రామగుండం: రామగుండంలో మూతపడిన 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో నూతనంగా 800 మెగావాట్ల సామర్థ్యం గల నూతన విద్యుత్ కేంద్రం స్థాపించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత సింగరేణి, జెన్‌కో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలని తలపెట్టినప్పటికీ జెన్‌కో ఇంజినీర్లు, ఉద్యోగుల జేఏసీ సంయుక్తంగా జెన్‌కో ఉనికిని కాపాడుతూ సింగరేణి భాగస్వామ్యం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవా లని ప్రభుత్వ నిర్ణయంపై వివిధ రకాలుగా నిరసనలు చేపట్టారు. దీంతో సింగరేణి భాగస్వామ్యం ఉపసంహరించుకొని పూర్తిస్థాయిలో నూతన విద్యుత్ కేంద్రం స్థాపనను జెన్‌కోకు అప్పగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
పాలక మండలి సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో గురువారం ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా అధ్యక్షతన జరిగిన జెన్‌కో పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇందులో రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రంస్థానంలో నూతన విద్యుత్ కేంద్రం స్థాపనకు న్యూఢిల్లీకి చెందిన డిసిగ్ సంస్థతో తయారు చేయించిన డీపీఆర్‌కు ఆమోద ముద్ర పడింది. మెగావాట్‌కు రూ.16.7 కోట్లు చొప్పున 800 మెగావాట్లకు రూ.13,300 కోట్ల అంచనాతో నిర్మించేందుకు అధికార వర్గాలు నిర్ణయించాయి. వద్యుత్ కేంద్రానికి అవసరమయ్యే బొగ్గు కేటాయింపు, పర్యావరణ అనుమతుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఏది ఏమైనా ఆర్థిక సంవత్సరాంతంలో మూడిన బీథర్మల్‌ను కూల్చి నూతన కేంద్రం స్థాపనకు శంకుస్థాపన చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.
ఇంధన శాఖ కార్యదర్శి, జెన్‌కో సీఎండీతో ప్రభుత్వం చర్చలు
Comments
Please login to add a commentAdd a comment