కరీంనగర్ కార్పొరేషన్: ఆర్‌ఆర్‌ఆర్ (రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్) విధానాన్ని నిరంతరం కొనసాగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అన్నారు. శుక్రవారం నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో ఉన్న రిసోర్స్ పార్క్‌ను సందర్శించారు. రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ పద్ధతిలో చెత్తను వ్యర్థాలను వేరు చేయాలని ఆదేశించారు. రిసోర్స్‌పార్క్‌లోని ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్‌ను వినియోగంలోకి తేవా లన్నారు. ప్రస్తుతం ఉన్న వర్మీ కంపోస్ట్ పిట్స్‌కు అదనంగా మరోమూడు కంపోస్ట్ పిట్స్ కట్టించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించా రు. ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్‌కు ప్రతీరోజు స్వచ్ఛ ఆటోలను తరలించి వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియను కొనసాగించాలన్నారు. అంతకుముందు బొమ్మకల్‌లో పారిశుధ్య పనులు, వార్డు కా ర్యాలయాన్ని పరిశీలించారు. సహాయ కమిషనర్ వేణుమాదవ్, ఎస్‌ఈ రాజ్‌కుమార్, పర్యావరణ ఇంజినీర్ స్వామి, ఏఈ సతీశ్ ఉన్నారు.
జీవనశైలిలో మార్పుతో ఎన్‌సీడీ వ్యాధులు దూరం
కరీంనగర్‌టౌన్: జీవనశైలిలో మార్పు, సమతుల్య ఆహారం, వ్యాయామం, యోగా, ధ్యానం ద్వారా ఎన్‌సీడీ వ్యాధులు దూరమవుతాయని డీఎంహెచ్‌వో వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆశాకార్యకర్తలకు ఎస్‌సీడీ వ్యాధులపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకుని, తగినంత శ్రమిస్తూ.. ఆరోగ్యంగా ఉండేలా వివరించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. పీవోడీటీటీ ఉమా శ్రీరెడ్డి, డీపీహెచ్‌ఎన్‌వో విమల, హెచ్‌ఈఈవో రాజ గోపాల్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
మహిళలు ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు
కరీంనగర్‌టౌన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాల్లాంటివారని మహిళా సాధికారత, వ్యాపార వ్యవస్థాపక కమిటీ చైర్మన్ బెల్లం మాధవి పేర్కొన్నారు. స్వదేశీ మేళాలో భాగంగా శుక్రవారం మహిళా ఆర్థిక స్వావలంబన, అభివృద్ధి అంశంపై స్వశక్తి మహిళలకు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, గృహిణిగా ఉంటూనే వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అ న్నారు. మధ్యాహ్నం పాడిపంట, రైతు ఆర్థిక స్వావలంబన సెమినార్‌కు ముఖ్యవక్తగా ఎన్నారై సామ ఎల్లారెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామీణ జనాభాలో ఎక్కువమంది ఏదో రూపంలో వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారన్నారు. కళ్లెం స్వప్న, బల్ల స్వప్న, విజయలక్ష్మి, కామారపు మంజుల, కళ్లెం కవిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment