pd
-
లైంగిక వేధింపులు..ఐసీడీఎస్ పీడీపై వేటు
అనంతపురం : జిల్లాకు చెందిన ఐసీడీఎస్ పీడీ వెంకటేశంపై వేటు పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, వెంకటేశంను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఓ మహిళా ఉద్యోగిపై గతంలో పీడీ వెంకటేశం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ రమామణి విచారణలో ఆరోపణలు రుజువు కావటంతో కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు. -
శిశు సంక్షేమ శాఖ పీడీ నిర్మల సస్పెన్షన్
కొరిటెపాడు (గుంటూరు) : జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.జె. నిర్మలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు పామాయిల్ ప్యాకెట్ల సరఫరా వ్యవహారంలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలపై ఆమెను విధుల నుంచి తొలగించారు. పామాయిల్ ప్యాకెట్లను సరఫరాచేసే కాంట్రాక్టర్ ఆదిత్య ట్రేడర్స్‌తో కుమ్మక్కై ఎమ్మార్పీ కంటే అధికంగా కొనుగోలు చేసి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఆమె ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం ఆమెను తొలగిస్తూ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై శాఖాపరమైన విచారణ నిర్వహించి తుది నివేదిక రావడంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మేళ్లచెరువులో డ్వామా పీడీ..
మేళ్లచెర్వు: మండలంలోని బుగ్గమాధవరం,వజినేపల్లి పుష్కర ఘాట్లను శనివారం పుష్కరఘాట్లను డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఘాట్ల వద్ద పనుల తీరు, ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐ వీరయ్య, ఐబీ ఈఈ సంజీవరెడ్డి, డీఈ స్వామి ఉన్నారు. -
బీ కేర్‘ఫుల్’
ఇందూరు : ‘‘బీ కేర్‌ఫుల్ పీడీ గారూ.. అంగన్వాడీలకు సరుకుల సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. నిరంతరం పౌరసరఫరాల అధికారులతో టచ్‌లో ఉండి ఎప్పటికప్పుడు సరుకులను దగ్గరుండి అంగన్వాడీ కేంద్రాలకు పంపించండి. ముఖ్యంగా కేంద్రాలకు పప్పు ఇం కా సరఫరా కాలేదు. వన్‌ఫుల్ మీల్ పథకం అమలుకు ఇబ్బందులు తలెత్తుతా యి. వెంటనే సరఫరా జరిగేలా చూడం డి’’ అని ఐసీడీఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య పీడీ రాములు ను ఆదేశించారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె ప్రగతి భవన్లో ఐసీడీఎస్ డెరైక్టర్ ఆమ్రాపాలి కాట, కలెక్టర్ రొనాల్డ్ రోస్‌లతో కలిసి ఐసీడీఎస్ అధికారులు, ప్రాజెక్టు సీడీపీఓలతో ప్రత్యే కంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంగన్వాడీలలో ప్రారంభమైన ఒక పూట సంపూర్ణ భోజన కార్యక్రమం ఎంతో మేలైందని, దాని లక్ష్యాన్ని నెరవేర్చేందుకు స్పిరిట్‌తో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌష్టికాహారం అందరికీ అందేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్ల లు, గర్భిణులు, బాలింతల హాజరుశా తం ఎట్టి పరిస్థితులలో తగ్గకూడదన్నా రు. వారు నేరుగా కేంద్రానికి వచ్చి తినే లా చూడాలని, అట్లయితేనే పౌష్టికాహా రం సరిగ్గా అందుతుందని తెలిపారు. సరుకులు, గుడ్లు, పాలు ఇంటికి తీసుకెళ్లే పద్ధతి మానుకోవాలని సూచించారు. వారికి టిఫిన్‌లో పెట్టి ఇవ్వండి గ్రామాలలో చాలా మంది మహిళలు కూలీ పని చేసుకునేవారున్న నేపథ్యం లో, వారికి ఉదయం 9:30కు టిఫిన్ బా క్సులలో భోజనం, గుడ్డు, పాలు పెట్టి ఇ వ్వాలని పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. ఎక్కడైన లోపాలు, సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా అధికారికి సమాచారం అందించాలని, వారు రాష్ట్ర అధికారులకు సమా చా రం అందించాలని ఆదేశించారు. పాల సరఫరాలో కొంత జా ప్యం జరుగుతోందని, కొన్ని కేంద్రాలకు సరఫరా కావడం లేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విజయ డెయి రీ ద్వారానే పూర్తి స్థాయిలో పాల సరఫ రా జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని ఒకే ప్రాంతం నుంచి పాలు సరఫరా చేయిస్తామన్నారు. జిల్లా లో మాతా,శిశు మరణాలు చాల వరకు తగ్గాయని, తక్కువ బరువు గల పిల్లలకు పౌష్టికాహారం అందించగా బరువు పెరి గారని తెలిపారు. అధికారుల పనితనం కనబడుతోందని, ఇదే స్పూర్తిగా పనిచేయాలని అభినందించారు. నార్మర్ డెలి వరీ కేసులు కొద్ది స్థాయిలో పెరిగాయని, సిజేరియన్ లేకుండా డెలివరీ చేయించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేసేం దుకు 11మందితో ఏర్పాటు చేస్తున్న కమిటీలు పక్కాగా పని చేసేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ, మత్స్యశాఖ, లీడ్‌బ్యాంక్ శాఖల అధికారులతో ఆమె సమీక్ష జరిపారు. -
వెనుకబాటు
స్వయం ఉపాధి కల్పనలో లక్ష్యానికి దూరంగా మెప్మా - నిర్దేశించిన లక్ష్యం 600 యూనిట్లు - ఏర్పాటు చేసిన యూనిట్లు 179 - ఈ ఏడాది నుంచి ఎస్జేఎస్ఆర్ రద్దు - ఎన్ఎల్యూఎం పేరిట అమల్లోకి సబ్సిడీ లేని కొత్త పథకం సాక్షి, కర్నూలు: పట్టణ ప్రాంతాల్లోని పొదుపు గ్రూపు సభ్యులకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా వ్యక్తిగత, సామూహిక రుణాల అందజేతలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వెనుకబడింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.6 కోట్లతో స్వయం ఉపాధి పథకం(యూఎస్ఈపీ) కింద జిల్లాలోని నగరపాలక సంస్థ, తొమ్మిది పురపాలక సంస్థల్లో 600 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం. అయితే ఇప్పటి వరకు 179 యూనిట్లు మాత్రమే నెలకొల్పడం గమనార్హం. అదేవిధంగా సంఘం మొత్తానికి అర్బన్ ఉమెన్ సెల్ఫ్ ప్రోగ్రాం(యూడబ్ల్యుఎస్పీ) కింద ఆరు యూనిట్లకు గాను ఎమ్మిగనూరులో ఐదు, కర్నూలులో ఒక్కటి మాత్రమే ఏర్పాటు చేయించగలిగారు. కర్నూలు, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు మినహా మిగిలిన ఆరు పురపాలక సంస్థల్లో లక్ష్యానికి అనుగుణంగా దరఖాస్తులు కూడా అందని పరిస్థితి నెలకొంది. బ్యాంకర్లు అంగీకార పత్రాలు ఇవ్వకపోవడం.. యూనిట్ల స్థాపనలో స్పష్టమైన విధానాన్ని లబ్ధిదారులు పాటించకపోవడం.. ఈ విషయంలో మెప్మా సిబ్బంది సలహాలు, సూచనలను అందివ్వలేకపోవడం అందుకు కారణమవుతోంది. స్వయం ఉపాధి పథకాలకు రూ.25 వేల వరకు రాయితీ లభిస్తోంది. సంఘాల ద్వారా పొందే రుణాలకు రూ.3 లక్షల వరకు రాయితీ ఉంటుంది. ఈ రెండు పథకాలకు సంబంధించి పురపాలక సంస్థల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన పురోగతి పరిశీలిస్తే ఆ శాఖ పనితీరు ఇట్టే అర్థమవుతోంది. మొత్తం రూ.6 కోట్ల వ్యయంతో 606 యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా.. నిధుల లేమి కారణంగా 179 యూనిట్లు (29.53 శాతం) మాత్రమే స్థాపించగలగడం గమనార్హం. ఇదిలా ఉండగా స్వర్ణ జయంతి సహరీ రోజ్‌గార్(ఎస్జేఎస్ఆర్) పథకాన్ని ఈ ఏడాది నుంచి కేంద్రం రద్దు చేసింది. దీంతో ఈ పథకం ద్వారా మెప్మా పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూఎస్ఈపీ కింద వ్యక్తిగత, సామూహిక రుణాల మంజూరు నిలిచిపోనుంది. అయితే కొత్తగా నేషనల్ అర్బన్ లైవ్లీవుడ్ మిషన్(ఎన్ఎల్యూఎం) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎస్జేఎస్ఆర్ తరహాలో ఈ పథకం కింద రుణాలు పొందే లబ్ధిదారులకు సబ్సిడీ వర్తించదు. కేవలం తక్కువ వడ్డీకి మాత్రమే రుణాలను అందజేస్తారు. ఈ కొత్త పథకం 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేవలం కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, నంద్యాల మున్సిపాలిటీల్లోని స్వయం సహాయక సంఘాలకు మాత్రమే వర్తింపజేయనున్నారు. వ్యక్తిగతంగా 1,038.. సామూహికంగా 14 యూనిట్లకు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నిధుల సమస్య ఉంది ఈ ఏడాది రూ.6 కోట్ల నిధులు కేటాయించగా ప్రభుత్వం మూడు విడతల్లో రూ.70 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. వచ్చిన నిధులను మంజూరైన యూనిట్లకు కేటాయించాం. నిధుల సమస్యను సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రభుత్వానికి నివేదించాం. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో నిధుల సమస్య తలెత్తింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. - రామాంజనేయులు, పీడీ, మెప్మా