మంథని: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ సూచించా రు. మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్‌పల్లి బాలికల మైనారిటీ గురుకులాన్ని శనివారం ఆమె ఆ కస్మికంగా తనిఖీ చేశారు. బాలికలతో మాట్లాడి హాస్టల్‌లో అందిస్తున్న భోజనం నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, విద్యా బోధన తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. కామన్ మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. పదో తరగతి వార్షిక పరీక్షల దృష్ట్యా స్టడీ అవర్స్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం బాలికలతో కలిసి భోజనం చేశారు.
పౌర సరఫరాల ఆర్‌ఐ సస్పెన్షన్
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లా పౌర సరఫరాల శాఖలోని ఆర్‌ఐ మల్లికార్జున్‌రావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు జారీచేశారని డీఎస్‌వో రాజేందర్ శనివారం తెలిపా రు. స్థానిక భూంనగర్ డీలర్ వద్ద డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో ఈ వేటు వేసినట్లు డీఎస్‌వో రాజేందర్ వివరించారు.
నేడు టీజీ సెట్
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో ఆదివారం జ రిగే టీజీ సెట్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని గోదా వరిఖని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ మాధవి శనివారం తె లిపారు. ఉదయం 11 గంటల – మధ్యాహ్నం ఒంటి గంటల వరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్షకు 528 మంది వి ద్యార్థులు హాజరు కానున్నారన్నారు. విద్యార్థు లు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.
పీఆర్‌పీ చెల్లించేలా చూడాలి
గోదావరిఖని: సింగరేణి అధికారుల సంఘం నాయకులు శనివారం ఆ సంస్థ సీఎండీ బల రాంను హైదరాబాద్‌లో కలుసుకున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరం పీఆర్‌పీ వెంటనే చెల్లించాలని కోరారు. కోలిండియాలో ఇప్పటికే చెల్లించారని గుర్తుచేశారు. ఈ–8 ఇంటర్వ్యూ లు పూర్తిచేసి పదోన్నతులు కల్పించాలన్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరా రు. ప్రతినిధులు సుభాని, తాళ్లపల్లి లక్ష్మీపతిగౌ డ్, పెద్ది నర్సింహులు, పోనుగోటి శ్రీనివాస్ త దితరులు సీఎండీని కలిసిన వారిలో ఉన్నారు.
నాగర్‌కర్నూల్‌కు సింగరేణి రెస్క్యూ టీం
గోదావరిఖని: సింగరేణి రెస్క్యూ బృందాలు శనివారం నాగర్‌కర్నూల్ బయలుదేరి వెళ్లాయి. మెయిన్ స్టేషన్ రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సూపరింటెండెంట్ మాధవరావుతోపాటు 27మంది ప్రత్యేక వాహనాల్లో బయ లు దేరి వెళ్లారు. శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీలో కూరుకుపోయిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ బలరాం ఆదేశాల మేరకు రెస్క్యూ అక్కడకు తరలివెళ్లింది.
సద్వినియోగం చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment