పన్ను వసూలు వేగవంతం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఆస్తిపన్ను వసూలు వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణితో కలిసి రివ్యూ నిర్వహించారు. గడువు సమీపిస్తోందని.. పన్ను వసూలు వేగంపెంచాలని, సెలవు రోజుల్లోనూ కలెక్ట్ చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి డివిజన్‌లలో క్యాంపులు నిర్వహించాలన్నారు. మొండి బకాయిదారులపై ఒత్తిడి పెంచాలన్నారు. డివిజన్లవారీగా బకాయిదారుల పేర్లను ప్రకటించి ఫోన్ చేయాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ఇతర ప్రైవేట్ సంస్థలతో పాటు, ప్రభుత్వ సంస్థల ట్యాక్స్ కూడా వసూలు చేయాలన్నారు. మ్యూటేషన్ ఫైళ్లు పెండింగ్‌లో ఉండొద్దని హెచ్చరించారు. ట్రేడ్‌లైసెన్స్‌లపైనా దృష్టి సారించాలన్నారు.
ఐదు రోజుల పనిదినాలే ఉండాలె
కరీంనగర్ అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం బ్యాంకుల ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐదు రోజుల బ్యాంక్ పని దినాలు ఉండాలని, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను నిలిపివేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేపడుతామని హెచ్చరించారు. నిరసనలో తాళ్లపల్లి శ్రీనివాస్, పాకాల వేణుమాధవ్, గర్రెపల్లి పోచయ్య, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లు ప్రారంభం
జమ్మికుంట: పదిరోజులుగా ఆధార్ అనుసంధాన్ సర్వర్ పని చేయకపోవడంతో నిలిచిపోయిన సీసీఐ కొనుగోళ్లు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. మార్కెట్ చైర్ పర్సన్ పూల్లురి స్వప్న, ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కాగా.. శుక్రవారం క్వింటాల్ పత్తి రూ. 6,870 పలికింది.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: తెలంగాణ చౌక్ ఫీడర్ పరిధిలోని 11 కేవీ లైన్, 25 కేవీఏఏ డీటీఆర్ విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు రాంనగర్, రాజీవ్‌పార్కు, లేబర్ అడ్డ, మంకమ్మతోట, ధన్‌గర్‌వాడీ స్కూల్, సత్య లాడ్జ్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.
మాతృభాషను గౌరవించాలి
కరీంనగర్‌సిటీ: విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఆంగ్ల విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత మాట్లాడుతూ, అన్ని భాషలలో మాతృభాష గొప్పదని, భాషను గౌరవిస్తే తల్లిని గౌరవించినట్టేనని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ మాట్లాడుతూ, ప్రపంచీకరణ నేపథ్యంలో కొన్ని భాషలు అంతరించిపోతున్నాయని, మాతృభాష గొప్పతనాన్ని భావితరాలకు అందించడానికి ప్రతిజ్ఞ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఉర్దూ పూర్వ విభాగాధిపతి డా.ఉమేరాతస్లీమ్ మాట్లాడుతూ, అన్ని భాషలను సమానంగా గౌరవించుకోవాలని భాషల ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఆంగ్ల విభాగాధిపతి విజయప్రకాశ్ మాట్లాడుతూ, పరభాషలు ఎన్ని నేర్చినా మాతృభాషను గౌరవించాలని, భాషల యొక్క గొప్పతనాన్ని వివరించారు. తెలుగు అధ్యాపకుడు డా.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, భాషలే కాక వాటి మాండలికాలను కూడా కాపాడాలని కోరారు. అధ్యాపకులు డా.ప్రదీప్‌రాజ్, డా.పావని, డా.రమేశ్, హరికృష్ణ, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
పన్ను వసూలు వేగవంతం చేయాలి
పన్ను వసూలు వేగవంతం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment