విజయవాడ, సాక్షి: చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. అయితే మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్మారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన - మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.
రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి.. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త. ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు
రామచంద్రగుహ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు.. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఇబ్బందులు తొలగిపోలేదు. అలాంటిది.. ఇందిరాగాంధీ చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు
ఓ మహర్షిలా జగన్..
.. మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని స్థాపించారాయన. అలాగే.. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది వైఎస్సార్.. ఇప్పుడు వైఎస్ జగన్. దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగన్ ఒక్కరే. అందుకే ప్రజలు మంచి మనసుతో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి..
జగన్‌మోహన్‌రెడ్డి ఒక వ్యవస్థ. వయసులో చిన్నవాడే అయినా ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి. పేదలు...మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా పాటు పడుతున్నారు. భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్. అందుకే జగన్ చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి. రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది
చంద్రబాబు పనైపోయింది
అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు. గత పాలనలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది. చంద్రబాబు పనైపోయింది. ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి. అందుకే తన కొడుకుని సీఎం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు బాధితుల్లో నేను, నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం. చంద్రబాబుకి ఆడవాళ్లంటే అసహ్యం. జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు మీటింగ్లు పెడుతున్నాడు. సన్నాసి అయిన లోకేష్ కావాలా?.. మంచి వ్యక్తి అయిన జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలి. పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది అని ఏపీ ప్రజలను హెచ్చరించారామె. ఈ సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి బండ్లమూడి రోజారాణి,మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు సునీతా లఖంరాజు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment