పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం
గోదావరిఖని: పోలీసు సిబ్బంది సమస్యలను పూ ర్తిస్థాయిలో పరిష్కరిస్తామని, దీనికోసం పోలీస్ ద ర్బార్ నిర్వహిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్‌లో శని వారం స్పెషల్ పార్టీ, క్యూఆర్‌టీ సిబ్బంది, అధికా రులతో సీపీ దర్బార్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పెషల్ పార్టీ, క్యూఆర్‌టీ పోలీస్‌లు విధి నిర్వహణలో అనేక సమస్యలు, సవాళ్లతోపాటు ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. క్రమశిక్షణ, ప్రణాళికా బద్ధంగా విధులు నిర్వహించ డం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు. వ్యక్తి గత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చా లా ప్రమాదకరమని, వాటితో అనారోగ్య సమస్య లు ఎదురవుతాయని ఆయన తెలిపారు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు కు టుంబ గురించి ఆలోచించాలని సూచించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment