం పైగా మహిళలే లబ్దిదారులున్నారు. తద్వారా ప్రతి ఇంటిలో మహిళకు అత్యంత ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం దోహదం చేస్తోంది.

అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, కళ్యాణమస్తు, ఇళ్ల పట్టాలు.. ఇలా అన్ని పథకాల లబ్ధి అక్కచెల్లెమ్మలకే దక్కుతుండటం గమనార్హం. వృద్ధాప్య, వితంతు పింఛన్లు, మహిళల రక్షణ కోసం దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలు కచ్చి తత్వంతో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల దశ, దిశ మార్చిన పథకాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి.    

కళ్లెదుటే రాజకీయ సాధికారత 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారతలో సాధించిన అద్భుతాలు గమనిస్తే దేశంలో మరే రాష్ట్రం మనకు సాటిలేదని గర్వంగా చెప్పొచ్చు. రాజకీయ సాధికారత విషయమే తీసుకుంటే.. దేశ వ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ బిల్లు చర్చకు వచ్చి న దాఖలాలు లేవు.  
 కానీ, రాష్ట్రంలో ఏ డిమాండ్లు, ఉద్యమాలు లేకపోయినా వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన తర్వాత ఎవరూ అడగకుండానే పదవుల్లో మహిళలకు సమున్నత వాటా దక్కింది. నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ దేశానికి ఆదర్శంగా నిలిచారు.  
♦ నామినేటెడ్‌ పదవుల్లో 51 శాతంపైగా పదవులు ఇ­చ్చి న తొలి ప్రభుత్వం వైస్‌ జగన్‌ ప్రభుత్వమే. గ్రా­మాల్లో వార్డు మెంబర్, పట్టణాల్లో కౌన్సిలర్, కా­ర్పొరేటర్‌ దగ్గర్నుంచి రాష్ట్ర మంత్రి వరకు మ­హిళలకు పెద్దపీట వేయడం దేశంలోనే రికార్డు. 
 రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్‌ చైర్మన్‌గా జకియా ఖానంను నియమించారు. రా­ష్ట్ర తొలి మహిళా చీఫ్‌ సెక్రటరీగా, ఆ తర్వాత రా­ష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమి­ం­చారు. ఏపీ మహిళా కమిషన్‌ చైర్మన్‌గా వా­సి­రె­­డ్డి పద్మ, సభ్యుల నియామకం ద్వారా మహిళల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని చాటా­రు.  
గతంలో మహిళలకు తొలిసారిగా హోం మంత్రి ఇచ్చి న ఘనత దివంగత సీఎం వైఎస్సార్‌దే. ఆ తర్వాత ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌.. మరో రెండడుగులు ముందుకు వేస్తూ రాష్ట్ర హోం మంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితతో పాటు తొలి మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణిని, మలి విడతలో రాష్ట్ర హోం మంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులు అప్పగించారు.  
రాష్ట్రంలో 13 జడ్పీ చైర్మన్‌ పదవుల్లో ఏడుగురు.. 26 జడ్పీ వైస్‌చైర్మన్‌ పదవుల్లో 15 మంది మహిళలే. 12 మేయర్‌ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్‌ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 మంది మహిళలే ఎన్నికయ్యేలా చేశారు. స్థానిక సంస్థల నుంచి నామినేటెడ్‌ పదవుల్లోను మహిళలకు అగ్రపీఠం దక్కింది. దాదాపు 2.60 లక్షల వలంటీర్‌ ఉద్యోగాల్లో 53 శాతం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 51 శాతం మహిళలే ఉండటం గమనార్హం. 

సున్నా వడ్డీ పథకానికి మళ్లీ జీవం  
 గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్‌ సంస్థల అధిక వడ్డీ ఆగడాల నుంచి మహిళలను ఆదుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో పావలా వడ్డీ పథకాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. పొదుపు సంఘాల పేరుతో బ్యాంకు నుంచి తీసుకునే రుణం సకాలంలో చెల్లించే మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. 
2014 తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ పథకానికి నిధులు విడుదల చేయడం ఆపేశారు. దాంతో పొదుపు సంఘాల మహిళలపై కొత్తగా వడ్డీ భారం పడింది. తద్వారా సుమారు 18.36 శాతం పొదుపు సంఘాలు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మిగిలిపోయాయి. అప్పటి దాకా బాగా నడుస్తున్న ‘ఎ’ కేటగిరిలో ఉండే సంఘాలు కూడా ‘సి’, ‘డి’ గ్రేడ్లలోకి పడిపోయాయి.  
 2019లో అధికారంలోకి వచ్చి న సీఎం వైఎస్‌ జగన్‌.. సున్నా వడ్డీ పథకానికి తిరిగి జీవం పోశారు. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలకు చెందిన 1,02,16,410 ఖాతాల రుణాలకు సంబంధించి బ్యాంకులకు ప్రభుత్వం వడ్డీ రూపేణా రూ.3,615.28 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం 99.6 శాతానికి పైగా పొదుపు సంఘాలు తిరిగి ‘ఎ’ గ్రేడ్‌లో చేరాయి.  

