పరిశ్రమలు, ఉపాధి కల్పనలో క్రాంతి.. జగనన్న పాలనలో రాష్ట్రానికి సంక్రాంతి | Industries And Employment Generation In AP | Sakshi
Sakshi News home page

పరిశ్రమలు, ఉపాధి కల్పనలో క్రాంతి.. జగనన్న పాలనలో రాష్ట్రానికి సంక్రాంతి

Published Tue, Jan 16 2024 11:54 AM | Last Updated on Tue, Jan 16 2024 11:57 AM

Industries And Employment Generation In AP - Sakshi

భారీ, మెగా పరిశ్రమలు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ, మెగా పరిశ్రమలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. గడిచిన 55 నెలల సమయంలో 311కి పైగా భారీ పరిశ్రమల్లో 1.30 లక్షల మంది ఉపాధి పొందారు. అంతే కాకుండా  జీఐఎస్ సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరిగాయి. దీంతో మరో 6.07 లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించనుంది.

ఎంఎస్ఎంఈలు
రాష్ట్రంలో రూ. 30000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 3.94 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 26.29 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ. 2087 కోట్ల ప్రోత్సాహకాలను ఎంఎస్ఎంఈలకు ఇవ్వడం జరిగింది.

పోర్టుల నిర్మాణం
భారీ, మెగా పరిశ్రమలు మాత్రమే కాకుండా.. ఫోర్టుల అభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇందులో భాగమగ్నే ఇప్పటికే ఉన్న ఆరు పోర్టులకు అదనంగా 4 కొత్త పోర్టుల నిర్మాణానికి రూ. 16000 కోట్ల వ్యయం వెచ్చించారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కొత్తగా నిర్మితమవుతున్న పోర్టుల ద్వారా 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 75,000 మందికి ఉపాధి లభిస్తుంది.

ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు
సీఎం జగన్ ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధికి ఊతమిస్తూ రూ. 4,000 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేక ఒక ఫిషింగ్ హార్టర్ రానుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుంది.

ఎయిర్ పోర్టులు
రూ. 3,200 కోట్ల వ్యయంతో శరవేగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు సాగుతున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 80 వేల మందికి ఉపాధి లభిస్తుంది. గన్నవరం, కాకినాడ, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్ పోర్టుల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వెల్లువ
పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌లో JSW స్టీల్, రాంకో సిమెంట్, సెంచురీ ఫ్యానల్స్, ATC టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ, మెగా పరిశ్రమలు, MSMEల ద్వారా రూ.14.19 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీని వల్ల ఏకంగా 33.63 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement