ఎల్‌ఆర్‌ఎస్‌ పరిష్కార మేళా | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ పరిష్కార మేళా

Published Sun, Feb 23 2025 1:21 AM | Last Updated on Sun, Feb 23 2025 1:19 AM

ఎల్‌ఆ

ఎల్‌ఆర్‌ఎస్‌ పరిష్కార మేళా

సద్వినియోగం చేసుకోండి

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, రామగుండం నగర పాలక సంస్థలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏమైనా సందేహాలుంటే టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారు లు ఏర్పాటు చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌ హెల్ప్‌డెస్క్‌లో నివృత్తి చేసుకోవాలి.

– అరుణశ్రీ, కమిషనర్‌(ఎఫ్‌ఎస్‌ఏ), రామగుండం

కోల్‌సిటీ(రామగుండం): సుమారు నాలుగేళ్లుగా లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకానికి(ఎల్‌ఆర్‌ఎస్‌) ఎదురు చూస్తున్న జిల్లావాసులకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగించింది. జిల్లాలోని రామగుండం నగర పాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ పథకానికి మొత్తం 19,778 దరఖాస్తులు అందాయి. సర్కారు నిర్ణయంతో అప్రమత్తమైన బల్దియా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు.. దరఖాస్తుల పరిష్కారానికి రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా ఏర్పాటు చేశారు. దీనితోపాటు సందేహాలు తీర్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై దరఖాస్తుదారుల సందేహాలను ఎప్పటికప్పుడు ఇందులో నివృత్తి చేస్తున్నారు. తద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తు న్నాయి. జిల్లాలోని ఒక నగర పాలక సంస్థతోపాటు మరో మూడు మున్సిపాలిటీల నుంచి ఎల్‌ఆర్‌ఎఫ్‌ ఫీజు ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం భారీగా సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మార్చి 31 వరకు గడువు..

జిల్లావ్యాప్తంగా 2021లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో.. 2020 ఆగస్టు 28వ తేదీకి ముందు నాటి అక్రమ లేఅవుట్లనే క్రమబద్ధీకరించనున్నారు. మార్చి 31వ తేదీలోగా పూర్తిగా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించినవారికి 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేసుకోని వారికి, లే అవుట్లలో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల క్రమబద్ధీకరణకు కొన్ని వెలుసుబాట్లు కల్పించింది. ఒక లేఅవుట్‌లో 10శాతం ప్లాట్లు రిజిస్టరై.. 90శాతం ప్లాట్లు మిగిలిపోయినా ఎల్‌ఆర్‌ఎస్‌లో రెగ్యులరైజేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాట్లు కొనుగోలుచేసి సేల్‌డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన వారికి కూడా క్రమబద్ధీకరణ చాన్స్‌ ఇచ్చారు. ఈ కేటగిరీల వారికి కూడా మార్చి 31వ తేదీలోగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకుంటే ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.

196 దరఖాస్తుల తిరస్కరణ..

జిల్లాలో రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లో లే అవుట్ల క్రమబద్ధీకరణకు 19,778 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 4,936 దరఖాస్తులను అధికారులు అనుమతించారు. వివిధ కారణాలతో 196 దరఖాస్తులను తిరస్కరించారు. ఇప్పటివరకు కేలం 279 మంది మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించారు.

దరఖాస్తుల వివరాలు

బల్దియాల్లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు

శరవేగంగా దరఖాస్తుల పరిశీలన

దరఖాస్తుదారులకు మంచిఅవకాశం

ఫీజులో 25శాతం రాయితీ వర్తింపు

జిల్లాలో 3 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌

బల్దియా దరఖాస్తులు అనుమతి తిరస్కరణ డాక్యుమెంటేషన్‌ లోపాలు నిషేధిత భూముల్లోనివి ఫీజు చెల్లించినవి

రామగుండం 7,078 2,799 48 2,238 1,924 99

పెద్దపల్లి 10,269 1,837 135 5,933 1,726 173

సుల్తానాబాద్‌ 1,536 209 12 706 204 01

మంథని 895 91 01 725 46 06

No comments yet. Be the first to comment!
Add a comment
ఎల్‌ఆర్‌ఎస్‌ పరిష్కార మేళా1
1/1

ఎల్‌ఆర్‌ఎస్‌ పరిష్కార మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement