పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు
కరీంనగర్/కరీంనగర్ అర్బన్: పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లకు ఓరియంటేషన్ నిర్వహించారు. సూపరింటెండెంట్లు ప్రతీ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి వసతులను పరిశీలించాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పరీక్షకు ముందు ప్రతీ విద్యార్థికి ఓఆర్‌ఎస్ ద్రావణం అందించాలని సూచించారు. ఇన్విజిలేటర్లు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. దివ్యాంగులు పరీక్ష రాసేందుకు సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని సూచించారు. డీఈవో జనార్దన్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బ్యాలెట్ పరిశీలనపై పర్యవేక్షణ
మెదక్, నిజామాబాద్,కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ పేపర్ల పరిశీలన కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. కలెక్టర్ పమేలా సత్పతి బ్యాలెట్ పేపర్ పరిశీలనలో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.అభ్యర్థులు, అభ్యర్థుల తరఫున వచ్చిన ఏజెంట్లు బ్యాలెట్ పేపర్ల తనిఖీని పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment