ఇందూరు : ‘‘బీ కేర్‌ఫుల్ పీడీ గారూ.. అంగన్‌వాడీలకు సరుకుల సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. నిరంతరం పౌరసరఫరాల అధికారులతో టచ్‌లో ఉండి ఎప్పటికప్పుడు సరుకులను దగ్గరుండి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించండి. ముఖ్యంగా కేంద్రాలకు పప్పు ఇం కా సరఫరా కాలేదు. వన్‌ఫుల్ మీల్ పథకం అమలుకు ఇబ్బందులు తలెత్తుతా యి. వెంటనే సరఫరా జరిగేలా చూడం డి’’ అని ఐసీడీఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య పీడీ రాములు ను ఆదేశించారు.
శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె ప్రగతి భవన్‌లో ఐసీడీఎస్ డెరైక్టర్ ఆమ్రాపాలి కాట, కలెక్టర్ రొనాల్డ్ రోస్‌లతో కలిసి ఐసీడీఎస్ అధికారులు, ప్రాజెక్టు సీడీపీఓలతో ప్రత్యే కంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంగన్‌వాడీలలో ప్రారంభమైన ఒక పూట సంపూర్ణ భోజన కార్యక్రమం ఎంతో మేలైందని, దాని లక్ష్యాన్ని నెరవేర్చేందుకు స్పిరిట్‌తో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పౌష్టికాహారం అందరికీ అందేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్ల లు, గర్భిణులు, బాలింతల హాజరుశా తం ఎట్టి పరిస్థితులలో తగ్గకూడదన్నా రు. వారు నేరుగా కేంద్రానికి వచ్చి తినే లా చూడాలని, అట్లయితేనే పౌష్టికాహా రం సరిగ్గా అందుతుందని తెలిపారు. సరుకులు, గుడ్లు, పాలు ఇంటికి తీసుకెళ్లే పద్ధతి మానుకోవాలని సూచించారు.
వారికి టిఫిన్‌లో పెట్టి ఇవ్వండి
గ్రామాలలో చాలా మంది మహిళలు కూలీ పని చేసుకునేవారున్న నేపథ్యం లో, వారికి ఉదయం 9:30కు టిఫిన్ బా క్సులలో భోజనం, గుడ్డు, పాలు పెట్టి ఇ వ్వాలని పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. ఎక్కడైన లోపాలు, సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా అధికారికి సమాచారం అందించాలని, వారు రాష్ట్ర అధికారులకు సమా చా రం అందించాలని ఆదేశించారు. పాల సరఫరాలో కొంత జా ప్యం జరుగుతోందని, కొన్ని కేంద్రాలకు సరఫరా కావడం లేదన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విజయ డెయి రీ ద్వారానే పూర్తి స్థాయిలో పాల సరఫ రా జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని ఒకే ప్రాంతం నుంచి పాలు సరఫరా చేయిస్తామన్నారు. జిల్లా లో మాతా,శిశు మరణాలు చాల వరకు తగ్గాయని, తక్కువ బరువు గల పిల్లలకు పౌష్టికాహారం అందించగా బరువు పెరి గారని తెలిపారు. అధికారుల పనితనం కనబడుతోందని, ఇదే స్పూర్తిగా పనిచేయాలని అభినందించారు.
నార్మర్ డెలి వరీ కేసులు కొద్ది స్థాయిలో పెరిగాయని, సిజేరియన్ లేకుండా డెలివరీ చేయించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేసేం దుకు 11మందితో ఏర్పాటు చేస్తున్న కమిటీలు పక్కాగా పని చేసేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ, మత్స్యశాఖ, లీడ్‌బ్యాంక్ శాఖల అధికారులతో ఆమె సమీక్ష జరిపారు.
బీ కేర్‘ఫుల్’
Published Sun, Jan 4 2015 3:03 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement