సింగరేణి స్టాండింగ్ కౌన్సిల్‌గా ‘చంద్రుపట్ల’
మంథని: పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది చంద్రుపట్ల రమణకుమార్‌రెడ్డి హైకోర్టులో సింగరే ణి అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీచేయగా.. అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ద్వారా చంద్రుపట్ల చార్జి తీసుకున్నారు. రమణకుమార్‌రెడ్డి స్టాండింగ్ కౌన్సిల్‌గా మూడేళ్ల పాటు వ్యవహరిస్తారు. రా ష్ట్రంలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థకు సంబంధించిన న్యాయపరమైన సుమారు ఆరు వేల కేసులను ఆయన చూసుకోనున్నారు. కాగా, శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మంత్రి శ్రీధర్ బాబును కలిసి కృతజ్ఞతలుతెలిపారు.
ఆలయాల్లో మంత్రి పూజలు
మున్సిపల్‌తోపాటు ఆయా గ్రామాల్లోని ఆలయా ల్లో మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
అభినందించిన మంత్రి శ్రీధర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment