పెద్దపల్లిరూరల్: మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు వర్తింపజేశారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నా రు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలో మంగళవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి 91మహిళా సంఘాలకు రూ.7.75కోట్ల చెక్కులు అందించారు.
పోలీసు నియామకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బాలికలు ఉన్నత చదువులకు రెసిడెన్షియల్ వసతి కల్పించిందని అడిషనల్ కలెక్టర్ అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ మమతారెడ్డి, డీఆర్‌డీఓ శ్రీధర్, సంక్షేమాధికారి రవుఫ్‌ఖాన్, ఉపాధికల్పనాధికారి తిరుపతిరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సింహాచారి, రంగారెడ్డి తదితరులున్నారు.
నాడు.. నేడు బేరీజు వేసుకోవాలి
మంథని: మహిళల అభివృద్ధికి గత ప్రభుత్వాల పనితీరు.. ప్రస్తుతం అమలవుతున్న పథకాలను బేరీజు వేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మంథనిలోని ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవంలో కలెక్టర్ సంగీత, జయశంకర్‌భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీహర్షిణీతో కలిసి మాట్లాడారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు ప్రతి దశలో సర్కారు సహాయం అందిస్తోందన్నారు. ముందుగా జెడ్పీ చైర్మన్లు, కలెక్టర్‌కు మహిళలు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. గర్భిణులకు సీమంతం చేశారు. చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, సీడీపీవో పద్మశ్రీ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి పెద్దపీట
గోదావరిఖని: మహిళల సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దుర్గానగర్ ఆర్కే గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ మహిళ దినోత్సవంలో పాల్గొన్నారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ 40 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.
వీహబ్ ద్వారా 64 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.4కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించామన్నారు. మేయర్ బంగి అనిల్‌కుమార్, జెడ్పీటీసీ అముల నారాయణ, మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, సీడీపీఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment