శిశు సంక్షేమ శాఖ పీడీ నిర్మల సస్పెన్షన్
Published Mon, Jan 2 2017 10:23 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
కొరిటెపాడు (గుంటూరు) : జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.జె. నిర్మలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పామాయిల్ ప్యాకెట్ల సరఫరా వ్యవహారంలో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలపై ఆమెను విధుల నుంచి తొలగించారు. పామాయిల్ ప్యాకెట్లను సరఫరాచేసే కాంట్రాక్టర్ ఆదిత్య ట్రేడర్స్‌తో కుమ్మక్కై ఎమ్మార్పీ కంటే అధికంగా కొనుగోలు చేసి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఆమె ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం ఆమెను తొలగిస్తూ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై శాఖాపరమైన విచారణ నిర్వహించి తుది నివేదిక రావడంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Advertisement