● మహిళా అగ్రికల్చర్ ఆఫీసర్ల అగచాట్లు ● డీటెయిల్ క్రాప్ సర్వే కోసం పడరాని పాట్లు ● నిర్మానుష్య ప్రాంతాల్లో భయంభయంగా.. ● పురుగులు, పుట్టలు, రైలుపట్టాలు దాటుతూ సర్వే ● యాప్, సర్వర్ సతాయింపులు ● ఇతర రాష్ట్రాల్లో మహిళలు దూరం ● ప్రాణాలకు తెగించి, ఆత్మగౌరవాన్ని చంపుకుంటున్నామని ఆవేదన ● గర్భిణులు, బాలింతలకూ దొరకని మినహాయింపు
పెద్దపల్లి: బురదలో కూరుకుపోయిన బండితో ఏఈవో ఆపసోపాలు
జగిత్యాల జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో ఊరికి దూరంగా పొలం ఉంది. వెళ్లేందుకు సరైన దారిలేదు. పొలానికి వెళ్లాలంటే కల్లు కాంపౌండ్ దాటాలి. అక్కడ కల్లు తాగేవాళ్లు ఒంటరిగా వస్తున్న మహిళా ఏఈవోను చూసి వెకిలిగా నవ్వారు.. అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తే.. పొలంగట్టుపై బుసలు కొడుతూ నాగుపాము అంతెత్తున లేచింది. ఆ మహిళా ఏఈవోకు ప్రాణాలు పోయినంత పనైంది.
జిల్లా ఏఈవోలు మహిళలు సాగుచేసినభూమి డీసీఎస్
(ఎకరాల్లో) (ఎకరాల్లో)
సిరిసిల్ల 53 28 2,34,000 24,499
జగిత్యాల 71 34 1,39,000 19,000
కరీంనగర్ 75 13 3,03,000 59,005
పెద్దపల్లి 55 21 2,10,975 18,692
Comments
Please login to add a commentAdd a comment