ఎన్‌సీడీల నివారణపై శిక్షణ
కరీంనగర్‌టౌన్: ఎన్‌సీడీల సర్వే, నివారణపై హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆశా కార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశమందిరంలో నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు చేస్తున్న కృషి, సేవలను అభినందించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమానికి మహిళలను తీసుకెళ్లి స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం ఎన్‌సీడీ వ్యాధులు పెరిగిపోతున్నందున, ప్రజలు సమతుల్య ఆహారం తీసుకుని, సరైన వ్యాయామం, యోగా చేయాలని తద్వారా డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు నివారించుకోవచ్చని సూచించారు. పీవోడీటీటీ ఉమాశ్రీరెడ్డి కుక్కకాటు, నివారణ చర్యలు, రేబి స్‌ను నివారించడంపై అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment