
ప్రతీకాత్మక చిత్రం
అనంతపురం : జిల్లాకు చెందిన ఐసీడీఎస్ పీడీ వెంకటేశంపై వేటు పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, వెంకటేశంను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఓ మహిళా ఉద్యోగిపై గతంలో పీడీ వెంకటేశం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ రమామణి విచారణలో ఆరోపణలు రుజువు కావటంతో కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment