పెళ్లి పనులు చేసొస్తూ.. వాగులో పడి
రామగిరి(మంథని): చిన్నమ్మ కుమారుడి పెళ్లి పనులు చేసి, ఇంటికి వస్తున్నాడు.. బైక్ అదుపుతప్పి, వాగులో పడి, సింగరేణి కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన ఊరగొండ రాజ్‌కుమార్(39) అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగరీత్యా సెంటినరీకాలనీలోని జోన్–1 ఎస్టీటూ 559 క్వార్టర్‌లో ఉంటున్నాడు. గురువారం రాంపెల్లికి చెందిన తన చిన్నమ్మ కుమారుడి పెళ్లి మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో జరగనుండటంతో బుధవారం రాత్రి వరకు రాంపెల్లిలో వివాహ పనులు చేశాడు. గురువారం ఉదయం ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి పెళ్లికి హాజరవుదామని బైక్‌పై బయలుదేరాడు. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిలోని కల్వచర్ల బొక్కల వాగు వద్ద వాహనం అదుపుతప్పి, వంతెన పైనుంచి వాగులో పడింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య లత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మంథని సీఐ రాజుగౌడ్, ఎస్సై దివ్య పరిశీలించారు. రాజ్‌కుమార్ మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన ఒక్కగానొక్క కుమారుడు తమను పోషిస్తాడనుకుంటే చనిపోయాడంటూ మృతుడి తల్లిదండ్రులు గట్టమ్మ–శంకర్ కన్నీరుమున్నీరుగా విలపించారు.
సింగరేణి కార్మికుడి దుర్మరణం
కల్వచర్ల బొక్కలవాగు వద్ద బైక్ అదుపుతప్పి, ఘటన
పెళ్లి పనులు చేసొస్తూ.. వాగులో పడి
Comments
Please login to add a commentAdd a comment