ఆసరాతో కొండంత భరోసా 
గత చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీల­­తో అప్పుల పాలైన పొదుపు సంఘాల మహిళల­­­ను ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జ­రి­­గిన 2019 ఏప్రిల్‌ 11వ తేదీ నాటికి మహిళా స్వ­యం సహాయక సంఘాల పేరిట ఉండే బ్యాంకు రు­ణం మొత్తాన్ని ఈ పథకం కింద నాలుగు వి­డ­­త­ల్లో ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు.  
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) వివరాల ప్రకారం ఎన్నికలు జరిగిన ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల పేరిట రూ.25,517 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయా పొదుపు సంఘాలకు చెందిన 78,94,169 మందికి వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం రూ.19,178.17 కోట్ల లబ్ధి చేకూర్చింది. 

శాశ్వత ఉపాధికి ‘చేయూత’ 
రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు సైతం ఆర్థిక దన్ను కల్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత పథకం ప్రవేశపెట్టింది. అర్హులైన లబ్ధిదారులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 26,39,703 మంది మహిళలకు రూ.14,129.12 కోట్లు అందించింది.  
మహిళలకు శాశ్వత జీవనోపాధి కలిగేలా అమూ­ల్, హిందూస్థాన్‌ యూనీ లీవర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గాంబుల్, రిలయెన్స్‌ రిటైల్, అజియో బిజినెస్‌ వంటి సంస్థలతో ఒప్పందం కుదిర్చింది. ఆయా మల్టీ నేషనల్‌ సంస్థల సహకారం, ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో రాష్ట్రంలో 5,28,662 కుటుంబాలు వివిధ రకాల వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకొని శాశ్వత జీవనోపా«ధి పొందుతున్నాయి. 

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ.. జగనన్న గోరుముద్ద 
 రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా గర్భిణులు, బాలింతలకు మంచి ఆహారం అందిస్తున్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు, అంగన్‌వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి విద్యతోపాటు వారికి అవసరమైన బలమైన ఆహారం, వైద్యం అందిస్తున్నారు. వారికి ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభిస్తున్నారు. 
 వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో 43,26,782 మందికి రూ.3,590 కోట్లు ఖర్చు చే­శా­రు. ఈ పథకానికి గత ప్రభుత్వ హయాంలో ఏ­టా కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు చే­య­గా, ప్రస్తుత ప్రభుత్వం ఏటా రూ.2 వేల కో­ట్లు ఖర్చు చేస్తోంది. బడికెళ్లే పిల్లలకు జగనన్న గో­రు­ముద్ద పథకం ద్వారా బలమైన ఆహారాన్ని అందిస్తున్నారు. 

లక్షాధికారి అవుతున్న పేదింటి మహిళ 
 సొంతిల్లు అనేది సామాన్య, నిరుపేద ప్రజల కల. సీఎం జగన్‌ ఈ స్వప్నం నెరవేర్చే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో 30,76,675 మందికి రూ.75,670.05 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అంతటితో ఆగకుండా ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని మహా యజ్ఞంలా చేపట్టారు. ఇప్పటి వరకు 21,31,564 మంది ఇళ్ల నిర్మాణానికి రూ.9,151.79 కోట్లు ఖర్చు చేశారు.  
 మరోవైపు వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదలపై భారం వేయకుండా కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. ఒక్కో మహిళకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఇంటిని ప్రభుత్వం అందించడం ద్వారా పేదింటి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. మొత్తంగా రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను సమకూరుస్తున్నారు. 
 వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద ఓసీ మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు 4,38,088 మంది ఈ వర్గం నిరుపేద అక్క చెల్లెమ్మలకు రూ.1,257.04 కోట్లు అందించారు. కాపు నేస్తం, లా నేస్తం వంటి అనేక పథకాల్లోనూ ఓసీ మహిళలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మేలు చేస్తోంది. 
పేద తల్లిదండ్రులు తమ ఆడబిడ్డ పెళ్లి చేయడానికి పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధతో వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 16,668 మంది ఆడబిడ్డల తల్లుల ఖాతాల్లో రూ.125.50 కోట్లు జమ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కారి్మకులకు ఈ పథకాలను వర్తింపజేయడం ద్వారా ఆ వర్గాల్లో సంతోషం నింపారు. 

అమ్మ ఒడి.. చదువులమ్మ గుడి 
ప్రతి తల్లి తన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ­కాంక్షిస్తుంది. అటువంటి తల్లుల ఆశలు, ఆకాంక్ష­లు నెరవేర్చేలా రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చే­స్తున్నారు. ప్రతి దశలో విద్యార్థుల చదువుల భా­రం తల్లిదండ్రులపై పడకుండా మొత్తం ప్రభు­త్వమే భరించేలా పథకాలు అమలు చేస్తున్నారు.  
 మూడేళ్ల వయసులో అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే దశ నుంచి పాఠశాల విద్య, ఇంటర్‌ విద్య, ఉన్నత విద్యను పూర్తి చేసుకొనే వరకు పేద వర్గాల కుటుంబాల్లోని పిల్లల చదువులకు అయ్యే మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పలు పథకాలు ప్రవేశపెట్టారు. పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందించేందుకు వీలుగా 8వ తరగతిలోకి వచ్చే పిల్లలకు ప్రతి ఏటా ఉచితంగా ప్రభుత్వం ట్యాబులు అందిస్తోంది.  
 ఈ నాలుగేళ్లలో జగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ.19,674.34 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన ద్వారా 25,17,245 మందికి రూ.4,275.76 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 26,98,728 మందికి రూ.10,636.67 కోట్లు లబ్ధి చేకూర్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 1,858 మందికి రూ.132.41 కోట్లు ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement