రుక్మాపూర్ సైనిక స్కూల్‌లో ఘర్షణ
చొప్పదండి: చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ సైనిక శిక్షణ పాఠశాలలో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. గురువారం రాత్రి పదోతరగతి విద్యార్థులను ఇంటర్ విద్యార్థులు చితకబాదారు. విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం స్కూల్‌కు చేరుకోవడంతో ఈ విషయం వెలుగుచూసింది. విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం. రుక్మాపూర్ సైనిక శిక్షణ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులను గురువారం రాత్రి ఇంటర్ విద్యార్థులు చితకబాదారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలవడంతో వారు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టడంతో విషయం వెలుగుచూసింది. ఈ విషయం ఎస్సై గొల్లపల్లి అనూషకు తెలియడంతో ఆమె స్కూల్‌కు చేరుకొని విచారణ చేపట్టింది.
నలుగురికి గాయాలు
విద్యాలయంలో గురువారం జరిగిన ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డట్లు తెలిసింది. పలువురు విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో నే తమ గాయాలను బయటకు చూపించారు. పోలీసులు వెళ్లి విచారణ చేపట్టా.. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సంఘటనపై జిల్లా ఉన్నతాధికారులను కలు స్తామని విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు.
పదోతరగతి విద్యార్థులను చితకబాదిన ఇంటర్ విద్యార్థులు
విచారణ చేపట్టిన పోలీసులు
రుక్మాపూర్ సైనిక స్కూల్‌లో ఘర్షణ
Comments
Please login to add a commentAdd a comment