One Full Meal Scheme
-
బీ కేర్‘ఫుల్’
ఇందూరు : ‘‘బీ కేర్‌ఫుల్ పీడీ గారూ.. అంగన్వాడీలకు సరుకుల సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. నిరంతరం పౌరసరఫరాల అధికారులతో టచ్‌లో ఉండి ఎప్పటికప్పుడు సరుకులను దగ్గరుండి అంగన్వాడీ కేంద్రాలకు పంపించండి. ముఖ్యంగా కేంద్రాలకు పప్పు ఇం కా సరఫరా కాలేదు. వన్‌ఫుల్ మీల్ పథకం అమలుకు ఇబ్బందులు తలెత్తుతా యి. వెంటనే సరఫరా జరిగేలా చూడం డి’’ అని ఐసీడీఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య పీడీ రాములు ను ఆదేశించారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె ప్రగతి భవన్లో ఐసీడీఎస్ డెరైక్టర్ ఆమ్రాపాలి కాట, కలెక్టర్ రొనాల్డ్ రోస్‌లతో కలిసి ఐసీడీఎస్ అధికారులు, ప్రాజెక్టు సీడీపీఓలతో ప్రత్యే కంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంగన్వాడీలలో ప్రారంభమైన ఒక పూట సంపూర్ణ భోజన కార్యక్రమం ఎంతో మేలైందని, దాని లక్ష్యాన్ని నెరవేర్చేందుకు స్పిరిట్‌తో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌష్టికాహారం అందరికీ అందేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్ల లు, గర్భిణులు, బాలింతల హాజరుశా తం ఎట్టి పరిస్థితులలో తగ్గకూడదన్నా రు. వారు నేరుగా కేంద్రానికి వచ్చి తినే లా చూడాలని, అట్లయితేనే పౌష్టికాహా రం సరిగ్గా అందుతుందని తెలిపారు. సరుకులు, గుడ్లు, పాలు ఇంటికి తీసుకెళ్లే పద్ధతి మానుకోవాలని సూచించారు. వారికి టిఫిన్‌లో పెట్టి ఇవ్వండి గ్రామాలలో చాలా మంది మహిళలు కూలీ పని చేసుకునేవారున్న నేపథ్యం లో, వారికి ఉదయం 9:30కు టిఫిన్ బా క్సులలో భోజనం, గుడ్డు, పాలు పెట్టి ఇ వ్వాలని పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. ఎక్కడైన లోపాలు, సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా అధికారికి సమాచారం అందించాలని, వారు రాష్ట్ర అధికారులకు సమా చా రం అందించాలని ఆదేశించారు. పాల సరఫరాలో కొంత జా ప్యం జరుగుతోందని, కొన్ని కేంద్రాలకు సరఫరా కావడం లేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విజయ డెయి రీ ద్వారానే పూర్తి స్థాయిలో పాల సరఫ రా జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని ఒకే ప్రాంతం నుంచి పాలు సరఫరా చేయిస్తామన్నారు. జిల్లా లో మాతా,శిశు మరణాలు చాల వరకు తగ్గాయని, తక్కువ బరువు గల పిల్లలకు పౌష్టికాహారం అందించగా బరువు పెరి గారని తెలిపారు. అధికారుల పనితనం కనబడుతోందని, ఇదే స్పూర్తిగా పనిచేయాలని అభినందించారు. నార్మర్ డెలి వరీ కేసులు కొద్ది స్థాయిలో పెరిగాయని, సిజేరియన్ లేకుండా డెలివరీ చేయించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేసేం దుకు 11మందితో ఏర్పాటు చేస్తున్న కమిటీలు పక్కాగా పని చేసేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ, మత్స్యశాఖ, లీడ్‌బ్యాంక్ శాఖల అధికారులతో ఆమె సమీక్ష జరిపారు. -
‘సంపూర్ణ భోజనం’
అంగన్వాడీల్లో కొత్త పథకం ‘వన్ ఫుల్ మీల్’ తాండూరు: మాతా, శిశు మరణాలను తగ్గించాలనే ఆలోచనతో తెలంగాణ సర్కారు ‘వన్ ఫుల్ మీల్ (ఒక పూట సంపూర్ణ భోజనం) పథకాన్ని తీసుకురానున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇందిరమ్మ అమృత హస్తం పథకంలో పలు మార్పులు చేసి ‘వన్ ఫుల్ మీల్’ను రూపొందించారు. గతంలో ఈ పథకం పరిమితంగా అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయ గా తెలంగాణ ప్రభుత్వం విస్తృత పరు స్తూ అన్ని కేంద్రాలకు వర్తింపచేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఈ పథ కం ఈనెల 15న ప్రారంభం కానుంది. ఈ ఏడాది నవంబర్ 26న ఈ పథకానికి సంబంధించి జీఓ నం.12 జారీ చేశారు. అమృతహస్తం పథకాన్ని జిల్లాలో పరిగి, తాండూరు, వికారాబాద్, మర్పల్లి, మహేశ్వరం ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అమలు చేశారు. కొత్త పథకం కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 13 ఐసీడీఎస్ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. మెనూలోనూ మార్పు లు చేశారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 2,524 ప్రధాన అంగన్వాడీలు, 269 మినీ అంగన్వాడీల ద్వారా సుమారు 1.95లక్షల మంది ఏడు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలతోపాటు సుమారు 52వేల మంది గర్భిణులు, బాలింతలకు ఒక పూట భోజనం, ప్రతి రోజూ పాలు, గుడ్లు, ఆకుకూరలు, సాంబారు తదితరాలతో పోషకాలున్న భోజనం అందజేస్తారు. గతంలో బాలింతులు,గర్భిణునలకు నెలలో 25 రోజులు మాత్రమే 200 మిల్లీలీటర్ల పాలు, ఒక గుడ్డు అందించేవారు. తాజాగా వన్‌ఫుల్ మీల్ కింద 30 రోజులుపాలు, గుడ్డు అందిస్తారు. ఆదివారం సెలవు అయినందున ఆ రోజు ఇచ్చే పాలు, గుడ్లను సోమ, మంగళవారాల్లో ఎగ్ కర్రీ, పెరుగు రూపంలో బాలింతలు, గర్భిణులకు అందించేలా మెనూ తయారు చేశారు. గతంలో ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు నెలకు ఎనిమిది గుడ్లను ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి రోజూ గుడ్డు ఇవ్వనున్నారు. పిల్లలకు పది రోజులకు పది గుడ్ల చొప్పున మూడు విడతల్లో అందజేస్తారు. ఇక మూడేళ్ల నుంచి ఆరు ఏళ్ల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి నాలుగు గుడ్లను ఇచ్చేవారు. ఇక నుంచి ప్రతి రోజూ పిల్లలకు గుడ్లు ఇస్తారు. ఆదివారం సెలవు దినం కావడం వల్ల ఆ రోజు ఇవ్వాల్సిన గుడ్డును పిల్లలకు ముందు రోజే.. అంటే శనివారం అందజేస్తారు. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు (నాలుగు నెలలకు) గుడ్లు, పాల కోసం రూ.94,82,95,872 కేటాయించారు. సోమవారం నుంచి వన్‌ఫుల్ మీల్ - సీడీపీఓ వెంకటలక్ష్మి అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం నుంచి పథకం అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పథకం అమలుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. -
ఇక రోజూ గుడ్డు
⇒ గర్భిణులు, బాలింతలు, శిశువులకు ⇒ 15 నుంచి అమలు కానున్న ‘వన్ ఫుల్ మీల్’ పథకం ⇒ మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం ⇒ క్షేత్రస్థాయిలో సిబ్బంది అంకితభావంతో పని చేయాలి ⇒ ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట సూచన ఇందూరు : మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ‘ఇందిరమ్మ అమృతహస్తం’ పథకం ద్వారా ‘వన్ ఫుల్ మీల్’ను ప్రవేశ పెడుతున్నా మని ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట తెలిపారు. నిర్లక్ష్యం చేయకుం డా క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలని సీడీపీఓలు, సూపర్వైజర్లను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాలు లక్షల, కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా ఐసీడీఎస్ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదన్నారు. మొన్నటి వరకు జిల్లాలోని పది ప్రాజెక్టులలో ఆరింట ‘అమృతహస్తం’ అమలైందని, ఇకపై అన్ని ప్రాజెక్టులలో అమలవుతుందన్నారు. దీనిని పకడ్బందీగా చేపట్టేలా అంగన్వాడీ కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. గతంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నెలలో 25 రోజులు మాత్రమే గుడ్లు అందజేసేవారని, ప్రస్తుతం పౌష్టికాహార పరిమాణం పెరిగిందన్నా రు. రోజూ గుడ్డుతోపాటు బాలింతలు, గర్భిణులకు 200 మిల్లీలీటర్ల పాలు కూడా ఇస్తామన్నారు. వీటికోసం అంగన్ వాడీ కార్యకర్తల ఖాతాలోకే నేరుగా ముందస్తు నిధులను జమచేస్తామని చెప్పారు. శిశువులు మూడు కిలోల బరువుతో, రక్తహీనత లేకుం డా జన్మించేలా చూడాలని సూచించారు. సూపర్వైజర్లు గ్రామాలను సందర్శించి, కమిటీలను ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. ఈ కొత్త కార్యక్రమం అమలు తీరును నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఆర్జేడీ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వన్ ఫుల్ మీల్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అందరూ కంకణబద్ధులు కావాలని కోరారు. గ్రేడింగ్ విధానంతో పని తీరు పరిశీలన ఇక ముందు అంగన్వాడీల పనితీరును మెరుగు పరచడానికి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నామని కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు, కార్యకర్తల పనితీరు మెరుగుపడటమే కాకుండా బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందన్నారు. ప్రతీ కార్యకర్త అంగన్వాడీ కేంద్రంలో ఆరు నుంచి ఏడు గంటల సేపు పిల్లలతో గడపాలని, పిల్లలకు నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు. గర్భిణులకు పౌష్టికాహారం సమృద్ధిగా అంది స్తే బిడ్డలు మూడు కిలోల బరువుకు తగ్గకుండా పుడతారన్నారు. ఈ నెల 15 నుంచి అమలయ్యే ‘వన్ ఫుల్ మీల్’ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, స్వరూ పా న్ని హైదరాబాద్ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సదస్సులో ఐసీడీఎస్ పీడీ రాములు తదితరులు పాల్గొన్నారు.